26 Jun 2023
దేశంలోనే తొలిసారిగా నీటి అడుగున రైలు, రోడ్డు మార్గం.. బ్రహ్మపుత్ర కింద సొరంగం ఏర్పాటు
భారత దేశంలోనే ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ మల్టీ మోడల్ కారిడార్‌ను కేంద్రం నిర్మించబోతోంది. ఇందుకోసం ఈశాన్య భారత్ లోని అస్సాంను వేదికగా చేసుకోనుంది.
కేసీఆర్‌ను గద్దె దించేందుకే కాంగ్రెస్‌లోకి.. పొంగులేటి
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సహా 35 మంది బీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు ముహూర్తం ఖరారైంది.
మాతో మాట్లాడితే ఇక్కడితో వదిలేస్తాం, లేకుంటే సల్మాన్ ఖాన్‌ను చంపేస్తాం : గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్
ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామని కెనడియన్ గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. ముందస్తు రిజర్వేషన్ చార్జీలు తగ్గింపు
ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ అందించింది. తెలంగాణలోని సుదూర ప్రాంతాల ప్రయాణికులకు ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ముందస్తు రిజర్వేషన్ రేట్లను యాజమాన్యం తగ్గించింది.
బెంగళూరులో ఆఫీస్‌ను విక్రయించేందుకు సిద్ధమవుతున్న ఇంటెల్; దాని విలువ ఎన్ని వందల కోట్లంటే!
ప్రముఖ టెక్ దిగ్గజం ఇంటెల్ సంస్థ "హైబ్రిడ్-ఫస్ట్" మోడల్‌లో తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నందున బెంగళూరు కార్యాలయాన్ని విక్రయించాలని యోచిస్తోందని ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది.
Womens Ashes Series : యాషెస్ టెస్టులో ఆస్ట్రేలియా భారీ విజయం
ఆసీస్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఏకైక మహిళల టెస్టు రసవత్తరంగా సాగింది.
సినీ ఫక్కిలో భారీ చోరీ.. దిల్లీలో గన్నులతో బెదిరించి డబ్బులతో జంప్
ద్విచక్ర వాహనాలపై వచ్చి కారును అడ్డగించిన దోపిడీ దొంగలు, గన్నులతో బెదిరించి డబ్బుల సంచిని దోచుకెళ్లారు. ఈ ఘటన దేశ రాజధాని దిల్లీలో చోటు చేసుకుంది.
చాట్‌జీటీపీ లాంటి ఇంటర్‌ఫేస్‌ను రెడీ చేసే పనిలో నాసా
అమెరికాకు చెందిన నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్( నాసా) అంతరిక్ష మిషన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ని భాగం చేసే పనిలో నిమగ్నమైంది.
అంగారక గ్రహం మీదకు మనుషులను పంపే ప్రయత్నం: వన్ ఇయర్ ప్రోగ్రామ్ ని మొదలెట్టిన నాసా
అంగారక గ్రహం మీద మానవుల ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం అంగారక గ్రహం మీదకు మనుషులను పంపేందుకు నాసా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే అంగారక గ్రహం పరిస్థితులను భూమీద సృష్టించి వ్యోమగాములకు అంగారక పరిస్థితులను అలవాటు చేయిస్తోంది.
జింబాబ్వే విధ్వంసం.. వన్డేలో 408 పరుగులతో 14 ఏళ్ల రికార్డు బద్దలు
వరల్డ్‌కప్ క్వాలిఫైయర్ మ్యాచులో జింబాబ్వే దుమ్ములేపుతోంది. సొంత గడ్డపై జరుగుతున్న మ్యాచుల్లో సంచలన ఇన్నింగ్స్‌లు ఆడి రికార్డు సృష్టిస్తోంది.
ఆమె ఎంతోమంది షర్మిలలను సృష్టించాలి.. అందుకే కారును గిఫ్ట్‌గా ఇస్తున్నానన్న కమల్ హాసన్
తమిళనాడులోని కొయంబత్తూర్ లో తొలి మహిళా బస్సు డ్రైవర్ షర్మిల అంశం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ ఘటనపై ప్రముఖ నటుడు కమల్ హాసన్ స్పందించారు. ఈ ఘటన పట్ల తాను చాలా బాధపడ్డానని చెప్పారు.
2024 సీ-హెచ్ఆర్ ఎస్‌యూవీ రివీల్ చేసిన టయోటా.. ఫీచర్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే!
దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టయోటా 2024 సీ-హెచ్ఆర్ ఎస్‌యూవిని తాజాగా ఆవిష్కరించింది. యూరప్ లో ఇప్పటికే ఈ మోడల్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ ఎస్‌యూవీ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం
పొంగులేటి, జూపల్లి సహా తెలంగాణ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ సమావేశం
పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహా పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్దమైంది.
తెలంగాణలో కొత్తగా మరో 3 డిగ్రీ కళాశాలకు అటానమస్ హోదా.. మొత్తం 14కు చేరిన స్వయంప్రతిపత్తి కాలేజీలు
తెలంగాణలో కొత్తగా మరో 3 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు అటానమస్ హోదా దక్కించుకున్నాయి. ఆయా కాలేజీలు న్యాక్ - ఏ గ్రేడ్‌ను సాధించుకోవడంతో యూజీసీ స్వయంప్రతిపత్తి హోదాను కల్పించింది.
వన్డే వరల్డ్ కప్ 2023కి కేన్ విలియమ్సన్ సిద్ధం!
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఐపీఎల్ 16వ సీజన్‌లో గాయపడిన విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు నెలలు ఆటకు దూరమైన అతను, ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నాడు.
మణిపూర్‌లో పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది: సీఎం బీరేన్ సింగ్
ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్ దిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మణిపూర్‌లో పరిస్థితిపై అమిత్ షాకు బీరెన్ సింగ్ వివరించారు.
భాగ్ సాలే ట్రైలర్: కేసీఆర్ కు తెలంగాణ ఇష్టం, నాకు నువ్వు ఇష్టం; ఇంట్రెస్టింగ్ గా సాగిన ట్రైలర్
మత్తువదలరా చిత్రంతో వెండితెరకు పరిచయమైన కీరవాణి కొడుకు శ్రీ సింహా, ప్రస్తుతం భాగ్ సాలే అంటున్నాడు. నేహా సోలంకి హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ ఈరోజు విడుదలైంది.
రెండు రోజుల పాటు ముంబైలో కుంభవృష్టి.. ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ
ముంబై సహా మహారాష్ట్ర తీర ప్రాంతంలో భారీ వర్షాలు కురవనున్నాయి. రాగల 2 రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ఈ మేరకు ఆరెంజ్ అలెర్జ్ ను సైతం జారీ చేసింది.
పాట్నలో సమావేశమైన ప్రతిపక్ష కూటమిని 'వాగ్నర్ గ్రూప్' గా పోల్చిన ఉద్ధవ్ ఠాక్రే
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతిపక్షాల కూటమిని రష్యా కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్‌తో ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన పత్రిక సామ్నా సంపాదకీయం పేర్కొంది.
ఐదు సెషన్లు ఆడితే ఆరు ఇంజెక్షన్లు తీసుకున్నాను.. చివరి టెస్టుపై ఇషాంత్ కామెంట్స్
టీమిండియా బౌలర్‌గా ఇషాంత్‌శర్మ ఎన్నో ఏళ్ల పాటు సేవలందించాడు. ముఖ్యంగా టెస్టుల్లో సుదీర్ఘంగా ఆడి టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
నైరుతి విస్తరణతో దేశమంతటా భారీ వర్షాలు.. వరదలో చిక్కుకున్న హిమాచల్ వాసులు
నైరుతి రుతుపవనాలు క్రమంగా దేశమంతటా విస్తరిస్తుండటంతో పలు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి.
త్రిపురలో జరిగే 14దేవతల పండగ కర్చీపూజ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు
ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో ఖర్చీపూజ పండగను పెద్ద ఎత్తున జరుపుతారు. దీన్ని 14దేవతల పండగ అని కూడా పిలుస్తారు.
రాత్రి అంతా పార్టీ చేసుకొని.. తెల్లారి 250 రన్స్ కొట్టిన కోహ్లీ
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతర్జాతీయ క్రికెట్‌లో అనేక రికార్డులతో పాటు భారత జట్టు ఛేజింగ్ మాస్టర్, రన్ మెషీన్‌గా ప్రసిద్ధికెక్కాడు.
హిమాచల్ ప్రదేశ్: కొండచరియలు విరిగిపడటంతో 11కిలోమీటర్లు నిలిచిపోయిన ట్రాఫిక్; వందల మంది రోడ్లపైనే
హిమాచల్ ప్రదేశ్‌లో ఆదివారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో జనజీవనం స్తంభించిపోయింది.
స్పై సినిమాకు పెరిగిన టిక్కెట్ ధరలు: ఏ ప్రాంతంలో ఎంత పెరిగిందంటే?
కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో విజయం దక్కించుకున్న యంగ్ హీరో నిఖిల్, స్పై పేరుతో పాన్ ఇండియా సినిమాను తీసుకొస్తున్నాడు.
కోహ్లీలా దూకుడును పెంచుకోవాలి.. రోహిత్ శర్మకు పాక్ మాజీ క్రికెటర్ సూచన
టీమిండియా జట్టు వచ్చే నెలలో వెస్టిండీస్ పర్యటనకు బయలుదేరనుంది. ఈ పర్యటనలో భారత జట్టు టెస్టు, వన్డే, టీ20 మ్యాచులను ఆడనుంది. దీంతో పాటు టెస్టు జట్టుకు వైస్‌కెప్టెన్‌గా రహానే, వన్డే జట్టుకు వైస్ కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యాను ఎంపిక చేశారు.
రికార్డుస్థాయిలో రూ.2 లక్షల కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ బకాయిలు
ప్రస్తుతం క్రెడిట్ కార్డుల వినియోగం కూడా విపరీతంగా పెరిగింది. చేతిలో ఉంది కదా అని, ప్రతి అవసరానికి క్రెడిట్ కార్డును గీకేస్తున్నారు.
విటిలిగో: చర్మంపై తెల్లటి మచ్చలు ఏర్పడే పరిస్థితిపై జనాల్లో ఉన్న అపోహాలు
చర్మంపై తెల్లటి మచ్చలు ఏర్పడటాన్ని విటిలిగో అంటారు. ఇది ఆటో ఇమ్యూన్ సమస్య.
ఒకటో నెంబర్ ప్లాట్‌ఫామ్‌పై నిరీక్షిస్తున్న ప్రయాణికులు.. మరో ప్లాట్‌ఫామ్‌పై నుంచి జారుకున్న రైలు
ఓ రైల్వే స్టేషన్ సిబ్బంది అనౌన్స్ మెంట్ ఇవ్వకపోవడంతో వందలాది ప్రయాణికులు ట్రైన్ మిసయ్యారు.
మేఘాలయ: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అవుట్‌పోస్ట్‌పై దాడి: ఐదుగురి గాయాలు
మేఘాలయలోని తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో సరిహద్దు ఔట్‌పోస్ట్‌పై ఆదివారం రాత్రి గ్రామస్థులు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు బీఎస్ఎఫ్ సిబ్బందితో సహా మొత్తం ఐదుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు.
ఓలా ఎస్1 కంటే కొమాకి SE ఎంతో బెటర్.. ఫీచర్లు చూస్తే ఇప్పుడే కొనేస్తారు..!
ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ కంపెనీ కొమాకి రేంజ్ ఎకో, స్పోర్ట్, స్పోర్ట్ పెర్ఫార్మెన్స్ అనే 3 వేరియంట్లను కలిగి ఉంది.
తలపతి విజయ్, లియో సినిమా బృందంపై కేసు నమోదు: నా రెడీ పాటే కారణం
తలపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో లియో పేరుతో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుండి విజయ్ పుట్టినరోజు (జూన్ 22) సందర్భంగా నా రెడీ పాటను రిలీజ్ చేసారు.
దేశంలోనే పొడవైన స్కైవాక్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్.. ట్రాఫిక్ కష్టాలకు చెక్
దేశంలోనే అత్యంత పొడవైన ఉప్పల్ స్కైవాక్ ను తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ట్రాఫిక్ సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు నాలుగేళ్ల క్రితం దీని నిర్మాణం మొదలుపెట్టారు.
భారతీయ రైల్వే 'షవర్ సౌకర్యం'; ఏసీ కోచ్ పైకప్పు లీక్ కావడంపై నెటిజన్లు ఫైర్
ప్యాసింజర్ రైలు కోచ్ పైకప్పు నుంచి నీరు కారుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఎంఎస్ ధోనీ ఎఫెక్టు.. ఆ గేమ్‌కు 3 గంటల్లోనే 30 లక్షల డౌన్‌లోడ్స్
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మైదానంలోనే కాకుండా బయట కూడా ప్రశాంతంగా ఉండే ఈ మిస్టర్ కూల్ ఫ్లైట్‌లో ఓ గేమ్ ఆడాడు. ప్రస్తుతం ఆ వీడియో 3 గంటల్లోనే 30 లక్షల డౌన్ లోడ్స్ కావడం విశేషం.
డ్యూటీ అవర్స్ ముగిశాయని ఫ్లైట్ నడపనన్న పైలట్.. విమానంలోనే 350 మంది ప్రయాణికులు
ఎయిర్ ఇండియా విమానం మరో వివాదాస్పద ఘటనకు తావిచ్చింది. ప్రయాణికులతో నిండి ఉన్న విమానంలోకి ఎక్కేందుకు పైలెట్ నిరాకరించారు.
ఆర్థిక వ్యవస్థపై రూ.2,000నోట్ల ఉపసంహరణ ప్రభావం ఉండదు: ఆర్‌బీఐ గవర్నర్
రూ.2000 నోటును ఉపసంహరించుకోవడం వల్ల ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు.
ఈ వారం థియేటర్లలో రిలీజ్ అవుతున్న తెలుగు సినిమాల లిస్టు
ఈ వారం తెలుగు బాక్సాఫీసు వద్ద ఆసక్తికరమైన వినోదం కనిపించనుంది. అన్నీ చిత్రాలే అయినప్పటికీ ఇంట్రెస్టింగ్ కథాంశాలతో వస్తున్నాయి. ఆ సినిమాలేంటో తెలుసుకుందాం.
తెలంగాణలో రూ.3500 కోట్లతో మెగా పెట్టుబడులు.. త్వరలోనే షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం : లులూ సంస్థ
ఫుడ్ ప్రాసెసింగ్, ఎగుమతుల రంగాల్లో మెగా పెట్టుబడికి తెలంగాణ వేదిక కానుంది. ఈ మేరకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మరో పెద్ద కంపెనీ ముందుకొచ్చింది.
భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న స్నేహితుడి గొంతు కోసి, రక్తం తాగాడు
కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ జిల్లాలో దారుణం జరిగింది. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తన స్నేహితుడి గొంతు కోసి, రక్తాన్ని తాగేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
జకోవిచ్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి అల్కరాజ్.. గ్రాస్ కోర్టుపై తొలి టైటిల్
టెన్నిస్‌లో నయా సంచలనంగా పేరొందిన కార్లోస్ అల్కరాజ్ మరో టైటిల్‌ను సాధించి సత్తా చాటాడు. క్వీన్స్ క్లబ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో గెలిచి తొలి గ్రాస్ కోర్టు టైటిల్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఓజీ సినిమా షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్: ఈ సంవత్సరంలోనే రిలీజ్ అయ్యేలా ప్లాన్?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాహో దర్శకుడు సుజిత్ కాంబినేషన్లో వస్తున్న ఓజీ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
గుండెపోటుతో రాజ్యసభ సభ్యుడు హరద్వార్ దూబే కన్నుమూత
భారత దేశ రాజకీయాల్లో మరో విషాదం జరిగింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన భాజపా సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు హరద్వార్ దూబే కన్నుమూశారు.
ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ విజేతగా మహారాష్ట్ర
ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ తొలి సీజన్లో మహరాష్ట్ర ఐరన్ మెన్ జట్టు విజేతగా అవరతరించింది.
అంతర్జాతీయ మాదకద్రవ్యాలు దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం గురించి తెలుసుకోవాల్సిన విషయాలు
ప్రతి ఏడాది జూన్ 26వ తేదీన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం జరుపుతున్నారు.
సూపర్ సిక్స్‌లో శ్రీలంక.. వరల్డ్ కప్‌లో ఆడే ఆ రెండు జట్లు ఏవో..?
జింబాబ్వే వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ క్యాలిఫయర్ లీగ్ దశలో శ్రీలంక వరుసగా హ్యాట్రిక్ విజయాలను సాధించింది. దీంతో ఆరు పాయింట్లతో సూపర్ సిక్స్ కు అర్హత సాధించింది.
భారత్-అమెరికా స్నేహం ప్రపంచంలోనే అత్యంత కీలకమైనది: బైడెన్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో తమ వ్యూహాత్మక సాంకేతిక భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించేందుకు రెండు దేశాలు అనేక ప్రధాన ఒప్పందాలపై సంతకాలు చేశాయని యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు.
అన్నదాతలకు గుడ్ న్యూస్.. నేటి నుంచి రైతుబంధు నిధులు విడుదల,పోడు రైతులకూ వర్తింపు
నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులను తెలంగాణ ప్రభుత్వం జమ చేయనుంది. ఈ మేరకు అర్హులైన రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీ ప్రక్రియను చేపట్టింది.
వందేమాతరం రచయిత బంకించంద్ర ఛటర్జీ గురించి ఎక్కువ మందికి తెలియని విషయాలు
భారత జాతీయ గీతం జనగణమన అయితే జాతీయ గేయం(నేషనల్ సాంగ్) వందేమాతరం. ఈ పాటను బంకించంద్ర ఛటర్జీ రచించారు.
దులీప్ ట్రోఫీలో వెస్ట్‌జోన్ జట్టుకు ఆడనున్న పుజారా, సూర్య
గత నెలలో వెస్టిండీస్‌తో జరిగే టెస్టు సిరీస్ కోసం టీమిండియా జట్టులో ఛతేశ్వర్ పుజారా, సూర్యకుమార్ యాదవ్‌కు స్థానం కల్పించలేదు. దీంతో దేశవాళీ టోర్నీ దులిప్ ట్రోఫీలో వెస్ట్ జోన్ జట్టు తరుపున వీరిద్దరూ ఆడనున్నారు.
500 వాహనాల భారీ కాన్వాయ్ తో మహారాష్ట్రకు సీఎం కేసీఆర్..దారిపొడవునా ఫ్లెక్సీల హోరు
మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ విస్తరణ చేపట్టేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఉవ్విళ్లూరుతున్నారు. ఇందులో భాగంగానే నేటి నుంచి 2 రోజుల పాటు మరాఠీ గడ్డపై పర్యటించనున్నారు.
దేవర నుండి లేటెస్ట్ అప్డేట్: ఆ ఫైట్ సీన్ కంప్లీట్
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న దేవర సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతుంది. మొదలు కావడంలో చేసిన ఆలస్యం, షూటింగ్ లో చేయడం లేదు.
INDvsWI: టీ20 జట్టులోకి తెలుగు తేజం.. ఇక విండీస్ బౌలర్లకు చుక్కలే!
వచ్చే నెలలో భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. జులై 12 నుంచి మొదలయ్యే ఈ పర్యటనలో టీమిండియా, వెస్టిండీస్‌తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లను ఆడనుంది. అయితే టీ20 జట్టులో చాలా మార్పులు చేయాలని బీసీసీఐ భావిస్తోంది.
ఒడిశాలో పెండ్లి బస్సు- ఆర్టీసీ బస్సు ఢీ; 12మంది దుర్మరణం
ఒడిశాలో ఘోర ప్రమాదం జరిగింది. ఒడిశా స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్(ఓఎస్‌ఆర్‌టీసీ) బస్సు- పెళ్లి బృందంతో వస్తున్న ప్రైవేట్ బస్సు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి.
సలార్ సినిమాకు అనుకోని దెబ్బ: పృథ్వీరాజ్ కు యాక్సిడెంట్
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ సినిమాలో మళయాలీ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నటుడు పృథ్వీరాజ్ కు యాక్సిడెంట్ అయ్యింది.
జూన్ 26న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
ఇక కోర్టులోనే పోరాటం; ఆందోళన విరమించిన రెజ్లర్లు
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన భారత అగ్రశ్రేణి రెజ్లర్లు ఈ వ్యవహారాన్ని ఇక కోర్టులోనే తేల్చుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఆందోళలను విరమిస్తున్నట్లు ప్రకటించారు.
25 Jun 2023
బీజేపీ మీటింగ్‌లో కాల్పుల కలకలం; కార్యకర్తకు గాయాలు
బిహార్‌లోని మాధేపురా జిల్లా మురళిగంజ్‌లో జరిగిన బీజేపీ మీటింగ్‌లో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటనలో బీజేపీ కార్యకర్తకు గాయాలయ్యాయి.
15గంటల్లో 286 మెట్రో స్టేషన్లలో ప్రయాణం; దిల్లీ వ్యక్తి గిన్నిస్ రికార్డు
కేవలం 15గంటల్లోనే దిల్లీలోని అన్ని మెట్రో స్టేషన్లలో ప్రయాణించి ఓ వ్యక్తి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించాడు.
'ఆర్డర్ ఆఫ్ ది నైల్': ప్రధాని మోదీకి ఈజిప్ట్ అత్యున్నత పురస్కారం
ఈజిప్ట్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ బిజీబిజీగా గడుపుతున్నారు.
రష్యాలో ఏం జరుగుతోంది? వాగ్నర్ గ్రూప్ పుతిన్‌పై ఎందుకు తిరుగుబాటు చేసింది? తర్వాత ఎందుకు వెనక్కి తగ్గింది?
గత రెండు రోజులుగా రష్యాలో హైడ్రామా నడిచింది. పుతిన్ ప్రైవేట్ సైన్యం వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ రష్యాలో తిరుగుబాటుకు దిగారు. కీలక ప్రాంతాలను కూడా ఆక్రమించారు. అనూహ్యంగా ఒక్కరోజులోనే బెలారస్ మధ్యవర్తిత్వంతో తిరుగుబాటుకు ప్రిగోజిన్ తెరదింపారు.
జూన్ 25న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
పశ్చిమ బెంగాల్: బంకురాలో రెండు గూడ్స్ రైళ్లు ఢీ
పశ్చిమ బెంగాల్ బంకురాలోని ఓండా రైల్వే స్టేషన్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది.