భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

08 Jun 2023

లోక్‌సభ

'వన్ ఆన్ వన్' వ్యూహం: 450లోక్‌సభ స్థానాల్లో ప్రతిపక్షాల నుంచి బీజేపీపై ఒక్కరే పోటీ 

2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీపై ఉమ్మడిగా పోరాడేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఇందుకోసం ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్లాలని భావిస్తున్నాయి.

36 గంటల తర్వాత రష్యా నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం

దిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్లాల్సిన ఎయిర్‌ ఇండియా విమానం, ఇంజిన్‌ లోపం తలెత్తడంతో రష్యాలోని మారుమూల పట్టణమైన మగదాన్‌లో అత్యవసరంగా ల్యాండింగ్‌ అయిన విషయం తెలిసిందే.

బ్రిజ్ భూషణ్ సింగ్‌ కేసు కీలక మలుపు; ఆ రెజ్లర్ మైనర్ కాదట

రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై నమోదైన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

దేశానికే హైదరాబాద్ హెల్త్ హబ్.. అతిపెద్ద ప్రభుత్వ ఆస్పత్రికి భాగ్యనగరమే నిలయం

హైదరాబాద్ దేశానికే హెల్త్ సిటీగా మారనుందా. ఈ విషయానికి అవుననే సమాధానాన్ని ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ఏకంగా దేశంలోనే అతిపెద్ద సర్కార్ ఆస్పత్రి భవన నిర్మాణానికి ముహుర్తం వచ్చేస్తోంది. ఈ మేరకు ప్రఖ్యాత నగరం, హైదరాబాద్‌ చరిత్రలోకి ఎక్కనుంది.

08 Jun 2023

ముంబై

ముంబై: జీవిత భాగస్వామిని ముక్కలుగా నరికి, శరీర భాగాలను కుక్కర్‌లో ఉడకబెట్టాడు 

ముంబైలో దారణం జరిగింది. ఒక వ్యక్తి తన జీవిత భాగస్వామిని హత్య చేసి, ఆమె మృతదేహాన్ని చెట్లను కట్ చేసే యంత్రంతో ముక్కలుగా చేశాడు. ఆ తర్వాత శరీర భాగాలను కుక్కర్‌లో ఉడకబెట్టాడని పోలీసు వర్గాలు తెలిపాయి.

07 Jun 2023

కర్ణాటక

బీజేపీ వైపు జేడీఎస్ చూపు; 2024 ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమికి కర్ణాటకలో ఎదురుదెబ్బ!

ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ఆశించినన్ని సీట్లు రాకపోవడంతో దిగ్భ్రాంతికి గురైన జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) బీజేపీకి స్నేహ హస్తాన్ని అందిస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే 2024లో సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాల కూటమికి ఇదే ఎదురుదెబ్బే అవుతుంది.

07 Jun 2023

గుజరాత్

16 వేలకు పైగా గుండెలను కాపాడిన డాక్టర్.. గుండెపోటుతో మృతి 

ఆ డాక్టర్ వైద్యం చేస్తే ఎలాంటి ఆపదలో ఉన్న గుండె అయినా కొట్టుకుంటుంది. అలా దాదాపు 16 వేలకుపైగా గుండెల్ని కాపాడిన ఓ కార్డియాలజిస్ట్ అదే గుండెపోటుతో మరణించడం పట్ల విచారం వ్యక్తమవుతోంది.

ఔరంగజేబును కీర్తిస్తూ సోషల్ మీడియా పోస్ట్; కొల్హాపూర్‌లో నిరసనలు; పోలీసుల లాఠీ‌ఛార్జ్ 

మొఘల్ చక్రవర్తి ఔరంగజేబును కీర్తిస్తూ, మరాఠా జాతీయ చిహ్నాన్ని అగౌరవపరిచేలా సోషల్ మీడియా చేసిన పోస్ట్ మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో నిరసనలకు దారితీసింది.

07 Jun 2023

ఒడిశా

ఒడిషా ఘటనలో 51 గంటల ఆపరేషన్.. స్వయంగా నడిపించిన రైల్వే మంత్రి

ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బహానగ రైల్వే స్టేషన్ సమీపంలో 3 రైళ్లు ఢీకొన్న ఘటనలో ఇప్పటికే 288 ప్రాణాలు కోల్పోవడం దిగ్భ్రాంతికరం.

07 Jun 2023

లక్నో

లక్నో కోర్టులో తూపాకీ కాల్పులు; గ్యాంగ్‌స్టర్ హత్య 

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో కోర్టులో ఒక గ్యాంగ్‌స్టర్‌ను ప్రత్యర్థి కాల్చి చంపాడు.

07 Jun 2023

సీబీఐ

వైఎస్‌ వివేకా హత్య కేసు: కలర్ జిరాక్స్ కాపీతో నిన్‌హైడ్రిన్‌ పరీక్షకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి రాసిన లేఖపై కలర్ జిరాక్స్ కాపితో నిన్‌హైడ్రిన్‌ పరీక్ష జరిపేందుకు సీబీఐ కోర్టు అనుమతిచ్చింది.

కనీస మద్ధతు ధరలకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. క్వింటాల్ వరికి రూ.143 పెంపు 

2023 -24 మార్కెటింగ్ సీజన్ ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ల పెంపుదలకు బుధవారం కేంద్ర మంత్రివర్గం అంగీకరించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశమైంది.

07 Jun 2023

దిల్లీ

మనీష్ సిసోడియాను తలుచుకొని అరవింద్ కేజ్రీవాల్ కంటతడి 

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం నగరంలో కొత్త పాఠశాలను ప్రారంభించారు.

ఉద్యోగులపై ఏపీ సర్కార్ వరాల జల్లు.. సీపీఎస్ స్థానంలో జీపీఎస్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ ఉద్యోగుల సంక్షేమం కోసం కొత్త పెన్షన్ విధానాన్ని తేనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన నూతన ప్రభుత్వ పెన్షన్ విధానంపై బిల్లు రూపకల్పనను కేబినెట్ ఆమోదించింది.

క్రీడామంత్రి అనురాగ్ ఠాకూర్ ఎదుట రెజ్లర్లు 5 డిమాండ్లు 

భారత రెజ్లింగ్ సమాఖ్యకు ఒక మహిళ నేతృత్వం వహించాలని రెజ్లర్లు డిమాండ్ చేశారు.

నైరుతి రుతుపవనాల జాడేదీ..ఇంకా కేరళను తాకని నైరుతి, మరో 3 రోజుల ఆలస్యం

రానున్న 24 గంటల్లో అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుపాన్ రూపం దాల్చనుంది.

07 Jun 2023

తెలంగాణ

తెలంగాణ: బీసీలకు రూ.లక్ష ఆర్థిక సాయం రూల్స్ ఇవే..ఈనెల 20న దరఖాస్తుకు లాస్ట్ డేట్

బీసీ ఫెడరేషన్ పరిధిలోని కులాలకు, చేతి వృత్తిదారులకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ అందించింది. ఒక్కో చేతి వృత్తిదారుడికి రూ. లక్ష ఆర్థిక సాయం ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ మంగళవారం నుంచే ప్రారంభమైంది.

సికింద్రాబాద్‌ నుంచి పలు రైళ్ల రద్దు.. రద్దైన రైళ్ల పూర్తి వివరాలు ఇవే

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ నుంచి బయల్దేరే పలు రైళ్లు రద్దైనట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. గతవారం ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది.

07 Jun 2023

విమానం

రష్యాలో ఏయిర్ఇండియా ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..సహాయం కోసం ముంబయి నుంచి మరో ఫ్లైట్

అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకి భారత రాజధాని న్యూదిల్లీ నుంచి ఓ విమానం బయల్దేరింది. అది కాస్తా సాంకేతిక లోపంతో మంగళవారం అర్థాంతరంగా రష్యాలోని మగడాన్ ఏయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది.

07 Jun 2023

మణిపూర్

మణిపూర్‌లో హింసను అరికట్టాలని అమిత్ షా ఇంటి ఎదుట 'కుకీ' తెగ మహిళల నిరసన 

మణిపూర్‌లో జాతి హింసను అరికట్టాలని ప్లకార్డులతో కుకీ తెగకు చెందిన మహిళలు బుధవారం దిల్లీలోని కేంద్ర హోం మంత్రి అమిత్ షా నివాసం వెలుపల నిరసన తెలిపారు.

07 Jun 2023

తెలంగాణ

తెలంగాణ: 2023-24 అకాడమిక్ క్యాలెండర్‌ రిలీజ్.. జూన్ 12 నుంచి కొత్త అకాడమిక్ ఇయర్

తెలంగాణ పాఠశాల విద్యాశాఖ 2023-24 అకాడమిక్ క్యాలెండర్‌ను రిలీజ్ చేసింది. ఈ విద్యాసంవత్సరంలో మొత్తంగా 229 పని దినాలు ఉంటాయని వెల్లడించింది. జూన్ 12 నుంచి కొత్త అకాడమిక్ ఇయర్ మొదలుకానుంది.

రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం; రైల్వే గేటును ఢీకొట్టిన ట్రాక్టర్ 

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దాదాపు ఆ పెను ప్రమాదం 288మందిని బలితీసుకుంది. ఒడిశా రైలు ప్రమాదం తర్వాత, ట్రైన్ యాక్సిడెంట్ అంటేనే ప్రజలు భయపడిపోతున్నారు.

07 Jun 2023

ముంబై

ముంబై: హాస్టల్ గదిలో శవమై కనిపించిన విద్యార్థిని; రైలు పట్టాల వద్ద నిందితుడి మృతదేహం 

ముంబైలోని హాస్టల్ గదిలో ఓ విద్యార్థిని మృతదేహం లభ్యమైంది. ఆమెపై అత్యాచారం జరిగినట్లు అనుమానిస్తున్నామని, శవపరీక్ష నివేదిక వచ్చిన అది నిర్ధారణ అవుతుందని పోలీసులు తెలిపారు.

తెదేపా నేత వైవీబీ రాజేంద్రప్రసాద్‌కు హార్ట్ ఎటాక్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు

తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌ బుధవారం ఉదయం గుండెపోటుకు గురయ్యారు. వైవీబీ అస్వస్థతను గమనించిన కుటంబసభ్యులు, హుటాహుటిన ఆయన్ను విజయవాడలోని రమేశ్‌ ఆస్పత్రిలో చేర్పించారు.

ఇండియన్ రైల్వేస్ కి ఏమైందీ..మళ్లీ పట్టాలు తప్పిన రైలు.. ఈసారి ఆయిల్ ట్యాంకర్

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని జబల్‌పూర్‌ జిల్లాలో మంగళవారం రాత్రి ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. షాపురా భిటోని స్టేషన్‌లోని భారత్ పెట్రోలియం డిపో సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

07 Jun 2023

అమెరికా

అమెరికా కాంగ్రెస్‌లో మోదీ రెండోసారి ప్రసంగం; ఆ ఘనత సాధించిన తొలి భారత ప్రధాని

జూన్ 22న జరిగే అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగించేందుకు ఎదురుచూస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

రాజస్థాన్ కాంగ్రెస్ లో లుకలుకలు .. సొంత పార్టీ దిశగా సచిన్ పైలట్

కర్ణాటక గెలుపును ఆస్వాదిస్తున్న కాంగ్రెస్ అధిష్టానానికి ఆ ఆనందం ఎక్కువ సేపు నిలువలేకపోతోంది. దీనికి కారణం రాజస్థాన్ కాంగ్రెస్ లో ఏర్పడిన లుకలుకలే.

రెజ్లర్లను మరోసారి చర్చలకు ఆహ్వానించిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ 

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతున్న రెజ్లర్లతో చర్చలు జరిపేందుకు కేంద్రం సుముఖంగా ఉందని కేంద్ర క్రీడామంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు.

నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ కీలక భేటీ.. ఉద్యోగుల్లో టెన్షన్ టెన్షన్

ఏపీలో కీలక మంత్రివర్గం సమావేశం జరగనుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలో జరగనున్న ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పలు ముఖ్య నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది.

ఏపీ పోలవరానికి నిధుల ప్రవాహం... అదనంగా రూ.12,911 కోట్లు శాంక్షన్

పోలవరం నేషనల్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నిధుల వరద పారిస్తోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ కు అదనంగా రూ.12,911.15 కోట్లు మంజూరయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పోలవరం ప్రాజెక్టుకు భారీ మొత్తంలో నిధులు మంజూరు చేస్తూ కేంద్ర ఆర్థికశాఖ ఉత్తర్వులు ఇచ్చింది.

06 Jun 2023

తెలంగాణ

తెలంగాణ: చేప ప్రసాదం పంపిణీ ఎప్పుడో చెప్పిన మంత్రి తలసాని

హైదరాబాద్ మహానగరంలో చేప ప్రసాదం ఫేమస్. అయితే ఇందుకు తెలంగాణ సర్కార్ ఆధ్వర్యంలో ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

రాజస్థాన్ లో రాక్షస వివాహం.. బహిరంగంగానే యువతి కిడ్నాప్

రాజస్థాన్‌లోని జైసల్మేర్ లో దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట సంచలనంగా మారింది. ఒక దశలో రాజకీయ వర్గాలను, ప్రభుత్వాలనే షేక్ చేస్తోంది.

06 Jun 2023

నౌకాదళం

భారీ టార్పెడోను విజయవంతంగా పరీక్షించిన భారత నేవీ

నీటి అడుగున లక్ష్యాన్ని ఛేదించేందుకు భారత నౌకాదళం, డీఆర్‌డీఓ సంయుక్తంగా మంగళవారం దేశీయంగా అభివృద్ధి చేసిన భారీ బరువు గల టార్పెడోను విజయవంతంగా పరీక్షించాయి.

తెలంగాణకి మోదీ రాక, ఈసారి అక్కడ ఓపెన్ రోడ్‌ షో

తెలంగాణకు కమలళదళాపతులు, అగ్రనేతలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా టూర్లు ఖరారయ్యాయి.

06 Jun 2023

కర్ణాటక

కర్ణాటకలో 'గో హత్య' దుమారం; స్పందించిన సీఎం సిద్ధరామయ్య

గో హత్య నిరోధక చట్టాన్ని సమీక్షించాలంటూ కర్ణాటక మంత్రి చేసిన ప్రకటనపై నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య స్పందించారు.

06 Jun 2023

ఒడిశా

ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ ఎందకంటే? 

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తును సీబీఐ మంగళవారం అధికారికంగా చేపట్టింది.

హస్తం గూటికే జూపల్లి, పొంగులేటి - నెలాఖరులోగా చేరికలకు ముహూర్తం

చానాళ్లుగా కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠకు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓ కీలక పొలిటికల్ డెసిషన్ కు వచ్చారని తెలుస్తోంది.

ఒడిశాలో మరో రైలు ప్రమాదం; సికింద్రాబాద్-అగర్తలా ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు 

ఒడిశాలో మూడు రైళ్ల ఢీకొన్న పెను విషాదాన్ని మరువక ముందే మరో రైలు ప్రమాదం జరిగింది.

తమిళనాడు: విద్యాలయాలకు మళ్లీ వేసవి సెలవుల పొడిగింపు 

స్కూల్ పిల్లలకు సంబంధించిన అంశంపై తమిళ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.

కర్ణాటక: గృహ వినియోగదారులకు మాత్రమే ఉచిత విద్యుత్; మార్గదర్శకాలు విడుదల 

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉచితంగా 200యూనిట్లు విద్యుత్‌ను అందిస్తామని హామీ ఇచ్చింది.