హైదరాబాద్: వార్తలు

ఏడాదిలో రూ.6లక్షల ఇడ్లీలను ఆర్డర్ చేసిన హైదరాబాద్ వ్యక్తి

హైదరాబాద్‌కు చెందిన ఒక ఇడ్లీ ప్రేమికుడు గత ఏడాది కాలంలో రూ. 6 లక్షల విలువైన ప్లేట్లకు ఆర్డర్ ఇచ్చారని ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ వెల్లడించింది.

డేటా చోరీ కేసు: మనీలాండరింగ్ కోణాన్ని పరిశీలించడానికి రంగంలోకి దిగిన ఈడీ

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డేటా చోరీ కేసులో మనీలాండరింగ్ కోణాన్ని పరిశీలించడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది.

27 Mar 2023

తెలంగాణ

హైదరాబాద్: ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ వద్ద 90రోజులుగా ట్రాఫిక్ ఆంక్షలు

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఆధ్వర్యంలో 2023 మార్చి 28 నుంచి జూలై 28 వరకు 90 రోజుల పాటు ఎర్రగడ్డ మెట్రో స్టేషన్‌లో పరిధిలోని ఏజీ కాలనీ నుంచి లక్ష్మీ కాంప్లెక్స్ వరకు నగర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

25 Mar 2023

తెలంగాణ

ఎల్బీనగర్ ఆర్‌హెచ్‌ఎస్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన కేటీఆర్; ఇక సిగ్నల్ ఫ్రీ జంక్షన్

ఎల్‌బీ నగర్‌ ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరాయి. ఎల్‌బీ నగర్‌ ఆర్‌హెచ్‌ఎస్‌ ఫ్లైఓవర్‌ను తెలంగాణ మంత్రి కేటీ రామారావు శనివారం ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎస్‌ఆర్‌డీపీ) కింద రూ.32 కోట్లతో ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించింది.

22 Mar 2023

వీసాలు

హైదరాబాద్: నానక్‌రామ్‌గూడ యూఎస్ కాన్సులేట్‌లో కార్యకలాపాలు షురూ; స్పందించిన అమెరికా

హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో అధునాతన హంగులతో యూఎస్ కాన్సులేట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాకు చెందిన వారికి సేవలను ఇక్కడి నుంచి అందిస్తున్నారు.

21 Mar 2023

తెలంగాణ

ఆన్‌లైన్‌లో సాలార్‌జంగ్ మ్యూజియం; ఇంకెందుకు ఆలస్యం చూసేయండి

ప్రఖ్యాత సాలార్‌జంగ్ మ్యూజియాన్ని సందర్శించాలనుకుంటున్నారా? పని ఒత్తడిలో ఉండటం, హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ వల్ల మ్యూజియంకు వెళ్లేందుకు సమయం కేటాయించకలేకపోతున్నారా? అయితే మీలాంటి వారికోసమే మ్యూజియం నిర్వాహకులు ప్రత్యేక ఆన్‌లైన్ ప్రదర్శనను ప్రారంభించారు.

20 Mar 2023

తెలంగాణ

ఇండిగో: హైదరాబాద్‌లో గాల్లో ఉన్న విమానంపై వడగళ్ల వాన; తప్పిన పెను ప్రమాదం

అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్‌కు ప్రయాణికులతో వస్తున్న ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ విమానాశ్రయంలో ల్యాండింగ్ అయ్యే సమయంలో విమానంపై వడగళ్ల వాన పడింది. దీంతో విమానం భారీగా దెబ్బదిన్నది.

తెలంగాణ: సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం; ఆరుగురు మృతి

తెలంగాణలోని సికింద్రాబాద్‌లోని నివాస సముదాయంలో గురువారం సాయంత్రం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఆరుగురు మరణించగా, మరో ఏడుగురికి గాయాలయ్యాయి.

తెలుగు రాష్ట్రాలకు హై స్పీడ్ రైలు కారిడార్; 4గంటల్లోనే హైదరాబాద్ నుంచి విశాఖకు!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో హైస్పీడ్ రైలు పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన కసరత్తును ఇప్పటికే రైల్వైశాఖ మొదలు పెట్టింది. ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

15 Mar 2023

ప్రపంచం

కేబుల్ బ్రిడ్జి దగ్గర వాహనాలు పార్కింగ్ జరిమానా తప్పదు

హైదరాబాద్ : ఇకపై దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద సెల్ఫీ తీసుకోవడానికి వాహనాలను పార్కింగ్ చేస్తే ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు విధించనున్నారు. కొంతమంది బ్రిడ్జిపై కారు లేదా బైక్ పార్కింగ్‌పై సెల్ఫీలు దిగుతున్నారు. దీని వల్ల రోడ్డుపై వెళ్లే వాహనదారులకు ఇబ్బంది కలుగుతోంది.

కవితపై బండి సంజయ్ కామంట్స్; దిష్టిబొమ్మను దహనం చేసిన బీఆర్ఎస్

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలకు నిరసస్తూ బీఆర్‌ఎస్‌ నాయకులు ఆందోళనకు దిగారు. శనివారం దిల్లీలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, మద్దతుదారులు సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు.

దిల్లీలో కవితను ప్రశ్నిస్తున్న ఈడీ; హైదరాబాద్ లో బీజేపీకి వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు

దిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించి భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఎమ్మెల్సీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత శనివారం దిల్లీలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల ఎదుట హాజరయ్యారు. ఆమెపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

10 Mar 2023

తెలంగాణ

తెలంగాణ: ప్రయాణికుల భద్రత కోసం క్యాబ్, ఆటో ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటు

ప్రయాణికుల భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా రైల్వే స్టేషల్ లేదా బస్టాండ్ వద్ద క్యాబ్ లేదా ఆటో ఎక్కే మహిళా ప్రయాణికుల భద్రత కోసం ట్రాకింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయనుంది. అర్థరాత్రి నుంతి తెల్లవారుజాము వరకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోనున్నారు.

09 Mar 2023

ప్రయాణం

TSRTC: ప్రయాణికుల కోసం రెండు స్పెషల్ ఆఫర్స్‌ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ

హైదరాబాద్‌లో ప్రయాణికుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్‌టీసీ) రెండు ప్రత్యేకమైన ఆఫర్లను గురువారం లాంఛ్ చేసింది. గ్రేటర్ హైదరాబాద్‌లోని ప్రయాణికులకు సరసమైన ధరలో, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ ప్రత్యేక ఆఫర్లను తీసుకొచ్చింది.

పాకిస్థాన్‌లో హిందూ డాక్టర్ గొంతు కోసి హత్య చేసిన డ్రైవర్

పాకిస్థాన్‌లోని హైదరాబాద్‌కు చెందిన ధరమ్ దేవ్ రాతి అనే డాక్టర్ మంగళవారం తన ఇంట్లోనే అతని డ్రైవర్ చేతిలో హత్యకు గురయ్యాడు. డ్రైవర్ కత్తితో డాక్టర్ గొంతు కోశాడని పోలీసులు పాకిస్థాన్ వార్తా సంస్థ ది నేషన్‌కు తెలిపారు.

గ్రీన్ హైదరాబాద్: ఫ్లై ఓవర్ల కింద ఆక్సిజన్ పార్కుల ఏర్పాటు

గ్రేటర్ హైదరాబాద్‌లో వాయు కాలుష్యాన్ని నివారించేందుకు యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే నగరంలో పచ్చదనాన్ని పెంపొందించేదుకు అనేక అర్బన్ పార్కులను ఏర్పాటు చేసిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ), తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా మరో అడుగు ముందుకేశాయి.

తెలంగాణలో 'ఫాక్స్‌కాన్' భారీ పెట్టుబడులు; లక్షమందికి ఉపాధి అవకాశాలు

ఆపిల్‌తో సహా వివిధ బ్రాండ్‌లకు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను తయారు చేసే ఫాక్స్‌కాన్ రాష్ట్రంలో భారీగా పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుంది.

02 Mar 2023

తెలంగాణ

ఐటీ నిపుణుల నియామకంలో హైదరాబాద్ నంబర్ వన్

సాఫ్ట్‌వేర్ నిపుణులను నియమించుకోవడంలో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా టాప్ 20 నగరాల జాబితాలో 10వ స్థానంలో నిలిచింది. ఈ మేరకు టెక్నికల్ హైరింగ్ ఏజెన్సీ అయిన 'కారత్' జాబితాను విడుదల చేసింది.

25 Feb 2023

తెలంగాణ

రంగారెడ్డి: మర్మాంగాన్ని కోసి, గుండెను బయటికి తీసి స్నేహితుడిని దారుణంగా హత్య చేసిన యువకుడు

ఓ యువకుడు తన స్నేహితుడిని దారుణంగా హత్య చేశాడు. మర్మాంగాన్ని కోసి, గుండెను బయటికి తీసి అత్యంత కిరాతకంగా వ్యవహరించారు. తను ప్రేమించిన యువతిని తన స్నేహితుడు ఇష్టపడటమే ఈ హత్యకు కారణం. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది.

అమరావతి భూముల కేసు: హైదరాబాద్‌లో మాజీ మంత్రి నారాయణ కుమార్తె ఇంట్లో సీఐడీ సోదాలు

అమరావతి భూముల కేసులో మాజీ మంత్రి పి.నారాయణ కుమార్తె నివాసంలో ఆంధ్రప్రదేశ్‌ నేరపరిశోధన విభాగం (సీఐడీ) అధికారులు సోదాలు నిర్వహించారు. మాదాపూర్‌లో ఉంటున్న ఆమె ఇంట్లో ఉదయం నుంచి సీఐడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

సికింద్రాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో 200ఏళ్ల నాటి బావి పునరుద్ధరణ

సికింద్రాబాద్‌లోని మౌలా-అలీలోని జోనల్ రైల్వే ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (జెడ్ఆర్‌టీఐ)లో గల 200 సంవత్సరాల పురాతన వారసత్వ మెట్ల బావిని దక్షిణ మధ్య రైల్వే పునరుద్ధరించింది.

22 Feb 2023

తెలంగాణ

హైదరాబాద్ లో మరో బాలుడిపై వీధి కుక్కుల దాడి

హైదరాబాద్‌లోని అంబర్‌పేట ప్రాంతంలో వీధికుక్కల దాడిలో చిన్నారి ప్రదీప్ మృతి చెందిన ఘటన మరువకముందే, మరొకటి వెలుగులోకి వచ్చింది.

22 Feb 2023

భూకంపం

భవిష్యత్‌లో భారత్‌కు భారీ భూకంపాల ముప్పు ; నిపుణుల హెచ్చరిక

ప్రతి సంవత్సరం భారత భూభాగం సుమారు 5 సెం.మీ వరకు స్థాన భ్రంశం అవుతున్నట్లు హైదరాబాద్‌లోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్‌జీఆర్‌ఐ) ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పూర్ణచంద్రరావు వెల్లడించారు. ఈ ప్రభావం హిమాలయ ప్రాంతాలపై ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఫలితంగా రాబోయే రోజుల్లో భూకంపాలు భారీగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.

హైదరాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంఐఎం నేత రహ్మత్ బేగ్‌; మద్దతు ప్రకటించిన బీఆర్ఎస్

త్వరలో జరగనున్న హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తన అభ్యర్థిని ఏఐఎంఐఎం ప్రకటించింది. తమ పార్టీ అభ్యర్థిగా మీర్జా రహ్మత్ బేగ్‌ను రాబోయే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేస్తారని ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మంగళవారం ట్విట్టర్‌లో ప్రకటించారు.

21 Feb 2023

తెలంగాణ

హైదరాబాద్‌లో విషాదం: వీధికుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. వీధికుక్కుల దాడిలో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందాడు. ఈ దారుణ ఘటన అతడి తండ్రి పనిచేసే స్థలంలోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది.

13 Feb 2023

గూగుల్

గూగుల్ ఆఫీస్‌కు బాంబు బెదిరింపు- హైదరాబాద్‌లో వ్యక్తి అరెస్ట్

మహారాష్ట్ర పుణె నగరంలోని గూగుల్ కార్యాలయానికి సోమవారం బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. అయితే దీనిపై వెంటనే అప్రమత్తమైన పోలీసులు విచారించగా అది ఫేక్ కాల్ అని తేలింది.

11 Feb 2023

టాటా

ఫార్ములా E రేసులకు ప్రసార హక్కులు చేజిక్కించికున్న టాటా కమ్యూనికేషన్స్

రెగ్యులేటరీ ఫైలింగ్ ద్వారా, టాటా కమ్యూనికేషన్స్ ABB FIA ఫార్ములా E వరల్డ్ ఛాంపియన్‌షిప్ కోసం అధికారిక ప్రసార పంపిణీ హక్కులు చేజిక్కించుకున్నట్టు ప్రకటించింది.

నందమూరి కుటుంబంలో మరో విషాదం- హీరో బాలకృష్ణ సోదరుడికి యాక్సిడెంట్

నందమూరి కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ సోదరుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లో నందమూరి రామకృష్ణ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.

తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా, ఎన్నికల కోడ్ కారణం

రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చింది. దీంతో ఫిబ్రవరి 17న జరగాల్సిన తెలంగాణ నూతన సచివాలయ భవన ప్రారంభోత్సవం వాయిదా పడింది.

మహీంద్రా సంస్థ రూపొందించిన ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ SUVల గురించి తెలుసుకుందాం

స్వదేశీ SUV స్పెషలిస్ట్ మహీంద్రా గత సంవత్సరం ఆగస్టులో బ్రాండ్ యూరోపియన్ డిజైన్ స్టూడియోలో ఐదు కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ SUVలను ప్రకటించింది. అవి XUV.e8, XUV.e9, BE.05, BE.07, BE.09 మోడల్స్. కొత్త XUV.e, BE సబ్-బ్రాండ్‌ల క్రింద వస్తాయి. ఫిబ్రవరి 10న ఈ వాహనాలను తొలిసారిగా భారతదేశంలో ప్రదర్శిస్తుంది.

హెచ్‌సీయూలో ఉద్రిక్తత: మోదీ బీబీసీ డాక్యుమెంటరీ vs కాశ్మీర్ ఫైల్స్‌ ప్రదర్శించిన ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని ఎస్ఎఫ్ఐ, కాశ్మీర్ ఫైల్స్‌ సినిమాను ఏబీవీపీ పోటీ పడి మరీ ప్రదర్శించడంతో హెచ్‌సీయూలో మరోసారి వివాదం రాజుకుంది.

24 Jan 2023

తెలంగాణ

ఫిబ్రవరి 17న తెలంగాణ కొత్త సచివాలయ భవనం ప్రారంభం, స్టాలిన్, సోరెన్, తేజస్వీకి ఆహ్వానం

తుది మెరుగులు దిద్దుకుంటున్న తెలంగాణ కొత్త సచివాలయ భవనం ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారైంది. సీఎం కేసీఆర్ పుట్టినరోజున అంటే ఫిబ్రవరి 17న కొత్త సచివాలయ భవనాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. దాదాపు రూ. 700 కోట్లతో నిర్మించిన కొత్త ఐకానిక్ భవనాన్ని ఆ రోజు ఉదయం 11:30గంటలకు ప్రారంభించనున్నారు.

హెచ్‌సీయూలో బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శన, యూనివర్సిటీ అధికారులకు ఏబీవీవీ ఫిర్యాదు

ప్రధాని మోదీ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. తాజాగా ఈ వివాదాస్పద విషయం హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)కి చేరుకుంది.

24 Jan 2023

విమానం

స్పైస్‌జెట్: దిల్లీ-హైదరాబాద్ విమానంలో ప్రయాణికుడి అనుచిత ప్రవర్తన, అరెస్టు చేసిన పోలీసులు

విమానాల్లో కొందరు ప్రయాణికులు సిబ్బంది పట్ల , తోటి ప్రయాణికుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న సంఘటనలు ఈ మధ్య కాలంలో పెరిగిపోయాయి. ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాల సంఘటనలు మరువక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్‌లో అమెజాన్ ఎయిర్ సేవలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

కస్టమర్లకు వేగంగా బుకింగ్ డెలివరీలను చేరవేసేందుకు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా హైదరాబాద్‌లో ఎయిర్ సర్వీసులకు శ్రీకారం చుట్టింది. సోమవారం హైదరాబాద్‌లోని జీఎంఆర్ ఏరో టెక్నిక్‌లో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ఎయిర్ సర్వీసులకు ప్రారంభించారు.

హైదరాబాద్ మెట్రోను పరిశీలించిన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ

ఎంపీ రాజీవ్ రంజన్ సింగ్ నేతృత్వంలోని 14 మంది సభ్యులతో కూడిన హౌసింగ్, అర్బన్ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ హైదరాబాద్ మెట్రో రైలు సందర్శించింది. రాయదుర్గ్ నుంచి అమీర్‌పేట్ స్టేషన్ వరకు ప్రయాణించారు.

కేటీఆర్: తెలంగాణలో గ్లోబల్ రెస్టారెంట్ కంపెనీ 'ఇన్‌స్పైర్ బ్రాండ్స్' పెట్టుబడులు

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మరో అంతర్జాతీయ సంస్థ ముందుకొచ్చింది. గ్లోబల్ మల్టీ-బ్రాండ్ రెస్టారెంట్ కంపెనీ 'ఇన్‌స్పైర్ బ్రాండ్స్' హైదరాబాద్‌లో సపోర్ట్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

సికింద్రాబాద్‌ డెక్కన్‌ స్పోర్ట్స్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం, ఎగిసిపడుతున్న అగ్నికీలలు

సికింద్రాబాద్‌ మినిస్టర్‌ రోడ్‌లోని నల్లగుట్ట వద్ద ఉన్న డెక్కన్‌ స్పోర్ట్స్ భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చిక్కుకున్న పది మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు.

రేపు హైదరాబాద్‌లో టీడీపీ భారీ ర్యాలీ, చంద్రబాబు, బాలకృష్ణ హాజరు

తెలంగాణలో మరో భారీ కార్యక్రమానికి టీడీపీ సిద్ధమవుతోంది. ఈనెల 18న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు 27వ వర్ధంతి నేపథ్యంలో హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ర్యాలీలో టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ కూడా పాల్గొననున్నారు.

16 Jan 2023

టర్కీ

ఎనిమిదో నిజాం ముకరం జా కన్నుమూత, సీఎం కేసీఆర్ సంతాపం

ఎనిమిదో నిజాం ముకరం జా టర్కీలోని ఇస్తాంబుల్‌లో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 89 ఏళ్ల ముకరం జా హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బహదూర్ మనవడు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌కు కొడుకులు ఉన్నా.. ఆయన వారసుడిగా మనవడు అయిన ముకరం జానే ప్రకటించారు. దీంతో ఎనిమిదో నిజాంగా ముకరం జా గుర్తింపు పొందారు.

మునుపటి
తరువాత