ఉత్తర్‌ప్రదేశ్: వార్తలు

కారు ప్రమాదంలో అసోం 'లేడీ సింగం' జున్మోని రభా మృతి; సీఐడీ విచారణ

అసోం 'లేడీ సింగం', 'దబాంగ్ కాప్'గా ప్రసిద్ధి చెందిన పోలీసు మహిళా సబ్-ఇన్‌స్పెక్టర్ జున్మోని రభా రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు అధికారులు వెల్లడించారు.

యూపీలో మరో గ్యాంగ్‌స్టర్ ఎన్‌కౌంటర్‌; అనిల్ దుజానా హతం 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్యాంగ్‌స్టర్ల వేట కొనసాగుతోంది. మీరట్ జిల్లాలో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గ్యాంగ్‌స్టర్ అనిల్ దుజానాను హతమార్చారు.

ఉత్తర్‌ప్రదేశ్: వీధి కుక్కల దాడిలో 12ఏళ్ల బాలుడు మృతి 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీలోని సీబీ గంజ్ ప్రాంతంలో వీధి కుక్కల దాడిలో 12ఏళ్ల బాలుడు మృతి చెందాడు. అలాగే మరో చిన్నారికి గాయాలయ్యాయి.

25 Apr 2023

ఎన్ఐఏ

పీఎఫ్‌ఐ విచారణ: బిహార్, యూపీ, పంజాబ్, గోవాలో ఎన్‌ఐఏ దాడులు

నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ)ని లక్ష్యంగా చేసుకుని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మంగళవారం ఉదయం నాలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది.

అతిక్ అహ్మద్ కార్యాలయంలో రక్తంతో తడిసిన క్లాత్, మెట్లపై బ్లెడ్ మరకలు, మారణాయుధాలు 

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇటీవల హత్యకు గురైన గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్‌కు చెందిన కార్యాలయంలో సోమవారం అడుగుపెట్టిన పోలీసులు ఖంగుతిన్నారు.

 అతిక్ అహ్మద్, అష్రఫ్ హత్య ఎఫెక్ట్; ఐదుగురు యూపీ పోలీసులు సస్పెండ్ 

గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ హత్యలకు సంబంధించి కేసులో ప్రయాగ్‌రాజ్‌లోని షాహ్‌గంజ్ పోలీస్ స్టేషన్ స్టేషన్ ఆఫీసర్‌తో సహా నలుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.

గ్యాంగ్‌స్టర్ అతిక్ సోదరుల హత్యపై ఈనెల 24న సుప్రీంకోర్టులో విచారణ 

పోలీసుల సమక్షంలో గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ , అష్రఫ్ హత్య జరగడంపై విచారించేందుకు మాజీ సీజేఐ అధ్యక్షతన స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ చేసిన పిటిషన్‌ను మంగళవారం సుప్రీంకోర్టు స్వీకరించింది.

భద్రతా కారణాలతో అతిక్ అహ్మద్ హంతకులను ప్రతాప్‌గఢ్ జిల్లా జైలుకు తరలింపు

గ్యాంగ్‌స్టర్‌గా అతిక్ అహ్మద్‌తో పాటు అతని సోదరుడు అష్రఫ్‌ను హతమార్చిన ముగ్గురు షూటర్లను ఉత్తరప్రదేశ్ పోలీసులు సోమవారం ప్రయాగ్‌రాజ్‌లోని నైని సెంట్రల్ జైలు నుంచి ప్రతాప్‌గఢ్ జిల్లా జైలుకు బదిలీ చేశారు.

17 Apr 2023

హత్య

Uttar Pradesh: గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్‌ శరీరంలో 9 బుల్లెట్లు 

గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్, అష్రఫ్ మృతదేహాలకు నిర్వహించిన శవ పరీక్షల వివరాలను పోలీసులు వెల్లడించారు.

మార్చిలోనే గ్యాంగ్‌స్టర్, అతిక్, అష్రఫ్‌ను పోలీసులు చంపేయాలనుకున్నారా? 

ఉత్తర్‌ప్రదేశ్ గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ శనివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. పోలీసుల కస్డడీలో ఉన్న వీరు హత్యకు గురికావడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

Explainer: యూపీ మొదటి 'గ్యాంగ్‌స్టర్'; 'అతిక్ అహ్మద్' అరెస్టు, మరణం ఎందుకు సంచలనమయ్యాయి? 

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్, రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్‌, అతని సోదరుడు అష్రఫ్ హత్యకు గురయ్యారు.

యూపీలో మరో సంచలనం: గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌ ఎన్‌కౌంటర్ 

ఉత్తర్‌ప్రదేశ్ గ్యాంగ్‌స్టర్‌, రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌ ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన పోలీసుల ఎన్‌కౌంటర్ చనిపోయారు.

'ఆపరేషన్ ఝాన్సీ' ఎలా జరిగింది? పక్కా ప్లానింగ్ యూపీ పోలీసులు అసద్‌ ఎన్‌కౌంటర్ చేశారా? 

ఝాన్సీ జిల్లాలో ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు జరిగిన ఎదురుకాల్పుల్లో గ్యాంగ్‌స్టర్‌ అతిక్ అహ్మద్ కొడుకు అసద్‌ మరణించారు. అయితే 'ఆపరేషన్ ఝాన్సీ' ఎలా జరిగింది? పోలీసులకు అసద్ ఎలా కార్నర్ అయ్యాడు. పక్కా ప్లానింగ్ యూపీ పోలీసులు అసద్‌ ఎన్‌కౌంటర్ చేశారా? తెలుసుకుందాం.

దొంగతనం చేశాడనే అనుమానంతో మేనేజర్‌ను దారుణంగా కొట్టారు; ప్రభుత్వాస్పత్రిలో మృతదేహం 

దొంగతనం చేశాడనే అనుమానంతో 32 ఏళ్ల వ్యక్తిని దారుణంగా కొట్టారు. అనంతరం అతని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో బయట పడేశారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో జరిగింది.

గ్యాంగ్‌స్టర్‌ అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ ఎన్‌కౌంటర్‌ 

గ్యాంగ్‌స్టర్‌గా మారిన రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ కుమారుడు అసద్, అతని అనుచరుడు గులామ్ ఉత్తర్‌ప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఝాన్సీలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించినట్లు పోలీసులు గురువారం తెలిపారు.

ఉమేష్ పాల్ కేసు: అతిక్ అహ్మద్ ఇంట్లో ఐఫోన్, ఆధార్ కార్డులు స్వాధీనం

ఉమేష్ పాల్ హత్య కేసులో ప్రయాగ్‌రాజ్ పోలీసులు కీలకమైన పురోగతిని సాధించారు. గ్యాంగ్‌స్టర్‌ అతిక్ అహ్మద్ కసరి మసారి ఇంటి నుంచి ఒక ఐఫోన్, కీలకమైన రిజిస్టర్‌తో పాటు రెండు ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.

ఇంట్లో భారీ పేలుడు, 4మృతదేహాలు లభ్యం; రంగంలోకి ఫోరెన్సింగ్ బృందం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లోని పొలాల మధ్యలో ఉన్న ఓ ఇంట్లో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసు అధికారులు ప్రమాదంపై ఆరా తీస్తున్నారు.

28 Mar 2023

ఎంపీ

ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసు; అతిక్ అహ్మద్‌కు జీవిత ఖైదు విధించిన ప్రయాగ్‌రాజ్ కోర్టు

ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసులో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు మంగళవారం మాఫియా నాయకుడు అతిక్ అహ్మద్‌ను దోషిగా తేల్చింది. అతిక్ అహ్మద్‌తో పాటు దినేష్ పాసి, ఖాన్ సౌలత్ హనీఫ్‌లకు జీవిత ఖైదు, లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది. బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్య కేసులో ఉమేష్ పాల్‌ ప్రధాన సాక్షి కావడం గమనార్హం.

One World TB Summit: 2025 నాటికి టీబీని నిర్మూలించడమే భారత్ లక్ష్యం: ప్రధాని మోదీ

2025 నాటికి టీబీ నిర్మూలనే లక్ష్యంగా భారత్ పని చేస్తోందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ప్రపంచ లక్ష్యం కంటే 5 సంవత్సరాలు ముందే భారత్ టార్గెట్‌ను చేరుకుంటుందని పేర్కొన్నారు.

ఉమేష్ పాల్ హత్య కేసు నిందితులకు నేపాల్‌లో ఆశ్రయం; అండర్ వరల్డ్‌ నాయకుడు అన్సారీ అరెస్టు

ఉత్తరప్రదేశ్‌లో ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ఉమేష్ పాల్ హత్య కేసు వ్యవహారం దేశం దాటి అంతర్జాతీయ స్థాయికి చేరింది. ఈ కేసులోని నిందుతులకు నేపాల్‌లో ఖయ్యూమ్ అన్సారీ అనే వ్యక్తి ఆశ్రయం ఇచ్చినట్లు ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) గుర్తించింది. ఖయ్యూమ్ అన్సారీకి అండర్ వరల్డ్‌‌తో సంబంధాలు ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

ఉత్తర్‌ప్రదేశ్ హత్య కేసు: ఉమేష్ పాల్‌పై కాల్పులు జరుపుతున్న సీసీటీవీ వీడియో వైరల్

దేశ‌వ్యాప్తంగా సంచలనంగా మారిన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ఉమేష్ పాల్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉమేష్‌పై కాల్పులు జరుపుతున్న దృశ్యాలు రికార్డయిన సీసీటీవీ వీడియో బయటకు వచ్చింది.

ఉమేష్ పాల్ హత్య: పోలీసుల అదుపులో అతిక్ అహ్మద్ సన్నిహితుడు బల్లి పండిట్

ఉమేష్ పాల్ హత్య కేసులో ఉత్తరప్రదేశ్ పోలీసులు పురోగతి సాధించారు. హత్య కేసులో ప్రధాన నిందితుడు, గ్యాంగ్‌స్టర్‌‌గా, రాజకీయ నాయకుడిగా చలామణి అవుతున్న అతిక్ అహ్మద్‌కు సన్నిహితుడైన బల్లి పండిట్‌ను పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు.

రూ.20 లక్షల లంచం అడిగిన ఐపీఎస్; వీడియో షేర్ చేసిన అఖిలేష్ యాదవ్

ఉత్తర్‌ప్రదేశ్ ఒక వ్యాపారవేత్త నుంచి డబ్బు డిమాండ్ చేస్తున్న ఐపీఎస్ అధికారి వీడియోను సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేశారు. ఆ అధికారిపై 'బుల్‌డోజర్' ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? అని సీఎం యోగి ఆదిత్యనాథ్ ను ప్రశ్నించారు. దీంతో ప్రభుత్వం వెంటనే ఆ వీడియో దర్యాప్తునకు ఆదేశించింది.

ఉమేష్ పాల్ హత్య కేసు: పోలీసుల ఎన్‌కౌంటర్‌లో నిందితుడు ఉస్మాన్ మృతి

ఉమేష్ పాల్ హత్య కేసులో ప్రధాన నిందితుడు ఉస్మాన్ సోమవారం మరణించారు. ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లోని కౌంధియారాలో పోలీసులు విజయ్ కుమార్ అలియాస్ ఉస్మాన్ చౌదరి మధ్య ఎదురు కాల్పులు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఎన్ కౌంటర్ లో ఉస్మాన్ మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు.

యోగి ఆదిత్యనాథ్ వర్సెస్ అఖిలేష్ యాదవ్: యూపీలో శాంతి‌భద్రతలపై అసెంబ్లీలో డైలాగ్ వార్

2005లో హత్యకు గురైన బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే రాజుపాల్ కేసులో ప్రధాన సాక్షి ఉమేష్ పాల్‌ను ప్రయాగ్‌రాజ్‌లో శుక్రవారం దుండగులు హతమార్చారు. ఈ అంశంపై ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో సీఎం యోగి ఆదిత్యనాథ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మధ్య డైలాగ్ వార్ నడిచింది.

21 Feb 2023

ఎన్ఐఏ

గ్యాంగ్‌స్టర్-టెర్రర్ నెట్‌వర్క్‌పై ఎన్‌ఐఏ ఉక్కుపాదం; దేశవ్యాప్తంగా 72చోట్లు దాడులు

గ్యాంగ్‌స్టర్-టెర్రర్ నెట్‌వర్క్ అణచివేతపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఫోకస్ పెట్టింది. మంగళవారం ఉదయం నుంచి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 72చోట్ల దాడులు నిర్వహిస్తోంది.

ఉత్తర్‌ప్రదేశ్: ఆక్రమణల తొలగింపు సమయంలో ఇంటికి నిప్పు! తల్లీ, కూతురు సజీవ దహనం

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహత్ జిల్లాలోని ఒక గ్రామంలో ఆక్రమణల తొలగింపు సమయంలో ఒక ఇంట్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 45 ఏళ్ల మహిళతో పాటు ఆమె కుమార్తె (20) మరణించారు.

యూపీ: అక్రమ ఆయుధాల నివారణకు తీసుకుంటున్న చర్యలేంటి? రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

లైసెన్సు లేని తుపాకుల వల్ల కలిగే అనార్థాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

08 Feb 2023

లక్నో

'త్వరలోనే లక్నో పేరు 'లక్ష్మణ్ నగరి'గా మార్పు', యూపీ డిప్యూటీ సీఎం ప్రకటన

లక్నో పేరు మార్పుపై ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ కీలక ప్రకటన చేశారు. భదోహిలో జిల్లాలో వివిధ పథకాలు, అభివృద్ధి పనుల పురోగతిపై డిప్యూటీ సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. సూర్యావలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు.

జర్నలిస్టు రాణా అయ్యూబ్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు, పిటిషన్ కొట్టేవేత

జర్నలిస్టు రాణా అయ్యూబ్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మనీలాండరింగ్ కేసులో ఘజియాబాద్ ప్రత్యేక కోర్టు జారీ చేసిన సమన్లను సవాలు చేస్తూ ఆమె వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది.

04 Feb 2023

హర్యానా

ఉత్తర్‌ప్రదేశ్, హర్యానాలో భూకంపం, రిక్టర్ స్కేలుపై 3.2తీవ్రత నమోదు

హర్యానా, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి భూ ప్రకంపం సంభవించింది. స్వల్పంగా భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

02 Feb 2023

కేరళ

కేరళ జర్నలిస్ట్ సిద్ధిక్ కప్పన్ విడుదల, రెండేళ్లుగా జైలులోనే

2020లో తీవ్రవాద ఆరోపణలపై అరెస్టయిన కేరళ జర్నలిస్ట్ సిద్ధిక్ కప్పన్ గురువారం విడుదలయ్యారు. వాస్తవానికి గతేడాది డిసెంబరులోనే బెయిల్ లభించినా రిలీజ్ చేయలేదు. తాజాగా లక్నో సెషన్స్ కోర్టు ఆయన విడుదలపై సంతకం చేసింది.

గోరఖ్‌నాథ్ ఆలయంపై దాడి కేసులో నిందితుడికి మరణశిక్ష, ఎన్ఐఏ కోర్టు సంచలన తీర్పు

2022 ఏప్రిల్‌లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌నాథ్ ఆలయం వద్ద ఉన్న భద్రతా సిబ్బందిపై దాడి కేసులో అరెస్టయిన అహ్మద్ ముర్తాజా అబ్బాసీకి ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు సోమవారం మరణశిక్ష విధించింది.

తల్లి పాలలో పురుగుమందుల అవశేషాలు, 111మంది నవజాత శిశువులు మృతి

ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌లో గత 10నెలల్లో 111మంది శిశువులు అనుమానాస్పద కారణాలతో మరణించారు. ఈ మరణాలపై లక్నోలోని క్వీన్ మేరీ హాస్పిటల్ బృందం పరిశోధన చేయగా, షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహారాజ్‌గంజ్‌లోని గర్భిణుల పాలల్లో పురుగుమందులు అవశేషాలను ఉండటం గమనార్హం.

24 Jan 2023

హర్యానా

డేరా బాబా స్టైలే వేరు! పొడవాటి ఖడ్గంతో కేక్ కటింగ్, వీడియో వైరల్

పెరోల్‌‌పై జైలు నుంచి బయటకు వచ్చిన డేరా బాబా మరో వివాదంలో చిక్కుకునే అవకాశం ఉంది. తను బెయిల్‌పై విడుదలైన సందర్భంగా అనుచరులతో కలిసి బర్నావా ఆశ్రమంలో కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు డేరా బాబా.

డోలో-650 తయారీదారుపై ఈఎస్ఐ కుంభకోణం ఆరోపణ, అలహాబాద్ హైకోర్టులో పిటిషన్

డోలో-650 ట్యాబ్లెట్లను తయారు చేస్తున్న ఫార్మాస్యూటికల్ కంపెనీకి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ (ఈఎస్ఐ) కుంభకోణానికి కంపెనీ పాల్పడినట్లు ఆరోపిస్తూ, ట్రయల్ కోర్టులో వ్యాజ్యం దాఖలైంది.

ఎంవీ గంగా విలాస్: ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్‌ను ప్రారంభించిన మోదీ

ప్రపంచంలోనే అతిపొడవైన నదీ యాత్రకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. వారణాసిలో ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్ 'ఎంవీ గంగా విలాస్‌'ను వర్చువల్‌గా మోదీ జెండా ఊపి ప్రారంభించారు. దేశ పర్యాటక రంగానికి ఊతం ఇచ్చేందుకు ఇది దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

05 Jan 2023

దిల్లీ

దిల్లీ ప్రమాదం రిపీట్: నోయిడాలో స్విగ్గీ డెలివరీ బాయ్‌ను కిలోమీటర్ లాక్కెళ్లిన కారు

దిల్లీలోని సుల్తాన్‌పురి ఘటన మరవక ముందే... నోయిడాలో అలాంటి ప్రమాదమే వెలుగులోకి వచ్చింది. న్యూ ఇయర్ రోజు రాత్రి నోయిడాలో స్విగ్గీ డెలివరీ బాయ్ కౌశల్ యాదవ్ బైక్‌ను కారు ఢీకొట్టడంతో పాటు కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లింది. దీంతో కౌశల్ యాదవ్ అక్కడికక్కడే మృతి చెందాడు.

ముంబయి పర్యటనకి ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి

ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం ముంబయి పర్యటనకు వెళ్లారు. గురువారం ఆయన ముంబయిలో నిర్వహించే రోడ్ షోలలో పాల్గొంటారు. దేశీయ పెట్టుబడిదారులను ఆకర్షించడంలో భాగంగానే యోగి దేశమంతా పర్యటించనున్నారు. జనవరి 5 నుంచి జనవరి 27 వరకు దేశవ్యాప్తంగా తొమ్మిది ముఖ్యమైన నగరాల్లో నిర్వహించే రోడ్ షోల్లో యోగి పాల్గొనున్నారు.

కృష్ణ జన్మభూమి వివాదం.. షాహీ ఈద్గా మసీదు వివాదాస్పదంలో సర్వేకు కోర్టు ఆదేశం

కృష్ణ జన్మభూమి వివాద స్థలంపై ఉత్తరప్రదేశ్‌లోని మథుర హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. జనవరి 2 తర్వాత.. షాహీ ఈద్గా మసీదు ఉన్న వివాదాస్పద స్థలాన్ని సర్వే చేయాలని పురావస్తు శాఖను ఆదేశించింది. జనవరి 20 తర్వాత నివేదికను సమర్పించాలని సూచించింది.

మునుపటి
తరువాత