23 Aug 2023
చంద్రయాన్ -3 మిషన్ విజయవంతం.. ఇస్రోకు శుభాకాంక్షల వెల్లువ
చంద్రుడి దక్షిణ ధ్రువంపై రోవర్ ను సాఫ్ట్ ల్యాండింగ్ చేయడంతో చంద్రయాన్-3 మిషన్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఈ మేరకు ఇస్రో శాస్త్రవేత్తలతో సహా దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి.
అతి తక్కువ కాలంలోనే తెలంగాణలో గణనీయ అభివృద్ధి: కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం మెదక్ జిల్లాలో కొత్త కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు.
అంతరిక్ష రారాజుగా భారత్.. దక్షిణ ధ్రువంపై కాలుమోపిన ఏకైక దేశంగా రికార్డు
ప్రతిష్టాత్మక చంద్రయాన్-3 ప్రాజెక్టుతో ప్రపంచవ్యాప్తంగా భారత్ సరికొత్త రికార్డును సృష్టించింది. అగ్రరాజ్యాలు, అగ్రదేశాలకు అందని భారీ అంతరిక్ష విజయాన్ని సగర్వంగా అందుకుంది.
చంద్రయాన్-3: చరిత్ర సృష్టించిన భారత్: సెలబ్రిటీల శుభాకాంక్షలు
చంద్రయాన్-3 మిషన్ సక్సెస్ కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. చప్పట్లతో తన ఆనందాన్ని అందరితో పంచుకున్నారు.
దిల్లీలో తప్పిన ఘోరం.. ఒకేసారి 2 విమానాలకు ల్యాండింగ్, టేకాఫ్ క్లియరెన్స్
దిల్లీ విమానాశ్రయంలో తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. 2 విమానాలకు ఒకేసారి ల్యాండింగ్, టేకాఫ్ కోసం ఏటీసీ గ్రీన్ సిగ్నల్ అందింది.
India on the moon: చంద్రయాన్-3 విజయవంతం అభివృద్ధికి చెందిన భారతానికి నాంది: ప్రధాని మోదీ
చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ చంద్రుని దక్షిణ ధృవంపై విజయవంతంగా ల్యాండ్ అయ్యింది. ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశ ప్రజలతో పాటు, ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.
Chandrayaan-3 Timeline: చంద్రయాన్-3 మిషన్‌లో కీలక ఘట్టాలు ఇవే
చంద్రయాన్-3 మిషన్ విజయవంతమైంది. మిషన్‌లోని మిక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై సురక్షితంగా దిగింది. ఈ ప్రయోగం ఆది నుంచి చివరకు ఎంతో ఉత్కంఠగా సాగింది. ప్రతి దశను ఇస్రో విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా.. ఈ మిషన్ సక్సెస్ అయ్యింది. అయితే ఇప్పుడు చంద్రయాన్-3 మిషన్‌లోని కీలక ఘట్టాలను ఇప్పుడు గుర్తు చేసుకుందాం.
Chandrayaan 3 mission successful: సాహో ఇస్రో.. జయహో భారత్.. చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం
చందమామపై రహస్యాలను ఛేదించేందుకు ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైంది.
చంద్రయాన్-3 విజయవంతం.. ప్రయోగం వెనుక ఉన్న కీలక శాస్త్రవేత్తలు వీరే
చంద్రయాన్-3 మిషన్ విజయవంతమైంది. చంద్రుడి దక్షిణ ధృవం మీద అడుగుపెట్టిన మొదటి దేశంగా ఇండియా నిలిచింది.
కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం.. ఏడాదికి రెండు బోర్డ్ ఎగ్జామ్స్
దేశంలో ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించనున్నట్లు కేంద్రం విద్యా మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది.
మాజీ భర్తపై రాఖీ సావంత్ కామెంట్స్ వైరల్: తన న్యూడ్ వీడియోలు అమ్ముకున్నాడని ఆరోపణ
బాలీవుడ్ బ్యూటీ రాఖీ సావంత్ తన భర్త అదిల్ ఖాన్ దురానీపై తీవ్రమైన కామెంట్స్ చేసింది. ప్రస్తుతం అదిల్ ఖాన్ దురానీకి దూరంగా ఉంటున్న ఆమె, తన న్యూడ్ వీడియోలను భర్త అమ్ముకున్నాడని కామెంట్స్ చేసింది.
మీ పెదాలు ముదురు రంగులో ఉన్నాయా? ఈ ఇంటి చిట్కాలతో లేత రంగులోకి మార్చుకోండి
ఒక్కొక్కరికీ ఒక్కో రకమైన చర్మ రంగు ఉన్నట్టే పెదాల రంగు కూడా డిఫరెంట్ గా ఉంటుంది. అయితే కొందరిలో పెదాలు ముదురు రంగులో ఉంటాయి.
ప్రభాస్ సలార్ సినిమాకు అమెరికాలో అదిరిపోతున్న అడ్వాన్స్ బుకింగ్స్: ఆల్రెడీ లక్ష డాలర్లను దాటేసింది
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా విడుదలకు ముందే రికార్డులు తిరగరాస్తోంది. సలార్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్రెడీ అమెరికాలో మొదలైపోయాయి.
చంద్రుడి మీద చంద్రయాన్ 3 ల్యాండింగ్ ఎలా జరుగుతుంది? ఆ సమయంలో ఏం జరుగుతుంది?
చంద్రుడి మీద చంద్రయాన్-3 అడుగుపెట్టే సమయం ఆసన్నమైంది. మరికొద్ది గంటల్లో జాబిల్లి మీద ల్యాండర్ మాడ్యూల్ అడుగుపెట్టనుంది. అయితే చాలామందికి ల్యాండ్ అయ్యే సమయంలో ఏం జరగనుందనేది ఆసక్తిగా అనిపిస్తోంది.
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి వచ్చిన డిజిటల్ లగేజీ నిర్వహణ
తిరుమల శ్రీవారి భక్తుల కోసం మరో కొత్త సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు లగేజీ నిర్వహణ నిమిత్తం నూతన వ్యవస్థకు టీటీడీ శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలోనే BBMS (బాలాజీ బ్యాగేజ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్)ను లాంచ్ చేసింది.
మరోసారి తల్లైనా సెరెనా విలియమ్స్.. భార్యపై అలెక్సిస్ ప్రశంసలు
అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ మరోసారి అమ్మతనాన్ని ఆస్వాదిస్తోంది. రెండోసారి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు ఆమె భర్త, ప్రముఖ పారిశ్రామికవేత్త అలెక్సిస్ ఒహానియన్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
చంద్రయాన్ పాత పేరు ఏంటో తెలుసా? చంద్రయాన్ గా ఎవరు మార్చారో తెలుసుకోండి
మరికొద్ది గంటల్లో చంద్రుడి దక్షిణ ధృవం మీద చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యూల్ అడుగుపెట్టనుంది. ఈ క్రమంలో భారతీయులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
చంద్రయాన్-3పై పాక్ నేత కీలక వ్యాఖ్యలు.. ప్రత్యేక్ష ప్రసారం చేయాలని సూచన
భారత్ ప్రయోగించిన ప్రతిష్టాత్మక చంద్రయాన్-3 మిషన్ పై ప్రపంచ దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ మేరకు పాకిస్థాన్ మాజీ మంత్రి ఫవాద్ ఛౌదరీ ఇస్రో శాస్త్రవేత్తల కృషిని పొగడ్తలతో ముంచెత్తారు.
Heath streak: జింబాబ్వే ఆటగాడు హీత్ స్ట్రీక్ మరణించలేదు, హెన్రీ ట్వీట్ వైరల్
జింబాబ్వే మాజీ క్రికెట్ ఆటగాడు హీత్ స్ట్రీక్ మరణించినట్లు ఉదయం వార్తలు వచ్చాయి. హీత్ స్ట్రీక్ స్నేహితుడు హెన్రీ ఒలెంగా ఆయన మరణించినట్లు ట్వీట్ కూడా చేసారు.
అధ్యక్ష రేసులో మరో భారతీయుడు.. సింగపూర్‌లో థర్మన్ షణ్ముగరత్నం పోటీ
విదేశాల్లో భారత సంతతికి చెందిన వ్యక్తులు రాజకీయంలోనూ దూసుకెళ్తున్నారు. ఇప్పటికే రుషి సునక్ బ్రిటన్ ప్రధాని కాగా వివేక్ రామస్వామి అమెరికా అధ్యక్ష బరిలో నిలుస్తున్నారు.
'2024 KTM 390 డ్యూక్' వర్సెస్ '2024 CFMoto 450NK' బైక్స్ మధ్య తేడాలు తెలుసుకోండి
KTM మోటార్ బైకులకు మార్కెట్లో ఉన్న డిమాండ్ అందరికీ తెలిసిందే. 390డ్యూక్ బైకుని 2013లో KTM లాంచ్ చేసింది.
మిజోరం: రైల్వే వంతెన కూలి 17 మంది కార్మికులు మృతి
మిజోరంలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. సాయిరాంగ్ ప్రాంతానికి సమీపంలో నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన కూలిపోవడంతో కనీసం 17 మంది కార్మికులు మరణించారని పోలీసులు తెలిపారు.
హై బీపీని కంట్రోల్‌లో ఉంచుకోవాలంటే ఈ ఆహారాలను తీసుకోండి
హై బీపీ కారణంగా అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి, గుండె సంబంధ సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. ప్రస్తుతం హై బీపీని కంట్రోల్ లో ఉంచే కొన్ని ఆహారాల గురించి తెలుసుకుందాం.
భారత ఆర్థిక వ్యవస్థపై మోదీ కీలక వ్యాఖ్యలు..5 ట్రిలియన్ డాలర్లుగా ఎదుగుతుందని జోస్యం
దక్షిణాఫ్రికా వేదికగా బ్రిక్స్ సమావేశాలు జరుగుతున్నాయి. సదస్సులో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ భారత ఆర్థిక వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని చెప్పారు.
చంద్రుడి దక్షిణ ధ్రువంపైనే ప్రపంచ దేశాల ఫోకస్.. ఇంతకీ అక్కడ ఏముందో తెలుసా
చందమామపై పరిశోధించే క్రమంలో ప్రపంచ దేశాల అంతరిక్ష సంస్థలు దక్షిణ ధ్రువం(South Pole)పైనే ఫోకస్ పెట్టాయి. అగ్రదేశం అమెరికా సహా ఐరోపా దేశాలు, చైనా, భారత్, జపాన్, ఇజ్రాయెల్ తదితర దేశాలు ఇప్పటికే పలుమార్లు ప్రయోగాలు, పరిశోధనలు చేపట్టాయి.
కాంతార ప్రీక్వెల్ బడ్జెట్ వందకోట్లు దాటుతోంది, ఆ మార్పులే కారణం?
సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైనా కూడా పాన్ ఇండియా విజయం అన్ని సినిమాలకు రాదు. కొన్ని సినిమాలు మాత్రమే పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకుంటాయి. అలాంటి వాటిల్లో కాంతార ఒకటి.
ISRO: మనం కచ్చితంగా విజయం సాధిస్తాం: చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్‌పై ఇస్రో చీఫ్ కామెంట్స్
చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ కోసం దేశం మొత్తం ప్రార్థనలు చేస్తోంది. ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. ఈ క్రమంలో మరికొన్ని గంటల్లో చంద్రయాన్ -3 మిషన చంద్రుడిపై దిగనున్న నేపథ్యంలో ఇస్రో చీఫ్ ఎస్.సోమనాథ్ ఈ ప్రయోగంపై జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలను చెప్పారు.
CR Rao: తెలుగు మూలాలున్న ప్రపంచ గణిత మేథావి సీఆర్ రావు మృతి
భారతదేశానికి చెందిన అమెరికన్ ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త, స్టాటిస్టిక్స్‌లో నోబెల్‌గా చెప్పుకునే ఇంటర్నేషన్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ అవార్డు అందుకున్న సీఆర్ రావు, 103ఏళ్ల వయసులో అనారోగ్య కారణాల వల్ల కన్నుమూశారు.
ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు..ఆ మాట ఆమోదయోగ్యం కాదని వెల్లడి
జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు ఉద్దేశించిన ఆర్టికల్ 370ని 2019లో కేంద్రం రద్దు చేసింది. భారత ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ ను మంగళవారం విచారించింది.
Heath streak: 49ఏళ్ళ వయసులో జింబాబ్వే క్రికెటర్ హీత్ స్ట్రీక్ కన్నుమూత
జింబాబ్వే క్రికెట్ దిగ్గజం హీత్ స్ట్రీక్ కన్నుమూశారు. 49ఏళ్ల వయసులో క్యాన్సర్ తో పోరాడుతూ చనిపోయాడని హీత్ స్ట్రీక్ సహచరులు తెలియజేసారు.
ఆగస్టు 23న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
ఆగస్టు 23వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
చంద్రయాన్-3లో తెలంగాణ శాస్త్రవేత్త.. సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్ రాసిన గద్వాల యువకుడు
ప్రపంచ దేశాలు ఆసక్తిగా తిలకిస్తున్న చంద్రయాన్-3 ప్రాజెక్టులో తెలంగాణకి చెందిన యువ శాస్త్రవేత్త భాగమయ్యాడు. జోగులాంబ గద్వాల జిల్లాలోని ఉండవల్లికి చెందిన కృష్ణ కుమ్మరి రెండు పేలోడ్స్ కోసం సాఫ్ట్‌వేర్ రాశారు.
చంద్రయాన్-3: చారిత్రక ఘట్టానికి అంతా సిద్ధం.. ప్రపంచం చూపు భారత్ వైపు
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3, బుధవారం చంద్రుడి మీద ల్యాండ్ కానుంది. ఈ చారిత్రక ఘట్టం కోసం భారతీయులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఒడిశా బీచ్‌లో అబ్బురపరిచే 'చంద్రయాన్-3' సైకత శిల్పం
చంద్రయాన్-3 మిషన్ బుధవారం సాయంత్రం చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ అవడానికి సిద్ధంగా ఉంది.
22 Aug 2023
చంద్రయాన్-3పై స్పందించిన సునీత విలియమ్స్.. చాలా ఆసక్తితో ఎదురుచూస్తున్నట్లు వెల్లడి
చంద్రయాన్-3 మిషన్ కీలక ఘట్టానికి చేరుకున్న వేళ ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ మేరకు జాబిల్లిపై బుధవారం సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్ విక్రమ్ అడుగుపెట్టనుంది. ఈ అద్వితీయమైన దృశ్యం కోసం భారత ప్రజలతో పాటు ప్రపంచ దేశాలూ ఆశగా ఎదురు చూస్తున్నాయి.
తల్లీ కూతుళ్ల హత్య, మరో చిన్నారిని గర్భవతిని చేసిన నిందితుడికి మరణి శిక్ష
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తంబళ్లపల్లెలో జంట హత్యల కేసులో చిత్తూరు కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ మేరకు నిందితుడికి మరణశిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Rakhi Thali for Modi: దక్షిణాఫ్రికాలో ప్రధాని మోదీకి 'రాఖీ' థాలీని సిద్ధం చేసిన ప్రవాసులు
15వ బ్రిక్స్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు.
చంద్రయాన్-3పై ప్రకాశ్ రాజ్ వివాదాస్పద ట్వీట్.. కేసు నమోదు
చంద్రయాన్-3పై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ఓ ట్వీట్ చేశాడు. అది కాస్త సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ మేరకు కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లాలోని బనహట్టి పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
కొన్ని నెలలు ఉల్లిపాయలు తినడం మానేయండి: ఉల్లి ధరల పెరుగులపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
ఉల్లి ధరలు పెరగడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్ర మంత్రి దాదా భూసే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
నేషనల్ ఐకాన్ గా సచిన్ టెండూల్కర్.. కేంద్ర ఎన్నికల సంఘంతో ఒప్పందం
దేశవ్యాప్తంగా మరికొద్ది నెలల్లోనే సార్వత్రిక ఎన్నికలకు తెరలేవనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సైతం అందుకు రంగం సిద్ధం చేస్తోంది.
అమిత్ షాకు దిల్లీ మహిళా కమిషన్ చీఫ్ లేఖ.. అత్యాచార బాధితురాలిని కలవనివ్వాలని అభ్యర్థన
కేంద్రహోం శాఖ మంత్రి అమిత్ షాకు దిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ లేఖ రాశారు. స్త్రీ శిశుసంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ చేతిలో పలుమార్లు అత్యాచారానికి గురైన బాలికను కలిసేందుకు అనుమతివ్వాలని కోరారు.
BRICS: 'బ్రిక్స్' కూటమిలో మరో 40దేశాలు ఎందుకు చేరాలనుకుంటున్నాయి?
బ్రిక్స్ కూటమి.. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలతో కూడిన అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల సమాహారం.
హిమాచల్: భారీ వర్షాలకు 346మంది బలి; రూ.8100కోట్ల నష్టం
హిమాచల్ ప్రదేశ్ లో గత రెండు నెలలుగా కురుస్తున్న వర్షాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్, రాష్ట్రం మొత్తాన్ని ప్రకృతి విపత్తు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించారు.
శాన్‌ఫ్రాన్సిస్కోలో కాన్సులేట్ జనరల్‌గా తెలుగు వ్యక్తి.. బాధ్యతలు స్వీకరించిన శ్రీకర్ రెడ్డి
అగ్రరాజ్యం అమెరికాలో భారత కొత్త కాన్సులేట్ జనరల్‌గా తెలుగు వ్యక్తి నియామకమయ్యారు. ప్రపంచానికే ఐటీ కేంద్రం(సిలికాన్ వ్యాలీ)గా గుర్తింపు పొందిన నగరం శాన్‌ఫ్రాన్సిస్కోలో శ్రీకర్ రెడ్డి పనిచేయనున్నారు.
ఆ ఐదు సిక్సర్లతో నా జీవితం మారిపోయింది: రింకూ సింగ్
ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడిన రింకూ సింగ్, ప్రస్తుతం భారత జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. ఐర్లాండ్‌తో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లో రింకూ ఆడుతున్నాడు.
ఇండిగో విమానంలో విషాదం.. గాల్లో ఉండగానే రక్తపు వాంతులతో ప్రయాణికుడు మృతి
ఇండిగో విమానంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విమానం గాల్లో ఉండగానే ఓ ప్రయాణికుడు రక్తపు వాంతులతో తుది శ్వాస విడిచాడు.
Bharat NCAP: ప్రజల ప్రాణాలను కాపాడేందుకు 'భారత్ ఎన్‌సీఏపీ' ప్రోగ్రామ్‌ను లాంచ్ చేసిన నితిన్ గడ్కరీ
కేంద్ర జాతీయ రహదారులు, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ BNCAP (Bharat New Car Assessment Program) ప్రోగ్రామ్ ని లాంచ్ చేసారు. దీని ప్రకారం యాక్సిడెంట్‌లో కారు ఎంతమేరకు పాడవుతుందో అంచనా వేస్తారు.
కాంగ్రెస్ గూటికి చేరనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్.. ఇప్పటికే టిక్కెట్ కోసం దరఖాస్తు
ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. సోమవారం బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించిన జాబితాలో తన పేరు లేకపోవడంపై ఆమె తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు.
చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్: ఆ 17నిమిషాలే కీలకమంటున్న ఇస్రో
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం తుది దశకు చేరుకుంది. చంద్రుడి మీద సురక్షితంగా దిగడానికి ల్యాండర్ మాడ్యూల్ సిద్ధమవుతోంది.
లక్షద్వీప్ ఎంపీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ; కేరళ హైకోర్టుకు కీలక ఆదేశాలు
2009లో జరిగిన హత్యాయత్నం కేసులో లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్‌కు విధించిన శిక్షను నిలిపివేస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది.
7th Pay commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త: రెండేళ్ళు సెలవు పెట్టినా జీతం వచ్చేస్తుంది
ఆల్ ఇండియా సర్వీస్ సభ్యులకు సంబంధించిన సెలవుల విషయంలో కొన్ని సవరణలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.
'చంద్రయాన్-3' మిషన్ ల్యాండింగ్ ఆలస్యం అంటూ వార్తలు.. ఇస్రో ట్వీట్‌తో క్లారిటీ
'చంద్రయాన్-3' మిషన్ ల్యాండింగ్ కోసం దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా చూస్తోంది. ఇదే సమయంలో మిషన్ ల్యాండింగ్ ఆలస్యం అయ్యే అవకాశం ఉందంటూ మంగళవారం ఉదయం నుంచి జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.
చంద్రయాన్-3 ల్యాండింగ్: విద్యాసంస్థల్లో ప్రత్యక్ష ప్రసారానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు
జాబిల్లికి అత్యంత దగ్గరగా వెళ్ళిన చంద్రయాన్-3, మంగళవారం సాయంత్రం 6:04గంటలకు చంద్రుడి మీద అడుగుపెట్టనుందని ఇస్రో వెల్లడి చేసింది.
Raju Punjabi: 40ఏళ్ల వయసులో ప్రముఖ గాయకుడు రాజు పంజాబీ కన్నుమూత
హర్యానాకు చెందిన ప్రముఖ గాయకుడు రాజు పంజాబీ(40) మంగళవారం అనారోగ్యంతో కన్నుమూశారు.
40రోజుల చంద్రయాన్-3 ప్రయాణం 60సెకన్ల వీడియోలో.. మీరూ చూసేయండి!
చంద్రయాన్-3 ద్వారా చంద్రుడిపై అడుగుపెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఈ మూన్ మిషన్ లాంచింగ్ నుంచి ల్యాండింగ్ వరకు ఎన్నో కీలక ఘట్టాలను దాటుకుంటూ వెళ్తోంది. ఈ మేరకు మిషన్ చివరి దశకు వచ్చేసింది.
ఇండియాలో ఈ జిమ్ సెంటర్స్ చాలా పాపులర్.. అవేంటో తెలుసుకుందామా!
వ్యాయామం చేయడం ఆరోగ్యానికి చాలా అవసరం. ఒక రోజులో కనీసం 30నిమిషాలైనా వ్యాయామం చేయాలని చెబుతారు. వ్యాయామం చేయడం ఎంత ముఖ్యమో, వ్యాయామం చేసే ప్రదేశం బాగుండడం అంతకన్నా ముఖ్యం.
ప్రపంచ ఛాంపియన్ షిప్ ట్రయల్స్‌కు వచ్చేయ్.. బజరంగ్ పూనియాను సాయ్ లేఖ
భారత క్రీడా ప్రాధికార సంస్థ (Sports Authority of India) సాయ్ నుండి ఒలింపిక్ పతక విజేత రెజ్లర్ బజరంగ్ పూనియాకు లేఖ వచ్చింది.
జర్నలిస్టులకు ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్.. 'X' అకౌంట్‌లో కథనాలు పోస్ట్ చేస్తే ఆదాయం
జర్నలిస్టులకు బంపర్ ఆఫర్ తగిలింది. ఈ మేరకు X అకౌంట్(ట్విట్టర్) అధినేత ఎలాన్ మస్క్ ఓ ఆఫర్ ఇచ్చారు. అధిక ఆదాయం కావాలనుకునే పాత్రికేయులకు ఓ సూచన చేశారు.
UIDAI: ఆధార్ 'యూఏడీఏఐ' చైర్మన్‌గా నీల్ కాంత్ మిశ్రా
యాక్సిస్ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్, గ్లోబల్ రీసెర్చ్ హెడ్ నీల్ కాంత్ మిశ్రాను ఆధార్ కార్డ్ సేవలను అందించే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(UIDAI) తాత్కాలిక చైర్మన్‌గా కేంద్రం నియమించింది.
యోగి ఆదిత్యనాథ్ పాదాలను తాకడంపై సూపర్ స్టార్ రజనీకాంత్ క్లారిటీ
సూపర్ స్టార్ రజనీకాంత్ పై గతకొన్ని రోజులుగా కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఇటీవల హిమాలయాలకు వెళ్ళిన రజనీకాంత్, అక్కడి నుండి అటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లారు.
రష్యా: లూనా-25 స్పేస్‌క్రాఫ్ట్ కూలిపోవడంపై శాస్త్రవేత్త మనస్తాపం.. ఆస్పత్రిలో చేరిక
లూనా 25 స్పేస్‌క్రాఫ్ట్ వైఫల్యంతో రష్యాకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త ఆస్పత్రి పాలయ్యారు. లూనా 25 మిషన్ ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన ప్రముఖ భౌతిక, ఖగోళ శాస్త్రవేత్త మిఖాయిల్ మారోవ్ మనస్థాపంతో అనారోగ్యానికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే అతన్ని ఆస్పత్రికి తరలించారు.
BRICS Summit: ప్రధాని మోదీ-జీ జిన్‌పింగ్ భేటీపైనే అందరి దృష్టి
బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికాకు వెళ్లారు. బ్రిక్స్ సమ్మిట్ ఆగస్టు 22న ప్రారంభమై 24వరకు జరగనుంది.
Mega 157: చిరంజీవి 157 చిత్రం అప్డేట్.. ఈసారి కొత్తగా ట్రై చేస్తున్న మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి 157వ సినిమా అప్డేట్ ఇప్పుడే వచ్చింది. బింబిసార సినిమాతో తిరుగులేని విజయాన్ని అందుకున్న దర్శకుడు వశిష్ట, చిరంజీవి 157వ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
కమ్యూనిస్టులకు హ్యాండ్ ఇచ్చిన సీఎం కేసీఆర్.. రగిలిపోతున్న కామ్రెడ్లు
తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ వ్యూహ్మాత్మక వైఖరిని పాటిస్తున్నారు.ఈ మేరకు ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు దూరంగా ఉంటున్నారు.
Mega 156: చిరంజీవి 156వ సినిమా అప్డేట్ వచ్చేసింది, ఈసారి కూతురికి అవకాశం
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా 156వ సినిమా అప్డేట్ వచ్చేసింది. చిరంజీవి కూతురు సుష్మిత కొణిదెల సొంత నిర్మాణ సంస్థ అయిన గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్మెంట్స్ లో చిరంజీవి 156వ సినిమా ఉండబోతుంది.
Chiranjeevi birthday: చిరంజీవి గ్యారేజీలో ఎన్ని లగ్జరీ కార్లు ఉన్నాయో తెలుసా?
తెలుగు సినిమా చరిత్రలో నిలువెత్తు శిఖరం చిరంజీవి. ఈరోజు ఆయన పుట్టినరోజు. 68ఏళ్ళ వయసులో సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులకు వినోదం పంచుతున్నారు.
ప్రధాని మోదీకి పాక్ సోదరి రక్షాబంధన్ శుభాకాంక్షలు.. 31వసారి రాఖీ కట్టనున్న మొహిసిన్
ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్థాన్ సోదరి రాఖీ కట్టనున్నారు. రక్షాబంధన్‌ను పురస్కరించుకుని పాకిస్థాన్‌కు చెందిన కమర్ మొహిసిన్ షేక్ మోదీకి రాఖీ కట్టనున్నారు. ఇందుకోసం ఈనెల 30న పాక్ నుంచి దిల్లీకి రానున్నారు. గత 30సంవత్సరాలుగా మోదీకి కమర్ రాఖీ కడుతున్నారు.
Chess world cup 2023: ప్రపంచకప్ చెస్ ఫైనల్‌కు చేరుకున్న ప్రజ్ఞానంద: కార్లసన్‌తో నేడు ఢీ
చెస్ ప్రపంచ కప్ ఫైనల్‌లో ప్రజ్ఞానంద అడుగు పెట్టాడు. భారతదేశం నుంచి విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచకప్ ఫైనల్ లో అడుగు పెట్టిన రెండో ఆటగాడిగా ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు.
Telangana voter list: తెలంగాణలో ఓటర్ల సంఖ్య ఎంతో తెలుసా.. జాబితాను విడుదల చేసిన ఎన్నికల సంఘం
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియకు ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఈసీ(ELECTION COMMISSION) ఓటర్ల జాబితాను ప్రకటించింది.
Balakot: ఉగ్రవాదుల చొరబాటు విఫలం: ఎల్‌ఓసీ వద్ద ఇద్దరు ముష్కరులు హతం
జమ్ముకశ్మీర్ పూంచ్ జిల్లా బాలాకోట్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి ఉగ్రవాదుల చొరబాటును భారత సైన్యం అడ్డుకుంది. ఈ నేపథ్యంలో ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చినట్లు సైన్యం ప్రకటించింది.
ఆగస్టు 22న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
ఆగస్టు 22వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
BRICS Summit: 'బ్రిక్స్' సదస్సులో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాకు బయలుదేరిన ప్రధాని మోదీ
దక్షిణాఫ్రికా అధ్యక్షతన ఆగస్టు 22-24 తేదీల్లో జోహన్నెస్‌బర్గ్‌లో 15వ బ్రిక్స్ సమ్మిట్ జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం దక్షిణాఫ్రికాకు బయలుదేరారు.