భారతదేశం: వార్తలు

03 Jan 2023

ధర

కేవలం రూ. 6499కే Poco కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌

Poco కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లో ఈరోజే విడుదల చేసింది. Poco C50 పెద్ద 6.5-అంగుళాల డిస్ప్లేతో, 5000mAh బ్యాటరీ, వెనుకవైపు 8-మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఎంట్రీ లెవల్ సెగ్మెంట్‌లో ఎక్కువ ఫోన్‌లను విడుదల చేయడం లేదు. భారతదేశంలో రూ. 10,000 లోపు ఉన్న ఫోన్‌ను పొందడం కొనుగోలుదారులకు కష్టమవుతోంది. అయితే, Poco C50తో ఇప్పుడు పరిస్థితి మారబోతుంది.

ఫ్రిడ్జ్ కొంటున్నారా? అయితే మీ జేబు ఖాళీ కావాల్సిందే!

సాధారణంగా వేసవిలో ఉపయోగించే వస్తువులు చలికాలంలో తక్కువ ధరకు లభిస్తాయి. మార్చి వచ్చిందంటే చాలు ఏసీలు, కూలర్లు, రిఫ్రిజిరేటర్లు ధరలు అమాంతం పెరిగిపోతాయి. కానీ ఈసారి మాత్రం రిఫ్రిజిరేటర్ల విషయంలో మాత్రం కొంచెం ముందుగానే ధరలు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఎమ్మెల్యే, ఎంపీల వాక్ స్వాతంత్య్ర హక్కుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

వాక్ స్వాతంత్య్ర హక్కుపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ) ప్రకారం వాక్ స్వాతంత్య్ర హక్కు అందరికీ సమానంగా ఉంటుందని చెప్పింది. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి కూడా దీనికి అతీతం కాదని ధర్మాసనం చెప్పింది. ఆర్టికల్ 19(2) కింద పేర్కొన్నవి తప్ప.. వాక్‌స్వేచ్ఛపై అదనపు ఆంక్షలు విధించలేమని సుప్రీంకోర్టు తెలిపింది.

దిల్లీ లిక్కర్ స్కామ్: నిందితులకు బెయిల్ మంజూరు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ లిక్కర్ స్కామ్‌లో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులకు బెయిల్ మంజూరైంది. నరేందర్ సింగ్, కుల్దీప్ సింగ్, ముత్తా గౌతమ్, అరుణ్ పిల్ళై, సమీర్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే వీరు రెగ్యులర్ బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

'మేక్ ఇన్ ఇండియా" ఆశయాలు 2023 బడ్జెట్ తీరుస్తుందా?

గత కొన్నేళ్లుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా ప్రచారంతో భారతదేశాన్ని ప్రపంచానికి తయారీ కేంద్రంగా మార్చాలనే ప్రయత్నం చేసింది. అయితే ప్రపంచవ్యాప్త డిమాండ్ తగ్గడంతో తయారీ రంగం ఒత్తిడికి గురవుతుంది. భారతదేశ ఎగుమతి ఆదాయాన్ని దెబ్బతీసి ఆర్థిక వృద్ధికి ఆటంకం కలిగిస్తున్నందున ఈ ఆందోళనలను పరిష్కరించడానికి కేంద్రం రాబోయే బడ్జెట్‌లో తన విధానాలను సర్దుబాటు చేయవలసి ఉంటుంది.

ఇకపై టాటా Neuలో ముఖేష్ బన్సాల్ కేవలం సలహాదారు మాత్రమే!

టాటా డిజిటల్ ప్రెసిడెంట్ ముఖేష్ బన్సాల్, టాటాNeu రోజువారీ కార్యకలాపాల నుండి వైదొలిగినట్లు సమాచారం. అత్యున్నత స్థాయిలో కొనసాగుతున్న గందరగోళం గురించి అక్కడ ఉద్యోగుల ద్వారా తెలిసింది

భారతదేశంలో 48,624 ట్విట్టర్ ఖాతాలపై నిషేధం

అక్టోబర్ 26 నుండి నవంబర్ 25 మధ్య భారతదేశంలో పిల్లలపై లైంగిక దోపిడీ, బలవంతపు నగ్నత్వాన్ని ప్రోత్సహించినందుకు 45,589 ఖాతాలను ట్విట్టర్ నిషేధించింది. దేశంలో తమ వేదికపై ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినందుకు 3,035 ఖాతాలను కూడా తొలగించింది. మొత్తంగా, భారతదేశంలో ఈ విషయంపై ట్విట్టర్ 48,624 ఖాతాలను నిషేధించింది.

Hyundai మోటార్ ఇండియాకు కొత్త COOగా తరుణ్ గార్గ్

హ్యుందాయ్ మోటార్ ఇండియా సోమవారం తన సీనియర్ మేనేజ్‌మెంట్ లీడర్‌షిప్‌లో జరిగిన మార్పును ప్రకటించింది. ఇది జనవరి 1, 2023 నుండి అమలులోకి వచ్చింది.

పిల్లల కోసం ప్రత్యేకంగా Tab M9ని లాంచ్ చేసిన Lenovo

చైనీస్ టెక్ దిగ్గజం Lenovo Tab M9 పేరుతో కొత్త టాబ్లెట్‌ను ప్రవేశపెట్టింది. ఇది ఈ ఏడాది మధ్యలో వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది.

రాజౌరిలో మరో పేలుడు.. చిన్నారి మృతి.. 24గంటల్లోనే రెండో ఘటన

జమ్ముకశ్మీర్‌లోని రాజౌరిలో మరో ఉగ్ర పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. రాజౌరిలో ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరపగా.. నలుగురు పౌరులు మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటన జరిగి 24గంటలు గడవక ముందే రాజౌరిలో మరో పేలుడు సంభవించడంతో కశ్మీర్ లోయలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

ఫోన్లు కొనడానికి ఫిజికల్ స్టోర్లకే ఓటు వేస్తున్న భారతీయులు

గత దశాబ్దం నుండి ఆన్లైన్ షాపింగ్ భారతదేశంలో పుంజుకుంది. అయితే ముఖ్యంగా గత అయిదారేళ్ళ నుండి అన్ని బ్రాండ్ల మొబైల్ ఫోన్లు ఆన్లైన్ లో అందుబాటులో ఉంటున్నాయి.

స్వీయ- అభ్యాస బ్రెయిలీ పరికరం 'Annie' గురించి తెలుసుకుందాం

గోవాలోని BITS పిలానీకి చెందిన అమన్ శ్రీవాస్తవ, అతని ముగ్గురు స్నేహితుల మధ్య టిఫిన్ తింటున్నప్పుడు ప్రారంభమైన సంభాషణ ఒక పరిశోధన ప్రాజెక్ట్ గా రూపుదిద్దుకుంది. ఆ విధంగా బెంగళూరుకు చెందిన టింకర్‌బెల్ ల్యాబ్స్ దృష్టి లోపం ఉన్న పిల్లలకు బ్రెయిలీ లిపిని నేర్పడానికి ప్రపంచంలోనే మొట్టమొదటి స్వీయ-అభ్యాస పరికరం 'Annie'ని అభివృద్ధి చేసింది.

31 Dec 2022

ఆర్ బి ఐ

బడ్జెట్ టారిఫ్ తో రఘురాం రాజన్ ను భయపెడుతున్న మోడీ ప్రభుత్వం

కేంద్ర బడ్జెట్ 2023కి ముందు, నరేంద్ర మోడీ ప్రభుత్వం పెంచే సుంకాల గురించి తాను భయపడుతున్నానని, భారతదేశాన్ని ఇటువంటి చర్యలు అధిక ఖర్చుతో కూడిన దేశంగా మారుస్తుందని. చైనాకు ప్రత్యామ్నాయంగా మారడం మరింత సవాలుగా మారనుందని, టారిఫ్‌లను పెంచడం వలన భారతదేశంలోకి వచ్చే నిధులు ఆగిపోయే అవకాశం ఉందని మాజీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

2022 లో IRDAI తీసుకున్న సానుకూల మార్పులు

ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI), 2022లో పలు ప్రయోజనం చేకూర్చే సానుకూల నిర్ణయాలను తీసుకుంది. '2047 నాటికి అందరికీ బీమా' అనే దృక్పథంతో IRDAI అనేక సంస్కరణలు చేసింది.

2022లో ఎన్ని వందలమంది ఉగ్రవాదులు హతమయ్యారంటే?

2022లో కశ్మీర్ లోయలో జరిగిన ఎన్‌కౌంటర్ల వివరాలను అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) విజయ్ కుమార్ వెల్లడించారు. కశ్మీర్‌‌లో మొత్తం 93 ఎన్‌కౌంటర్లు జరిగినట్లు పేర్కొన్నారు.

సీసీ కెమెరా నిఘాలో రైల్వే కోచ్‌లు.. ఇక రైలు ప్రయాణం మరింత భద్రం

రైళ్లలో ప్రయాణించే మహిళలు, చిన్నారుల భద్రతను మరింత పెంచేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా కొత్తగా 15,000 కోచ్‌లను సీసీ కెమెరాల నీడలోకి తేనుంది. ఇందుకోసం కేంద్రం రూ. 705 కోట్లను కేటాయించింది.

2023 లో ఇస్రో చేయబోతున్న ప్రయోగాలు

2023 లో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) సూర్యుడు, చంద్రుడు, శుక్రుడు, భూమిని పరిశోధించే దిశగా ప్రయత్నాలు చేస్తుంది. అక్టోబర్ 2022 నాటికి USA, జర్మనీ, కెనడా, స్వీడన్‌తో సహా 34 దేశాల కోసం దాదాపు 385 విదేశీ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది. ఇప్పుడు 2023 లో జరపబోయే మిషన్ల గురించి తెలుసుకుందాం.

డిసెంబర్ లో రికార్డు స్థాయిలో వాహన అమ్మకాలు: తగ్గింపులే కారణం

భారతదేశంలో ప్రయాణీకుల వాహనాల (PVS) రిటైల్ విక్రయాలు డిసెంబరులో రికార్డును తాకనున్నాయి. సంవత్సరాంతపు తగ్గింపులు వలన భారీగా అమ్మకాలు పెరిగాయి. డిసెంబర్‌లో ప్రయాణీకుల వాహనాల రిటైలింగ్ భారతీయ ఆటోమోటివ్ మార్కెట్లో 400,000 మార్కును తాకే అవకాశం ఉంది.

డిసెంబర్ 30న ఉచిత Fire MAX కోడ్‌లు: ఎలా రీడీమ్ చేయాలి

Garena Free Fire MAXలో ఉచిత కోడ్‌లను రీడీమ్ చేయడానికి వినియోగదారులు కొన్ని నియమాలను పాటించాలి.

2022వ సంవత్సరం ప్రపంచ కుబేరుల లిస్ట్ లోకి గౌతమ్ అదానీ

గౌతమ్ అదానీ ప్రపంచంలోని అత్యంత ధనవంతుల స్థాయికి ఎదిగారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో టాప్ టెన్‌లో ఈ ఏడాది తన సంపదను పెంచుకున్న ఏకైక వ్యక్తి కూడా అదానీ మాత్రమే.

30 Dec 2022

కార్

2021లో లక్షా యాభై మూడు వేలమందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో బలి

భారతదేశం 2021లో 4,12,432 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) తాజా డేటా ప్రకారం ఈ ప్రమాదాల్లో 1,53,972 మంది మరణించగా, 3,84,448 మంది వ్యక్తులు గాయపడ్డారు. 2021లో రోడ్డు ప్రమాదాలు 12.6% పెరిగాయి. ఏడాదిలో రోడ్డు ప్రమాదాల కారణంగా మరణాలు 16.9%, గాయాలు 10.39%గా నమోదు అయ్యాయి.

30 Dec 2022

కేరళ

కేరళలో మరో సంపన్న ఆలయం.. గురువాయూర్ గుడి బ్యాంకు డిపాజిట్లు ఎన్ని రూ.వేల కోట్లో తెలుసా?

కేరళ గురువాయూర్ ఆలయ ఆస్తులపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ఆలయం పరిధిలో ఎన్ని రూ. కోట్ల డిపాజిట్లు ఉన్నాయి? ఎంత భూమి ఉంది? అనేది బయటి ప్రపంచానికి తెలియదు. అయితే ఇప్పుడు ఆ విషయం బయటికి వచ్చింది.

వచ్చే సంవత్సరం మార్చిలోపు పాన్-ఆధార్ లింక్ తప్పనిసరి

పాన్ కార్డు ఉన్నవారు తమ నంబర్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని ఆదాయపు పన్ను శాఖ తుది హెచ్చరిక జారీ చేసింది. మార్చి 31, 2023లోపు పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయకుంటే, పాన్ పనిచేయదు. PANకి లింక్ చేయబడిన ఆర్థిక లావాదేవీలు, ఆదాయపు పన్ను పెండింగ్ రిటర్న్స్ ప్రాసెసింగ్ నుండి నిలిపివేయబడతాయి.

29 Dec 2022

ప్రపంచం

భారత హాకీ ఇండియా జట్టుకు నగదు బహుమతి

భారత్ హాకీ ఇండియా సరికొత్త నిర్ణయం తీసుకుంది. హాకీని మరింత ప్రోత్సహించేలా జట్టులోకి సభ్యులకు నగదును బహుమతిని ప్రకటించింది. ప్రస్తుతం నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా పలువురు అభినందనలు తెలుపుతూ ట్విట్స్ చేస్తున్నారు. జనవరిలో జరిగే FIH పురుషుల ప్రపంచ కప్ 2023 భువనేశ్వర్-రూర్కెలాలో జరగనుంది.

ఈసీ కొత్త ప్రయత్నం.. ఊరికి వెళ్లకుండానే ఓటు వేసేందుకు 'రిమోట్‌ ఓటింగ్‌ మిషన్‌'

దేశంలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో పరిస్థితులు అనుకూలించక పట్టణాల నుంచి గ్రామాలకు వచ్చి ఓటు వేయలేని వారు చాలా మంది ఉంటారు. అలా గ్రామాలకు వచ్చి ఓటవేయలేని వారికోసం ఎన్నికల సంఘం 'రిమోట్‌ ఓటింగ్‌ మిషన్‌'ను తీసుకురావాలని నిర్ణయించింది.

రాహుల్ భద్రతపై కాంగ్రెస్ అనుమానాలు.. కేంద్రం ఏం అంటోంది?

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భద్రత విషయం ఇప్పడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాహుల్ గాంధీ భద్రత విషయంలో కేంద్రం సరిగా వ్యవహరించడం లేదని కాంగ్రెస్ చెబుతోంది. భారత్ జూడో యాత్ర ఈనెల 24న దిల్లీకి చేరిన సందర్భంలో.. రాహుల్ గాంధీ భద్రతపై నిర్లక్ష్యం తేటతెల్లమైందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి కేసీ వేణుగోపాల్ బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఇది రాజకీయంగా చర్చకు దారిసింది.

28 Dec 2022

కోవిడ్

కరోనా అలర్ట్.. రాబోయే 40 రోజులు జాగ్రత్తగా ఉండాలని కేంద్రం హెచ్చరిక!

జనవరి మధ్యలో దేశంలో కోవిడ్ కేసులు పెరిగే అవకాశం ఉన్నందున రాబోయే 40 రోజులు చాలా కీలకమైనవి అని, జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు చెబుతున్నాయి. గత అనుభవాలను విశ్లేషించిన తర్వాత ఈ అంచనాకు వచ్చినట్లు పేర్కొంటున్నాయి.

2022లో భారత్ క్రీడాకారుల చరిత్రాత్మకమైన విజయాలు

2022లో భారత మహిళ ప్లేయర్ల కోసం చారిత్రాత్మకమైన నిర్ణయాలను అమలు చేశారు. మహిళా క్రికెటర్లకు, భారత క్రికెటర్లతో సమానంతో వేతనాలను అందిస్తామని బీసీసీఐ కార్యదర్శి జేషా వెల్లడించారు.

ఫెయిర్‌వర్క్ ఇండియా రేటింగ్స్ లో అగ్ర స్థానంలో నిల్చిన అర్బన్ కంపెనీ

భారతదేశంలో డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ఆర్థిక వ్యవస్థ ఆవిర్భావంతో, గిగ్ వర్కర్లకు డిమాండ్ పెరిగింది. అయినా సరే, వీరికి ఇప్పటికీ సరైన వేతనం, మిగిలిన సౌకర్యాలు అందడంలేదని తెలుస్తుంది.

28 Dec 2022

సినిమా

2023లో టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఈ జలపాతాలను లిస్ట్ లో చేర్చుకోండి

2022 పూర్తయిపోతోంది. ఇంకో నాలుగు రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. అప్పుడే ఆ సంవత్సరంలో ఏమేం చేయాలనే లిస్ట్ కూడా రెడీ చేసుకుంటున్నారు.

ఐసీఐసీఐ బ్యాంక్‌ లోన్‌ కుంభకోణం కేసు : కొచ్చర్‌ దంపతులకు సీబీఐ కస్టడీలోనూ సకల సౌకర్యాలు

ఐసీఐసీఐ బ్యాంక్‌ లోన్‌ కుంభకోణం కేసులో అరెస్టయిన ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ సీఈవో, ఎండీ చందా కొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌, వీడియోకాన్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుడు వేణుగోపాల్‌ ధూత్‌లు ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్నారు. అయితే కస్టడీలో ఉన్నన్ని రోజులు వీరు ప్రత్యేక వసతులు వినియోగించుకునేందుకు సీబీఐ కోర్టు అనుమతిచ్చింది.

24 Dec 2022

కోవిడ్

కరోనాపై రాష్ట్రాలకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు.. ఆక్సిజన్ నిల్వలపై అప్రమత్తం

దేశానికి కరోనా కొత్త వేరియంట్ 'ఒమిక్రాన్ బీఎఫ్ 7' ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. భవిష్యత్తులో ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు రాష్ట్రాలను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రాలకు కీలకమైన మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం.. తాజాగా మరికొన్ని సూచనలు చేసింది.

24 Dec 2022

కోవిడ్

81కోట్ల రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పిన కేంద్రం.. అదేంటంటే?

పేదలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మరోసారి కరోనా ముంచుకొస్తున్న నేపథ్యంలో.. ఇంకో ఏడాది పాటు పేదలకు ఉచితంగా రేషన్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద.. 81కోట్ల మందికి రేషన్‌ఉచితంగా అందించాలని ప్రధాని మోదీ అధ్యక్షత కేంద్ర కేబినెట్‌నిర్ణయం తీసుకుంది.

24 Dec 2022

కోవిడ్

కరోనా కట్టడికి కేంద్రం చర్యలు.. విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ పరీక్షలు

చైనాతో పాటు అనేక దేశాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయ్యింది. ఈమేరకు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రయాణికుల్లో కనీసం 2శాతం మందికి కరోనా స్క్రీనింగ్ పరీక్షలు చేయాలని నిర్ణయించింది. శనివారం నుంచే ఈ పరీక్షలు చేయనున్నారు.

23 Dec 2022

సిక్కిం

లోయలోకి దూసుకెళ్లిన ఆర్మీ వాహనం.. 16మంది భారత జవాన్లు మృతి

భారత సైనిక వాహనం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 16జవాన్లు వీర మరణం పొందారు. మరో నలుగురు సైనికులు గాయపడ్డారు. నార్త్ సిక్కిం ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.

లద్దాఖ్‌‌లో భారత సైనికుల పెట్రోలింగ్ హక్కులను పునరుద్ధరణకు ఒప్పుకోని చైనా

భారత్- చైనా కార్ప్స్ కమాండర్ స్థాయిలో జరిగిన 17వ సమావేశంలో సరిహద్దు వివాద పరిష్కారానికి ఎలాంటి ముందడుగు పడలేదు. తూర్పు లద్దాఖ్‌లోని డెప్సాంగ్ ప్లెయిన్స్, చార్డింగ్ నింగ్‌లుంగ్ నుల్లా జంక్షన్‌లో భారత సైన్యానికి పెట్రోలింగ్ హక్కులను పునరుద్ధరించడానికి చైనా అంగీకరించకపోవడంతో.. కొన్ని తాత్కాలిక నిర్ణయాలు తీసుకొని సమావేశాన్ని ముగించారు.

భారత్ జూడో యాత్రను ఆపడానికి కేంద్రం సాకులు చెబుతోంది: రాహుల్

భారత్ జూడో యాత్రలో కరోనా నిబంధనలు పాటించాలని లేకుంటే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నిలిపివేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయ రాసిన లేఖపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. తన పాదయాత్రను ఆపడానికి కేంద్రం సాకులు చెబుతోందని రాహుల్ అన్నారు. బీజేపీ పాలకులు సత్యానికి భయపడుతున్నారని చెప్పారు.

PF చందాదారులకు శుభవార్త, నెలవారీ పెన్షన్ పెంపుపై జాతీయ కమిటీ నోటీసు

ప్రైవేట్ సెక్టార్‌లో పనిచేస్తూ, పీఎఫ్‌ జీతంలో కట్ అవుతున్నవారికి ఇది శుభవార్త.

మంచి ఉద్యోగం వదులుకోని.. సన్యాసిగా మారుతున్న యువ శాస్త్రవేత్త

అతను అనుకుంటే విలాసవంతమైన జీవితం తన కాళ్ల ముందుకు వస్తుంది. చుట్టూ పదిమంది పనివాళ్లతో దర్జాగా బతికే అవకాశం ఉన్నా.. అతనికి ఆ జీవితం సంతృప్తిని ఇవ్వలేదు. రూ.కోట్లలో జీతం.. అతి పెద్ద ఉద్యోగాన్ని వదిలేసి జైన సన్యాసిగా మారాడానికి ముందుకొచ్చాడు మధ్యప్రదేశ్ కు చెందిన ప్రన్సుఖ్ కాతేడ్(28).

22 Dec 2022

సినిమా

రామానుజన్ నంబర్ 1729 కి ఉన్న విశేషం తెలుసుకోవాల్సిందే

ప్రపంచ గణిత మేధావుల్లో అగ్రగణ్యుడిగా చెప్పుకునే శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజును (డిసెంబర్ 22) జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటున్నాం.

మునుపటి
తరువాత