తాజా వార్తలు
Udhayanidhi: 'సనాతన ధర్మం' మలేరియా, డెంగ్యూ లాంటిది: ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఆయన సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చారు. అంతేకాదు, సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడమే కాదు నిర్మూలించాలని ఆయన చెప్పడం సంచలనంగా మారింది.
ఒడిశాలో భారీ వర్షాలు; పిడుగుపాటుకు 10మంది మృతి
ఒడిశాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో శనివారం రాత్రి ఆరు జిల్లాల్లో పిడుగుపాటు కారణంగా పది మంది మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్రానికి చెందిన స్పెషల్ రిలీఫ్ కమిషనర్ తెలిపారు.
One nation, one election: జమిలి ఎన్నికల కోసం 8మందితో కేంద్రం కమిటీ.. గెజిట్ నోటిఫికేషన్ జారీ
దేశంలో పార్లమెంటరీ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించవచ్చో? లేదో? తేల్చేందుకు కేంద్రం 8మందితో ఒక కమిటీని శనివారం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
వర్షంతో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ రద్దు.. ఇరు జట్లకు చెరొక పాయింట్
ఆసియా కప్‌లో భాగంగా శనివారం జరిగిన భారత్-పాకిస్థాన్ మధ్య గ్రూప్ దశ మ్యాచ్ రద్దయ్యింది.
Ind vs Pak: నిప్పులు చెరిగిన పాక్ పేసర్లు.. టీమిండియా 266 పరుగులకు ఆలౌట్
ఆసియా కప్-2023లో భాగంగా శ్రీలంకలోని క్యాండీ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఆలౌటైంది.
TVS: ఆగస్టులో 20వేలకు పైగా iQube మోడల్స్‌ను విక్రయించిన టీవీఎస్
దేశీయ మోటార్‌సైకిల్ తయారీదారు టీవీఎస్(TVS) మోటార్ కంపెనీ ఆగస్టులో గణనీయమైన అమ్మకాలను నమోదు చేసింది.
ప్రముఖ హాస్యనటుడు ఆర్ఎస్ శివాజీ కన్నుమూత
ప్రముఖ తమిళ హాస్యనటుడు ఆర్ఎస్ శివాజీ శనివారం ఉదయం చెన్నైలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు.
ఛత్తీస్‌గఢ్: అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం.. బీజేపీ నేత కొడుకు అరెస్ట్
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఘోరం జరిగింది. కజిన్‌తో కలిసి రక్షా బంధన్ జరుపుకుని తిరిగి వస్తుండగా ఇద్దరు అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం జరిగింది.
కారణం చెప్పకుండానే.. భారత్‌తో వాణిజ్య చర్చలను నిలివేసిన కెనడా
జీ20 సదస్సు ముంగిట కెనడా కీలక ప్రకటన చేసింది. భారత్‌తో ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం కోసం జరుగుతున్న చర్చలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
సెప్టెంబర్ 8న మోదీ-బైడెన్ ద్వైపాక్షిక సమావేశం: వైట్‌హౌస్ వెల్లడి
దిల్లీ వేదికగా సెప్టెంబర్ 9,10తేదీల్లో జరగనున్న జీ20 సదస్సు జరగనుంది. ఈ సమ్మిట్ పాల్గొనేందుకు 8వ తేదీన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్ రానున్నారు.
నేడు నింగిలోకి దూసుకెళ్లనున్న ఆదిత్య L-1పైనే.. సూర్యుడిపైకి తొలిసారిగా..
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఆదిత్య ఎల్-1ను నేడు ప్రయోగించనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
సెప్టెంబర్ 2న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
సెప్టెంబర్ 2వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు. Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లు ఆయుధాలు, వజ్రాలు, స్కిన్‌లు, మరిన్ని వంటి గేమ్‌లోని అంశాలను గెలవడానికి ఉపయోగించవచ్చు.
భక్తుల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?.. టీటీడీ, అటవీశాఖకు హైకోర్టు నోటీసులు
అలిపిరి-తిరుమల మెట్ల మార్గంలో భక్తుల భద్రతపై దాఖలైన పిటిషన్‌పై బుధవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ చేపట్టింది.
ఆంధ్రప్రదేశ్: ఎస్సై ఉద్యోగాల ఫైనల్ రాత పరీక్షకు తేదీలు ఖరారు
ఆంధ్రప్రదేశ్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల తుది రాత పరీక్షలకు షెడ్యూల్ విడుదలైంది.
మధ్యప్రదేశ్: అనారోగ్యంగా ఉన్న చిరుత పట్ల అనుచిత ప్రవర్తన
మధ్యప్రదేశ్‌లోని ఇక్లెరా గ్రామంలో అనారోగ్యంతో ఉన్న చిరుత పట్ల స్థానికులు అనుచితంగా ప్రవర్తించారు.
TS Liquor: తెలంగాణలో మద్యం షాపులకు బంపర్ ఆఫర్.. అప్పుపై లిక్కర్ సరఫరాకు గ్రీన్ సిగ్నల్
తెలంగాణలో మద్యం అమ్మకాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
7నిమిషాల్లో క్యాన్సర్ ట్రీట్‌మెంట్.. కొత్త ఇంజెక్షన్‌ను అభివృద్ధి చేసిన ఇంగ్లండ్
ఇంగ్లండ్‌లోని వందలాది మంది రోగులకు క్యాన్సర్‌కు చికిత్స చేసే ఇంజెక్షన్‌ను అందించడానికి బ్రిటన్ ప్రభుత్వ సంస్థ జాతీయ ఆరోగ్య సేవ( ఎన్‌హెచ్ఎస్) విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది.
రేపు ముంబైలో ప్రతిపక్షాల 'ఇండియా' కూటమి సమావేశం.. 27 పార్టీల హాజరు
2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయేను ఓడించేందుకు లక్ష్యంగా ప్రతిపక్షాల ఇండియా (ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్) కూటమి గురువారం మూడోసారి సమావేశం అవుతోంది.
చంద్రయాన్-3: విక్రమ్ ల్యాండర్ ఫోటోలు తీసిన రోవర్.. ట్వీట్ చేసిన ఇస్రో
చంద్రయాన్-3 ప్రయోగంలో చంద్రుడిపై దిగిన ప్రజ్ఞాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్ నుంచి కొత్త అప్డేట్ వచ్చింది.
జీ20 సమ్మిట్ వేళ.. తెరిచి ఉండేవి ఏవి? మూసి ఉండేవి ఏవో తెలుసుకుందాం
సెప్టెంబర్ 9,10 తేదీల్లో దిల్లీలో ప్రతిష్ఠాత్మక జీ20 సదస్సు కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వబోతోంది.
Delhi: దిల్లీలో తుపాకీ కాల్పులు.. అమెజాన్ మేనేజర్ మృతి
దిల్లీలోని భజన్‌పురా ప్రాంతంలో మంగళవారం రాత్రి తుపాకీ కాల్పులు కలకలం రేపాయి.
కోడికత్తిని అందించింది మంత్రి బొత్స మేనల్లుడే: న్యాయవాది సలీం సంచలన వ్యాఖ్యలు
కోడికత్తి కేసులో నిందితుడు జనపల్లి శ్రీనివాసరావు తరఫున వాదిస్తున్న లాయర్ సలీం సంచలన ఆరోపణలు చేశారు.
చైనా మ్యాప్‌పై ప్రధాని మోదీ మాట్లాడాల్సిందే: రాహుల్ గాంధీ
అరుణాచల్ ప్రదేశ్‌ను చైనాలో అంతర్భాగంగా పేర్కొంటూ.. ఆ దేశం మ్యాప్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే.
Minority Scholarship Scam: మైనారిటీ స్కాలర్‌షిప్ కుంభకోణం; సీబీఐ కేసు నమోదు
మైనారిటీ స్కాలర్‌షిప్ కుంభకోణం కేసులో సీబీఐ వివిధ ప్రభుత్వ సంస్థలు, బ్యాంకుల అధికారులపై కేసు నమోదు చేసింది.
తెలంగాణ: అర్చకులకు గుడ్ న్యూస్.. జీతాలు, ఆలయ నిర్వహణ సాయంపెంపు
తెలంగాణలోని అర్చకుల వేతనాలతో కూడిన 'ధూప దీప నైవేద్యం' సాయాన్ని భారీగా పెంచాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు.
తెలంగాణ: పారా మెడికల్ కోర్సుల్లో 10శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తింపు
మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది.
ఆంధ్రప్రదేశ్: రిజిస్ట్రేషన్ల కోసం 'కార్డ్ ప్రైమ్' సాఫ్ట్ వేర్ .. 31వ తేదీ నుంచి అమలు
సాంకేతిక యుగంలో అన్ని అరచేతిలోనే జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
'ఫస్ట్‌క్రై.కామ్' సీఈఓపై పన్ను ఎగవేత ఆరోపణలు.. ఐటీ శాఖ దర్యాప్తు
ఆన్‌లైన్ బేబీ కేర్ ప్రొడక్ట్స్ ప్లాట్‌ఫారమ్ 'ఫస్ట్‌క్రై.కామ్' వ్యవస్థాపకుడు సుపమ్ మహేశ్వరి పన్ను ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఎలాంటి చర్చ జరగకుండానే ముగిసిన మణిపూర్ అసెంబ్లీ సమావేశాలు
మణిపూర్ వర్షాకాల సమావేశాలు ఎలాంటి చర్చ లేకుండానే, అర్ధాంతరంగా ముగిశాయి. మణిపూర్‌లో జాతి ఘర్షణలు చెలరేగిన తర్వాత తొలిసారి మంగళవారం సమావేశమైన అసెంబ్లీలో గందరగోళం నెలకొంది.
Cooking Gas: గుడ్ న్యూస్.. వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.200 తగ్గించాలని కేంద్రం నిర్ణయం
రాఖీ పండగ వేళ కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు 14 కిలోల వంటగ్యాస్ సిలిండర్ ధరను తగ్గించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది.
'అయ్యో తప్పు జరిగింది'.. బిహార్‌లో కులగణన సర్వేపై అఫిడవిట్‌ను ఉపసంహరించుకున్న కేంద్రం
బిహార్ ప్రభుత్వం నిర్వహించిన కుల గణన సర్వేపై సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌ను కేంద్రం ఉపసంహరించుకుంది.
తెలంగాణ: రైతులకు బ్యాడ్ న్యూస్.. సెప్టెంబర్‌లో కూడా వర్షాలు లేనట్టే
తెలంగాణలో వర్షాలు మొహం చాటేశాయి. రాష్ట్రంలోకి ఆలస్యంగా ప్రవేశించిన రుతుపవనాలు.. రానురాను బలహీనపడుతూ వచ్చాయి.
విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరిన వైఎస్ జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి
విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్సార్‌సీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టును ఆశ్రయించారు.
దిల్లీ మద్యం స్కామ్‌ను విచారిస్తున్న ఈడీ అధికారిపై సీబీఐ కేసు
దిల్లీ మద్యం స్కామ్ కేసులో నిందితుడైన వ్యాపారవేత్త అమన్‌దీప్ సింగ్ ధాల్ నుంచి రూ.5 కోట్లు లంచం తీసుకున్న ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారిని సీబీఐ సోమవారం అరెస్టు చేసింది.
నేటి నుంచి మణిపూర్ అసెంబ్లీ సమావేశాలు; రాష్ట్రంలో హింస చెలరేగిన తర్వాత తొలిసారి భేటీ
మణిపూర్ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ఉదయం 11గంటలకు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో జాతి హింస చెలరేగిన తర్వాత తొలిసారిగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి.
జీ20 సదస్సు: దిల్లీలో భద్రత కట్టుదిట్టం.. భారీగా బలగాల మోహరింపు.. 1000మంది కమాండోలకు ప్రత్యేక శిక్షణ
మరో 10రోజుల్లో దిల్లీలో జీ20 శిఖరాగ్ర సమావేశం జరగనుంది. దేశవిదేశాల నుంచి హై ప్రొఫైల్ ఉన్న నాయకులు దిల్లీకి రానున్నారు.
పాకిస్థాన్‌లో భారత డిప్యూటీ హైకమిషన్‌గా గీతిక శ్రీవాస్తవ నియామకం
పాకిస్థాన్‌లో భారత డిప్యూటీ హై కమిషనర్, ఇన్‌చార్జ్ హై కమిషనర్‌గా ఐఎఫ్‌ఎస్ అధికారిణి గీతికా శ్రీవాస్తవను కేంద్ర ప్రభుత్వం నియమించింది.
రిలయన్స్ బోర్డుకు నీతా అంబానీ రాజీనామా; డైరెక్టర్లుగా ఇషా, ఆకాశ్, అనంత్ నియామకం
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్) డైరెక్టర్ల బోర్డుకు ముకేష్ అంబానీ భార్య నీతా అంబానీ రాజీనామా చేశారు.
యూకే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్‌లో సాంకేతిక సమస్య.. విమానాలు ఆలస్యం
బ్రిటన్ నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్‌లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు వినామయాన సంస్థలు చెప్పాయి. దీంతో దేశంలో విమాన సర్వీసులు ఆలస్యమవుతాయని స్పష్ట చేశాయి.
ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా వాదించిన కశ్మీర్ లెక్చరర్‌ను ఎందుకు సస్పెండ్ చేశారు?: సుప్రీంకోర్టు
పాఠశాల విద్యా శాఖలోని సీనియర్ లెక్చరర్‌గా పని చేస్తున్న జహూర్ అహ్మద్ భట్ సస్పెన్షన్‌కు గల కారణాలపై దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.