LOADING...

10 Sep 2023


'ఇండియా' కూటమికి భయపడి పేరు మార్చుతున్నారు : రాహుల్ గాంధీ

ఇండియా వ‌ర్సెస్ భార‌త్ అంశం గత కొద్ది రోజులుగా భారతదేశంలో దుమారం రేపుతోంది. ఈ మేరకు కేంద్రం తీరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

స్కిల్ డెవలప్‌మెంట్ కేసు: చంద్రబాబుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ 

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏసీబీ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది.

Mahindra SUV: భారీ డిస్కౌంట్‌‌లో లభిస్తున్న మహింద్రా ఎస్‌యూవీ వాహనాలు ఇవే..

ఎస్‌యూవీ మోడల్ కారును కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే సెప్టెంబర్‌లో ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ మహింద్రా పలు ఎస్‌యూవీ వాహనాలపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ఏఏ వేరియంట్లు డిస్కొంట్‌లో లభిస్తున్నాయో చూద్దాం.

తెలంగాణలో 5 రోజులు దంచికొట్టనున్న వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ

తెలంగాణలో రానున్న ఐదు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వానలు పడే అవకాశాలున్నట్లు తెలిపింది.

Mega 157: చిరంజీవి కొత్త సినిమా నుంచి మెగా కబురు.. ఇక అడ్వెంచరే

మెగాస్టార్ చిరంజీవి తన 157వ సినిమాను బింబిసార దర్శకుడు వశిష్టతో చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి మెగా కబురు వచ్చేసింది. చిరంజీవితో ఉన్న ఫోటో షేర్ చేస్తూ వశిష్ట ఒక ట్వీట్ చేశాడు.

డిజిటల్ పేమెంట్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. 'యూపీఐ లైట్‌ ఎక్స్‌' గురించి తెలుసా

గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్-2023లో భాగంగా యూపీఐ లైట్ ఎక్స్ (UPI LITE X) అనే కొత్త యూపీఐ సాంకేతికత ప్రారంభమైంది. ఈ మేరకు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఈ కొత్త యూపీఐ టెక్నాలజీని లాంచ్ చేశారు. దీంతో వ్యాపారులు, వినియోగదారులు ఆఫ్‌లైన్‌లో కూడా చెల్లింపులను నిరాటంకంగా చేసుకోవచ్చు.

'భారత్' పేరు ఇష్టం లేని వాళ్లు దేశం విడిచి వెళ్లిపోండి: బీజేపీ ఎంపీ  వివాదాస్పద వ్యాఖ్యలు 

ఇండియా పేరు మార్పుపై మరోసారి రగడ మొదలైంది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియా పేరును భారత్‌గా మార్చేస్తామన్నారు.

BRI Exit Italy: జీ20 వేదికగా చైనాకు షాకిచ్చిన ఇటలీ

దిల్లీ జీ20 వేదికగా చైనాకు ఇటలీ షాకిచ్చింది. చైనా ప్రతిష్టాత్మికంగా భావించిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (BRI) నుంచి తాము వైదొలగాలని భావిస్తున్నట్లు ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని ప్రకటించారు. చైనా ప్రధాని లీ కియాంగ్‌కు ఈ విషయాన్ని జార్జియా చెప్పినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.

సెప్టెంబర్ 17పై బీఆర్ఎస్ కీలక నిర్ణయం.. జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహిస్తామని ప్రకటన

సెప్టెంబర్‌ 17న జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ శ్రేణులు 17న జాతీయ సమైక్యతా దినోత్సవంలో పాల్గొనాలని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.

 హైదరాబాద్: జూనియర్ ఆర్టిస్ట్ దారుణ హత్య.. కారణం ఇదే!

హైదరాబాద్‌లో ఓ జూనియర్ ఆర్టిస్ట్ దారుణంగా హత్యకు గురయ్యాడు. ప్రేమించిన అమ్మాయితో చనువుగా ఉంటున్న నెపంతో ఆమె మాజీ లవర్, స్నేహితులతో కలిసి ఈ ఘోరానికి ఒడిగట్టాడు.

బైడెన్ కాన్వాయ్‌లో ప్రోటోకాల్ ఉల్లంఘించిన డ్రైవ‌ర్.. యూఏఈ అధ్య‌క్షుడు బస చేసే హోటల్‌లోకి వెళ్లి..  

దిల్లీలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాన్వాయ్‌లోని ఓ డ్రైవ‌ర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్ల‌క్ష్యంగా డ్రైవింగ్ చేసి ప్రొటోకాల్ ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డిన నేపథ్యంలో కొద్దిసేపు ప్ర‌శ్నించారు. అనంత‌రం అత‌డిని విడిచిపెట్టారు.

'దిల్లీ డిక్లరేషన్‌' వెనుక 200 గంటలు, 300 భేటీలు, 15 ముసాయిదాల కృషి

జీ20 దిల్లీ డిక్లరేషన్‌ వెనుక భారీ కసరత్తు జరిగింది. ఫలితంగానే అధ్యక్ష హోదాలో భారత్‌ శనివారం గ్రాండ్ విక్టరీని సాధించగలిగింది. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భాగస్వామ్య దేశాల మధ్య అభిప్రాయభేదాలను పక్కనపెట్టి, సంయుక్త ప్రకటనపై ఏకాభిప్రాయాన్ని సాధించగలిగింది.

G20 summit: ముగిసిన దిల్లీ జీ20 సమ్మిట్.. బ్రెజిల్‌కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోదీ 

దిల్లీ వేదికగా జరుగుతున్న రెండు రోజుల జీ20 సమావేశాలు ముగిసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.

పుతిన్‌ను అరెస్టు చేసే ఉద్దేశం మాకు లేదు: బ్రెజిల్ అధ్యక్షుడు 

వచ్చే ఏడాది బ్రెజిల్ రాజధాని రియో ​​డి జనీరోలో జీ20 సదస్సు జరగనుంది. అయితే ఈ సమ్మిట్‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిర్భయంగా రావొచ్చని ఆ దేశ అధ్యక్షుడు బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా అన్నారు. ఆయన వస్తే తాము అరెస్టు చేయబోమని, ఆ ఉద్దేశం తమకు లేదన్నారు.

యూఎస్‌ ఓపెన్‌లో దుమ్మురేపిన కోకో గౌఫ్.. 19 ఏళ్లకే తొలి గ్రాండ్​స్లామ్ కైవసం

అమెరికా యువ సంచలనం, కోకో గౌఫ్ తొలి గ్రాండ్​స్లామ్ టైటిల్ ను కైవసం చేసుకున్నారు. యూఎస్‌ ఓపెన్‌ టోర్నీలో టైటిల్ గెలిచిన పిన్న వయస్కురాలిగా సెరెనా విలియమ్స్ తర్వాత గుర్తింపు సాధించారు.

నోరూరించే వెజ్ కుర్మాలను  మీ ఇంట్లో ట్రై చేయండి

కుర్మా వంటకాలు అంటే అందరికీ నోరూరుతాయి. కూరగాయలు, మసాలాలు, పెరుగు కాంబినేషన్లో వీట్ని తయారు చేస్తారు.రోటీ లేదా పరాటా, చపాతీతో ఆస్వాదించే రుచికరమైన వెజ్ కుర్మాలను ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం.

రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించిన జీ20 దేశాధినేతలు 

జీ20 సదస్సులో రెండో రోజులో భాగంగా ఆదివారం సభ్యదేశాల ప్రతినిధులు దిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.

అల్లు అర్జున్‌కు మంచు విష్ణు లేఖ.. బన్నీ రిప్లై ఇచ్చిన ట్వీట్ వైరల్ 

జాతీయ ఉత్తమ నటుడిగా గుర్తింపు పొందిన పుష్ప హీరో అల్లు అర్జున్ కి 'మా' అసోసియేషన్ ప్రత్యేక అభినందనలు తెలిపింది. ఈ మేరకు మా ప్రెసిడెంట్ మంచు విష్ణు బన్నీకి ప్రశంస లేఖ రాశారు.

ఏసీబీ కోర్టులో చంద్రబాబు రిమాండ్ రిపోర్ట్..స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో ఆయనే సూత్రధారన్న సీఐడీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం కొనసాగుతోంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో మాజీ సీఎం చంద్రబాబుపై ఏసీబీ కోర్టుకు సీఐడీ రిమాండ్‌ రిపోర్టు సమర్పించింది. ఈ మేరకు సంచలన అభియోగాలను పొందుపర్చింది.

సెప్టెంబర్ 10న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

సెప్టెంబర్ 10వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

దిల్లీలోని అక్షరధామ్ ఆలయంలో బ్రిటన్ ప్రధాని రిషి సునక్ పూజలు 

జీ20 సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన బ్రిటన్ ప్రధాని రిషి సునక్, ఆయన భార్య అక్షతా మూర్తి ఆదివారం ఉదయం దిల్లీలోని అక్షరధామ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

ఆసియా కప్ : నేడు భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. 90శాతం వర్ష సూచన

ఆసియా కప్‌ 2023లో భాగంగా భారత్, పాకిస్తాన్‌ మధ్య మరో సమరానికి తెెరలేచింది. సూపర్‌-4 దశలో భాగంగా శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియంలో ఇవాళ ఇరు జట్లు తలపడనున్నాయి.

Morocco earthquake: మొరాకోలో భూకంప కల్లోలం.. 2,000 దాటిన మృతులు.. వెల్లువెత్తున్న మానవాతా సాయం

సెంట్రల్ మొరాకోలో 6.8 తీవ్రతతో సంభవించిన భూకంపం కల్లోలం సృష్టించింది. ఈ విప్తత్తుకు ఉత్తర ఆఫ్రికా దేశమైన మొరాకోకు తీవ్ర విషాదాన్ని మిగల్చింది.

నాటకీయ పరిణామాల మధ్య విజయవాడకి జనసేనానిని  

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసు లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడుని ఏపీ పోలీస్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

09 Sep 2023


India-Middle East-Europe corridor: 'భారత్-మిడిల్ ఈస్ట్-యూరప్' కనెక్టివిటీ కారిడార్ ప్రారంభం 

జీ20 సదస్సు వేదికగా చారిత్ర ఒప్పందం జరిగింది. వాణిజ్య సంబంధాలను పెంపొందించే ప్రయత్నంలో 'భారత్-మిడిల్ ఈస్ట్-యూరప్' కనెక్టివిటీ కారిడార్‌ను ప్రారంభించారు.

దగ్గుబాటి ఇంట్లో మోగనున్న పెళ్లి బాజాలు.. రానా తమ్ముడి వివాహం ఎవరితో తెలుసా

ఇండియన్ మూవీ మొగల్, ప్రముఖ నిర్మాత దివంగత దగ్గుబాటి రామానాయుడు మనవడు ఓ ఇంటి వాడు కానున్నాడు. స్టార్ ప్రొడ్యూసర్ సురేశ్‌ బాబు చిన్న కుమారుడు, హీరో అభిరామ్‌ పెళ్లి ఖరారైనట్లు సమాచారం.

ఈ ఏడాది ఇప్పటి వరకు విడుదలైన టాప్-5 ఈవీ వాహనాలు ఇవే 

భారతీయ ఈవీ మార్కెట్ కొన్ని సంవత్సరాలుగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. 2023లో పలు దేశీయ, గ్లోబల్ బ్రాండ్‌లు తమ కొత్త ఈవీ మోడల్స్‌ను మార్కెట్‌లోకి విడుదల చేశారు.

యూపీలో ఘోరం.. విద్యార్థినికి డ్రగ్స్‌ ఇచ్చి, గ్యాంగ్ రేప్ చేస్తూ వీడియో తీశారు

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోరం జరిగింది. కళాశాల విద్యార్థిని అడ్డగించిన కొందరు వ్యక్తులు ఆమెకు బలవంతంగా డ్రగ్స్‌ ఇచ్చారు. ఆపై అత్యాచారం చేశారు.

మీ కిడ్నీల ఆరోగ్యానికి ఈ ఆయుర్వేద చిట్కాలను పాటించండి

గత కొన్నాళ్లుగా దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి బాధితులు వేగంగా పెరుగుతున్నారు. ప్రారంభ దశల్లోనే దీన్ని గుర్తించి అడ్డుకట్ట వేయాలి.లేకపోతే వ్యాధి తీవ్రంగా మారే ప్రమాదం పొంచి ఉంటుంది.

అభిషేక్‌ పిక్చర్స్‌పై విజయ్ దేవరకొండ తండ్రి ఆగ్రహం

విజయ్ దేవరకొండను ఉద్దేశించి అభిషేక్‌ పిక్చర్స్‌ చేసిన వ్యాఖ్యలపై అతని తండ్రి గోవర్థన్ రావు దేవరకొండ స్పందించారు. విజయ్ పై ఇలాంటి ఆరోపణలు చేయడం దురదృష్టకరమన్నారు.

రూ.10 లక్షల బైక్‌పై జొమాటో ఫుడ్ డెలివరీ.. వీడియో వైరల్

ఓ డెలివరీ బాయ్ దాదాపు రూ.10లక్షల ఖరీదైన స్పోర్ట్స్ బైక్‌పై ఫుడ్ డెలివరీ చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. సదరు డెలివరీ బాయ్ ని ఓ వ్యక్తి బతకడానికి ఏం చేస్తుంటారు అని అడిగారు.

MMTS Hyderabad: రైల్వే ప్రయాణికులకు అలెర్ట్.. వారం పాటు 16ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు

హైదరాబాద్‌లోని ఎంఎంటీఎస్ రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలెర్ట్ జారీ చేసింది. ఈ మేరకు వారం పాటు 16సర్వీసులను రద్దు చేస్తూ నిర్ణయించింది. ఈనెల 11 నుంచి 17 వరకు సర్వీసులను పూర్తిగా రద్దు చేసినట్లు ప్రకటించింది.

G20 Delhi Declaration: దిల్లీ డిక్లరేషన్‌ను ఆమోదించిన జీ20 దేశాధినేతలు: ప్రధాని మోదీ ప్రకటన 

జీ20 సదస్సు తొలి సెషన్‌లో కూటమిలోని దేశాధినేతలు దిల్లీ సమ్మిట్ డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.

వేములవాడ రాజన్న ఆలయ సమీపంలో అగ్ని ప్రమాదం

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన వేములవాడలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పట్టణంలోని ఆలయ వసతి గృహాలకు చెందిన దుకాణాల వద్ద మంటలు అంటుకున్నాయి.

Morocco earthquake: మొరాకో భూకంప ప్రమాదంలో 632కు చేరిన మరణాలు 

ఉత్తరాఫ్రికా దేశమైన సెంట్రల్ మొరాకోలో శుక్రవారం ఉత్తరాఫ్రికాను కుదిపేసిన భయకరమైన భూకంపాలు ఇవేఅర్థరాత్రి 6.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే.

ఆసియా కప్‌: కేఎల్‌ రాహుల్‌ రాకతో సంజూ శాంసన్‌‌కు ఉద్వాసన.. నెట్టింట ట్రోల్స్

ఆసియా కప్‌కు అదనపు ఆటగాడిగా ఎంపికైన టీమిండియా వికెట్‌ కీపర్‌ సంజూ శాంసన్ తిరుగుముఖం పట్టాడు. పాకిస్థాన్‌తో సూపర్‌-4 మ్యాచ్‌కు ముందు కేఎల్‌ రాహుల్‌ జట్టులోకి చేరారు. దీంతో జట్టు యాజమాన్యం సంజూని భారత్ పంపించేసింది. ఈ క్రమంలోనే సంజూ శ్రీలంకను వీడాడు.

ఇది ప్రపంచానికి కొత్త దిశను చూపే సమయం: జీ20 స్వాగత ప్రసంగంలో ప్రధాని మోదీ 

దిల్లీ ప్రగతి మైదాన్‌లోని 'భారత్‌ మండపం'లో జీ20 సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత ప్రారంభమైంది. మోదీ ఈ సందర్భంగా కీలక ప్రసంగం చేశారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో కీలక పాత్రదారి చంద్రబాబు: ఏపీ సీఐడీ

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై ఆంధ్రప్రదేశ్ సీఐడీ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు మంగళగిరిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐడీ చీఫ్ ఎన్ సంజయ్ మాట్లాడారు. నంద్యాలలో ఉదయం 6గంటలకు చంద్రబాబ అరెస్ట్ చేశామన్నారు.

ఎమిరేట్స్ విమానంలో మెడికల్ ఎమర్జెన్సీ.. దిల్లీకి మళ్లిన ఫ్లైట్

దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. (Dubai-Guangzhou Emirates Aeroplane) దుబాయ్ నుంచి గ్యాంగ్ జౌ వెళ్లాల్సిన EK- 362 ఎమిరేట్స్ విమానం అత్యవసర వైద్య పరిస్థితుల కారణంగా దిల్లీకి మళ్లింది.

Modi-Biden bilateral meet: ద్వైపాక్షిక సమావేశంలో మోదీ, బైడెన్ చర్చించిన అంశాలు ఇవే.. 

జీ20 సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌- ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ద్వైపాక్షిక భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఇరువురు దేశాధినేతలు కీలక అంశాలపై చర్చించారు.

 G20 summit 2023: ప్రధాని మోదీ సీటు ముందు నేమ్ ప్లేట్‌పై  'భార‌త్‌' పేరు

G20 శిఖరాగ్ర సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో భారత్ పేరు మరోసారి కనిపించింది. రౌండ్‌టేబుల్‌పై ప్ర‌ధాని నరేంద్ర మోదీ కూర్చున్న స్థానంలో భార‌త్ నేమ్ ప్లేట్ దర్శనమిచ్చింది.

ముంబైలో తళుక్కుమన్న నయనతార.. బాలీవుడ్‌కూ ప్రాధాన్యత ఇస్తానన్న బ్యూటీ

దక్షిణాది ప్రముఖ సినీనటి నయనతార శుక్రవారం ముంబైలో మెరిశారు. జవాన్‌ చిత్రం సక్సెస్ మీట్ లో భాగంగా ఈ టాప్ హీరోయిన్ ప్రేక్షకులతో కలిసి సినిమా చూశారు.

G20 summit delhi: దిల్లీలో అట్టహాసంగా జీ20 సదస్సు.. దేశాధినేతలకు స్వాగతం పలికిన ప్రధాని మోదీ  

జీ20 సదస్సు శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. శిఖరాగ్ర సమావేశానికి తొలిసారిగా ఆతిథ్యం ఇస్తున్న భారత్ రాజధాని దిల్లీ దేదీప్యమానంగా వెలిగిపోతోంది. ప్రపంచ దేశాధినేతల రాకతో మహానగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.

అరెస్ట్‌పై స్పందించిన చంద్రబాబు.. న్యాయమే గెలుస్తుందని ధీమా

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనను అరెస్ట్ చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. తాను తప్పు చేయలేదన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనను అణిచివేస్తున్నట్లు తెలిపారు.

సెప్టెంబర్ 9న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

సెప్టెంబర్ 9వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Morocco Earthquake: మొరాకోను కుదిపేసిన భారీ భూకంపం; 296 మంది మృతి 

సెంట్రల్ మొరాకోను భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై 6.8తీవ్రత నమోదైంది.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు.. ఆంధ్రప్రదేశ్‌లో హై అలర్ట్ 

అవినీతి ఆరోపణల కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును ఆంధ్రప్రదేశ్ పోలీసులు శనివారం ఉదయం అరెస్టు చేశారు.