LOADING...

13 Jul 2025


Nitish Kumar: బిహార్‌ సీఎం కీలక ప్రకటన .. వచ్చే ఐదేళ్లలో కోటి ఉద్యోగాలు కల్పిస్తాం

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరోసారి అధికారంలోకి రావాలని యత్నిస్తున్న ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ కీలక ప్రకటన చేశారు.

Bomb threat: కేరళ సీఎం ఇంటికి బాంబు హెచ్చరిక.. అప్రమత్తమైన పోలీసులు

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అధికారిక నివాసానికి బాంబు బెదిరింపు సందేశం అందడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.

Air India: ఎయిర్ ఇండియా ప్రమాదం వెనుక అసలు కారణం.. 'గోల్డెన్‌ చాసిస్‌'తో బహిర్గతం

అహ్మదాబాద్‌లో జూన్ 12న జరిగిన ఎయిర్‌ ఇండియా AI-171 విమాన ప్రమాద దర్యాప్తులో 'గోల్డెన్‌ చాసిస్‌' అనే ప్రత్యేక పరికరం కీలకంగా నిలిచింది.

Ms Dhoni: ధోని టీ షర్ట్ ధర.. ఐఫోన్ 15 ప్లస్ విలువకు సమానం!

టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోని మరోసారి కొత్త లుక్‌తో అభిమానులను ఆకట్టుకున్నారు. తాజాగా ఎంఎస్ ధోని ధరించిన మ్యూజికల్‌ షర్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Kota Srinivasa Rao: కోట శ్రీనివాసరావు మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం

ప్రధాని నరేంద్ర మోదీ ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతిపట్ల సంతాపం ప్రకటించారు. ఆయన మృతిని బాధాకరమైన విషాదంగా పేర్కొన్నారు.

Kavitha: తీన్మార్ మల్లన్నను అరెస్టు చేయాలి.. డీజీపీకి ఫిర్యాదు చేసిన కవిత

తనపై తీవ్రంగా అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ ఎమ్మెల్సీ కవిత, తీన్మార్ మల్లన్నపై మండిపడ్డారు.

Vijay: సారీ కాదు.. న్యాయం కావాలి'.. లాకప్‌డెత్‌పై విజయ్ ఆగ్రహం

తమిళనాడులో ఒక సామాన్య పౌరుడిగా జీవిస్తున్న సెక్యూరిటీ గార్డు అజిత్ కుమార్‌ మృతిచెందిన కస్టడీ మృతికేసు రాష్ట్రాన్ని షాక్‌కు గురి చేసింది.

Election Commission: దేశవ్యాప్తంగా ఓటరు జాబితా సమగ్ర సవరణకు ఈసీ సన్నద్ధం?

బిహార్‌లో ఓటర్ల జాబితాలపై చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ వ్యవహారాన్ని సుప్రీం కోర్టు సమర్థించిన నేపథ్యంలో, ఇప్పుడు అదే తరహాలో దేశవ్యాప్తంగా ఓటరు జాబితాల పరిశుద్ధీకరణకు ఎన్నికల సంఘం రంగంలోకి దిగనుంది.

motivation: ఎంత కష్టపడినా ఫలితం కనిపించడంలేదా? చాణక్య చెప్పిన ఐదు మార్గాలివే! 

ఆచార్య చాణక్యుడు కేవలం ప్రఖ్యాత ఆర్థికవేత్త, రాజకీయ నిపుణుడు మాత్రమే కాదు గొప్ప తాత్వికుడూ, రచయిత కూడా. జీవితాన్ని విజయం వైపు నడిపించే అనేక మూల సూత్రాలను ఆయన 'చాణక్య నీతి' పేరుతో రూపొందించారు.

UK: యూకే వీసాల్లో డిజిటల్‌ విప్లవం.. జులై 15 నుంచి ఈ-వీసా విధానం అమలు!

ఇమిగ్రేషన్‌ వ్యవస్థను మరింత సాంకేతికంగా మార్చే దిశగా యునైటెడ్ కింగ్‌డమ్‌ (UK) కీలక ముందడుగు వేసింది.

Chhangur Baba: విదేశాల నుంచి రూ.500 కోట్ల ప్రవాహం.. చంగూర్‌బాబా చీకటి భాగోతం ఇదే! 

విదేశాల నుంచి నిధులను సమకూర్చి, అక్రమ మతమార్పిడులకు పాల్పడుతున్న జలాలుద్దీన్ అలియాస్‌ చంగూర్‌బాబా ఆర్థిక వ్యవస్థపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విస్తృత దర్యాప్తు కొనసాగిస్తోంది.

Trump: ట్రంప్‌ సుంకాల దాడి మళ్లీ మొదలు.. మెక్సికో, ఈయూకు 30శాతం టారిఫ్ షాక్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, ప్రపంచ వాణిజ్య రంగాన్ని మరోసారి కదిలించారు. మెక్సికోతో పాటు యూరోపియన్ యూనియన్ సభ్య దేశాల నుంచి దిగుమతి అయ్యే పలు వస్తువులపై 30 శాతం దిగుమతి సుంకాలను విధించనున్నట్లు ప్రకటించారు.

Pulsar N150: పల్సర్ N-150కి గుడ్‌బై చెబుతున్న బజాజ్‌.. ఎందుకంటే?

ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ బజాజ్‌ ఆటో తన పల్సర్ N150 మోటార్‌సైకిల్‌ను మార్కెట్‌ నుంచి వైదొలిగించనుంది.

Bihar: బిహార్‌లో ఓటర్ల సర్వే సంచలనం.. బంగ్లాదేశ్‌, నేపాల్‌, మయన్మార్‌ దేశస్థుల గుర్తింపు! 

బిహార్‌లో శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండగా, ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది.

Vivo: వాటర్‌ప్రూఫ్‌ ఫోన్ కావాలా.. 50ఎంపీ కెమెరాలతో వివో సరికొత్త ఎక్స్200 ఎఫ్‌ఈ వచ్చేస్తోంది!

వివో కంపెనీ తన తాజా టెక్నాలజీతో రూపొందించిన రెండు ప్రీమియం ఫోన్లను జూలై 14న, సోమవారం భారతదేశంలో విడుదల చేయనున్నది.

Teenmaar Mallanna: కవితపై అనుచిత వ్యాఖ్యలు.. మల్లన్న ఆఫీస్‌ను ధ్వంసం చేసిన కార్యకర్తలు!

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో జాగృతి కార్యకర్తలు తీవ్ర ఆగ్రహోద్రేకంతో గురువారం మేడిపల్లి ప్రాంతంలోని తీన్మార్ మల్లన్న (చిరుమర్తి శ్రీనివాస్) కార్యాలయంపై దాడికి దిగారు.

Rajya Sabha:రాష్ట్రపతి కీలక నిర్ణయం..  రాజ్యసభకు నలుగురు ప్రముఖుల నామినేషన్‌

రాజ్యసభకు నలుగురు ప్రముఖులను నామినేట్ చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక నిర్ణయం తీసుకున్నారు.

Hemant Soren: సోరెన్ పార్టీకి సైబర్ షాక్‌.. జేఎంఎం 'ఎక్స్' ఖాతా హ్యాక్‌!

ఝార్ఖండ్ ముక్తీ మోర్చా (జేఎంఎం) అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా హ్యాక్‌కు గురైంది. ఈ విషయాన్ని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ధృవీకరించారు.

Pakistan: విమాన ప్రయాణంలో 'సర్ప్రైజ్'.. కరాచీ బదులుగా జెడ్డా వెళ్లిన ప్రయాణికుడు

విమాన ప్రయాణాల్లో వింత సంఘటనలు జరగడం కొత్త కాదు. అయితే తాజాగా పాకిస్థాన్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన మాత్రం షాకింగ్ అని చెప్పొచ్చు.

Pashamylaram: పాశమైలారంలో మరో భారీ అగ్ని ప్రమాదం

ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిన సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీ అగ్ని ప్రమాదం నుంచి ఇంకా ప్రజలు తేరుకోకముందే, అదే ప్రాంతంలో మరో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

USA:అమెరికాలో పంజాబ్ గ్యాంగ్‌స్టర్ బటాలా సహా 8 మంది భారతీయులు అరెస్టు

అమెరికాలో హింస, బెదిరింపుల కేసుల్లో భారతీయ మూలాలున్న 8 మందిని అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన పంజాబ్ గ్యాంగ్‌స్టర్ల సంబంధాలను మరోసారి ప్రపంచ దృష్టికి తీసుకొచ్చింది.

Srikalahasti: హత్యకేసులో జనసేన శ్రీకాళహస్తి ఇన్‌ఛార్జి వినుత అరెస్ట్‌!

చైన్నైలోని కూవం నది వద్ద గుర్తించిన ఓ యువకుడి మృతదేహం కేసు తెలుగురాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది.

IND vs ENG:  క్రాలీకి 'ఆస్కార్' ఇవ్వండి బాబోయ్.. చప్పట్లతో సమాధానం ఇచ్చిన టీమిండియా ప్లేయర్లు!

లీడ్స్ వేదికగా జరుగుతున్న భారత్-ఇంగ్లండ్ మూడో టెస్ట్‌ ఉత్కంఠభరితంగా, ఉద్వేగాల నడుమ కొనసాగుతోంది.

TamilNadu: తమిళనాడులో గూడ్స్‌ రైలులో మంటలు.. ఐదు వ్యాగన్లు దగ్ధం!

తమిళనాడులోని తిరువల్లూరు సమీపంలో ఆదివారం తెల్లవారుజామున తీవ్ర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

Mega DSC: డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. తుది కీ, వెరిఫికేషన్ షెడ్యూల్ విడుదల!

ఆంధ్రప్రదేశ్‌ మెగాడీఎస్సీ-2025 పరీక్షలు గత నెలలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించారు.

India T20 Series Win: చివరి బంతికి ఓటమి.. అయినా సిరీస్ భారత్‌దే!

ఇంగ్లండ్‌తో జరిగిన ఐదవ, చివరి టీ20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు చివరి బంతికి పరాజయం పాలైనప్పటికీ, సిరీస్‌ను 3-2తో గెలుచుకుని చారిత్రక విజయాన్ని అందుకుంది.

Kota Srinivasa Rao Death : 'అరేయ్ ఒరేయ్ అని పిలిచేవాడివి'.. లైవ్‌లో ఏడ్చేసిన బ్రహ్మనందం

ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు మృతి నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది.

US: రూ.7 లక్షల కోట్ల టారిఫ్ భారంతో అమెరికా కంపెనీలకు కఠిన పరీక్ష

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన టారిఫ్ ప్రణాళికలు ఆ దేశంలోని ప్రముఖ కంపెనీలపై భారీ ఆర్థిక భారం మోపే అవకాశముందని తాజా విశ్లేషణలు హెచ్చరిస్తున్నాయి.

KOTA : రాజకీయాల్లోనూ కోట స్పెషల్‌ మార్క్‌.. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపు!

టాలీవుడ్‌కు తీరని లోటు చోటుచేసుకుంది. సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు (83) ఈ తెల్లవారుజామున 4 గంటలకు కన్నుమూశారు.

Kota Srinivasa Rao: తెలుగు సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు (83) ఈరోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో కన్నుమూశారు.

12 Jul 2025


Air India Plane Crash report: పైలట్లు లేకుండానే దర్యాప్తు..? AAIB నివేదికపై ALFA తీవ్ర అసంతృప్తి

అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(AAIB)విడుదల చేసిన ప్రాథమిక నివేదికను ఎయిర్‌లైన్స్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ALFA)తీవ్రంగా వ్యతిరేకించింది.

Delhi: ఏపీకి అరుదైన గౌరవం.. ఐదు నగరాలకు స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులు!

కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌కు అరుదైన గౌరవం దక్కింది. రాష్ట్రంలోని ముఖ్యమైన నగరాలు ఈ అవార్డులను సాధించాయి.

TTD: నిరుద్యోగ వేద పండితులకు నెలకు రూ. 3 వేలు భృతి.. ఆనం రాంనారాయణరెడ్డి ప్రకటన!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేద పండితుల సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 590 మంది వేద పండితులు ప్రస్తుతం నిరుద్యోగంగా ఉన్నారని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి తెలిపారు.

Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ దాడులు.. 600 డ్రోన్లు, క్షిపణులతో ఐదు నగరాలపై యుద్ధవాతావరణం

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మరింత తీవ్రతరమయ్యాయి. ఇటీవల కీవ్‌ నగరంలో ఉన్న ఆయుధ పరిశ్రమలపై మాస్కో భారీ స్థాయిలో వైమానిక దాడులకు పాల్పడింది.

Allu Arjun: ఒకే సినిమాలో నాలుగు పాత్రలు.. అల్లు అర్జున్ నుంచి మాస్, క్లాస్, ఎమోషన్‌ ట్రీట్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ చిత్రం 'AA 22' (వర్కింగ్ టైటిల్) గురించి ఇప్పటికే ఇండస్ట్రీలో పెద్ద ఎక్స్‌పెక్టేషన్ నెలకొంది.

IIM Calcutta: ఐఐఎం కోల్‌కతా అత్యాచార కేసులో మలుపు.. బాధితురాలి తండ్రి సంచలన ప్రకటన

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM-Calcutta)లో చదువుతున్న ఓ విద్యార్థినిపై జరిగిన లైంగికదాడి కేసు కీలక మలుపు తిరిగింది.

Shubman Gill: ఇంగ్లండ్ గడ్డపై కొత్త చరిత్ర.. కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన గిల్!

టీమిండియా యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుత ప్రదర్శనతో ఫాన్స్‌ను ఉత్సాహానికి గురిచేస్తున్నాడు.

IIM Calcutta: ఐఐఎం కోల్‌కతాలో కలకలం.. బాయ్స్ హాస్టల్‌లో విద్యార్థినిపై అత్యాచారం 

పశ్చిమ బెంగాల్‌లో మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించిన వరుస ఘటనలు వెలుగుచూస్తున్న నేపథ్యంలో తాజాగా కోల్‌కతాలో మరో దారుణం బయటపడింది.

Iran: ఇరాన్‌లో సంచలనం.. బాలికపై హత్యాచారం చేసిన దోషికి బహిరంగంగా ఉరిశిక్ష

ఒక బాలికను హత్యాచారం చేసిన ఘోర కేసులో దోషిగా తేలిన వ్యక్తికి ఇరాన్‌ అధికారులు బహిరంగంగా మరణశిక్షను అమలు చేశారు.

Insomnia problem: పిల్లల్లో నిద్రలేమి లక్షణాలు ఏంటో తెలుసా? ఇలా గుర్తించండి, నివారించండి!

పిల్లలు సరిగ్గా నిద్రపోకపోతే వారి మానసిక, శారీరక అభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతుంది.

Tata discounts: హారియర్‌ ఈవీపై రూ.1 లక్ష డిస్కౌంట్‌.. టాటా ఈవీలకు భారీ ఆఫర్లు!

ప్ర‌ముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్‌ తన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలపై విశేష డిస్కౌంట్‌లు ప్రకటించింది.

Shubhanshu: భూమికి రాక అనంతరం శుభాంశు శుక్లాకు ఏడురోజుల క్వారంటైన్‌

యాక్సియం-4 మిషన్‌ లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకు వెళ్లిన భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా, ఇతర ముగ్గురు వ్యోమగాములు జులై 14న భూమికి తిరిగిరానున్నారు.

R Narayana murthy : ప్రజల కోసమే జీవితం.. రియల్ హీరో నారాయణమూర్తి హాస్పిటల్‌కు తన పేరు కూడా పెట్టలేదు!

తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నఆర్.నారాయణమూర్తి, మళ్లీ ఓ మానవీయ అంశాన్ని వెండితెరపై ఆవిష్కరించేందుకు సిద్ధమయ్యారు.

Radhika Yadav Murder: టెన్నిస్ కోర్ట్ నుంచి ట్రాజెడీ వరకు.. రాధికా యాదవ్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి! 

దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన టెన్నిస్ క్రీడాకారిణి రాధికా యాదవ్ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Janasena Party: డ్రైవర్ హత్య కేసు.. జనసేన ఇంఛార్జ్ పార్టీ నుంచి బహిష్కరణ!

శ్రీకాళహస్తి జనసేన ఇన్‌ఛార్జిగా కొనసాగిన వినూత కోటాపై పార్టీ అధికారికంగా బహిష్కరణ వేటు వేసింది. ఆమెను పార్టీ నుంచి తొలగిస్తున్నట్టు జనసేన ప్రకటనలో వెల్లడించింది.

Bengaluru Stampede: ఆర్సీబీ ర్యాలీ ట్రాజెడీ.. తొక్కిసలాటకు కారణం ఎవరో స్పష్టం చేసిన కమిషన్!

ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ తొక్కిసలాటపై న్యాయ విచారణ నివేదిక బయటపడింది.

Air India Flight: టేకాఫ్ తర్వాతే దుర్ఘటన.. ఇంజన్లు షట్‌డౌన్, ఫ్యూయల్ కట్‌ఆఫ్‌!

ఘోర విషాదానికి దారితీసిన ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) విడుదల చేసిన ప్రాథమిక నివేదిక కీలక విషయాలను వెల్లడించింది.

Gold Rate: మళ్లీ లక్షకు చేరువలో బంగారం ధర.. ఒక్క రోజులో రూ.4వేలు పెరిగిన వెండి!

కొంతకాలం తగ్గుముఖం పట్టిన తర్వాత బంగారం ధరలు మరోసారి పెరుగుదల దిశగా దూసుకుపోతున్నాయి.

Autonomous Satellites: భారత్‌ రక్షణలో విప్లవాత్మక అడుగు.. 2027లో నిఘా శాటిలైట్‌ సమూహం ప్రయోగం!

దేశ రక్షణ రంగంలో భారతదేశం కీలక ముందడుగు వేస్తోంది. తొలిసారిగా స్వయంప్రతిపత్తి కలిగిన నిఘా ఉపగ్రహాల సమూహాన్ని అభివృద్ధి చేస్తున్నది.

Rajinikanth: రిటైర్‌మెంట్‌ తర్వాత 'వేల్పారి' పుస్తకం పూర్తి చేస్తా : రజనీకాంత్‌

ఎస్. వెంకటేశన్‌ రచించిన ప్రసిద్ధ చారిత్రక నవల 'వేల్పారి'కి విశేష పాఠకాదరణ లభించిన నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం చెన్నైలో ప్రత్యేక సాహితీ కార్యక్రమం నిర్వహించారు.

North Korea: ఉక్రెయిన్‌ సంచనల ఆరోపణలు.. రష్యా ఆయుధాల్లో 40శాతం ఉత్తరకొరియానే!

ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న యుద్ధంలో రష్యాకు ఉత్తర కొరియా భారీ మద్దతు అందిస్తోంది.

China: ఒక చేప కోసం కీలక నిర్ణయం.. 300 డ్యామ్‌లను కూల్చిన చైనా

పర్యావరణ పరిరక్షణ కోసం చైనా కీలక చర్యలకు పాల్పడుతోంది. దేశంలో ఇప్పటివరకు 300 డ్యామ్‌లను కూల్చివేసింది.

Jasprit Bumrah: లార్డ్స్‌లో చెలరేగిన బుమ్రా.. ఎందుకు మౌనంగా ఉన్నాడో తెలుసా? 

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ప్రతిష్టాత్మక మూడో టెస్టులో భారత పేసర్‌ జస్ప్రీత్ బుమ్రా మరోసారి తన శైలి చూపించాడు.

Shivarajkumar: 'పెద్ది' సినిమాలో శివన్న దుమ్ము దులిపే లుక్‌ విడుదల

రామ్‌ చరణ్‌ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న భారీ సినిమా 'పెద్ది' నుంచి శనివారం ఓ స్పెషల్‌ అప్‌డేట్‌ వచ్చింది.

Adani group: ఆరోగ్య రంగంలోకి అడుగుపెట్టిన అదానీ.. 'హెల్త్‌కేర్‌ టెంపుల్స్‌' ప్రారంభానికి శ్రీకారం

ప్రముఖ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్‌ అధిపతి గౌతమ్‌ అదానీ ఆరోగ్య సంరక్షణ రంగంలోకి అడుగుపెట్టారు.

AP Liquor Scam: అన్నీ ఆ ముఠానే చేసిందే.. నాకు అధికారమే లేదు.. రజత్‌ భార్గవ వాంగ్మూలం ఇదే!

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బెవరేజస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (APSBCL) కేంద్రంగా జరిగిన భారీ మద్యం కుంభకోణంపై కీలకంగా మారిన విశ్రాంత ఐఏఎస్‌ అధికారి రజత్‌ భార్గవను ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) శుక్రవారం విచారించింది.

Rashmika Mandanna: ప్రేమిస్తే మార్పు తప్పదు.. రష్మిక బోల్డ్‌ స్టేట్‌మెంట్‌

వరుస చిత్రాలతో తన క్రేజ్‌ను నిలబెట్టుకుంటున్న నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న మరోసారి వార్తల్లోకెక్కారు.

Dhavaleswaram: గోదావరిలో పెరుగుతున్న వరద ఉద్ధృతి.. ధవళేశ్వరం వద్ద అధికారులు అప్రమత్తం!

తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం సమీప గోదావరి నదిలో వరద ప్రవాహం తీవ్రంగా పెరుగుతోంది. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం 10 అడుగులకు చేరుకుంది.

IMD: విపత్తుల అంచనాలో కొత్త అధ్యాయం.. INSAT-4 శాటిలైట్లతో సాంకేతిక విప్లవం

భూ తాపం, వాతావరణ మార్పులు ప్రపంచ వ్యాప్తంగా ప్రజల జీవన విధానాలను, ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.

Alzheimers: చైనాలో అల్జీమర్స్‌ శస్త్రచికిత్స నిలిపివేత.. ఆరోగ్య శాఖ కీలక ఆదేశాలు!

అల్జీమర్స్‌ వ్యాధికి చికిత్సగా చైనాలో ఇటీవల ప్రాచుర్యం పొందిన ఒక శస్త్రచికిత్సా విధానంపై అక్కడి ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

Plane Crash: అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంపై AAIB నివేదిక విడుదల.. పైలట్ల మధ్య చివరి సంభాషణ ఇదే!

జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై 'ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో' (AAIB) 15 పేజీలతో కూడిన ప్రాథమిక నివేదికను విడుదల చేసింది.

'X' Subscription: వినియోగదారులకు ఊరట.. 'X' సబ్‌స్క్రిప్షన్ ఛార్జీల్లో భారీగా తగ్గింపు!

సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ 'X' (మాజీ ట్విటర్) భారత వినియోగదారులకు శుభవార్త అందించింది.