LOADING...

25 Aug 2023


ఖుషి నుండి వచ్చేస్తున్న కొత్త పాట: రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఓసి పెళ్ళామా ప్రోమో రిలీజ్ 

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న ఖుషి చిత్రం సెప్టెంబర్ 1వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లలో భాగంగా మరో పాట ప్రోమోను ఖుషి టీమ్ విడుదల చేసింది.

ఏపీ ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టు నోటీసులు.. హైకోర్టు తీర్పును సవాల్ చేసిన సీబీఐ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మికి సుప్రీం నోటీసులు జారీ చేసింది. 2007లో అక్రమంగా గనులు కేటాయించారని శ్రీ లక్ష్మీపై సిబిఐ కేసులు నమోదు చేసింది.

దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్​కు ఝలక్​.. ప్రధాని డిగ్రీ కేసులో సుప్రీం కీలక నిర్ణయం

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్​కు సుప్రీంకోర్టులో చుక్క ఎదురైంది. ప్రధాని మోదీ డిగ్రీ కేసులో గుజరాత్​ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ కేజ్రీ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు పిటిషన్ తిరస్కరణకు గురైంది.

TS DSC 2023: గుడ్ న్యూస్.. 5089 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి

తెలంగాణలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి కేసీఆర్ సర్కార్ పచ్చజెండా ఊపింది. తెలంగాణ‌లో డీఎస్సీ ద్వారా 5089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

TS Gurukulam: గురుకుల పాఠశాలల కాంట్రాక్టు ఉపాధ్యాయులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్

సాంఘిక సంక్షేమ, గురుకుల పాఠశాలల్లోని కాంట్రాక్టు ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

చంద్రయాన్-3 తర్వాత చంద్రయాన్-4 ఉంటుందని మీకు తెలుసా? దాని విశేషాలివే 

చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడంతో ఇప్పుడంతా చంద్రయాన్-4 మీదకు టాపిక్ మళ్ళింది. ఇస్రో చేపట్టనున్న భవిష్యత్తు ప్రాజెక్టుల్లో చంద్రయాన్-4 కూడా ఉంది.

వాన్‌పిక్‌ కేసులో ఏపీ సర్కారుకు సుప్రీం నోటీసులు.. స్టేటస్‌ కోను అమలు చేయాలని ఆదేశం

వాన్‌పిక్‌ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ, ఉత్తర్వులిచ్చేవరకు స్టేటస్‌ కోను అమలు చేయాలని ఆదేశించింది.

BWF: క్వార్టర్ ఫైనల్స్ ఆడేందుకు సిద్ధమైన సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టి, హెచ్‌ఎస్ ప్రణయ్ 

వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీల్లో ముగ్గురు భారత స్టార్ షట్లర్లు బరిలోకి దిగనున్నారు. సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి, హెచ్‌ఎస్ ప్రణయ్ క్వార్టర్ ఫైనల్ ఆడేందుకు సిద్ధమయ్యారు.

B20 సదస్సులో నిర్మలా సీతారామన్.. ద్రవ్యోల్బణం కట్టడికే తొలి ప్రాధాన్యం

దేశంలో గత 9 ఏళ్లుగా సుస్థిరమైన సంస్కరణలు చేపట్టామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. గతంలో అస్థిరమైన సంస్కరణలు ఉండేవని, కొవిడ్ కాలంలోనూ సంస్కరణలను కొనసాగించామన్నారు.

ట్రావెల్: విశాఖపట్నం వెళ్తున్నారా? ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం మర్చిపోకండి 

విశాఖపట్నం అనగానే అందరికీ ఆర్కే బీచ్ గుర్తొస్తుంది. ఆర్కే బీచ్ మాత్రమే కాకుండా విశాఖపట్నంలో చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి.

Congress: ఎమ్మెల్యే టికెట్ల కోసం భారీగా దరఖాస్తులు.. కొన్ని చోట్ల ఒకే సీటు కోసం తల్లీకొడుకుల దరఖాస్తులు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దరఖాస్తుల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది.

జీ-20 సమావేశాలకు రష్యా డుమ్మా.. పుతిన్ రావట్లేదని ప్రకటన

ప్రతిష్టాత్మకంగా జరగబోయే జీ-20 దేశాధినేతల సదస్సుకు వ్లాదిమిర్ పుతిన్‌ గైర్హాజరు కానున్నారు. భారత్‌ అధ్యక్షతన సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు జరగబోయే ఈ సదస్సుకు ఆయన హాజరుకావట్లేదని రష్యా ప్రకటన చేసింది.

అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ డేట్ ఫిక్స్? ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే? 

నిన్నటి నుండి సోషల్ మీడియాలో పుష్ప సినిమా గురించి చర్చ ఎక్కువగా జరుగుతోంది. 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఎంపిక కావడమే దానికి కారణం.

ఆసియా గడ్డపై ఇమామ్-ఉల్-హక్ సాధించిన రికార్డులివే!

వన్డే ఫార్మాట్లో పాకిస్థాన్ బ్యాటర్ ఇమామ్-ఉల్-హక్ అద్భుతమైన ప్రదర్శనతో అకట్టుకుంటున్నాడు. ఇటీవల ఆప్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలో పాక్ తరుఫున కీలక ఇన్నింగ్స్ ఆడి ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

40 ఏళ్ల తర్వాత గ్రీస్‌లో పర్యటించిన తొలి భారత ప్రధాని మోదీ.. ఘన స్వాగతం పలికిన ఎన్ఆర్ఐలు

ప్రధాని నరేంద్ర మోదీ గ్రీస్ దేశంలో పర్యటిస్తున్నారు. దాదాపు 40 ఏళ్ల తర్వాత ఓ భారత ప్రధాని గ్రీస్‌లో అడుగుపెట్టడం ఇదే తొలిసారి.1983లో ఇందిరాగాంధీ గ్రీస్‌లో చివరిసారిగా పర్యటించారు.

పవన్ కళ్యాణ్ ఓజీ నుండి వీడియో లుక్: 90ల కాలం నాటి డ్రెస్ లో పవన్ లుక్ అదుర్స్ 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ఓజీ. ప్రియాంక ఆరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతుంది.

Neeraj Chopra: ప్రపంచ అథ్లెటిక్స్ ఫైనల్‌కు నీరజ్ చోప్రా.. పారిస్ ఒలింపిక్స్‌కూ అర్హత 

టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతాక విజేత, భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా మరోసారి తన సత్తాను నిరూపించుకున్నాడు.

అమెరికాలో అదరగొట్టిన వివేక్ రామస్వామి.. అభ్యర్థిత్వంలో దూసుకెళ్తున్న భారత సంతతి నేత

అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వంలో భారత సంతతి నేత వివేక్ రామస్వామి దూసుకెళ్తున్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల డిబేట్ లో 504 మంది పోల్ లో పాల్గొన్నారు. వారిలో 28 శాతం మంది రామస్వామికే జై కొట్టారు.

అప్ఘనిస్తాన్ ఓపెనర్ అరుదైన ఘనత.. సచిన్ ప్రపంచ రికార్డు బద్దలు

ఆప్గనిస్తాన్ స్టార్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాబ్ చరిత్రను సృష్టించాడు. హంబన్‌టోటా వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన రెండో వన్డేలో సెంచరీతో చెలరేగిన గుర్బాజ్, ఓ అరుదైన ఫీట్ ను అందుకున్నాడు.

న్యూయార్క్ వీధుల్లో సమంత: లుక్ మార్చేసి స్టయిల్ గా కనిపిస్తున్న ఖుషీ హీరోయిన్ 

సమంత ప్రస్తుతం అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. న్యూయార్క్ వీధుల్లో తిరుగుతున్న భామ, ప్రస్తుతం నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించింది. దానికి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో సమంత పంచుకుంది.

Kia EV5 electric car :అదిరే లుక్‌తో కియా ఈవీ 5 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ వచ్చేస్తోంది.. ఫీచర్లు చూస్తే కొనాల్సిందే!

ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్‌లో సౌత్ కొరియాకు చెందిన దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ కియా మోటర్స్ దుమ్ములేపుతోంది.

బెదురులంక 2012 రివ్యూ: యుగాంతం చుట్టూ తిరిగే కథ ప్రేక్షకులను మెప్పించిందా? 

నటీనటులు: కార్తికేయ, నేహా శెట్టి, అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగార్, రాజ్ కుమార్ కసిరెడ్డి తదితరులు

రచయిత్రి మధుమితా శుక్లా హత్య కేసులో మాజీ మంత్రి దంపతులకు బెయిల్

ఉత్తర్‌ప్రదేశ్‌ రచయిత్రి,మధుమితా శుక్లా హత్య కేసులో నిందితుల విడుదలకు సుప్రీం స్టే నిరాకరించింది. ఈ మేరకు 8 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని శుక్రవారం ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది.

ETFలో తిరిగి ఇన్వెస్ట్ చేసేందుకు EPFO ఆసక్తి..ఆర్థిక మంత్రిత్వ శాఖతో చర్చలు

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్(ETFలు) నుండి రిడెంప్షన్ ద్వారా వచ్చిన మొత్తాన్ని తిరిగి స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖతో చర్చలు ప్రారంభించింది.

Virat Kohli: బీసీసీఐకి కోపం తెప్పించిన కోహ్లీ.. ఆటగాళ్లందరికీ వార్నింగ్!

ఆసియా కప్ 2023 కోసం భారత జట్టు సిద్ధమవుతోంది. భారత్ స్టార్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో ఏర్పాటు చేసిన స్పెషల్ ట్రెయినింగ్ క్యాంపులో తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

హిమాచల్​లో ఆకాశానికి చిల్లులు.. 51 మందిని రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ ఫోర్స్

హిమాచల్ ప్రదేశ్‌లో భీకర వర్షాలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. క్లౌడ్‌బర్స్ట్ కారణంగా చిక్కుకుపోయిన 51 మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి.

గాండీవధారి అర్జున మూవీ రివ్యూ: వరుణ్ తేజ్ నటించిన సినిమా ఎలా ఉందంటే? 

నటీనటులు: వరుణ్ తేజ్, సాక్షి వైద్య, నాజర్, రోషిణి ప్రకాష్, విమలా రామన్, అభినవ్ గొమఠం,తదితరులు

రిలయన్స్ వాటా అమ్మకం.. భారీగా పెట్టుబడి పెట్టనున్న ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ

దేశీయ కార్పొరేట్‌ అగ్రగామి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) ఐపీఓకు వెళ్లనుంది.

నిరాశపరిచిన జెస్విన్ ఆల్డ్రిన్.. ఫైనల్లో చుక్కెదురు

ప్రపంచ అథ్లెటిక్స్ లో భాగంగా హంగేరిలోని బుడాపెస్ట్‌లో జరుగుతున్న పురుషుల లాంగ్ జంప్ ఫైనల్‌లో జెస్విన్ ఆల్డ్రిన్ కు నిరాశ ఎదురైంది.

మధ్యప్రదేశ్ లో దారుణం.. 13 ఏళ్ళ బాలుడిపై ప్యూన్‌ లైంగికదాడి

మధ్యప్రదేశ్‌లోని సాత్నా జిల్లాలో ఉన్న ఓ రెసిడెన్షియల్‌ పాఠశాలలో 13 ఏళ్ళ బాలుడిపై ప్యూన్‌ లైంగికదాడికి పాల్పడ్డాడు.

చంద్రయాన్-3: విక్రమ్ ల్యాండర్ నుండి ప్రగ్యాన్ రోవర్ బయటకు వచ్చిన వీడియో చూసారా? 

చంద్రుడి మీద విక్రమ్ ల్యాండర్ ఆగస్టు 23వ తేదీన సాయంత్రం 6:04గంటలకు సురక్షితంగా దిగింది. అయితే ల్యాండర్ లో నుండి రోవర్ మాత్రం రాత్రి 10గంటల సమయంలో బయటకు వచ్చింది.

టీవీఎస్​ ఎక్స్​ వర్సెస్​ ఏథర్​ 450ఎక్స్​.. ఏది కొనడం బెటర్ ఆప్షన్..?

ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ 'ఎక్స్' ను దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టీవీఎస్ మోటర్ ఇటీవలే లాంచ్ చేసింది.

ఆహారం జీర్ణం కాక ఇబ్బందులు పడుతున్నారా? మీ జీర్ణశక్తిని ఈ విధంగా పెంచుకోండి 

మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. నీళ్ల విరేచనాలు, మలబద్ధకం, గుండె మంట, గ్యాస్ మొదలగు సమస్యలు ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల వస్తాయి.

మోదీతో జిన్‌పింగ్.. ఇండో చైనా సంబంధాలు బలపడితే ఇరు దేశాలకూ లాభమే 

భారత్-చైనా సంబంధాలపై డ్రాగన్ దేశ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మెరుగుపడితే ఉమ్మడి ప్రయోజనాలకు మేలు కలుగుతుందని ప్రధాని మోదీతో అన్నారు.

తెలంగాణాలో రానున్న మూడు రోజులలో వర్షాలు 

తెలంగాణలోని పలు జిల్లాల్లో వచ్చే మూడు రోజుల పాటు తేలిక నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

Skanda Pre Release Thunder స్కంద కోసం అఖండ వచ్చేస్తున్నాడు 

రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన స్కంద సినిమా సెప్టెంబర్ 15వ తేదీన థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టాలని చిత్రబృందం భావిస్తోంది.

PAK Vs AFG: పోరాడి పాక్ జట్టుకు విజయాన్ని అందించిన షాబాద్ ఖాన్

అప్ఘనిస్తాన్‌తో జరిగిన రెండు వన్డేలో పాకిస్థాన్ ఒక వికెట్ తేడాతో గెలుపొందింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తో పాక్ దక్కించుకుంది.

Telangana : ఈఎస్ఐ స్కామ్ కేసులో ఛార్జిషీట్‌ దాఖలు చేసిన ఈడీ

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ- బీమా వైద్య సేవల(IMS) కుంభకోణంలో ఈడీ ఛార్జ్ షీట్‌ దాఖలు చేసింది.

Bray Wyatt Dead: డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ బ్రే వ్యాట్ కన్నుమూత

వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్మెంట్ (WWE) లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్టార్ రెజ్లర్ బ్రే వ్యాట్ మృతి చెందాడు. ఈ విషయాన్ని డబ్ల్యూడబ్ల్యూఈ సీఈఓ ట్రిపుల్ హెచ్ ధ్రువీకరించారు.

విక్రమ్ ల్యాండర్ ఫోటోలు తీసిన చంద్రయాన్-2 ఆర్బిటార్; ఫోటోలు షేర్ చేసి డిలీట్ చేసిన ఇస్రో 

చంద్రుడి దక్షిణ ధృవం మీద దిగిన చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ ఫోటోలను చంద్రయాన్-2 ఆర్బిటార్ తీసిందని ఎక్స్(గతంలో ట్విట్టర్) వేదికగా ఇస్రో పంచుకుంది.

భారత కార్పొరేట్లకు మరో షాక్.. హిండెన్‌బర్గ్‌ తరహాలో మరో నివేదిక 

భారత పారిశ్రామిక దిగ్గజాలకు (కార్పొరేట్లకు) హిండెన్‌బర్గ్‌ మాదిరి షాక్‌ తగలనుంది. ఈ మేరకు నిర్దిష్ట కంపెనీల్లో చోటు చేసుకున్న అవకతవకలను ఓసీసీఆర్‌పీ(OCCRP) బయటపెట్టనుంది.

బెదురులంక 2012 ట్విట్టర్ రివ్యూ: యుగాంతం కాన్సెప్ట్ తో వచ్చిన కథ అకట్టుకుందా? 

ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయ, డీజే టిల్లు ఫేమ్ నేహాశెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన బెదురులంక 2012 చిత్రం ఈరోజు థియేటర్లలో రిలీజైంది.

యూవీ, ధోనీ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసే ప్లేయర్ అతడే: అశ్విన్

భారత జట్టుకు మిడిలార్డర్ బ్యాటింగ్ లైనప్ పై ఎప్పుడూ చర్చ సాగుతూనే ఉంది. టీమిండియా మాజీ ప్లేయర్లు యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసే ప్లేయర్ కోసం ఇప్పటికీ భారత యాజమాన్యం ఎదురుచూస్తోంది.

ఖరారైన తెలంగాణ అమిత్ షా పర్యటన.. టూర్ వివరాలు ఇవే 

ఈనెల 27న తెలంగాణ పర్యటనకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. ఖమ్మంలో తలపెట్టిన బీజేపీ 'రైతు గోస - బిజెపి భరోసా' సభలో అమిత్ షా ప్రసంగిస్తారు.

మణిపూర్ దుస్థితికి కాంగ్రెస్సే కారణమన్న బీరెన్ సింగ్.. సీఎం రాజీనామాకు సీపీఐ పట్టు 

మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ రాజకీయంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు కాంగ్రెస్ పార్టీనే కారణమన్నారు.

గాండీవధారి అర్జున ట్విట్టర్ రివ్యూ: సినిమా చూసిన నెటిజన్లు ఏమంటున్నారంటే? 

వరుణ్ తేజ్, సాక్షి వైద్య హీరో హీరోయిన్లుగా నటించిన గాండీవధారి అర్జున చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రీమియర్స్ ఆల్రెడీ పడిపోయాయి.

భద్రాద్రి కొత్తగూడెంలో భూకంపం.. భయాందోళనలో ప్రజలు 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరులో శుక్రవారం తెల్లవారు జామున 4.40గంటల సమయంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.

20 నిమిషాలు జైల్లో గడిపిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, 2లక్షల డాలర్ల వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్టయ్యారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదలయ్యారు. ఈ మేరకు 2,00,000 డాలర్ల బాండ్‌ను సమర్పించారు.

ఆగస్టు 25న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.

Happy Birthday Priyadarshi: ప్రియదర్శి కెరీర్‌ని మలుపు తిప్పిన ఆ మూడు సినిమాలు 

ప్రియదర్శి.. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫుల్ ఫామ్‌లో ఉన్న ఈ నటుడి పూర్తి పేరు ప్రియదర్శి పులికొండ. షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ ప్రారంభించిన ప్రియదర్శి, 2016లో టెర్రర్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు.

24 Aug 2023


Allu Arjun: జాతీయ అవార్డు వచ్చిన వేళ.. సుకుమార్‌ను పట్టుకొని ఏడ్చేసిన అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టాలీవుడ్ కు నిజంగానే ఐకాన్ గా నిలిచాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా అవార్డును గెలుచుకొని చరిత్ర సృష్టించాడు.

ముంబైలో జీకా కలకలం.. 79 ఏళ్ల వృద్ధుడికి పాజిటివ్

జీకా వైరస్‌ దేశంలో మరోసారి కలకలం సృష్టించింది. మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి జికా వైరస్‌ బారిన పడ్డారు. ఈ మేరకు వైద్య పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా వైరస్ పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.

National Film Awards 2023: ఆరు విభాగాల్లో జాతీయ అవార్డులు అందుకున్న ఆర్ఆర్ఆర్ 

69వ జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రకటన ఇంతకుముందే వెలువడింది. ఈ అవార్డుల్లో రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రానికి అవార్డుల పంట పండింది.

Allu Arjun: 'పుష్ప'కు అవార్డుల పంట .. జాతీయ ఉత్తమ నటుడిగా చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి తెలుగు హీరోగా చరిత్రను సృష్టించాడు.

జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ఉప్పెన.. తొలి సినిమాతోనే మెగా హీరోకు గుర్తింపు

69వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు ఉత్తమ తెలుగు చిత్రంగా ఉప్పెన సినిమాకు ప్రతిష్ఠాత్మకమైన అవార్డు దక్కింది.

Chess World Cup : ప్చ్.. ఫైనల్లో ప్రజ్ఞానంద ఓటమి

భారత టీనేజ్ గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద చెస్ ప్రపంచ కప్ పోటీలో ఓటమి పాలయ్యారు. ఫైనల్ టైబ్రేక్ లో ప్రజ్ఞానందపై వరల్డ్ నంబర్ వన్ ఆటగాడు క్లార్ సన్ వరుసగా రెండు గేమ్ ల్లో విజయం సాధించారు.

69th National film awards: 69వ జాతీయ చలనచిత్ర అవార్డులు వరించింది వీరినే..  

69వ జాతీయ చలనచిత్ర అవార్డులను గురువారం కేంద్రం ప్రకటించింది.

వన్డే ప్రపంచ కప్ కోసం కివీస్ భారీ ప్లాన్.. మోస్ట్ సక్సెస్ ఫుల్ కోచ్‌కు ఆహ్వానం!

భారత్‌తో జరిగే వన్డే వరల్డ్ కప్ కి ముందు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఆ జట్టు మాజీ కెప్టెన్, సీఎస్కే‌ను ఐదుసార్లు విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించిన స్టీఫెన్ ఫ్లెమింగ్ కోచ్‌ను న్యూజిలాండ్ జట్టు తమ కోచింగ్ బృందంలోకి తీసుకుంది.

దిల్లీ: ప్రభుత్వ కార్యాలయాలకు 3 రోజుల సెలవులు

అత్యంత ప్రతిష్టాత్మకమైన G-20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశాల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దిల్లీలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సెప్టెంబర్‌ 8 నుంచి 10 వరకు సెలవులు ప్రకటించింది. కేంద్ర కార్యాలయాలకు మూడు రోజుల పాటు సెలవులను మంజూరు చేసింది.

పోస్టాఫీసుల్లో కీలక మార్పులు.. సేవింగ్స్ ఖాతాదారులకు ముఖ్యగమనిక

పోస్టాఫీసుల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు జాయింట్ అకౌంట్‌ను ముగ్గురు కలిపి తీసుకునేందుకు పోస్టల్ శాఖ నిర్ణయించింది.

Patnam Mahender reddy: మంత్రిగా ప్రమాణం చేసిన పట్నం మహేందర్ రెడ్డి

తెలంగాణ మంత్రిగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ కేబినెట్ విస్తరణ చేపట్టారు. ఈ మేరకు గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఆయనతో పదవీ స్వీకారోత్సవం చేయించారు.

తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.. గద్వాల్ ఎమ్మెల్యేగా డీకే అరుణ 

గద్వాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అనర్హుడిగా ప్రకటిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

చంద్రయాన్-3 విజయానికి అంకితమిస్తూ Lectrix EV LXS Moonshine స్కూటర్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే! 

చంద్రుడి మీద చంద్రయాన్-3 సురక్షితంగా దిగిన సందర్భంగా భారతీయులంతా సంతోషంగా ఉన్నారు. చంద్రయాన్-3 విజయోత్సవ సంబరాలు దేశమంతా జరుగుతున్నాయి.

ధోని గురించే మాట్లాడుతారు.. యువీకి క్రెడిట్ ఇవ్వడం లేదు : గౌతమ్ గంభీర్

భారత జట్టు కంటే వ్యక్తులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చాడు.

ఇకపై ఎలక్ట్రిక్ వాహనాలకు రోడ్ ట్యాక్స్: తెలంగాణలో అమలు కానున్న కొత్త నిబంధన! 

ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇంధన ధరలు పెరగడం కావచ్చు, ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గడం కావచ్చు, కారణమేదైనా గానీ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు విపరీతంగా పెరిగాయి.

హిమాచల్‌ప్రదేశ్‌లో విరిగిపడ్డ కొండచరియలు..  కుప్పకూలిన భారీ భవనాలు

హిమాచల్‌ప్రదేశ్‌ను కొండచరియలు బెెంబెలెత్తిస్తున్నాయి. గురువారం కులు జిల్లాలో కొండచరియలు భారీగా విరిగిపడ్డాయి. దీంతో భారీ వాణిజ్య సముదాయాలు, ఇళ్లు కుప్పకూలిపోయాయి. అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Virat Kohli: యోయో టెస్టులో సత్తా చాటిన విరాట్ కోహ్లీ.. ఎన్ని పాయింట్లు సాధించాడంటే?

టీమిండియా క్రికెటర్లకు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో యోయో టెస్టు పరీక్షలు నిర్వహించారు. ఇందులో భారత స్టార్ విరాట్ కోహ్లీ మరోసారి తన ఫిటెనెస్‌ను నిరూపించుకున్నాడు.

అలనాటి అందాల నటి సీమ డియో కన్నుమూత.. దయనీయంగా చివరి రోజులు 

గత మూడేళ్ళుగా ఆల్జీమర్స్ వ్యాధితో ఇబ్బంది పడుతున్న ప్రముఖ బాలీవుడ్ నటి సీమ డియో బుధవారం ఉదయం 9గంటల ప్రాంతంలో ముంబైలో తన నివాసంలో కన్నుమూశారు.

Erriyon Knighton: రన్నింగ్‌లో ఉసేన్ బోల్ట్‌ను మించిన ఎరియన్ నైటాన్!

రన్నింగ్ అంటేనే గుర్తుకొచ్చే పేరు ఉసేన్ బోల్ట్. చిరుత వేగంతో ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు బోల్ట్ బాటలోనే మరో స్పింటర్ ఎరియన్ నైటాన్ ట్రాక్‌లో సంచలన రికార్డులను నమోదు చేస్తున్నాడు. ఏకంగా బోల్ట్ రికార్డునే ఎరియన్ నైటాన్ బద్దలు కొట్టి ఔరా అనిపించాడు.

వర్కౌట్స్ చేసిన తర్వాత మీ శరీరాన్ని చల్లబరిచే యోగాసనాల గురించి తెలుసుకోండి

వర్కౌట్స్ చేసిన తర్వాత కూల్ డౌన్ వ్యాయమాలు చేయడం అస్సలు మర్చిపోకూడదు.

ఆంధ్ర‌ప్రదేశ్‌‌: గుడ్ న్యూస్ చెప్పిన  సీఎం జగన్; కొత్తగా పెన్షన్‌, రేషన్ కార్డుల జారీ 

ఆంధ్ర‌ప్రదేశ్‌‌ ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి గుడ్ న్యూస్ అందించారు. కొత్త పెన్షన్‌ కార్డులు, రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీకార్డులను మంజూరు చేశారు.

చంద్రయాన్-3 వ్యోమగాములకు శుభాకాంక్షలు చెప్పిన రాజస్థాన్ మంత్రి.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

చంద్రయాన్-3పై రాజస్థాన్ మంత్రి అశోక్ చందన్‌ నోరు జారారు. ఈ మేరకు ప్రాజెక్టు విజయవంతంపై ఆయన స్పందించారు. ఈ క్రమంలోనే ఇస్రోకు అభినందనలు తెలియజేశారు.

DSC Notification: గుడ్ న్యూస్.. రెండు రోజుల్లో తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్  

తెలంగాణ నిరుద్యోగులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆమె స్పష్టం చేశారు. బషీర్ బాగ్‌లో గురువారం మంత్రి సబితా మీడియాతో మాట్లాడారు. మొత్తం 6500 పైగా పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

BRICS: బ్రిక్స్ కూటమిలో కొత్తగా 6దేశాలకు సభ్యత్వం.. స్వాగతించిన మోదీ

బ్రిక్స్ కూటమిలో సభ్యదేశాల సంఖ్య పెరగనుంది. మరో 6 కొత్త దేశాలు బ్రిక్స్ కూటమిలో చేరనున్నాయి.

Sleep Walk: స్లీప్ వాక్‌తో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన బాలుడు.. ఏకంగా 160.కి.మీ నడక!

నిద్రలో సహజంగా నడిచే అలవాటు కొందరికి మాత్రమే ఉంటుంది. ఇంటి నుంచి కొంత దూరం వరకే కొంతమంది వెళ్లగలరు. అయితే ఓ బాలుడు ఏకంగా 160 కి.మీ నిద్రలో నడిచారు.

చందమామపై ప్రయోగాలకు ప్రపంచదేశాలు పోటీ.. ఇంతకీ చంద్రుడిపై హక్కులు ఎవరెవరికో తెలుసా?

అంతరిక్ష ప్రయోగాల్లో చరిత్ర సృష్టించిన భారత్‌, నింగిలో ఇప్పటివరకు ఏ దేశానికీ దక్కని లక్ష్యం, గమ్యం ఇండియాకు దక్కింది. ఈ మేరకు అత్యంత సంక్లిష్టమైన జాబిల్లి దక్షిణ ధ్రువంపై ఇస్రో, విక్రమ్‌ ల్యాండర్‌ను సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. ఇంత వరకు బాగానే ఉన్నా తాజాగా ఓ ప్రశ్న ఆసక్తి రేకెత్తిస్తుంది.

చంద్రయాన్-3: చంద్రుడి మీద పరిశోధనలు మొదలుపెట్టిన ప్రగ్యాన్ రోవర్ 

చంద్రుడి దక్షిణ ధృవం మీద అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా భారతదేశం చరిత్ర సృష్టించింది. జాబిల్లిపై ల్యాండర్ మాడ్యూల్ అడుగుపెట్టిన అపురూప క్షణాలు భారతీయుల గుండెల్లో ఎంతో ఆనందాన్ని తీసుకొచ్చాయి.

కిమ్‌కు మళ్లీ నిరాశే .. ఉత్తరకొరియా నిఘా ఉపగ్రహం ప్రయోగం మరోసారి విఫలం

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ ప్రభుత్వానికి మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అంతరిక్షంలోకి నిఘా ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఉద్దేశించిన ప్రయోగం విఫలమైంది.

మహేష్ బాబు కో స్టార్ గా హాలీవుడ్ యాక్టర్: విజయేంద్ర ప్రసాద్ కామెంట్స్ వైరల్ 

మహేష్ బాబు 29వ సినిమా రాజమౌళి దర్శకత్వంలో ఉంటుందని తెలిసినప్పటి నుండి ఆ సినిమా గురించి అనేక రకాల వార్తలు వస్తూనే ఉన్నాయి.

యూట్యూబ్ చూస్తూ భార్యకు కాన్పు చేసిన భర్త.. భార్య మృతి

యూట్యూబ్‌లో వీడియో చూస్తూ భార్యకు కాన్పు చేయాలకున్న భర్త ప్రయత్నం బెడిసి కొట్టింది. ఏకంగా భార్య ప్రాణాలను చేజేతులా తీసుకున్నాడు. ప్రసవం చేసిన తర్వాత తీవ్ర రక్తస్రావం కావడంతో భార్య మృతి చెందింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి జిల్లాలో చోటు చేసుకుంది.

Big Breaking: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సభ్యత్వాన్ని సస్పెండ్ చేసిన UWW 

భారత రెజ్లింగ్ ఫెడరేషన్ (WFI) సభ్యత్వాన్ని యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (UWW) సస్పండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

భవిష్యత్తులో ఇస్రో చేపట్టనున్న అంతరిక్ష ప్రయోగాలు ఇవే.. 

చంద్రుడి మీద చంద్రయాన్-3 సురక్షితంగా దిగిన తర్వాత భారతదేశ వ్యాప్తంగా సంబరాలు ఆకాశాన్ని అంటాయి. చంద్రయాన్-3 ప్రాజెక్టులో భాగమైన ప్రతీ ఒక్కరికీ సోషల్ మీడియా వేదికగా అభినందనలు కురిపించారు.

హైదరాబాద్‎: ఉచిత చేప మందు పంపిణీదారుడు బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూత

హైదరాబాద్‎లో ఏటా చేప మందును పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూశారు. ముషీరాబాద్, బొలక్ పూర్ లోని పద్మశాలి కాలనీలో నివాసం ఉంటున్న ఆయన ఇటీవలే అనారోగ్యం పాలయ్యారు.ఈ మేరకు బుధవారం పరిస్థితి విషమించడంతో అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు.

Asia Cup : ఆసియా కప్‌లో టీమిండియాకు మెరుగైన రికార్డు.. పాకిస్థాన్ ప్లేస్ ఎక్కడంటే..?

భారత జట్టు ఐర్లాండ్ పర్యటనలో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. ప్రస్తుతం క్రికెట్ అభిమానులు ఆసియా కప్‌ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ టోర్నీలో భాగంగా సెప్టెంబర్ 2న కాండీ వేదికగా పాక్, భారత్ జట్లు తలపడనున్నాయి.

చంద్రయాన్-3 బయోపిక్ చేయాలంటూ బాలీవుడ్ హీరోకు పెరుగుతున్న రిక్వెస్టులు 

చంద్రుడి దక్షిణ ధృవం మీద అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా భారతదేశం అరుదైన ఘనత సాధించింది. చంద్రయాన్-3, చంద్రుడిపై సురక్షితంగా అడుగుపెట్టిన క్షణం భారతీయుల ఛాతి గర్వంతో ఉప్పొంగింది.

క్రికెట్ అభిమానులకు సూపర్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్ల బుకింగ్ ఆ రోజు నుంచే..?

భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచ కప్ 2023కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఐసీసీ వార్మప్ మ్యాచుల షెడ్యూల్‌ను బుధవారం వెల్లడించిన విషయం తెలిసిందే.

తెలంగాణ, ఆంధ్ర‌ప్రదేశ్‌‌కు వర్ష సూచన.. వచ్చే ఐదు రోజుల పాటు వానలు

తెలుగు రాష్ట్రాల్లో మరో దఫా భారీ వానలు కురవనున్నాయి. ఈ మేరకు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. రానున్న 5 రోజులు జోరుగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

చంద్రయాన్ -3 ప్రయోగంలో భాగమైన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఇవే..

చంద్రయాన్-3 విజయంతో చందమామపై భారత్ ముద్ర వేసింది. కేవలం రూ.615 కోట్ల అతి తక్కువ ఖర్చుతో ప్రాజెక్ట్ చేపట్టిన ఇస్రో ఘన విజయం సాధించింది. దీంతో అంతరిక్ష వాణిజ్యంలో అగ్ర దేశాల సరసన సగర్వంగా నిలిచింది భారత్‌.

ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న ఇంట్రెస్టింగ్ సినిమాలు 

ప్రతీవారం ఓటీటీలో కొత్త కంటెంట్ విడుదలవుతూ ఉంటుంది. ఈ వారం కూడా సరికొత్త కంటెంట్ తో ఓటీటీ వేదికల్లో తమ సబ్ స్క్రయిబర్లను ఆనందింపచేయడానికి వచ్చేస్తున్నాయి.

కాలిఫోర్నియాలో దారుణం.. భార్యపై కోపంతో బైకర్స్ బార్‌లో కాల్పులు; ఐదుగురు మృతి 

అమెరికా కాలిఫోర్నియాలోని ఆరెంజ్ కౌంటీలోని దుండగుడు తుపాలతో రెచ్చిపోయాడు. విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.

రష్యా: విమాన ప్రమాదంలో వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ మృతి.. ఆశ్చర్యపోలేదని బైడన్ ప్రకటన 

రష్యా ప్రైవేటు సైన్యం వాగ్నెర్ మెర్సెనరీ గ్రూప్ చీఫ్ అధిపతి యెవ్జెనీ ప్రిగోజిన్ బుధవారం రాత్రి విమాన ప్రమాదంలో మరణించారు.

Happy Birthday Geetha Madhuri: 'చమ్కా చమ్కా' సాంగ్‍‌తో ఊపేసిన గీతామాధురి కెరీర్‌లోని ఆసక్తికర విషయాలు  

చిరుతలోని చమ్కా చమ్కీ చమ్కీరే, గోలీమార్ లోని మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళు పాటల పేర్లు చెప్పగానే సింగర్ గీతా మాధురి గుర్తొస్తుంది. మాస్ సాంగ్స్ పాడటంలో గీతా మాధురి స్టయిలే వేరు.

ఆగస్టు 24న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది.

హైదరాబాద్‎లో కాల్పుల కలకలం.. రెస్టారెంట్‌  మేనేజర్ మృతి 

హైదరాబాద్ మహానగరంలో నేరాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. మహిళలపై అఘాయిత్యాలు, లైంగిక వేధింపులు ఓ వైపు, దొంగతనాలు మరోవైపు తరచుగా జరుగుతుండటంతో నగర వాసులు బెంబెలిత్తిపోతున్నారు.

బెజవాడ బెంచ్ సర్కిల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 300 బైకులు దగ్ధం

విజయవాడలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని కేపీనగర్ ప్రాంతంలో ఉన్న టీవీఎస్ వాహనాల షోరూంలో షార్క్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి.