ఆంధ్రప్రదేశ్: వార్తలు

12 Apr 2023

ఇంధనం

SEEI: ఇంధన పొదుపు సూచీలో టాప్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రాష్ట్ర ఇంధన పొదుపు సూచిక (ఎస్ఈఈఐ) 2021-22లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, రాజస్థాన్ ముందువరుసలో నిలిచినట్లు కేంద్రం తెలిపింది.

టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఏపీ సీఐడీ నోటీసులు 

తెలుగుదేశం పార్టీ/టీడీపీ ప్రధాన కార్యదర్శి, పార్టీ అనుబంధ మ్యాగజైన్ చైతన్య రథం పబ్లిషర్‌కు ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు మంగళవారం నోటీసులు జారీ చేశారు.

తెలుగు రాష్ట్రాల సంపదను నాశనం చేస్తున్న అదానీ, ప్రధాని: కేటీఆర్

అదానీ గ్రూప్‌నకు ఇచ్చిన ఒడిశాలోని బైలాదిలా మైనింగ్ కాంట్రాక్టును రద్దు చేయాలని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేస్తోందని అన్నారు.

నల్లమలలో 75 పులులు; ఎన్ఎస్‌టీఆర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏర్పడి 50ఏళ్లు

నల్లమల అడవులు పెద్దపులులకు నిలయంగా మారినట్లు, ఈ ప్రాంతంలో టైగర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం నల్లమల అడవుల్లో 75 వరకు పులులు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌‌ను వేలంలో దక్కించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్

ఆంధ్రప్రదేశ్ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకునే దిశగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ వేలం పాటలో బిడ్ వేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారు.

రేపు సికింద్రాబాద్-తిరుపతి వందే‌భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం; ట్రైన్ రూట్, టికెట్ ధరలను తెలుసుకోండి

ఐటీ సిటీ హైదరాబాద్‌ను వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం తిరుమలను కలిపే సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ శనివారం నుంచి అందుబాటులోకి రానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఈ సెమీ-హై స్పీడ్ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు.

అనంతపురం ఆర్టీఏ ఆఫీస్ సమీపంలో భారీ పేలుడు; ఒకరు దర్మరణం

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో ఘోర ప్రమాదం జరిగింది. అనంతపురం జిల్లా కేంద్రంలోని రవాణా కార్యాలయం సమీపంలోని ఒక దుకాణంలో భారీ పేలుడు సంభవంచింది.

07 Apr 2023

కోవిడ్

ఏప్రిల్ 10, 11 తేదీల్లో కరోనా మాక్ డ్రిల్; ఆరోగ్య శాఖ ఏర్పాట్లు

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 10, 11తేదీల్లో మాక్ డ్రిల్ నిర్వహించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ఆరోగ్య శాఖలు ఏర్పాట్లు చేస్తున్నాయి.

07 Apr 2023

బీజేపీ

ఆంధ్రప్రదేశ్: బీజేపీలో చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం దిల్లీలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు.

07 Apr 2023

బీజేపీ

నేడు బీజేపీలోకి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ కేంద్ర పెద్దల సమక్షంలో ఆయన ఆయన పార్టీలో చేరనున్నారు.

సైకో ఘాతుకం; స్నాప్‌చాట్‌లో ప్రేమించిన మహిళ అనుకొని మరో యువతి హత్య

ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణ హత్య జరిగింది. అమలాపురం పట్టణంలో ఈనెల 4న నెల్లూరు జిల్లాకు చెందిన కోట హరికృష్ణ ఓ మహిళను కత్తితో నరికి చంపాడు.

'ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌'తో వైద్య రంగంలో పెను మార్పులు: సీఎం జగన్

'ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌'తో దేశంలో వైద్య వ్యవస్థలో పెనుమార్పు వస్తాయని, ఆ మహత్తర కార్యక్రమం పల్నాడులోని లింగంగుంట్ల నుంచే ప్రారంభమైందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.

ఒంట్టిమిట్ట సీతా‌రాముల కల్యాణానికి సీఎం జగన్ గైర్హాజరకు కారణాలేంటి?

ఒంటిమిట్టలో బుధవారం జరిగే సీతా రాముల కల్యాణానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి హాజరు కావాల్సి ఉండగా చివరి నిమిషంలో ఆ కార్యక్రమం రద్దయింది.

'అమృత్ భారత్ పథకం' కింద ఆంధ్రప్రదేశ్‌లో 72 రైల్వే స్టేషన్ల అభివృద్ధి: కేంద్రం

ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే ప్రాజెక్టుల అభివృద్ది పనులపై మంగళవారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

దిల్లీ పర్యటనలో జనసేన అధినేత; హస్తిన పర్యటనలో పవన్ ఏం చేయబోతున్నారు?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉత్తర భారత పర్యటనలో ఉన్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఆదివారం పవన్ పర్యటించారు. పవన్ కళ్యాణ్ సోమవారం ఉదయం దిల్లీకి చేరుకున్నారు.

03 Apr 2023

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సోమవారం 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. దీంతో పరీక్ష కేంద్రాల వల్ల సందడి నెలకొంది. ఈ ఏడాది నుంచి రెండు రాష్ట్రాల్లో కూడా 11పేపర్లతో నిర్వహించే పరీక్షను 6 పేపర్లతో నిర్వహిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 3నుంచి ఎస్ఎస్‌సీ పరీక్షలు; విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఉచితం

ఏప్రిల్ 3 నుంచి 10వ తరగతి (ఎస్‌ఎస్‌సీ) పరీక్షలను నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విస్తృత ఏర్పాట్లు చేసినట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం తెలిపారు.

శ్రీరామ నవమి వేడుకల్లో అపశృతి; చలువ పందిళ్లు పూర్తిగా దగ్ధం

పశ్చిమగోదావరి జిల్లాలో శ్రీరామ నవమి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. ఏలూరులోని తణుకు మండలం దువ్వలో శ్రీరామ నవమి వేడుక కోసం వేసిన చలువ పందిళ్లకు మంటలు అంటున్నాయి.

30 Mar 2023

ఏలూరు

ఏలూరు: భీమడోలు జంక్షన్‌లో ఎస్‌యూవీని ఢీకొన్న 'దురంతో ఎక్స్‌ప్రెస్' రైలు

సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్తున్న 'దురంతో ఎక్స్‌ప్రెస్‌' రైలు గురువారం తెల్లవారుజామున ఎస్‌యూవీని ఢీకొట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలోని భీమడోలు మండలంలో ఈ ఘటన జరగడంతో ఆ మార్గం గుండా వెళ్లే పలు రైళ్లు ఆరు గంటలకు పైగా ఆలస్యంగా వెళ్లాయి.

ముగిసిన సీఎం వైఎస్ జగన్ దిల్లీ పర్యటన; అమిత్ షా, నిర్మలతో కీలక భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిల్లీ పర్యటన ముగిసింది. బుధవారం సాయంత్రం దిల్లీ వెళ్లిన ఆయన గురువారం ఉదయం తిరిగి ఆంధ్రప్రదేశ్‌కు బయలుదేరారు.

ఆంధ్రప్రదేశ్: 14 స్పెషాలిటీ ఆస్పత్రుల్లో 162మంది వైద్య నిపుణుల నియామకం

ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమానికి చెందిన వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ) ఆసుపత్రుల్లో నిపుణులైన వైద్యుల నియామకం కోసం వాక్-ఇన్ ఇంటర్వ్యూలు ముగిశాయి. ఈ నెల 23 నుంచి మంగళవారం వరకు నిర్వహించిన ఇంటర్వ్యూల్లో 14 స్పెషాలిటీల్లో 162 పోస్టులు భర్తీ అయ్యాయి.

28 Mar 2023

అమరావతి

అమరావతిపై విచారణను జులై 11కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు

అమరావతి కేసును వెంటనే విచారించాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీంకోర్టు మరోసారి తిరస్కరించింది. ఈ పిటిషన్‌ను జులై 11న విచారించనున్నట్లు జస్టిస్ జోసెఫ్, జస్టిస్ నాగరత్నతో కూడి న ధర్మాసనం పేర్కొంది.

పులివెందులలో కాల్పుల కలకలం; తుపాకీతో ఇద్దరిని కాల్చిన భరత్ యాదవ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నియోజకవర్గం పులివెందులలో మంగళవారం ఓ వ్యక్తి తుపాకీతో రెచ్చిపోయాడు. భరత్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి కాల్పులు జరపగా, ఇద్దరు గాయపడ్డారు.

27 Mar 2023

పోలవరం

పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లు; క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై కేంద్రం ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా క్లారిటీ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లని పేర్కొంది. 1980 ట్రిబ్యూనల్ అవార్డు ప్రకారం పోలవరం ఎత్తు 45.72 మీటర్లని కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ స్పష్టం చేశారు. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి ఈ మేరకు సమాధానం చెప్పారు.

27 Mar 2023

సీబీఐ

వైఎస్ వివేకా హత్య కేసులో కీలక మలుపు; దర్యాప్తు అధికారిని మార్చాలని సీబీఐని ఆదేశించిన సుప్రీంకోర్టు

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే విచారణ అధికారిని తక్షణమే మార్చాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఈరోజు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్‌రెడ్డి భార్య తులసమ్మ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

26 Mar 2023

ఇస్రో

శ్రీహరికోట: భారతదేశపు అతిపెద్ద ఎల్‌వీఎం రాకెట్‌ను ప్రయోగించిన ఇస్రో

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఆదివారం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి 36 ఉపగ్రహాలను మోసుకెళ్లే భారతదేశపు అతిపెద్ద ఎల్‌వీఎం3 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది.

వైసీపీ సంచలన నిర్ణయం; నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచనలంగా మారాయి. తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుపులో సహకరించినట్లు అనుమానిస్తున్న నలుగురు ఎమ్మెల్యేలపై వైసీపీ సస్పెన్షన్ వేటు వేసింది.

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి శుక్రవారం టీడీపీలో చేరారు.

24 Mar 2023

ఉద్యోగం

ఆంధ్రప్రదేశ్: గ్రూప్ 4 మెయిన్స్ పరీక్ష తేదీని ప్రకటించిన ఏపీపీఎస్సీ

గ్రూప్ 4 స్క్రీనింగ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి.. మెయిన్స్‌ కోసం ఎదురు చూస్తున్న వారికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) తీపికబురు చెప్పింది. మెయిన్స్ పరీక్షకు సంబంధించిన తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది.

24 Mar 2023

ఉద్యోగం

ఆంధ్రప్రదేశ్: నిరుద్యోగులకు శుభవార్త; డీఎస్సీ నోటీఫికేషన్‌పై క్లారిటీ ఇచ్చిన మంత్రి బొత్స

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయుల భర్తీపై త్వరలో నిరుద్యోగులకు శుభవార్త చెప్పనుంది. డీఎస్సీ నోటిఫికేషన్‌పై రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ కూడా దీనిపై క్లారిటీ ఇచ్చారు. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభంలో అంటే జులై కానీ, ఆగస్టులో గానీ డీఎస్సీ నోటిఫికేషన్‌పై నిర్ణయ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితం; టీడీపీ అభ్యర్థి అనురాధ విజయం

ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితం వచ్చింది. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించి సంచలనం సృషించారు.

23 Mar 2023

పోలవరం

పోలవరంలో నీటి నిల్వ 41.15 మీటర్లకే పరమితం; కేంద్రం కీలక ప్రకటన

పోలవరం ప్రాజెక్టుపై గురువారం కేంద్రం కీలక ప్రకటన చేసింది. పోలవరంలో నీటి నిల్వ ప్రస్తుతం 41.15 మీటర్లకే పరమితం చేసినట్లు పార్లమెంట్‌లో కేంద్రం పేర్కొంది.

Andhra pradesh: ఉత్కంఠగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్; ఓటేసిన సీఎం జగన్

వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక శాసనమండలి ఆవరణలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. గురువారం ఉదయాన్నే సీఎం జగన్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

విశాఖపట్నం: కుప్పకూలిన భవనం; ముగ్గురు మృతి; పుట్టినరోజు నాడే దుర్ఘటన

విశాఖపట్నం కలెక్టరేట్ సమీపంలోని రామజోగిపేటలో బుధవారం అర్థరాత్రి ఘోరం జరిగింది. మూడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ఆంధ్రప్రదేశ్: జగనన్న గోరుముద్దలో రాగి జావ; విద్యార్థుల మేథో వికాసంపై ప్రభుత్వం ఫోకస్

పాఠశాల విద్యార్థులకు వారంలో మూడు రోజులు ఉదయం పూట రాగి జావ అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి జగనన్న గోరుముద్ద ద్వారా లాంఛనంగా ప్రారంభించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాపం సర్వేలదేనా? అవే జగన్‌ను తప్పుదారి పట్టించాయా?

ఆంధ్రప్రదేశ్‌లోని 3 గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. ఉత్తరాంధ్ర(శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం), తూర్పు రాయలసీమ(ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు), పశ్చిమ రాయలసీమ(కడప-అనంతపురం-కర్నూలు)పట్టభద్రల స్థానాల్లో వైసీపీ అనూహ్య పరాభవం ఎదురైంది.

19 Mar 2023

తెలంగాణ

TSRTC: 'బాలాజీ దర్శనం' ప్యాకేజీకి విశేష స్పందన; తిరుమలకు 1.14 లక్షల మంది భక్తులు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) పోర్టల్‌లో అందుబాటులో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్పెషల్ ఎంట్రీ దర్శన్ టోకెన్‌కు భక్తుల నుంచి మంచి స్పందన వస్తోంది.

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వేపాడ చిరంజీవి ఎవరంటే?

ఉత్తరాంధ్ర(విశాఖపట్నం, శ్రీకాకులం, విజయనగరం) పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బలపర్చిన అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు విజయం సాధించారు.

ప్రధాని మోదీని కలిసి ప్రత్యేక హోదా డిమాండ్‌ను నెరవేర్చాలని కోరిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్‌ను నెరవేర్చాలన పునరుద్ఘాటించారు. అలాగే రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల వంటి అంశాలపై చర్చించారు.

17 Mar 2023

తెలంగాణ

ముంచుకొస్తున్న తుఫాను, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం

మరికొన్ని గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించడానికి తుఫాన్ ముంచుకొస్తుంది. ప్రస్తుతం చర్ల సరిహద్దు ఆనుకొని ఉన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జగదల్‌పూర్క్‌కు 65 కిలోమీటర్ల దూరంలో తెలంగాణలోని భద్రాచలానికి 120 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి)పేర్కొంది.