తాజా వార్తలు

29 Apr 2023

కడప

వైఎస్ కుటుంబం చీలిపోయిందా? వచ్చే ఎన్నికల్లో రెండు వర్గాల మధ్య పోరు తప్పదా? 

వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు, వైఎస్ కుటుంబంలో కూడా తీవ్రఅలజడిని రేపుతోంది. వివేక హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పాత్ర ఉందన్న ఆరోపణల నేపథ్యంలో వైఎస్ కుటుంబం నిలువుగా చీలిపోయిందనేది బహిరంగ రహస్యం.

28 Apr 2023

తెలంగాణ

వైఎస్ అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జూన్ 5కి వాయిదా

వైఎస్ వివేక హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌పై ఇప్పుడు వాదనలు వినలేమని శుక్రవారం తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.

91ఎఫ్‌ఎం ట్రాన్స్‌మీటర్ల ప్రారంభంతో రేడియో పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు: ప్రధాని మోదీ 

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 91 కొత్త ఎఫ్ఎం ట్రాన్స్‌మిటర్‌లను ప్రారంభించారు.

28 Apr 2023

హర్యానా

హర్యానా: భార్యను చంపి, చేతులు, తల నరికి; ఆ తర్వాత శరీరాన్ని కాల్చేశాడు

హర్యానాలోని మనేసర్ జిల్లాకు చెందిన 34ఏళ్ల వ్యక్తిని తన భార్యను దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.

చేతిపంపు కొట్టుకొని నీళ్లు తాగిన ఏనుగు; వీడియో వైరల్ 

పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన కొమరాడ మండలంలోని వన్నాం గ్రామంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

28 Apr 2023

బ్రిటన్

'నా కూతురు తన భర్తను ప్రధానిని చేసింది': రిషి సునక్‌పై సుధా మూర్తి ఆసక్తికర కామెంట్స్

యూకే ప్రధాన మంత్రి రిషి సునక్ అత్తగారు, ఇన్ఫోసిస్ సహ వ్యవస్తాపకుడు సుధా మూర్తి ఆసక్తిక కామెంట్స్ చేశారు.

50శాతం మంది ఉద్యోగులను తొలగిస్తున్న 'క్లబ్‌హౌస్'

ఆడియో ఆధారిత సోషల్ నెట్‌వర్కింగ్ యాప్ 'క్లబ్‌హౌస్' 50 శాతం మంది ఉద్యోగుల తొలగింపును చేపట్టినట్లు ప్రకటించింది.

పశ్చిమ బెంగాల్‌: పిడుగుపాటుకు 14మంది బలి

పశ్చిమ బెంగాల్‌లోని ఐదు జిల్లాల్లో పిడుగులు పడి దాదాపు 14 మంది మరణించారని అధికారులు తెలిపారు.

28 Apr 2023

సూడాన్

ఆపరేషన్ కావేరి: సూడాన్ నుంచి 10వ బ్యాచ్ భారతీయుల తరలింపు

సూడాన్ అంతర్యుద్ధంలో చిక్కున్న భారతీయులను రక్షించడానికి కేంద్రం 'ఆపరేషన్ కావేరి'ని ముమ్మరం చేసింది. తాజాగా ఎనిమిది, తొమ్మిది, పదవ బ్యాచ్‌లు సూడాన్ నుంచి బయలుదేరినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది.

28 Apr 2023

మణిపూర్

మణిపూర్‌లో ఉద్రిక్తత: సీఎం కార్యక్రమ వేదికకు నిప్పు; 144 సెక్షన్ విధింపు 

మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ శుక్రవారం హాజరుకావాల్సిన ఈవెంట్ వేదికను గురువారం రాత్రి కొందరు తగలబెట్టారు.

దేశంలో కొత్తగా 7,533 మందికి కరోనా; 44మరణాలు

దేశంలో గత 24గంటల్లో 7,533 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో మొత్తం కేసులు సంఖ్య 4.49కోట్లకు పెరిగినట్లు కేంద్రం చెప్పింది.

28 Apr 2023

తెలంగాణ

మొక్కజొన్న రైతులకు కేసీఆర్ శుభవార్త; పంట కొనుగోలుకు ముందుకొచ్చిన ప్రభుత్వం

మొక్కజొన్న రైతులకు తెలంగాణ సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. యాసంగిలో పండించిన మొక్కజొన్న పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

మే 1నుంచి షిర్డీ సాయిబాబా ఆలయం మూసివేత; ఎందుకో తెలుసా?

మహారాష్ట్రలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం షిర్డీ సాయిబాబా ఆలయం మే 1 నుంచి నిరవధికంగా మూసివేస్తున్నట్లు ఆలయ ట్రస్ట్ పేర్కొంది.

రాహుల్ గాంధీని చంపుతానని బెదిరించిన వ్యక్తి అరెస్టు 

నవంబర్ 2022లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో బాంబులు వేసి హత్య చేస్తామని బెదిరింపులతో కూడిన లేఖ పంపిన నిందితుడు 60ఏళ్ల దయాసింగ్ అలియాస్ ఐశిలాల్ ఝమ్‌ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

28 Apr 2023

అమెరికా

అలస్కాలో కుప్పకూలిన రెండు ఆర్మీ హెలికాప్టర్లు

శిక్షణ ముగించుకుని తిరిగి వస్తున్న అమెరికాకు చెందిన రెండు సైనిక హెలికాప్టర్లు అలస్కాలో గురువారం కూలిపోయాయి.

బెంగళూరు: ఇంటర్‌లో 90శాతం మార్కులు లేవని ఇల్లు అద్దెకు ఇవ్వలేదు

పరీక్షల్లో వచ్చిన మార్కులను బట్టి ఇల్లు అద్దెకు ఇచ్చే యజమానుల గురించి ఎప్పుడైనా విన్నారా? బెంగళూరులో అద్దెకోసం ఇల్లును వెతుకున్న వ్యక్తికి ఆ వింత అనుభవం ఎందురైంది.

బిహార్ డాన్ ఆనంద్ మోహన్ సింగ్ విడుదలపై ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అసోసియేషన్ అభ్యంతరం 

గోపాల్‌గంజ్ జిల్లా మేజిస్ట్రేట్ జి.కృష్ణయ్య హత్య కేసులో దోషిగా ఉన్న ఆనంద్ మోహన్ సింగ్‌ను విడుదల చేయాలని బిహార్ ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడంపై ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అసోసియేషన్ (ఐఏఎస్) అభ్యంతరం వ్యక్తం చేసింది.

'కాంగ్రెస్ 'వారంటీ' గడువు ముగిసింది'; హస్తం పార్టీపై ప్రధాని మోదీ సెటైర్లు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ ధ్వజమెత్తారు.

27 Apr 2023

ఐఎండీ

తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు; ఆందోళనలో రైతన్నలు 

ఇప్పటికే రైతాంగానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చిన అకాల వర్షాలు తెలంగాణ మరో మూడు రోజలు పాటు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

జనవరి-మార్చి త్రైమాసికంలో 9,400మంది ఉద్యోగులను తొలగించిన భారతీయ స్టార్టప్‌లు

గత ఏడాది నుంచి నెలకొన్ని ఆర్థిక అనిశ్చితి ఐటీ రంగానికి శరాఘాతంగా మారింది. దీంతో కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగుల తొలగింపును చేపడుతున్నాయి.

27 Apr 2023

సూడాన్

సూడాన్‌లో చిక్కుకున్న ప్రతి భారతీయుడిని రక్షించడమే ప్రభుత్వ లక్ష్యం: విదేశాంగ కార్యదర్శి 

సూడాన్‌లో చిక్కుకున్న ప్రతి భారతీయుడిని సురక్షింతంగా స్వదేశానికి తరలించడమే ప్రభుత్వ లక్ష్యమని గురువారం విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా స్పష్టం చేశారు.

తెలంగాణ భవన్‌లో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు 

భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించారు.

'డొనాల్డ్ ట్రంప్ నన్ను రేప్ చేశారు': న్యూయార్క్ కోర్టులో దావా వేసిన రచయిత

మూడు దశాబ్దాల క్రితం డొనాల్డ్ ట్రంప్ తనపై అత్యాచారం చేశారని అమెరికాకు చెందిన రచయిత జీన్ కారోల్ న్యూయార్క్ కోర్టులో దావా వేశారు.

27 Apr 2023

భూమి

భూమికి కొత్త ముప్పు; నక్షత్రాలు పేలి ధరణిపైకి దూసుకొస్తున్న ప్రమాదకర ఎక్స్-కిరణాలు 

ఖగోళ శాస్త్రవేత్తలు భూ గ్రహానికి కొత్త ముప్పును గుర్తించారు. పేలిన నక్షత్రాల నుంచి ఉత్పన్నమయ్యే ఎక్స్-కిరణాలు భూమితో సహా 100 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గ్రహాలను తీవ్రంగా ప్రభావితం చేసే దశ రావచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

27 Apr 2023

తెలంగాణ

TS EAMCET-2023: తెలంగాణ ఎంసెట్‌కు పరీక్షాల కేంద్రాల పెంపు; భారీగా పెరిగిన అప్లికేషన్లు

తెలంగాణ ఎంసెట్‌ -2023 కోసం రికార్డు స్థాయిలో అప్లికేషన్లు పెరిగినట్లు జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ)- హైదరాబాద్ పేర్కొంది.

దేశంలో కొత్తగా 9,355 మందికి కరోనా; 26 మరణాలు 

దేశంలో గత 24గంటల్లో 9,355 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు గురువారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

27 Apr 2023

ఇస్రో

'గగన్‌యాన్' పైలెట్లకు శిక్షణ పూర్తికావొచ్చింది: రాకేష్ శర్మ 

భారత తొలి వ్యోమగామి, వింగ్ కమాండర్ (రిటైర్డ్) రాకేష్ శర్మ ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్‌లోని ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించిన 'గగన్‌యాన్' & బియాండ్'పై ప్రదర్శనలో పాల్గొన్నారు.

TSRTC: ప్రయాణికులకు టీఎస్‌ ఆర్టీసీ గుడ్‌న్యూస్; హైదరాబాద్‌లో టికెట్ ధరలు రూ.10 తగ్గింపు 

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) హైదరాబాద్ పరిధిలోని సాధారణ ప్రయాణికుల కోసం టీ-24 టిక్కెట్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.

27 Apr 2023

సూడాన్

ఆపరేషన్ 'కావేరి': సూడాన్ నుంచి 1100మంది భారతీయులు తరలింపు

'ఆపరేషన్ కావేరి' కింద, భారతదేశం ఇప్పటివరకు సూడాన్ నుంచి దాదాపు 1100 మందిని తరలించింది.

26 Apr 2023

ఐపీఎల్

తడబడ్డ ఆర్సీబీ బ్యాటర్లు; కేకేఆర్ ఘన విజయం

చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ చేతిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఓటమి పాలైంది.

KKR vs RCB: కేకేఆర్ బ్యాటర్లు ధనాధన్; ఆర్సీబీ లక్ష్యం 201 పరుగులు

చిన్నస్వామి స్టేడియంలో వేదికగా బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ బ్యాటర్లు విరుచుకుపడ్డారు.

26 Apr 2023

తెలంగాణ

అంతర్జాతీయ వేదికపై సంగారెడ్డి విద్యార్థి ప్రతిభ; జీ20 సదస్సులో నమూనా ప్రదర్శన

సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ పాఠశాల విద్యార్థి, గైడ్ టీచర్ అరుదైన ఘనత సాధించారు. వీరు తయారు చేసిన ఓ నమూనా అంతర్జాతీయ సదస్సుకు ఎంపికైంది.

2023-24 ఐటీ రిటర్న్స్: ITR-1, ITR-4 ఆఫ్‌లైన్ ఫామ్స్ విడుదల

ఆదాయపు పన్ను శాఖ ఇంకా ఆన్‌లైన్ ఐటీఆర్ ఫారమ్‌లను విడుదల చేయనప్పటికీ, 2023-24 లేదా 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీ రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి ఆఫ్‌లైన్ ఐటీఆర్-1, 4 ఫామ్స్‌ను విడుదల చేసింది.

26 Apr 2023

తెలంగాణ

అయ్యో! సైబీరియన్ పక్షలకు ఎంత కష్టమొచ్చే; వడగండ్లతో విలవిల

తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలోని మాధాపురం గ్రామానికి ప్రతి ఏటా వలస వచ్చే సైబీరియన్ పక్షులు అకాల వర్షాలు, వడగళ్ల వానలకు అల్లాడిపోతున్నాయి. ముఖ్యంగా వడగళ్ల వానల వలన మృత్యువాత పడుతున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Hyderabad Metro: ఆ రూట్లలో షార్ట్ లూప్ ట్రిప్పులను నడుపుతున్న హైదరాబాద్ మెట్రో 

హైదరాబాద్‌లో ప్రయాణాల కోసం మెట్రోను ఆశ్రయించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పుడు వేసవి కావడంతో మెట్రో ప్రయాణాలు మరింత పెరిగాయి.

ఉత్తరాఖండ్: భారత మొదటి గ్రామం 'మాణా' స్వాగత బోర్టు ఏర్పాటు

ఉత్తరాఖండ్‌లోని సరిహద్దు గ్రామమైన 'మాణా' వద్ద 'భారత మొదటి గ్రామం' అని ప్రకటిస్తూ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బీఆర్ఓ) సైన్ బోర్డును ఏర్పాటు చేసింది. వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి బోర్టును ఏర్పాటు చేశారు.

కిలో గంజాయి స్మగ్లింగ్; భారత సంతతి వ్యక్తిని ఉరి తీసిన సింగపూర్‌ ప్రభుత్వం

కిలో గంజాయిని స్మగ్లింగ్ చేసిన కేసులో దోషిగా తేలిన భారత సంతతికి చెందిన 46 ఏళ్ల తంగరాజు సుప్పయ్య అనే వ్యక్తిని బుధవారం సింగపూర్ ప్రభుత్వం ఉరితీసింది.

లండన్‌లో జగన్నాథ ఆలయ నిర్మాణం; ప్రవాస ఒడిశా వ్యాపారి 25మిలియన్ పౌండ్ల విరాళం

లండన్‌లో జగన్నాథుడి ఆలయ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఆలయాన్ని నిర్మాణం కోసం ఒడిశా మూలాలున్న ప్రవాస భారతీయుడు 25మిలియన్ పౌండ్లను విరాళంగా ఇచ్చేందుకు ముందుకొచ్చారు.

దేశంలో కొత్తగా 9,629 కరోనా కేసులు: 29మరణాలు

దేశంలో గత 24గంటల్లో 9,629 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజా కేసులతో కలిపి యాక్టివ్ కేసుల సంఖ్య 61,013కు చేరుకుంది.

తాలిబన్ చేతిలో కాబూల్‌ విమానాశ్రయంలో ఉగ్రదాడి సూత్రదారి హతం 

2021లో కాబూల్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఆత్మాహుతి దాడి వెనుక సూత్రదారి అయిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదిని తాలిబాన్ హతమార్చింది. ఈ విషయాన్ని అమెరికా ధృవీకరించింది.