ఆ 5 నదుల అనుసంధానంతో ఏపీ సుభిక్షం: చంద్రబాబు
తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. 'సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి' కార్యక్రమంలో భాగంగా పలు ప్రాజెక్టులను సందర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లాలోకి చంద్రబాబు ప్రవేశించారు.
గద్దర్ మరణంపై ఆర్.నారాయణ మూర్తి దిగ్భ్రాంతి.. ఒక శకం ముగిసిందని ఆవేదన
తెలంగాణ ప్రజల ఉద్యమ గొంతుక, ప్రజాగాయకుడు గద్దర్ మరణంపై ఆర్.నారాయణమూర్తి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజా వాగ్గేయకారుల్లో మరో శకం ముగిసిందని ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఫ్రెండ్‌షిప్‌డే స్పెషల్ : డెలివరీ బాయ్ అవాతారం ఎత్తిన జొమాటో సీఈఓ
జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ స్నేహితుల దినోత్సవం సందర్భంగా డెలివరీ బాయ్ అవతారమెత్తారు. ఈ మేరకు రెడ్ టీ షర్ట్ ధరించారు. అనంతరం తన రాయల్ ఎన్ఫీల్డ్ వాహనంపై ఫుడ్ డెలివరీలు అందించేందుకు బయల్దేరారు. ఈ క్రమంలో అతని చేతిలో ఫ్రెండ్‌షిప్ బ్యాండ్స్ ఉండటం విశేషం.
కూతురు ఆరోగ్యంపై బిపాస బసు ఎమోషనల్.. క్లిష్ట సమయాన్ని ఎదుర్కొన్నట్లు వెల్లడి
బాలీవుడ్ బ్యూటీ బిపాసా బసు భావోద్వేగానికి గురయ్యారు. నటుడు కరణ్ సింగ్‌ను పెళ్లి చేసుకున్న బిపాస, ఇటీవలే పాపకు జన్మనిచ్చారు. దీనికి సంబంధించి తాజాగా ఇన్స్టాలో ఓ వీడియోను పంచుకున్నారు.
2030నాటికి 10కొత్త కార్ల విడుదలకు మారుతీ సుజుకి ప్లాన్
జపాన్ దిగ్గజ ఆటోమేకర్ మారుతి సుజుకీ కొత్త మోడళ్లపై ఫోకస్ పెట్టింది. కార్ల మార్కెట్‌లో తన మార్కెట్‌ను పెంచుకునేందుక, ఇతర కంపెనీలకు పోటీగా 10కొత్త కార్లను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది.
ఏ పార్టీకి పిండం పెట్టాలో ప్రజలు నిర్ణయిస్తారు; కాంగ్రెస్‌పై కేసీఆర్ ఫైర్
కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ ఘాటు విమర్శలు చేశారు.ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం ఎందుకు చేయాల్సి వచ్చిందో అసెంబ్లీ వేదికగా వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వక తప్పని పరిస్థితి వచ్చినందుకే ప్రత్యేక రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇచ్చిందన్నారు.
పాకిస్థాన్: పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు; 22 మంది మృతి
పాకిస్థాన్‌లో ఆదివారం ఘోర రైలు ప్రమాదం జరిగింది. రావల్పిండికి వెళ్లే హజారా ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో 10బోగీలు బోల్తాపడ్డాయి. ఈ ప్రమాదంలో 22మంది మరణించారు. 80మంది గాయపడ్డారు.
తెలంగాణ ప్రభుత్వంపై బండి సంజయ్ హాట్ కామెంట్స్.. రూ.లక్ష కోట్ల కోసమే ఆర్టీసీ విలీనమని ఆరోపణ
తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Gaddar Passed Away: ముగబోయిన ఉద్యమ గళం.. గద్దర్ కన్నుమూత
ప్రజా యుద్ధనౌక, ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గద్దర్ ఆదివారం తుదిశ్వాస విడిచారు.
పాకిస్థాన్ అమ్మాయి, ఇండియా అబ్బాయి.. ఆన్‌లైన్‌లో పెళ్లి చేసుకున్న వధువరులు
పాకిస్థాన్ అమ్మాయి, భారత అబ్బాయి శనివారం ఆన్‌లైన్‌లో పెళ్లి చేసుకున్నారు. పెద్దల అంగీకారంతో అమీనా, అర్బాజ్ ఖాన్ జంట పెళ్లి పీటలెక్కింది.
హర్యానాలో నాలుగో రోజు కీలక కూల్చివేతలు.. హోటల్ భవనాన్ని పడగొట్టిన బుల్డోజర్
హర్యానాలోని నుహ్ జిల్లాలో నాలుగో రోజూ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అల్లర్లకు కారణంగా నిలిచిన సహారా హోటల్‌ను ఆదివారం బుల్డోజర్లు నేలమట్టం చేశాయి. ఈ బిల్డింగ్ పై నుంచే అల్లరి మూకలు మతపరమైన ఊరేగింపుపై రాళ్ల దాడికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.
తెలంగాణ: టీఎస్‌ఆర్‌టీసీ బిల్లుకు గవర్నర్ తమిళసై ఆమోదం
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఉక్రెయిన్ విషయంలో అదే జరిగితే భారత్ సంతోషానికి అవధులుండవు: దోవల్
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ఇండియా కీలక వ్యాఖ్యలు చేసింది. ఇరుదేశాలు ఘర్షణ విధానానికి స్వస్తి పలికితే అంతకు మించిన సంతోషం భారత్‌కు మరోటి లేదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రకటించారు. సమస్యలను చర్చలు, దౌత్య మార్గాలతోనే పరిష్కరించాలనేది తమ విధానమని వెల్లడించారు.
మరోసారి వివాదాస్పదమైన ఇండిగో.. ఏసీ లేకుండానే గాల్లోకి లేచిన విమానం
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో మరో వివాదానికి కేంద్ర బిందుగా మారింది. చండీగఢ్ నుంచి జైపుర్‌కు శనివారం బయల్దేరిన విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
లోకల్ ట్రైన్‌లో బాంబు పెట్టామంటూ ముంబై పోలీసులకు ఫోన్ కాల్
ముంబైలోని లోకల్ ట్రైన్‌కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ట్రైన్‌లో బాంబులు పెట్టినట్లు ముంబై పోలీసులకు ఆదివారం ఉదయం కంట్రోల్ రూమ్‌కి ఈ కాల్ వచ్చింది. దీంతో ముంబై పోలీసులు అప్రమత్తయ్యారు.
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. 6.4 లక్షల గ్రామాలకు ఇంటర్నెట్ అనుసంధానం
భారతదేశంలోని లక్షలాది గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని చిట్టచివరి గ్రామానికి సైతం ఇంటర్నెట్ సేవలు అందించేందుకు భారత ప్రభుత్వం నడుం బిగించింది.
PM Modi: 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్లను అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం శంకుస్థాపన చేశారు.
చైనాలో భారీ భూకంపం.. 10 మందికి గాయాలు
చైనాలో ఆదివారం తెల్లవారుజామున భారీగా భూమి కంపించింది. బీజింగ్‌కి 300 కి.మీ దూరంలోని డెజౌలో 2.33 గంటలకు భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.5గా నమోదైనట్లు ఎర్త్‌క్వేక్ నెట్‌వర్క్స్ సెంటర్ ప్రకటించింది.
స్నేహితుల దినోత్సవం వేళ విషాదం.. కారు ప్రమాదంలో ముగ్గురు మిత్రులు మృతి
స్నేహితుల దినోత్సవం వేళ ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కారు అదుపు తప్పి వంతెన నుంచి పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్నేహితులు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు గాయపడ్డారు.
Happy Friendship Day 2023: విలసిల్లుతున్న ఆన్‌లైన్ స్నేహం
వేడుక, ఆనందం, బాధ ఎలాంటి అనుభూతిని అయినా పంచుకోవడానికి ప్రతి ఒక్కరికి ఓ ఫ్రెండ్ అనేవాడు ఉంటాడు. ఫ్రెండ్‌షిప్ అనేది మన జీవితాలను సుసంపన్నం చేసే అమూల్యమైన బంధం.
నేడు భారత్ వెస్టిండీస్ రెండో టీ20.. విజయమే లక్ష్యంగా బరిలో దిగుతున్న టీమిండియా
టీమిండియా- వెస్టిండీస్ మధ్య ఆదివారం రెండో టీ 20 మ్యాచ్ జరగనుంది.కేవలం 4 పరుగుల తేడాతో తొలి మ్యాచ్‌లో ఓడిన భారత జట్టు, ఆదివారం జరిగే పోరులో నెగ్గాలని పట్టుదలతో ఉంది. ఈ మేరకు జట్టులోకి మరో బ్యాటర్‌ను అదనంగా తీసుకోవాలని భావిస్తోంది.
మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. ఇంతకీ పేరు ఏం పెట్టిందో తెలుసా?
గోవా బ్యూటీ, హీరోయిన్ ఇలియానా తల్లిగా ప్రమోషన్ పొందారు.. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. తన పుత్రుడి ఫోటోతో పాటు పేరునూ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఆగస్టు 6న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
ఆగస్టు 6వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Chandrayaan-3: చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్ -3; ఈ నెల 23న జాబిల్లిపై మిషన్ ల్యాండింగ్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-3 ప్రయోగం కీలక దశకు చేరుకుంది.
బీజేపీ ఎంపీ రామ్ శంకర్ కతేరియాకు రెండేళ్ల జైలుశిక్ష; అనర్హత వేటు పడే అవకాశం
2011లో జరిగిన దాడి కేసులో బీజేపీ ఎంపీ రామ్ శంకర్ కతేరియాకు ఆగ్రా కోర్టు శనివారం రెండేళ్ల జైలు శిక్ష విధించింది.
తెలంగాణలో సంక్షేమం తప్ప సంక్షోభం లేదు; అసెంబ్లీలో మంత్రి కేటీఆర్
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. ఈ మేరకు పల్లె, పట్టణ ప్రగతిపై శనివారం ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడారు. తెలంగాణలో సంక్షేమం తప్ప, సంక్షోభం లేదని తేల్చి చెప్పారు.
టీమిండియాకు గుడ్ న్యూస్.. 140 కి.మీ ఫాస్ట్ బౌలింగ్ ఎదుర్కొంటున్న రిషబ్ పంత్
టీమిండియాకు గుడ్ న్యూస్ అందింది. వికెట్ కీపర్, స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ కు సంబంధించి తాజా అప్‌డేట్ వచ్చింది. ఈ మేరకు నేషనల్ క్రికెట్ అకాడమీలో పంత్ ప్రాక్టీస్ ప్రారంభించాడు.
'రూల్స్ రంజన్' నుంచి అప్డేట్.. రేపు 'ఎందుకురా బాబు' సాంగ్ రిలీజ్
రూల్స్ రంజన్ చిత్రానికి సంబంధించి మరో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి ఎందుకురా బాబు అనే పాటను ఆదివారం రిలీజ్ చేయనున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది.
టీటీడీ బోర్డు కొత్త సారథిగా భూమన కరుణాకర్ రెడ్డి నియమాకం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి నూతన ఛైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ ఎంపిక చేశారు. ప్రస్తుత బోర్డు పదవీకాలం ఆగస్ట్ 8తో పూర్తి కానుంది.
విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో అరుదైన శస్త్ర చికిత్స.. యువతి పొట్టలో వెంట్రుకల చుట్ట తొలగింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ యువతికి పొట్టలో భారీగా వెంట్రుకలున్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ మేరకు ఆపరేషన్ చేసి చుట్టుకున్న వెంట్రుకలను తొలగించారు.
Oils for Hair: మీ జుట్టు పెరుగుదల, ఆరోగ్యానికి ఈ నూనెలు వాడండి
విపరీతమైన కాలుష్యం, పోషకాహార లోపం వంటి కారణాలతో చిన్న వయసులోనే ఈరోజుల్లో జట్టు రాలిపోవడం పరిపాటిగా మారింది. కొన్ని ఆయిల్స్‌ను జుట్టుకు పట్టించడం ద్వారా మీ వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి. జట్టు ఊడిపోవడం కూడా తగ్గుతుంది. అవేంటో ఏంటో ఇప్పుడు చూద్దాం.
అమ్మవారి ఆలయంలో దొంగతనం.. దుర్గాభవాని ఆభరణాలతో పాటు సీసీటీవీ కెమెరాలు చోరీ
హైదరాబాద్‌లోని అమ్మవారి ఆలయంలో భారీ దొంగతనం జరిగింది.
వినియోగదారులకు ఉల్లి షాక్.. ఆగస్ట్ చివరి నాటికి కిలో ఉల్లి రూ.70పైనే!
భారతదేశంలో ఉల్లిగడ్డ ధరలు భారీగా పెరగనున్నాయి. ఈ మేరకు క్రిసిల్ మార్కెట్ అంచనా వేసింది. ఆగస్ట్ ఆఖరు నాటికి దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు కిలో రూ. 70కి చేరే అవకాశం ఉందని క్రిసిల్ మార్కెట్ తాజా నివేదికలో ప్రకటించింది.
మైమరపించే కంగనా రనౌత్ అందం.. 'చంద్రముఖి 2' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
జాతీయ అవార్డు గ్రహీత కంగనా రనౌత్ చాలా ఏళ్ల తర్వాత ఓ సౌత్ సినిమాలో నటిస్తోంది.
గవర్నర్ తమిళిసైతో ఆర్టీసీ కార్మీక యూనియన్ కీలక చర్చలు.. త్వరలోనే బిల్లుకు గ్రీన్ సిగ్నల్
టీఎస్ఆర్టీసీ బిల్లు-2023పై తెలంగాణ గవర్నర్ సానుకూలంగా స్పందించారు. బిల్లులోని 5 అంశాలపై ఇప్పటికే తమిళిసై ప్రభుత్వ వివరణ కోరారు. తాజాగా ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులతో ఆమె చర్చలకు ముందుకొచ్చారు.
నూహ్‌లో బుల్డోజర్ యాక్షన్.. మెడికల్ షాపులు, దుకాణాలు నేలమట్టం
హర్యానాలోని నుహ్‌లో రెండో రోజైన శనివారం కూడా బుల్డోజర్లు రంగంలోకి దిగాయి. ఈ మేరకు అక్రమ కట్టడాల కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. అధికారులు కూల్చుతున్న ఆయా కట్టడాలు అల్లర్లకు పాల్పడ్డ నిందితులకు చెందినవిగా సమాచారం.
Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు భారీ షాక్; తోషాఖానా కేసులో మూడేళ్ల జైలు శిక్ష.. అరెస్టు
తోషాఖానా కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ భారీ షాక్ తగిలింది. ఈ కేసులో ఇమ్రాన్ ఖాన్‌ను ఇస్లామాబాద్ ట్రయల్ కోర్టు దోషిగా తేలింది.
తెలుగు హీరో నుంచి రూ.25కోట్లు తీసుకోవడంపై స్పందించిన సమంత
దక్షిణాది స్టార్ హీరోయిన్ సమంత మైయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే.
ఓలా కీలక నిర్ణయం.. ఇకపై హైదరాబాద్‌లోనూ ప్రైమ్ ప్లస్ సేవలు
ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఓలా మరో కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరులో ప్రయోగాత్మకంగా అమలు చేసిన ప్రైమ్ ప్లస్ సేవలను తాజాగా మరో 3 మహానగరాలకు విస్తరించింది. పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో హైదరాబాద్, ముంబై, పుణె సిటీల్లో శుక్రవారం నుంచే సేవలు అందుబాటులోకి వచ్చాయి.
కోర్టు ప్రాంగణంలో నాలుగో పెళ్లి పంచాయతీ.. లాయర్ భర్తను చితకబాదిన ముగ్గురు భార్యలు
జార్ఖండ్‌లోని ఓ కోర్టులో ఓ భార్త, ముగ్గురు భార్యలకు మధ్య పంచాయితీ మొదలైంది. భర్తను ముగ్గురు సతీమణులు కలిసి చితకబాదిన సంఘటన రాంచీ సివిల్ కోర్టు ప్రాంగణంలో చోటు చేసుకుంది.
మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస; తుపాకీ కాల్పుల్లో ముగ్గురు మృతి, ఇళ్లు దగ్ధం
జాతి ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో శుక్రవారం అర్థరాత్రి మళ్లీ హింస చెలరేగింది. బిష్ణుపూర్ జిల్లాలో సాయుధులు తుపాకులతో రెచ్చిపోయారు.
ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ కీలక వ్యాఖ్యలు.. ఆ అంశాలను బిల్లులో పొందుపర్చాలని ప్రభుత్వానికి సూచన
టీఎస్ఆర్టీసీ బిల్లు-2023పై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. బిల్లులోని పలు అంశాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే పలు సందేహాలకు ప్రభుత్వం నుంచి వివరణ కోరారు.
ఆగస్టు 31నుంచి ముంబైలో 'ఇండియా' కూటమి సమావేశాలు
ఇండియా కూటమి మరోసారి సామావేశం కానుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై వేదికగా రెండు రోజుల పాటు భేటీ కానున్నారు. ఆగస్ట్ 31, సెప్టెంబరు 1న రెండు రోజుల ఈ సదస్సు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
హాలీవుడ్‌లో విషాదం; 'బ్రేకింగ్ బాడ్' నటుడు మార్క్ మార్గోలిస్ కన్నుమూత
హాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు మార్క్ మార్గోలిస్(83) కన్నుమూశారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు శుక్రవారం వెల్లడించారు.
గోల్డ్ మెడల్ గెలిచిన భారత జట్టు.. ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్ కైవసం
ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్ షిప్‌లో భారతదేశానికి మొట్టమొదటి బంగారు పతకం లభించింది. జర్మనీ రాజధాని బెర్లిన్ లో జరిగిన పోటీల్లో వెన్నం జ్యోతి సురేఖ, ప్రణీత్ కౌర్, అదితి గోపీచంద్ స్వామిలతో కూడిన భారత జట్టు అద్భుతమే చేసింది. ఫలితంగా గోల్డ్ మెడల్ ను ఒడిసిపట్టింది.
తెలంగాణలో ముగిసిన ఆర్టీసీ కార్మికుల ధర్నా.. రాజ్‌భవన్ ముట్టడికి ప్లాన్
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన రెండు గంటల ధర్నా ముగిసింది. టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును గవర్నర్ తమిళిసై ఆమోదించకపోవడంపై నిరసిస్తూ విధులను బహిష్కరించారు. ఈ మేరకు దాదాపు రెండు గంటల పాటు బస్సులను నిలిపివేశారు.
Jammu Kashmir: కుల్గామ్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు; ముగ్గురు ఆర్మీ జవాన్లు వీరమరణం
జమ్ముకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో శుక్రవారం ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఉగ్రవాదులతో జరిగిన ఎదుకాల్పుల్లో ముగ్గురు ఆర్మీ జవాన్లు వీరమరణం పొందారు.
ఆగస్టు 5న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
ఆగస్టు 5వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.