ఆంధ్రప్రదేశ్: వార్తలు

రూ.100వెండి నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ ముద్రించాలని కేంద్రం నిర్ణయం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటిన నాయకుడు, సినీ వినీలాకాశంలో నట సార్వభౌముడు నందమూరి తారకరామారావు శత జయంతి సంబంర్భంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

15 Feb 2023

కడప

కడప: జమ్మలమడుగులో స్టీల్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన వైఎస్‌ జగన్‌

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ చేసి శిలాఫలకాలను ఆవిష్కరించారు.

ఆంధ్రప్రదేశ్: పర్యాటకుల భద్రత కోసం టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను ప్రారంభించిన సీఎం జగన్

పర్యాటకుల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. పర్యాటక ప్రదేశాల్లో ప్రత్యేక టూరిస్టు పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేసింది. మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా 26 టూరిస్ట్‌ పోలీస్‌ స్టేషన్లను జెండా ఊపి ప్రారంభించారు.

11 Feb 2023

దిల్లీ

దిల్లీ లిక్కర్ కేసు: వైసీపీ ఎంపీ కుమారుడు రాఘవ రెడ్డి అరెస్ట్

దిల్లీ మద్యం కేసు విచారణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో దర్యాప్తు సంస్థలు వేగం పెంచడంతో అరెస్టుల పర్వం కొనసాగుతోంది.

10 Feb 2023

ఇస్రో

కొత్త రాకెట్ SSLV-D2 ను ప్రయోగించనున్నఇస్రో

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి మొదటి లాంచ్ ప్యాడ్ నుండి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (SSLV-D2) ను ప్రయోగించనుంది.

ఏపీ, తెలంగాణల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో స్థానిక, ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం గురువారం విడుదల చేసింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని 8 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు, తెలంగాణలోని ఒక నియోజకవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి.

09 Feb 2023

ఒడిశా

మనసును కదిలించే సంఘటన: భార్య మృతదేహాన్ని భూజాలపై మోసుకుంటూ కాలిననడకన ఒడిశాకు..

ఆంధ్రప్రదేశ్‌లో హృదయ విదారక సంఘటన ఒకటి చోటుచేసుకుంది. అంబులెన్స్‌కు డబ్బులు లేక భార్య మృతదేహాన్ని భూజలపై మోసుకుంటూ వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నఇంటికి బయలుదేరాడో ఓ భర్త.

ఆంధ్రప్రదేశ్: అవినీతి, లైంగిక వేధింపుల ఆరోపణలు- సాప్ ఎండీ ప్రభాకర్‌రెడ్డిపై బదిలీ వేటు

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి బదిలీ అయ్యారు. తదుపరి పోస్టింగ్ కోసం సాధారణ పరిపాలన విభాగంలో రిపోర్టు చేయాలని బదిలీ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.

వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి గుండెపోటు!

వైసీపీ ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు తొలుత నెల్లూరులోని అపోలో ఆస్పత్రిలోని అత్యవసర వార్డుకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం చెన్నైకి తరలించారు.

ఫోన్ ట్యాపింగ్: కేంద్ర హోంశాఖకు ఎమ్మెల్యే కోటం‌రెడ్డి శ్రీధర్ రెడ్డి లేఖ

ఆంధ్రప్రదేశ్‌లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. వైసీసీ తీరుగుబాటు నేత, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఈ అంశంపై కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని ఆయన కోరారు.

ఆంధ్రప్రదేశ్: మూడు రాజధానుల అంశంపై ఈనెల 23న సుప్రీంకోర్టులో విచారణ

ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల కేసు విచారణను ఈనెల 23వ తేదీన విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. మూడు రాజధానుల అంశాన్నిఅత్యవసర ప్రాతిపదికన విచారణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున వాదిస్తున్న న్యాయవాది నిరంజన్ రెడ్డి ధర్మాసనాన్ని కోరారు. దీంతో 23న విచారిస్తామని జస్టిస్ జోసెఫ్, జస్టిస్ నాగరత్నతో కూడిన ధర్మానసం వెల్లడించింది.

వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై కిడ్నాప్ కేసు నమోదు

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో కొన్నిరోజులుగా వైసీసీ తీరుగుబాటు నేత, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వార్తల్లో నిలుస్తున్నారు. వైసీపీకి చెందిన కీలక నేతలతోపాటు, ప్రభుత్వంలోని మంత్రులను టార్గెట్ చేస్తూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శలు గుప్పిస్తున్నారు.

ఫోన్ ట్యాపింగ్‌: వైసీపీ వర్సెస్ కోటంరెడ్డి మధ్య డైలాగ్ వార్- మోదీ జోక్యం చేసుకుంటారా?

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తోంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వర్సెస్ వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్‌కు ముగింపు పడే అవకాశం కనిపించడం లేదు. శుక్రవారం ఇరు‌వర్గాల మధ్య ఢీఅంటేఢీ అనేలా మాటల తూటాలు పేలాయి.

పాదయాత్రలో లోకేశ్‌ ప్రచార వాహనం సీజ్, టీడీపీ శ్రేణుల నిరసన

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ఏడోరోజుకు చేరుకుంది. పలమనేరు నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతుండగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా విశాఖపట్నం, సీఎం జగన్ ప్రకటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్‌కి విశాఖపట్నం కొత్త రాజధాని కానుందని సీఎం జగన్ ప్రకటించారు. రాబోయే రోజుల్లో తాను విశాఖకు షిఫ్ట్ కాబోతున్నట్లు వెల్లడించారు. మార్చి 3, 4 తేదీల్లో కొత్త రాజధాని విశాఖలో పెట్టుబడుల సదస్సును ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. సదస్సుకు వ్యాపారవేత్తలు, పెట్టబడిదారులను ఆహ్వానించారు.

'నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు', వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి సంచలన ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైసీపీ ఎమెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పోలీసు, ఇంటెలిజెన్స్ అధికారులు తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు.

తెలుగింట విరబూసిన పద్మాలు: తెలంగాణ నుంచి ఐదుగురికి, ఏపీ నుంచి ఏడుగురికి అవార్డులు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం ప్రకటించిన 'పద్మ' అవార్డుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు. తెలంగాణ నుంచి ఐదుగురికి, ఏపీనుంచి ఏడుగురికి అవార్టులు వచ్చాయి.

సుప్రీంకోర్టు ఆదేశాలు: జీఓ నెం.1 పిటిషన్‌పై 23న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ షోలు, ర్యాలీల నిర్వహణను నిషేధిస్తూ.. ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నెం.1 పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ఉన్నందున విచారణను వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. జీఓ నంబర్ 1పై జనవరి 23న విచారణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆదేశించింది.

జీఓ నెం.1ను సస్పెండ్ చేసిన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ షోలు, ర్యాలీల నిర్వహణను నిషేధిస్తూ.. ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నెం.1ను హైకోర్టు సస్పెండ్ చేసింది. ప్రభుత్వం నిర్ణయం నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. దీనిపై రాష్ట్రం ప్రభుత్వం జనవరి 20లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

కుటుంబంతో చర్చించిన తర్వాత వీఆర్ఎస్‌పై ఆలోచిస్తా: సోమేశ్‌కుమార్

తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్.. రిపోర్టు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ రాజధాని విజయవాడకు వెళ్లారు. అక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఎలాంటి బాధ్యతలు అప్పగించినా.. నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయాలని ఆదేశించిన కోర్టు

ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు జిల్లా కోర్టు షాకిచ్చింది. మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయాలని సత్తెనపల్లి పోలీసులను ఆదేశించింది.

10 Jan 2023

తెలంగాణ

తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌కు హైకోర్టులో చుక్కెదురు.. క్యాడర్ కేటాయింపు రద్దు

తెలంగాణ సీఎస్‌గా పని చేస్తున్న సోమేష్ కుమార్‌ క్యాడర్ కేటాయింపుపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. సోమేష్‌కుమార్‌ కేడర్‌ను రద్దు చేసింది. ఏపీ క్యాడర్‌కు సోమేష్‌కుమార్‌ వెళ్లాల్సిందేనని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ‌ సందర్భంగా కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.

06 Jan 2023

బీజేపీ

తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి? ఆ నలుగురిలో వరించేదెవరిని?

తెలుగు రాష్ట్రాల్లో బలపడాలని బీజేపీ ఎప్పటి నుంచో ఉవ్విళ్లూరుతోంది. అనుకున్నట్లుగా తెలంగాణలో కాస్త పుంజుకున్నా.. ఏపీలో మాత్రం ప్రభావాన్ని చూపలేకపోతోంది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది బీజేపీ. ఈ క్రమంలో త్వరలో చేపట్టనున్న కేంద్ర‌మంత్రి వర్గ విస్తరణలో తెలంగాణ, ఏపీకి ప్రాధాన్యత కల్పించొచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.

వచ్చే ఏడాది నుంచి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్‌ తరగతులు: సీఎం జగన్

డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించడానికి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని తరగతి గదులను డిజిటల్‌గా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతి గదుల్లో డిజిటల్‌ స్క్రీన్‌లు, ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెల్‌ డిస్‌ప్లే (ఐఎఫ్‌పిడి) ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. డిజిటల్‌ స్క్రీన్‌లతో ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.

సలహాదారుల నియామకాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

వివిధ శాఖలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సలహాదారులను నియమించడంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం సలహాదారులను నియమించే అధికారం ఉందా? లేదా? అనే దానిపై లోతుగా విచారణ జరపాల్సి ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా నేతృత్వంలోని డివిజన్‌ ​​బెంచ్‌ పేర్కొంది.

కందుకూరు, గుంటూరు ఘటనలు కుట్రలో భాగమే: చంద్రబాబు

కుప్పంలోని టీడీపీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో ఏం జరుగుతుందో ప్రపంచంలోని తెలుగు ప్రజలంతా చూస్తున్నారని చంద్రబాబు అన్నారు.

కొత్త నిబంధనల ఎఫెక్ట్: కుప్పంలో చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు

టీడీపీ అధినేత చంద్రబాబుకు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పోలీసులు షాకిచ్చారు. బుధవారం నుంచి మూడు రోజుల‌పాటు చంద్రబాబు కుప్పంలో రోడ్‌షోలు, బహిరంగ సభలను నిర్వహించాల్సి ఉంది.

చంద్రబాబు సభల ఎఫెక్ట్: రోడ్ షోలు, ర్యాలీలపై ఏపీ సర్కారు నిషేధం

రోడ్ షోలు, ర్యాలీల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ విస్తరణపై కేసీఆర్ ఫోకస్.. పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఆయనకేనా?

ఆంధ్రప్రదేశ్‌లో భారత రాష్ట్ర సమితి విస్తరణపై అధినేత కేసీఆర్ దృష్టి పెట్టారు. వీలైనంత త్వరలో ఏపీలో పార్టీ కార్యాలయాలన్ని ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నారు. ఏపీలో పార్టీని నడిపే నాయకుల జాబితాను ఇప్పటికే ఖరారు చేశారట. కీలక నాయకుల పేర్లు ఇప్పడు బయటకు వచ్చాయి. వీరందరూ సోమవారం కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.

చంద్రబాబుకే ఎందుకు ఇలా జరుగుతోంది? మరోసారి తొక్కిసలాట.. ముగ్గురు మృతి

చంద్రబాబు సభల్లో వరుస విషాదాలు టీడీపీని కలవరపాటుకు గురి చేస్తున్నాయి. కొత్త ఏడాదిలో మొదటి రోజు గుంటూరు వికాస్‌నగర్‌లో జరిగిన తొక్కిసలాటలో మరో ముగ్గురు మరణించారు. ఈ ముగ్గురూ మహిళలే. ఇటీవల కందుకూరు సభలో జరిగిన తొక్కిసలాటలో 8మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

30 Dec 2022

తెలంగాణ

తెలుగు రాష్ట్రాల్లో నకిలీ డాక్టర్ల స్కామ్.. రంగంలోకి సీబీఐ

తెలుగు రాష్ట్రాల్లో నకిలీ డాక్టర్ల స్కామ్ వెలుగులోకి వచ్చింది. విదేశాల్లో వైద్య విద్య చదివి.. అర్హత పరీక్ష రాయకుండానే.. ప్రాక్టీసు చేస్తున్న వైద్యులపై సీబీఐ గుర్తించే పనిలో పడింది. ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తోపాటు మిగతా రాష్ట్రాల్లో 91చోట్ల సోదాలు నిర్వహించింది.

కందుకూరు దుర్ఘటనకు కారణం ఎవరు? ప్రమాదంపై రాజకీయమా?

నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటనలో విషాదం చోటుచేసుకుంది. తోపులాటలో 8మంది మృతి చెందారు. అయితే దీనికి కారణం ఎవరనేదానిపై వైసీపీ- టీడీపీ శ్రేణులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.

'తెలంగాణ తీరుతో మా హక్కులను కోల్పోతున్నాం'.. కేంద్రానికి జగన్ ఫిర్యాదు

దిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్.. బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా మరోసారి తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న నీళ్ల పంచాయితీని కేంద్రం వద్దకు తీసుకెళ్లారు. ముఖ్యంగా జగన్.. తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు(కేఆర్‌ఎంబీ) ఆపరేషనల్‌ ప్రోటోకాల్స్‌, ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని కేంద్ర పర్యావరణ,అటవీ,వాతావరణ మార్పుల శాఖమంత్రి భూపేంద్ర యాదవ్‌‌కు జగన్ ఫిర్యాదు చేశారు.

అసైన్డ్ భూముల్లో గ్రానైట్ తవ్వకాలపై హైకోర్టులో విచారణ.. మంత్రి రజనీకి నోటీసు

ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజనీకి హైకోర్టు షాక్ ఇచ్చింది. అసైన్డ్ భూములను గ్రానైట్ తవ్వకాలకు అనుమతులు ఇచ్చిన కేసులో నోటీసు జారీ చేసింది. మంత్రి విడదల రజనీకి కౌంటర్ దాఖలు చేయవలసిందిగా ఈ సందర్భంగా ధర్మాసనం కోరింది.

ఏపీఎస్ఆర్టీసీ కార్గో ఆదాయం అదుర్స్.. మొదటి మూడు త్రైమాసికాల్లో ఎంత వచ్చిందంటే?

కార్గో సేవల్లో ఏపీఎస్ఆర్టీసీ దూసుకుపోతోంది. సురక్షితంగా, సకాలంలో, చౌకగా గమ్యస్థానాలకు సరుకులను చేరుస్తుండటంతో కార్గో సేవలకు ఆదరణ రోజురోజుకు పెరిగిపోతోంది. దీంతో ఆదాయం కూడా అంతకంతకూ పెరిగిపోతోంది. కార్గో సేవల ద్వారా 2022-23 ఆర్థిక సంవత్సరం మొదటి మూడు త్రైమాసికాల్లో రూ.122 కోట్ల ఆదాయంతో సత్తా చాటింది ఏపీఎస్ఆర్టీసీ.

2022లో మహిళలకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పులు ఇవే..

2022లో సుప్రీంకోర్టు మహిళలకు అనుకూలంగా అనేక తీర్పులను వెలువరించింది. అయితే అందులోని 5 చరిత్రాత్మక నిర్ణయాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చంపేస్తామని మాజీ ఎమ్మెల్యేకు హెచ్చరిక.. గుడివాడలో దుండగుల హల్‌చల్

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది.. రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్నా.. అందరి చూపు మాత్రం గుడివాడ పైన ఉందని చెప్పాలి. 2024 ఎన్నికల్లో గుడివాడలో ఎలాగైనా వైసీపీని ఓడించాలని కంకణం కట్టుకుంది. తాజాగా నియోజకవర్గంలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యమలో మరోసారి వార్తల్లో నిలిచింది గుడివాడ.

23 Dec 2022

తెలంగాణ

తెలంగాణలో టీడీపీ రీఎంట్రీ.. ఏ పక్షానికి నష్టం ? ఏ పార్టీకి లాభం?

అసెంబ్లీ ఎన్నికలు ఇంకో ఏడాది ఉన్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణపై ఫోకస్ పెట్టారు. వ్యూహాత్మకంగా ఖమ్మంలో బహిరంగ సభను నిర్వహించి.. తెలంగాణలో చాలా కాలంగా యాక్టివ్‌గా లేని టీడీపీని చంద్రబాబు తిరిగి చర్చలోకి తీసుకోచ్చారు. టీడీపీ యాక్టివ్ అయితే ఏ పార్టీకి లాభం, ఏ పార్టీకి నష్టం అనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.

టీడీపీ నుంచి ఎంపీగా వైసీపీ నేత డీఎల్ పోటీ ? జగన్‌ను విమర్శించడంలో ఆంతర్యం అదేనా?

వైసీపీ నేత, మాజీ మంత్రి, మైదుకూరు నుంచి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, కడప రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన నాయకుడు డీఎల్ రవీంద్రారెడ్డి చేసి ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి.

'రాష్ట్రాన్ని చంద్రబాబు తప్ప ఎవరూ కాపాడలేరు'.. సీఎం జగన్‌పై కడప వైసీపీ నేత ఆరోపణలు

ఏపీ సీఎం జగన్‌పై సంచనల ఆరోపణలు చేశారు కడప జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత డీఎల్ రవీంద్రారెడ్డి. పీకల్లోతు నష్టాల్లో ఉన్న బైజూస్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు. అంతేకాకుండా అందులో అవినీతి కోణం ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. బైజూస్ తో ఒప్పందం విషయంలో జగన్ అవినీతికి పాల్పడ్డారని, ఫలితంగా రూ. 1400 కోట్లు వృథా అవుతోందని సంచలన ఆరోపణపు చేశారు.

మునుపటి
తరువాత