12 Aug 2023

పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధానిగా అన్వర్ ఉల్ హక్ కాకర్ నియామకం 

పాకిస్థాన్‌లో జాతీయ అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత తాత్కాలిక ప్రధాన మంత్రిగా బెలూచిస్తాన్ అవామీ పార్టీ‌కి చెందిన అన్వర్ ఉల్ హక్ కాకర్ నియామకమయ్యారు.

'వోడాఫోన్ ఐడియా' యూజర్స్ కోసం స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్‌

భారతదేశంలో మూడో అతిపెద్ద టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా (Vi) 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వేళ వినియోగదారుల కోసం కొత్త ఆఫర్లను ప్రకటించింది.

సూరత్: పట్టపగలే బ్యాంకును దోచుకున్న దొంగలు; వీడియో వైరల్ 

బ్యాంకు దోచుకోవడం ఇంత సులభమా అనిపించే ఘటన గుజరాత్ లోని సూరత్ లో జరిగింది. శుక్రవారం ఉదయం జరిగిన ఈ సంఘటన, సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.

'టైగర్ నాగేశ్వర్‌రావు' నుంచి అప్డేట్.. 17న రవితేజ అభిమానులకు గుడ్‌న్యూస్ 

రవితేజ కెరీర్‌లో మొట్ట మొదటి పాన్ ఇండియా సినిమాగా రూపొందిన చిత్రం టైగర్ నాగేశ్వర్ రావు.

IMD: ఈ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు; ఐఎండీ హెచ్చరికలు జారీ 

దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం హెచ్చరికలు జారీ చేసింది.

ఇన్‌స్టాలో ఒక్కో పోస్టుకు 11.45కోట్లు వసూలు చేయడంపై కోహ్లీ రియాక్షన్  

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి సోషల్ మీడియాలో 256మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇన్‌స్టా‌లో విరాట్ కోహ్లీ ఒక్క పోస్టుకు 11.45కోట్లు సంపాదిస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మీడియా సపోర్టు కోరిన హీరో శ్రీ విష్ణు  

విజయ్ రాజ్ కుమార్, నేహా పఠానీ హీరో హీరోయిన్లుగా ఎన్వీఆర్ ప్రొడక్షన్స్, SIDS క్రియేటివ్ వరల్డ్ బ్యానర్ పై రూపొందిన చిత్రం 'ఏం చేస్తున్నావ్'.

'సర్జికల్ స్ట్రైక్‌'తోనే మణిపూర్ సమస్య పరిష్కారం: ఎన్‌పీపీ 

మణిపూర్‌లో 'అక్రమ వలసదారులు, మిలిటెంట్ల' సమస్య పరిష్కరానికి 'సర్జికల్ స్ట్రైక్' వంటి సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పిపి) నాయకుడు ఎం. రామేశ్వర్ సింగ్ అన్నారు.

Tata Motors: టాటా మోటార్స్ మరో మైలురాయి : లక్షఈవీ వాహనాల విక్రయం 

మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. పెద్ద కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిలో దూసుకుపోతున్నాయి.

భర్త చేతిలో హత్యకు గురైన బీజేపీ నాయకురాలు: మృతదేహం కోసం పోలీసుల గాలింపు 

ఇటీవల మహారాష్ట్ర నాగ్‌పూర్‌కు చెందిన బీజేపీ ఐటీ సెల్ నాయకురాలు సనాఖాన్ మిస్సింగ్ కేసు ఆగస్టు 1వ తేదీన పోలీసుల ముందుకు వచ్చింది.

పంచాయితీ ఎన్నికల్లో హింస.. టీఎంసీపై ప్రధాని మోదీ విమర్శలు

పశ్చిమ బెంగాల్‌లో పంచాయితీ ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాకాండ నేపథ్యంలో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు.

ఇండస్ట్రీలో 63ఏళ్ళు పూర్తి చేసుకున్న కమల్: శృతి హాసన్ ఎమోషనల్ పోస్ట్ 

లోకనాయకుడు కమల్ హాసన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నేటితో 63ఏళ్ళు పూర్తయ్యింది. ఈ సందర్భంగా సినిమా పరిశ్రమకు చెందిన సెలెబ్రిటీలు కమల్ హాసన్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

'దిల్లీ సర్వీసెస్ బిల్లు'కు రాష్ట్రపతి ఆమోదం; దేశ రాజధానికి ఇక కొత్త చట్టం

దిల్లీ సర్వీసెస్ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్రవేశారు. దీంతో బిల్లు దిల్లీ సర్వీసెస్ చట్టంగా మారింది.

భారత నేర న్యాయ వ్యవస్థ ప్రక్షాళన దిశగా కేంద్రం.. 377 సెక్షన్ రద్దుకు ప్రతిపాదన 

భారతదేశ నేర న్యాయ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళించేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది.

ప్రపంచ ఏనుగుల దినోత్సవం: ఏనుగులు మాట్లాడుకుంటాయని మీకు తెలుసా? 

ఈ భూమి మీద నడిచే అతిపెద్ద జంతువు ఏనుగు. నీళ్ళలో ఉండే తిమింగళాలను వదిలేస్తే భూమి మీద నడిచే జంతువుల్లో అతిపెద్దది ఏనుగు.

పుణెలో ఘోర ప్రమాదం: ఏడేళ్ల బాలుడిని ఈడ్చుకెళ్లిన కారు 

మహారాష్ట్ర పుణెలో ఘోర ప్రమాదం జరిగింది. స్కూటర్ మీద వెళ్తున్న ఏడేళ్ల బాలుడు, ఇంకా అతని తల్లిని ఒక కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లికి తీవ్ర గాయాలయ్యాయి.

అమెరికా: లహైనా నగరాన్నికమ్మేసిన కార్చిచ్చు: 67కు చేరిన మృతుల సంఖ్య 

అమెరికాలోని హవాయి దీవులకు సుందర దీవులని పేరు. ఆ సుందర దీవుల్లో ఇప్పుడు గందరగోళం నెలకొంది. హావాయి దీవుల్లోని మౌయి దీవిలో కార్చిచ్చు కారణంగా ప్రజలకు ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడ్డాయి.

WI vs IND: భారత జట్టుకు పరీక్షగా మారిన నాలుగో టీ20; అందరి కన్ను అతని మీదే 

వెస్టిండీస్‌తో టీమిండియా ఆడుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచులు పూర్తయ్యాయి.

అంతర్జాతీయ యువజన దినోత్సవం 2023: చరిత్ర, తెలుసుకోవాల్సిన విషయాలు 

ప్రతీ సంవత్సరం ఆగస్టు 12వ తేదీన అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటారు.

IIFM Awards 2023: : సీతారామం చిత్రానికి అవార్డు; మృణాల్ ఠాకూర్‌కు ప్రత్యేక పురస్కారం 

ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ 2023 అవార్డుల్లో సీతారామం సినిమాకు ఉత్తమ చిత్రంగా అవార్డు లభించింది.

Tirumala: తిరుమలలో విషాదం.. చిరుత దాడిలో చిన్నారి మృతి 

తిరుమల తిరుపతి కొండపై విషాదం చోటు చేసుకుంది. తిరుమలలోని అలిపిరి గుండా నడక మార్గంలో శుక్రవారం అర్థరాత్రి ఓ చిన్నారి(6)పై చిరుతపులి దాడి చేసింది. దీంతో బాలిక మృతి చెందినట్లు పోలీసులు శనివారం తెలిపారు.

Uttarakhand: రుద్రప్రయాగ్‌లో విరిగిపడ్డ కొండచరియలు; ఐదుగురు యాత్రికులు మృతి 

ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలోని చౌకీ ఫాటా పరిధిలోని తర్సాలి వద్ద ఘోర ప్రమాదం జరిగింది.

ఆగస్టు 12న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

ఆగస్టు 12వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

11 Aug 2023

ప్రేరణ: పెద్ద విజయం వైపు సాగే ప్రయాణంలో చిన్న విజయాలను సెలెబ్రేట్ చేసుకోవడం మర్చిపోకండి 

ఏదో ఒకటి సాధించకపోతే ఈ జీవితం ఎందుకు? మనిషిగా పుట్టినందుకు ఏదైనా గొప్పది సాధించాలని ఎంతోమంది చెబుతారు. గొప్ప కలలను కన్నప్పుడే గొప్ప పనులు చేయగలుగుతారని అంటారు.

ఒకరోజులో ఎన్ని అడుగులు నడవాలి? ఎన్ని అడుగులు నడిస్తే ఎంత మేలు జరుగుతుంది? 

నడక ఆరోగ్యానికి మంచిదని అందరూ చెబుతారు. అయితే ఎన్ని కిలోమీటర్లు నడవాలి, ఒకరోజులో ఎన్ని అడుగులు వేయాలనే విషయంలో ప్రతి ఒక్కరూ ఒక్కోరకంగా సమాధానం చెబుతారు.

కుదేలైన చైనా దిగ్గజ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ.. 57 వేల కోట్ల భారీ నష్టం

ప్రపంచంలోనే బలమైన దేశాల్లో ఒకటిగా నిలిచిన చైనా ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ఈ మేరకు డ్రాగన్ దేశంలో స్థిరాస్తి రంగం కుదేలైంది.

Ather 450S: మార్కెట్లోకి ఏథర్ ఎంట్రీ లెవల్ స్కూటర్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 115 కిలోమీటర్లు

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు రోజు రోజుకు డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో ఏథర్ ఎనర్జీ సంస్థ మరో కొత్త ఈవీని లాంచ్ చేసింది.

మణిపూర్: అస్సాం రైఫిల్స్ అంశంపై ప్రధానికి మైతీ, కుకీ ఎమ్మెల్యేల లేఖలు

మణిపూర్ రాష్ట్రంలో అస్సాం రైఫిల్స్ అంశంపై రగడ కొనసాగుతోంది. ఈ మేరకు కుకీ, మైతీ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ప్రధాన మంత్రి మోదీకి లేఖలు రాశారు.

ఆప్ ఎంపీపై సస్పెన్షన్ వేటు.. కారణమిదే?

ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రఘవ్ చద్దాను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు. నలుగురు ఎంపీల సంతకాలను ఫోర్జరీ చేశారని ఆరోపణలను రావడంతో రఘవ్ చద్దాపై వేటు పడింది.

వెకేషన్ నుండి ఇండియాకు తిరిగొచ్చిన మహేష్ బాబు: గుంటూరు కారం సెట్లో ఎప్పుడు జాయిన్ అవుతున్నారంటే? 

సూపర్ స్టార్ మహేష్ బాబు గత నెల వెకేషన్ కోసం విదేశాలకు వెళ్లారు. స్కాట్లాండ్ లో తన 48వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న మహేష్ బాబు, ప్రస్తుతం ఇండియాకు కుటుంబంతో సహా వచ్చేసారు.

జీఎస్టీ సవరణ బిల్లుకు లోక్‌సభ గ్రీన్ సిగ్నల్.. క్యాసినోపై 28 శాతం పన్ను

జీఎస్టీ సవరణ బిల్లు - 2023కి లోక్‌సభ పచ్చజెండా ఊపింది. దీంతో ఆన్‌లైన్‌ గేమింగ్‌, క్యాసినో, గుర్రపు పందేలు 28 శాతం పన్ను శ్లాబులోకి వచ్చేశాయి.

దేశద్రోహ చట్టాన్ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం

వలసవాద కాలం నాటి దేశద్రోహి చట్టాన్ని పూర్తిగా రద్దు చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో పేర్కొన్నారు.

ఎల్లప్పుడూ ప్రశాంతంగా, కామ్ గా ఉండేవారి అలవాట్లు ఎలా ఉంటాయో తెలుసుకోండి 

ఇప్పుడున్న పరిస్థితుల్లో టెన్షన్లు, కంగారు, కోపం లేకుండా ఉండటం కష్టమైపోయింది. ఆఫీసులో వర్క్ టెన్షన్, ఇంట్లో ఇంకేదో టెన్షన్. ఆఫీసు, ఇల్లు ఒక దగ్గరైతే మరేదో కంగారు.

పోలీసుల ఆంక్షల మధ్య రుషికొండకు బయల్దేరిన పవన్.. రోడ్లను దిగ్భంధించిన పోలీసులు

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మూడో విడత వారాహి యాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మళ్లీ వేడెక్కిస్తున్నాయి.

చైనాను ముంచెత్తుతున్న భారీ వరదలు.. 29 మంది మరణం, 16 మంది మిస్సింగ్

చైనాను భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాల ధాటికి చైనాలోని హెబెయ్‌ ప్రావిన్స్‌లో భారీ వరదలు సంభవించాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లో ప్రాణ నష్టం జరిగింది.

Shakib Al Hasan: వన్డే వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ కెప్టెన్‌గా షకీబ్ అల్ హసన్

బంగ్లాదేశ్ వన్డే కెప్టెన్‌గా షకీబ్ అల్ హసన్ వ్యవహరించనున్నారు. ఈ మేరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హసన్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

పెళ్ళికి ముందు శృంగారంలో పాల్గొనడం తప్పు కాదు: ఆర్జీవీ హీరోయిన్ శ్రీ రాపాక 

రామ్ గోపాల్ వర్మ ఎంత బోల్డ్ గా సమధానాలు చెబుతారో అందరికీ తెలిసిందే. రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన శ్రీ రాపాక కూడా అంతే బోల్డ్ గా సమాధానాలు ఇచ్చారు.

కేంద్రంపై మండిపడ్డ రాహుల్ గాంధీ.. మీడియా,లోక్‌సభ, రాజ్యసభ టీవీలను నియంత్రిస్తున్న కేంద్రం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్రప్రభుత్వంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

స్పిరిట్ నుండి తాజా అప్డేట్: మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలిసిపోయింది? 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం సలార్, కల్కి 2898 AD, స్పిరిట్, మారుతి దర్శకత్వంలోని రాజాడీలక్స్ సినిమాలు ఉన్నాయి.

Dhoni: ఎంఎస్ ధోని క్రేజ్ అంటే ఇదే.. వేలంలో రికార్డు ధర పలికిన మహీ బ్యాట్

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన ఆట తీరుతో ప్రపంచం నలువైపులా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు.

'శిక్షించేందుకే బ్రిటీష్ ఆ చట్టాలను తెచ్చింది.. పౌరుల హక్కుల రక్షణ కోసం సరికొత్త చట్టాలు' 

భారతదేశంలో నేర సంబంధిత అంశాలపై న్యాయ వ్యవస్థలో కీలక మార్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.

Anosmia: వాసన పసిగట్ట లేకపోవడమనే వ్యాధి గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు 

కోవిడ్ 19 సమయంలో చాలామంది వాసన పసిగట్టలేక ఇబ్బంది పడ్డారు. కోవిడ్ 19 సోకడం వల్ల వాసన పసిగట్ట లేకపోవడం, రుచి తెలియకపోవడం సంభవించింది.

YS Sharmila :కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్న వైఎస్ షర్మిల.. పార్టీ విలీనానికి ముహూర్తం ఫిక్స్..? 

తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపించడమే తన లక్ష్యమంటూ వైఎస్ షర్మిల పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే.

Virat Kohli: ఇన్‌స్టాలో కోహ్లీ ఒక్క పోస్టు పెడితే రూ.11.45 కోట్లు

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీకి కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు.

నిస్సాన్ కార్ కంపెనీ నుండి ఎలక్ట్రికల్ వెహికిల్ అరియా వచ్చేస్తోంది: ఇండియాలో ఎప్పుడు లాంచ్ కానుందంటే? 

నిస్సాన్ కంపెనీ ఇండియాలో అరియా(ARIYA EV) ఎలక్ట్రికల్ వాహనాన్ని తీసుకురానుంది. ఈ మేరకు భారతదేశంలో టెస్టింగ్ జరిగింది. అన్నీ కుదిరితే 2024లో మనదేశంలో లాంచ్ కానుంది.

రాహుల్ గాంధీపై బీజేపీ పాట.. ప్రేమ మనసులో ఉంటుంది, దుకాణాల్లో కాదు

కేంద్ర ప్రభుత్వంపై ఇండియా కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా కాంగ్రెస్‌ పై ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం.. నడిరోడ్డుపై బీజేపీ నేతను కాల్చి చంపిన ప్రత్యర్థులు

ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. సంభాల్‌ కు చెందిన బీజేపీ నేతను పాశవికంగా హత్య చేశారు.

ఆసియా కప్ 2023: ఈ టోర్నీలో వీరి ఆట చూడాల్సిందే!

ఆసియా కప్ 2023 టోర్నమెంట్‌కు పాకిస్థాన్, శ్రీలంకలు ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ టోర్నీలో తొమ్మిది మ్యాచులు శ్రీలంకలో, నాలుగు మ్యాచులు పాకిస్థాన్‌లో జరగనున్నాయి. ఈసారి ఆసియా కప్ వన్డే ఫార్మాట్లో జరగనుంది.

సుప్రీంకోర్టు మెగా బదిలీలు.. రాహుల్‌ గాంధీకి స్టే నిరాకరించిన ఆ జడ్జి బదిలీ

పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి విధించిన రెండేళ్ల శిక్ష నిలుపుదలకు నిరాకరించిన గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ హేమంత్‌ ప్రచక్‌ బదిలీ అయ్యారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

Tilak Varma : వన్డే వరల్డ్ కప్‌లో తిలక్ వర్మకు చోటు లభిస్తుందా.. మాజీ క్రికెటర్ల అభిప్రాయం ఇదే!

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరుపున సత్తా చాటిన తిలక్ వర్మ, పొట్టి ఫార్మాట్లోనూ అద్భుతంగా రాణిస్తున్నారు.

భోళాశంకర్ రివ్యూ: చిరంజీవి నటించిన సినిమా ఎలా ఉందంటే? 

నటీనటులు: చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ తదితరులు

Ronald : ఇన్ స్టా‌గ్రామ్‌లో సరికొత్త రికార్డు సృష్టించిన క్రిస్టియానో రోనాల్డ్

పోర్చుగల్ ఫుట్ బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డ్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

శ్రీవారి మ్యూజియానికి టీటీడీ భూమి పూజ.. రూ.145 కోట్లతో అత్యాధునిక భవనానికి శ్రీకారం

తిరుమల సన్నిధిలో ఎస్వీ మ్యూజియం నిర్మాణం కోసం పూజ భూమి జరిగింది.

ఇకపై ట్విట్టర్ లో వీడియో కాల్స్, పేమెంట్స్: ఎలా పనిచేస్తాయంటే? 

ఎక్స్ (ఒకప్పుడు ట్విట్టర్) లో కొత్త కొత్త ఫీఛర్స్ అందుబాటులోకి రానున్నాయి.

అగ్రదేశాల్లో మరోసారి కరోనా కలకలం.. వేగంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

అంతర్జాతీయంగా కొవిడ్ వ్యాప్తి మళ్లీ మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఎరిస్ కరోనా వేరియంట్ మరోసారి విజృంభిస్తోంది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా టూర్ ప్లాన్ చేస్తున్నారా? బెంగళూరు దగ్గర్లోని చూడాల్సిన ప్రదేశాలు ఇవే 

స్వాతంత్ర దినోత్సవం దగ్గరలోనే ఉంది. ఈ సమయంలో ఆఫీసులకు వెళ్ళేవారికి లాంగ్ వీకెండ్ అవకాశం దొరుకుతోంది. కాబట్టి ఎక్కడికైనా టూర్ ప్లాన్ చేస్తే బాగుంటుందని ప్రతీ ఒక్కరికీ అనిపిస్తుంది.

పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు.. కేసీఆర్ హర్షం

తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పాలమూరు-రంగారెడ్డి పర్యావరణ అనుమతులకు నిపుణుల కమిటీ ఆమోదముద్ర వేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పాలమూరు బిడ్డల దశాబ్దాల కలను సాకారం చేసే తీపీ కబురు కేంద్రం నుంచి అందింది.

రసాభసాగా పార్లమెంట్.. నేటితో ముగియనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు-2023

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు-2023 నేటితో ముగియనున్నాయి. జులై 20న ప్రారంభమైన సమావేశాలు తొలి రోజుల్లో వాయిదాల పర్వం కొనసాగింది.

Air India New Logo: ఎయిర్ ఇండియాకు నయా లోగో.. ఎలా ఉందంటే?

ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసినప్పుడు నుంచి టాటా గ్రూప్ వివిధ మార్పులకు శ్రీకారం చూడుతోంది.

Hero Vishal: లక్ష్మీ మీనన్ తో పెళ్ళి వార్తలపై స్పందించిన విశాల్ 

హీరో విశాల్ తెలుగువారే అయినా తమిళంలో సినిమాలు చేస్తుంటారు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పేరుతో సొంతంగా సినిమాలు తీస్తూ ఉంటారు.

సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన ఆదిపురుష్: స్ట్రీమింగ్ ఎక్కడంటే? 

ప్రభాస్ రాముడిగా, క్రితిసనన్ సీతగా నటించిన ఆదిపురుష్ సినిమా జూన్ 16న థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది.

ఏపీ గవర్నర్‌ కోటాలో నూతన ఎమ్మెల్సీలు.. పద్మశ్రీ, రవిబాబును నియమిస్తూ ఉత్తర్వులు జారీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా కర్రి పద్మశ్రీ, కుంభా రవిబాబులు నియామకమయ్యారు.

భోళాశంకర్ ట్విట్టర్ రివ్యూ: మెహెర్ రమేష్ కు ఈసారైనా హిట్ దక్కిందా? 

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన భోళాశంకర్ సినిమా ఈరోజు థియేటర్లలో రిలీజైంది. తమన్నా, కీర్తి సురేష్ హీరోయిన్లుగా కనిపించిన ఈ సినిమా ప్రీమియర్లు ఆల్రెడీ పడిపోయాయి.

Shikhar Dhawan: జట్టులో పేరు లేకపోవడంతో షాకయ్యా.. అవకాశం వస్తే నిరూపించుకుంటా : ధావన్

టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ మళ్లీ భారత జట్టు తరఫున ఆడటానికి దాదాపుగా దారులన్నీ మూసుకుపోయాయి.

ప్రపంచ అంతరిక్షంలో కీలక పరిణామం.. గంటల తేడాతో చంద్రుడి మీదకు రష్యా, భారత్ మిషన్లు

ప్రపంచ అంతరిక్ష రంగంలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రష్యాకు చెందిన లూనా-25, ఇండియాకు చెందిన చంద్రయాన్-3 కొన్ని గంటల తేడాతో దాదాపు ఒకే సమయంలో ల్యాండింగ్ కానున్నాయి.

ఆగస్టు 11న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.