భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

06 Aug 2023

హర్యానా

హర్యానాలో నాలుగో రోజు కీలక కూల్చివేతలు.. హోటల్ భవనాన్ని పడగొట్టిన బుల్డోజర్

హర్యానాలోని నుహ్ జిల్లాలో నాలుగో రోజూ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అల్లర్లకు కారణంగా నిలిచిన సహారా హోటల్‌ను ఆదివారం బుల్డోజర్లు నేలమట్టం చేశాయి. ఈ బిల్డింగ్ పై నుంచే అల్లరి మూకలు మతపరమైన ఊరేగింపుపై రాళ్ల దాడికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.

06 Aug 2023

గవర్నర్

తెలంగాణ: టీఎస్‌ఆర్‌టీసీ బిల్లుకు గవర్నర్ తమిళసై ఆమోదం

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

06 Aug 2023

ఇండిగో

మరోసారి వివాదాస్పదమైన ఇండిగో.. ఏసీ లేకుండానే గాల్లోకి లేచిన విమానం

ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో మరో వివాదానికి కేంద్ర బిందుగా మారింది. చండీగఢ్‌ నుంచి జైపుర్‌కు శనివారం బయల్దేరిన విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

06 Aug 2023

ముంబై

లోకల్ ట్రైన్‌‌లో బాంబు పెట్టామంటూ ముంబై పోలీసులకు ఫోన్ కాల్

ముంబైలోని లోకల్ ట్రైన్‌‌కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ట్రైన్‌లో బాంబులు పెట్టినట్లు ముంబై పోలీసులకు ఆదివారం ఉదయం కంట్రోల్ రూమ్‌కి ఈ కాల్ వచ్చింది. దీంతో ముంబై పోలీసులు అప్రమత్తయ్యారు.

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. 6.4 లక్షల గ్రామాలకు ఇంటర్నెట్ అనుసంధానం

భారతదేశంలోని లక్షలాది గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని చిట్టచివరి గ్రామానికి సైతం ఇంటర్నెట్ సేవలు అందించేందుకు భారత ప్రభుత్వం నడుం బిగించింది.

PM Modi: 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన 

అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్లను అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం శంకుస్థాపన చేశారు.

స్నేహితుల దినోత్సవం వేళ విషాదం.. కారు ప్రమాదంలో ముగ్గురు మిత్రులు మృతి

స్నేహితుల దినోత్సవం వేళ ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కారు అదుపు తప్పి వంతెన నుంచి పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్నేహితులు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు గాయపడ్డారు.

05 Aug 2023

బీజేపీ

బీజేపీ ఎంపీ రామ్ శంకర్ కతేరియాకు రెండేళ్ల జైలుశిక్ష; అనర్హత వేటు పడే అవకాశం

2011లో జరిగిన దాడి కేసులో బీజేపీ ఎంపీ రామ్ శంకర్ కతేరియాకు ఆగ్రా కోర్టు శనివారం రెండేళ్ల జైలు శిక్ష విధించింది.

05 Aug 2023

శాసనసభ

తెలంగాణలో సంక్షేమం తప్ప సంక్షోభం లేదు; అసెంబ్లీలో మంత్రి కేటీఆర్  

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. ఈ మేరకు పల్లె, పట్టణ ప్రగతిపై శనివారం ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడారు. తెలంగాణలో సంక్షేమం తప్ప, సంక్షోభం లేదని తేల్చి చెప్పారు.

టీటీడీ బోర్డు కొత్త సారథిగా భూమన కరుణాకర్‌ రెడ్డి నియమాకం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి నూతన ఛైర్మన్‌గా భూమన కరుణాకర్‌ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ ఎంపిక చేశారు. ప్రస్తుత బోర్డు పదవీకాలం ఆగస్ట్ 8తో పూర్తి కానుంది.

విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో అరుదైన శస్త్ర చికిత్స.. యువతి పొట్టలో వెంట్రుకల చుట్ట తొలగింపు 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ యువతికి పొట్టలో భారీగా వెంట్రుకలున్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ మేరకు ఆపరేషన్ చేసి చుట్టుకున్న వెంట్రుకలను తొలగించారు.

అమ్మవారి ఆలయంలో దొంగతనం.. దుర్గాభవాని ఆభరణాలతో పాటు సీసీటీవీ కెమెరాలు చోరీ

హైదరాబాద్‌లోని అమ్మవారి ఆలయంలో భారీ దొంగతనం జరిగింది.

05 Aug 2023

గవర్నర్

గవర్నర్‌ తమిళిసైతో ఆర్టీసీ కార్మీక యూనియన్ కీలక చర్చలు.. త్వరలోనే బిల్లుకు గ్రీన్ సిగ్నల్ 

టీఎస్ఆర్టీసీ బిల్లు-2023పై తెలంగాణ గవర్నర్‌ సానుకూలంగా స్పందించారు. బిల్లులోని 5 అంశాలపై ఇప్పటికే తమిళిసై ప్రభుత్వ వివరణ కోరారు. తాజాగా ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులతో ఆమె చర్చలకు ముందుకొచ్చారు.

05 Aug 2023

హర్యానా

నూహ్‌లో బుల్డోజర్‌ యాక్షన్‌.. మెడికల్‌ షాపులు, దుకాణాలు నేలమట్టం

హర్యానాలోని నుహ్‌లో రెండో రోజైన శనివారం కూడా బుల్డోజర్లు రంగంలోకి దిగాయి. ఈ మేరకు అక్రమ కట్టడాల కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. అధికారులు కూల్చుతున్న ఆయా కట్టడాలు అల్లర్లకు పాల్పడ్డ నిందితులకు చెందినవిగా సమాచారం.

కోర్టు ప్రాంగణంలో నాలుగో పెళ్లి పంచాయతీ.. లాయర్ భర్తను చితకబాదిన ముగ్గురు భార్యలు

జార్ఖండ్‌లోని ఓ కోర్టులో ఓ భార్త, ముగ్గురు భార్యలకు మధ్య పంచాయితీ మొదలైంది. భర్తను ముగ్గురు సతీమణులు కలిసి చితకబాదిన సంఘటన రాంచీ సివిల్‌ కోర్టు ప్రాంగణంలో చోటు చేసుకుంది.

05 Aug 2023

మణిపూర్

మణిపూర్‌‌లో మళ్లీ చెలరేగిన హింస; తుపాకీ కాల్పుల్లో ముగ్గురు మృతి, ఇళ్లు దగ్ధం

జాతి ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో శుక్రవారం అర్థరాత్రి మళ్లీ హింస చెలరేగింది. బిష్ణుపూర్ జిల్లాలో సాయుధులు తుపాకులతో రెచ్చిపోయారు.

05 Aug 2023

తెలంగాణ

ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ కీలక వ్యాఖ్యలు.. ఆ అంశాలను బిల్లులో పొందుపర్చాలని ప్రభుత్వానికి సూచన

టీఎస్ఆర్టీసీ బిల్లు-2023పై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. బిల్లులోని పలు అంశాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే పలు సందేహాలకు ప్రభుత్వం నుంచి వివరణ కోరారు.

05 Aug 2023

ఇండియా

ఆగస్టు 31నుంచి ముంబైలో 'ఇండియా' కూటమి సమావేశాలు 

ఇండియా కూటమి మరోసారి సామావేశం కానుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై వేదికగా రెండు రోజుల పాటు భేటీ కానున్నారు. ఆగస్ట్ 31, సెప్టెంబరు 1న రెండు రోజుల ఈ సదస్సు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

05 Aug 2023

గవర్నర్

తెలంగాణలో ముగిసిన ఆర్టీసీ కార్మికుల ధర్నా.. రాజ్‌భవన్‌ ముట్టడికి ప్లాన్

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన రెండు గంటల ధర్నా ముగిసింది. టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును గవర్నర్ తమిళిసై ఆమోదించకపోవడంపై నిరసిస్తూ విధులను బహిష్కరించారు. ఈ మేరకు దాదాపు రెండు గంటల పాటు బస్సులను నిలిపివేశారు.

Jammu Kashmir: కుల్గామ్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు; ముగ్గురు ఆర్మీ జవాన్లు వీరమరణం 

జమ్ముకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో శుక్రవారం ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఉగ్రవాదులతో జరిగిన ఎదుకాల్పుల్లో ముగ్గురు ఆర్మీ జవాన్లు వీరమరణం పొందారు.

మనీలాండరింగ్ కేసు విచారణలో రానా కపూర్‌కు చుక్కెదురు.. బెయిల్‌ నిరాకరించిన సుప్రీంకోర్టు  

ఎస్ బ్యాంక్ (YES BANK) సహ వ్యవస్థాపకుడు రానా కపూర్‌ కు సుప్రీంకోర్టులో చుక్కైదురైంది.

జ్ఞానవాపి మసీదులో సర్వేకు సుప్రీం గ్రీన్ సిగ్నల్.. నిర్మాణాలకు నష్టం జరగకూడదని స్పష్టం

జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో సైంటిఫిక్ సర్వేకి సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ మేరకు శాస్త్రీయ సర్వే కొనసాగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ ఓ షరతు విధించింది.

అన్నమయ్య జిల్లాలో హై టెన్షన్.. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య దాడులు

టీడీపీ అధినేత చంద్రబాబు రాయలసీమ పర్యటన నేపథ్యంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.

04 Aug 2023

ఎన్ఐఏ

Kashmir: హిజ్బుల్‌ కమాండర్‌ ఇంటిపై ఎన్ఐఏ దాడులు.. 5 చోట్ల ఏకకాలంలో దాడులు

కాశ్మీర్‌లోని ఉగ్ర నాయకుడి ఇంట్లో జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలను నిర్వహించింది. హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ ఒమర్ ఘనీపై ఉగ్రకార్యకలాపాలకు సంబంధించిన కేసులో ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టింది.

దేశవ్యాప్తంగా 508 రైల్వేస్టేషన్లకు మహర్దశ.. ఆగస్ట్ 6న మోదీ శంకుస్థాపన

దేశవ్యాప్తంగా 508 రైల్వేస్టేషన్ల ఆధునీకీకరణ పనులకు ముహుర్తం ఖరారైంది. ఆగస్టు 6న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది.

04 Aug 2023

దిల్లీ

ఇండియా కూటమికి దిల్లీ హైకోర్టు నోటీసులు.. వివరణ ఇవ్వాలని 26 విపక్షాలకు ఆదేశం 

ఇండియా కూటమికి దిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాజకీయ కూటమికి ఇండియా పేరు పెట్టడంపై పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చిది.

మోదీ ఇంటి పేరు కేసులో రాహుల్‌ గాంధీకి ఊరట.. జైలు శిక్షపై స్టే ఇచ్చిన సుప్రీం కోర్టు 

ఎట్టకేలకు పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది.ఈ మేరకు సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై సర్వోన్నత న్యాయస్థానం స్టే ఇస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.

04 Aug 2023

తెలంగాణ

TSRTC బిల్లుపై సస్పెన్స్.. ఇంకా ఆమోదించని గవర్నర్

బీఆర్ఎస్ సర్కారుకు గవర్నర్ తమిళ సై మళ్లీ షాకిచ్చింది. ఇటీవల వరద ప్రాంతాలను సందర్శించిన గవర్నర్ తమిళ సై ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

04 Aug 2023

మణిపూర్

మణిపూర్‌లో మళ్లీ అలజడి.. బెటాలియన్‌పై దాడి చేసి తుపాకులు చోరీ

మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా సాయుధ బలగాల క్యాంప్‌లపై ఓ వర్గం దాడి చేసి భారీగా ఆయుధాలను ఎత్తుకెళ్లారు.

కేదార్‌నాథ్ యాత్రలో విషాదం.. కొండచరియలు విరిగిపడి 12 మందికిపైగా గల్లంతు

ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ కేదార్‌నాథ్ యాత్ర మార్గంలో కొండచరియలు భారీగా విరిగిపడి 12 మందికిపైగా గల్లంతయ్యారు.

సైలెంట్‌గా ఉండకపోతే.. మీ ఇంటికి ఈడీ వస్తుంది : ప్రతిపక్షాలకు కేంద్రమంత్రి హెచ్చరిక 

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హట్ టాపిక్‌గా మారాయి. గురువారం లోక్ సభలో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆమె కొన్ని వ్యాఖ్యలను చేసింది.

సీమా హైదర్ పొలిటికల్ ఎంట్రీ.. ఆ రాజకీయ పార్టీ బంఫర్ ఆఫర్! 

పబ్‌జీ గేమ్‌తో ప్రేమలో పడిన పాక్ మహిళ సీమా గులాం హైదర్ భారత్ కు అక్రమంగా వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి.

04 Aug 2023

హర్యానా

హర్యానా: రంగంలోకి బుల్డోజర్లు.. నూహ్‌ అల్లర్ల నిందితుల ఇళ్లు కూల్చివేత

హర్యానాలోని బీజేపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. నూహ్‌ అల్లర్లకు పాల్పడ్డ నిందితుల అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఆయా ఇళ్లను స్థానిక అధికారులు బుల్డోజర్లతో కూల్చివేస్తున్నారు.

Hyderabad: కోకాపేట భూములకు రికార్డు ధర.. బుద్వేల్ భూముల వేలానికి నోటిఫికేషన్

కోకాపేట భూములకు రికార్డు స్థాయిలో ధర పలకడంతో హైదరాబాద్ శివారులోని బుద్వేల్ భూములను కూడా వేలం వేయడానికి తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది.

జ్ఞానవాపి మసీదులో కొనసాగుతున్న శాస్త్రీయ సర్వే.. బహిష్కరించిన మసీదు కమిటీ

జ్ఞానవాపి మసీదు ఆవరణలో శుక్రవారం ఉదయం సర్వే ప్రారంభమైంది. ఈమేరకు శాస్త్రీయ సర్వేను భారత పురావస్తు శాఖ(ASI) నిర్వహిస్తోంది.

04 Aug 2023

హర్యానా

నుహ్ ఎస్పీ వరుణ్ సింగ్లాపై బదిలీ వేటు.. మత అల్లర్లే కారణం

హర్యానా రాష్ట్రం మత ఘర్షణలతో అట్టుడుకుతోంది. ఈ మేరకు నుహ్ జిల్లా ఎస్పీ వరుణ్ సింగ్లాపై బదిలీ వేటు పడింది.

04 Aug 2023

పోలవరం

పోలవరంపై ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు.. దిల్లీలో కేంద్రమంత్రిని కలిసిన అంబటి రాంబాబు

ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రతిష్టాత్మమైన పోలవరం ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు.

తమిళనాడులో రాజకీయ కలకలం.. కోరిక తీర్చాలని పన్నీరు సెల్వం కుమారుడి వేధింపులు 

తమిళనాడులో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం కుమారుడు చిక్కుల్లో పడ్డారు. ఎంపీ రవీంద్రనాథ్ పై ఓ మహిళ సంచలన లైంగిక ఆరోపణలు చేశారు.

03 Aug 2023

మణిపూర్

Manipur violence: మణిపూర్‌లో మరోసారి చెలరేగిన హింస.. 17 మందికి తీవ్ర గాయాలు 

మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. తాజాగా బిష్ణుపూర్ జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.

దిల్లీ బిల్లుపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు.. కూటమిలో ఉన్నారని అవినీతిని సమర్థించకూడదు

పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన దిల్లీ అధికారుల నియంత్రణ బిల్లుపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. దిల్లీ గురించి ఆలోచించాలని విపక్ష కూటమికి చెందిన ఎంపీలకు సూచనలు చేశారు.