ఆంధ్రప్రదేశ్: వార్తలు

పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో దేశంలోనే 5వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ 

కూరగాయల పండ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ఘనత సాధించింది. దేశంలోనే 5వ స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని కేంద్ర గణాంక శాఖ వెల్లడించింది.

'జగనన్నకు చెబుదాం'లో ఎలా ఫిర్యాదు చేయాలి? ఏ సమస్యకు పరిష్కారం లభిస్తుంది?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'జగనన్నకు చెబుదాం' అనే కొత్త పరిష్కార కార్యక్రమాన్ని మే 9 నుంచి ప్రారంభించబోతోంది.

AP SSC Results 2023: పదో తరగతి ఫలితాలు విడుదల: రిజల్ట్ ఇలా చెక్ చేసుకోండి

బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఆంధ్ర‌ప్రదేశ్ AP SSC 2023 ఫలితాలను శనివారం ఉదయం 11 గంటలకు ప్రకటించింది.

రేపే ఏపీలో టెన్త్ పరీక్షా ఫలితాలు రిలీజ్.. పూర్తి వివరాలివే 

ఏపీలో ఈ ఏడాది జరిగిన టెన్త్ పరీక్షా ఫలితాలు విడుదల తేదీ ఖరారైంది. టెన్త్ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫలితాల తేదీని నేడు విద్యాశాఖ మంత్రి బోత్స సత్యనారాయణ వెల్లండించారు.

ఏపీ, తెలంగాణలో పదో తరగతి ఫలితాల విడుదల ఎప్పుడంటే?

పదో తరగతి ఫలితాల కోసం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో పరీక్ష రాసిన లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు.

శ్రీకాకుళంలో బహుదా నదిపై కుప్పకూలిన బ్రిటిష్ కాలం నాటి వంతెన 

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం సమీపంలోని బహుదా నదిపై నిర్మించిన పురాతన వంతెన బుధవారం కుప్పకూలింది.

03 May 2023

అమరావతి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట; చంద్రబాబు పాలనలో నిర్ణయాలపై విచారణకు లైన్ క్లియర్ 

సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాలనలో జరిగిన కొన్ని నిర్ణయాలపై విచారణకు బుధవారం సుప్రీంకోర్టు అనుమతిచ్చింది.

భోగాపురం విమానాశ్రయానికి జగన్ శంకుస్థాపన; మత్స్యం ఆకారంలో నిర్మించనున్న జీఎంఆర్ 

ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు.

ప్రభుత్వాస్పత్రుల్లో ఖాళీలన్నీ భర్తీ చేయాలి, నిరంతరం పర్యవేక్షించాలి: సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. నిరంతరం వైద్య సదుపాయాలను పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.

తుని రైలు దహనం కేసును కొట్టేసిన విజయవాడ రైల్వే కోర్టు

తూర్పుగోదావరి జిల్లా తుని వద్ద ఐదేళ్ల క్రితం రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను తగలబెట్టిన కేసును విజయవాడ రైల్వే కోర్టు సోమవారం కొట్టేసింది.

APSRTC: పాడేరు, అరకులోయ, బొర్రా గుహలకు 'ఏపీఎస్ఆర్టీసీ' ప్రత్యేక టూర్ ప్యాకేజీ 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) లంబసింగి, పాడేరు, అరకు లోయ, బొర్రా గుహలు వంటి పర్యాటక ప్రదేశాల్లో విహార యాత్రల కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రారంభించబోతోంది.

28 Apr 2023

తెలంగాణ

వైఎస్ అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జూన్ 5కి వాయిదా

వైఎస్ వివేక హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌పై ఇప్పుడు వాదనలు వినలేమని శుక్రవారం తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.

చేతిపంపు కొట్టుకొని నీళ్లు తాగిన ఏనుగు; వీడియో వైరల్ 

పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన కొమరాడ మండలంలోని వన్నాం గ్రామంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

27 Apr 2023

బిహార్

బిహార్ డాన్ ఆనంద్ మోహన్ సింగ్ విడుదలపై ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అసోసియేషన్ అభ్యంతరం 

గోపాల్‌గంజ్ జిల్లా మేజిస్ట్రేట్ జి.కృష్ణయ్య హత్య కేసులో దోషిగా ఉన్న ఆనంద్ మోహన్ సింగ్‌ను విడుదల చేయాలని బిహార్ ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడంపై ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అసోసియేషన్ (ఐఏఎస్) అభ్యంతరం వ్యక్తం చేసింది.

పాస్‌పోర్ట్ ఆఫీస్‌లు శనివారం కూడా తెరిచే ఉంటాయ్ 

ఆంధ్రప్రదేశ్‌లో పాస్ పోర్ట్ కోసం ఎదురుచూసే వారికి గుడ్ న్యూస్. రాష్ట్రంలో విశాఖపట్నం, భీమవరం, విజయవాడ, తిరుపతిలోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు ఇక నుంచి శనివారం కూడా పని చేయనున్నాయి.

26 Apr 2023

తెలంగాణ

తెలుగు రాష్ట్రాల్లో మామిడి రైతులకు శాపంగా మారిన అకాల వర్షాలు 

అకాల వర్షాల కారణంగా మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత రెండురోజులుగా కురుస్తున్న వర్షాలు మామిడి రైతుల ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి.

25 Apr 2023

కడప

రాజకీయాల్లోకి వైఎస్ వివేక కూతురు సునీత ఎంట్రీ ఇస్తున్నారా? కడపలో పోస్టర్లు వైరల్ 

కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో మాజీ మంత్రి వైఎస్ వివేకా కుమార్తె సునీత పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు ఆమె రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారంటూ టీడీపీ నేతల ఫొటోలతో కూడిన పోస్టర్లను ప్రొద్దుటూరులో ప్రధాన కూడళ్లలో అతికించారు.

25 Apr 2023

ఐఎండీ

ఆంధ్రప్రదేశ్‌‌లో చల్లచల్లగా; రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు 

భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చల్లటి వార్త చెప్పింది. రానున్న మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.

తెలంగాణ హైకోర్టు ఆదేశాలను కొట్టేసిన సుప్రీంకోర్టు; అవినాష్ రెడ్డి అరెస్టుకు లైన్ క్లియర్ 

వైఎస్ వివేకా హత్య కేసులో లోక్‌సభ సభ్యుడు వైఎస్‌ అవినాష్‌రెడ్డిని అరెస్టు చేయకుండా కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ని ఆదేశించిన తెలంగాణ హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది.

24 Apr 2023

కోనసీమ

ఆత్రేయపురంలో బంగారం పూతరేకులు; ధరంతో తెలుసా?

పూతరేకులు అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లాల్లోని ఆత్రేయపురం. పూతరేకులకు ఆత్రేయపురం వరల్డ్ ఫేమస్ అని చెప్పాలి.

24 Apr 2023

విహారం

పర్యాటకులకు అలర్ట్: నేడు, రేపు పాపికొండల విహార యాత్ర రద్దు 

ప్రముఖ పర్యాటక కేంద్రమైన పాపికొండల విహార యాత్రను యంత్రాంగం రద్దు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

 వైఎస్ వివేకా హత్య కేసు: అవినాష్‌రెడ్డి బెయిల్‌పై స్టే విధించిన సుప్రంకోర్టు 

వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో సీబీఐ ప్రశ్నిస్తున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది.

21 Apr 2023

అమెరికా

అమెరికాలో తుపాకీ కాల్పులకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థి బలి 

అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న ఆంధ్రప్రదేశ్‌‌కు చెందిన 24 ఏళ్ల విద్యార్థి తుపాకీ కాల్పులకు బలయ్యాడు.

కేంద్రం కీలక నిర్ణయం: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు చొప్పున ఫుడ్ స్ట్రీట్‌ల ఏర్పాటు 

జాతీయ ఆరోగ్య మిషన్ కింద దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో 100 ఫుడ్ స్ట్రీట్‌లను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది.

వివేకా హత్య కేసు: తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సునీత

వైఎస్‌ వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డిలను విచారిస్తూ సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది.

19 Apr 2023

వైజాగ్

 వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం కేఏ పాల్‌తో చేతులు కలిపిన లక్ష్మీనారాయణ 

వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ చేతులు కలిపారు.

19 Apr 2023

కర్ణాటక

యాక్టివ్ పాలిటిక్స్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన రఘువీరా రెడ్డి; కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ కీలక బాధ్యతలు

గత కొన్నేళ్లుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) మాజీ అధ్యక్షుడు ఎన్.రఘువీరా రెడ్డి తిరిగి యాక్టివ్ పాలిటిక్స్‌లోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించారు.

18 Apr 2023

కడప

వైఎస్ అవినాష్ రెడ్డికి ఊరట; ఏప్రిల్ 25వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశం 

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.

వివేకా హత్యకు కుట్ర పన్నిన విషయం అవినాష్ రెడ్డికి ముందే తెలుసు: సీబీఐ

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ముందస్తు బెయిల్ కోసం ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. ప్రొబేషన్ ఖరారు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 

ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

'ఓటర్లను ఏ, బీ, సీలుగా విభజించండి, వారితో ఒట్టు వేయించుకోండి'; ధర్మాన వ్యాఖ్యలు వైరల్

ఆంధ్రప్రదేశ్ మంత్రి ధర్మాన ప్రసాద రావు ఈ మధ్య కాలంలో తరుచూ వార్తల్లో నిలుస్తున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆయనకు పరిపాటిగా మారిందనే విమర్శలు కూడా వస్తున్నాయి.

'ప్రత్యేక హోదా కోసం పోరాడండి'; ఏపీ మంత్రులకు హరీష్ రావు కౌంటర్ 

బీఆర్‌ఎస్‌, వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తెలంగాణ మంత్రి తన్నీరు హరీష్ రావు చేసిన వ్యాఖ్యలతో వివాదం ప్రారంభమైన నేపథ్యంలో ఆయన సోమవారం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

ఆంధ్రప్రదేశ్: మండుతున్న ఎండలు, ఉక్కపోత; 4రోజుల్లోనే అమాంతం పెరిగిన విద్యుత్ వినియోగం

ఆంధ్రప్రదేశ్ రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో విద్యుత్ గ్రిడ్లకు డిమాండ్ ఏర్పడింది.

ఆంధ్రప్రదేశ్‌లోని 116 మండలాల్లో వేడిగాలులు; అమసరమైతే బయటకు రావాలని ఐఎండీ సూచన

ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో సోమవారం వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదు; క్లారిటీ ఇచ్చిన కేంద్రం 

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌గా పిలిచే రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌) ప్రైవేటీకరణ ప్రక్రియ ఆగదని శుక్రవారం కేంద్రం స్పష్టం చేసింది.

ఏపీలో ట్రోలింగ్ రాజకీయం: జగన్ స్టిక్కర్ తొలగించిన కుక్కపై పోలీసులకు టీడీపీ ఫిర్యాదు 

వైసీపీ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల 'మా భవిష్యతు నువ్వే జగన్' అనే ప్రచారాన్ని ప్రారంభించింది.

13 Apr 2023

ఇస్రో

 ఏప్రిల్ 22న పీఎస్‌ఎల్‌వీ-సీ55 మిషన్‌‌ను ప్రయోగించనున్న ఇస్రో 

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఏప్రిల్ 22న పీఎస్‌ఎల్‌వీ-సీ55 మిషన్‌కు ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది.

దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా జగన్మోహన్ రెడ్డి; ఏడీఆర్‌ వెల్లడి

దేశంలో అత్యంత ధనిక సీఎంగా ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలిచినట్లు అసోసియేషన్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) తన నివేదికలో పేర్కొంది.

13 Apr 2023

తెలంగాణ

'మార్గదర్శి' కార్యాలయాల్లో ఏపీ సీఐడీ సోదాలను ఆపలేము: తెలంగాణ హైకోర్టు

హైదరాబాద్‌లోని తమ కార్యాలయాల్లో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ సీఐడీ సోదాలను 'మార్గదర్శి' చిట్‌ఫండ్‌ కంపెనీ తెలంగాణ హైకోర్టులో సవాలు చేసింది.

సెల్ఫీ ఛాలెంజ్‌పై కౌంటర్; సుపరిపాలనపై చంద్రబాబుకు సవాల్ విసిరిన ఏపీ సీఎం జగన్ 

టిడ్కో ఇళ్లపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విసిరిన సెల్ఫీ ఛాలెంజ్‌పై ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కౌంటర్ ఇచ్చారు. సెల్ఫీ ఛాలెంజ్ అంటే కేవలం నాలుగు ఫొటోలను పోస్ట్ చేయడం కాదని వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి హితవు పలికారు.