30 Aug 2023

భగవంత్ కేసరి మొదటి పాట: తెలంగాణ యాసలో ఆసక్తి రేపుతున్న బాలయ్య, శ్రీలీల డైలాగ్స్ 

బాలకృష్ణ హీరోగా నటిస్తున్న భగవంత్ కేసరి నుండి మొదటి పాట ప్రోమోను రిలీజ్ చేస్తామని చిత్రబృందం నిన్న ప్రకటించింది. అన్నట్లుగానే ఈరోజు గణేష్ ఆంథెమ్ ప్రోమోను రిలీజ్ చేసారు.

భక్తుల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?.. టీటీడీ, అటవీశాఖకు హైకోర్టు నోటీసులు 

అలిపిరి-తిరుమల మెట్ల మార్గంలో భక్తుల భద్రతపై దాఖలైన పిటిషన్‌పై బుధవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ చేపట్టింది.

ఇమ్యూనిటీ పెంచడం నుండి ఎముకలను దృఢంగా చేయడం వరకు గుమ్మడి విత్తనాల ప్రయోజనాలు

గుమ్మడి విత్తనాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, మెగ్నీషియం ఇంకా చాలా పోషకాలు ఉంటాయి.

ఆంధ్రప్రదేశ్‌: ఎస్సై ఉద్యోగాల ఫైనల్ రాత పరీక్షకు తేదీలు ఖరారు 

ఆంధ్రప్రదేశ్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల తుది రాత పరీక్షలకు షెడ్యూల్ విడుదలైంది.

హోండా హార్నెట్ 2.0 మోడల్ వచ్చేసింది.. అపాచీ ఆర్టీఆర్ 180తో సైసై

భారతీయ ఆటో మార్కెట్ లోకి హార్నెట్ 2.0 బైక్ ప్రవేశించింది. దేశీయ టూ వీల‌ర్స్ త‌యారీ సంస్థ హోండా మోటార్ సైకిల్ ఇండియా తీసుకొచ్చిన ఈ కొత్త ద్విచక్ర వాహనం ధర రూ.1.39(ఎక్స్ షోరూమ్‌) ల‌క్ష‌ల నుంచి ప్రారంభమవుతోంది. ఈ మేరకు మోటారు సైకిల్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

ఒక రోజులో మన శరీరానికి ఎన్ని కార్బోహైడ్రేట్లు అవసరమవుతాయో మీకు తెలుసా? 

మన శరీరానికి ప్రధానంగా శక్తినందించే వనరులుగా కార్బోహైడ్రేట్లను చెప్పుకోవచ్చు.

నూతన అధ్యాయానికి నాంది పలికిన ఇంగ్లండ్.. ఇక పురుషులతో సమానంగా!

ఇంగ్లండ్ క్రికెట్‌లో మరో కొత్త రూల్‌ను ప్రవేశపెట్టనున్నారు. మహిళా క్రికెటర్ల మ్యాచ్ ఫీజును పెంచుతున్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. పురుషుల జట్టుతో సమానంగా మహిళల జట్టుకు మ్యాచ్ ఫీజు చెల్లించనుంది.

వివాదాస్పద మ్యాప్ పై భారత్ తీవ్ర స్పందనకు బదులిచ్చిన డ్రాగన్ దేశం  

చైనా మరోసారి కయ్యానికి కాలు దువ్వుతోంది.ఈ మేరకు భారతదేశంలోని భూభాగాలను తమ ప్రాంతాలుగా చూపిస్తూ సోమవారం చైనా అధికారికంగా ఓ మ్యాప్‌ను విడుదల చేసింది.

మధ్యప్రదేశ్‌: అనారోగ్యంగా ఉన్న చిరుత పట్ల అనుచిత ప్రవర్తన 

మధ్యప్రదేశ్‌లోని ఇక్లెరా గ్రామంలో అనారోగ్యంతో ఉన్న చిరుత పట్ల స్థానికులు అనుచితంగా ప్రవర్తించారు.

ODI WC 2023 : బంగ్లాదేశ్‌కు గట్టి షాక్.. వరల్డ్ కప్‌కు స్టార్ పేసర్ దూరం

బంగ్లాదేశ్ జట్టుకు గట్టి షాక్ తగిలింది. మోకాలి గాయంతో బాధపడుతున్న ఆ జట్టు స్టార్ పేసర్ ఎబదాత్ హొసేప్ వన్డే వరల్డ్ కప్ మొత్తానికి దూరమయ్యాడు.

IND vs PAK: ఇండియా, పాక్ మ్యాచుకు ముందు ఐదు ప్రశ్నలను సంధించిన మాజీ క్రికెటర్

ఆసియా కప్ సమరం నేటి నుంచి ప్రారంభమైంది. క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా ఎదుచూస్తున్న భారత్, పాక్ దయాదుల పోరు సెప్టెంబర్ 2న మొదలు కానుంది.

ఆహారానికి సంబంధించిన విషయాల్లో మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసే గిన్నిస్ రికార్డ్స్ 

ఆహారానికి సంబంధించిన విషయంలో గిన్నిస్ రికార్డ్స్ గురించి మీకు తెలుసా?

ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా కేజ్రీవాల్‌.. ఆకాంక్షిస్తున్న ఆమ్‌ఆద్మీ పార్టీ

ఇండియా- విపక్షాల కూటమికి ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రస్తుత దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ ఉండాలని ఆప్‌ ఆకాంక్షిస్తోంది.

TS Liquor: తెలంగాణలో మద్యం షాపులకు బంపర్ ఆఫర్.. అప్పుపై లిక్కర్ సరఫరాకు గ్రీన్ సిగ్నల్ 

తెలంగాణలో మద్యం అమ్మకాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

స్టాక్‌ మార్కెట్‌లోకి ఫోన్‌పే.. సరికొత్త యాప్ లాంచ్ చేసిన డిజిటల్ పేమెంట్స్ సంస్థ

ప్రముఖ డిజిటల్‌ పేమెంట్స్‌ ఫోన్‌-పే దిగ్గజం, సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు స్టాక్ మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఫోన్ -పే సరికొత్త యాప్‌ను లాంచ్‌ చేసింది.

ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐ ఫోన్ 15 సిరీస్ లాంచ్ డేట్ ప్రకటన

ఆపిల్ సంస్థ ప్రతేడాది ఒక ఈవెంట్‌ను నిర్వహించి, ఆ ఈవెంట్ లో ఆ సంవత్సరానికి సంబంధించిన లేటెస్ట్ ఆపిల్ సిరీస్ ఐ ఫోన్స్ లాంచ్ చేస్తుంది.

7నిమిషాల్లో క్యాన్సర్ ట్రీట్‌మెంట్.. కొత్త ఇంజెక్షన్‌ను అభివృద్ధి చేసిన ఇంగ్లండ్ 

ఇంగ్లండ్‌లోని వందలాది మంది రోగులకు క్యాన్సర్‌కు చికిత్స చేసే ఇంజెక్షన్‌ను అందించడానికి బ్రిటన్ ప్రభుత్వ సంస్థ జాతీయ ఆరోగ్య సేవ( ఎన్‌హెచ్ఎస్) విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది.

బరువు పెరుగుతామనే భయం లేకుండా స్వీట్స్ ఎలా ఎంజాయ్ చేయాలో తెలుసుకోండి 

బరువు తగ్గాలనుకునేవారు కొన్ని ఆహారాలను పక్కన పెట్టాల్సి ఉంటుంది. అందులో స్వీట్స్ తప్పకుండా ఉంటుంది.

మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ అగ్రనేత హెచ్‌డీ కుమారస్వామి స్వల్ప అస్వస్థతతో బుధవారం ఆస్పత్రిలో చేరారు.

Asia Cup 2023 : ఆసియా కప్ కోసం శ్రీలంకకు చేరుకున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ

శ్రీలంక, పాకిస్థాన్ వేదికగా జరగనున్న ఆసియా కప్ టోర్నీ ఆడేందుకు భారత స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ శ్రీలంకకు చేరుకున్నారు. వారితో పాటు భారత ఆటగాళ్లు కూడా లంక గడ్డపై అడుగుపెట్టారు.

ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ను మిస్ చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి, కారణం ఇదే 

దర్శకద్వయం రాజ్ అండ్ డీకే రూపొందించిన ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఎంత పెద్ద విజయం అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

గుజరాత్‌లో తప్పిన రైలు ప్రమాదం.. పట్టాలపై అడ్డంగా ఇనుప స్తంభాలు

గుజరాత్‌లో పెను రైలు ప్రమాదం తప్పినట్టైంది. కొందరు దుండగులు పట్టాలపై అడ్డంగా ఇనుప స్తంభాలను వేశారు. ఈ మేరకు రైలును, పట్టాలు తప్పించేందుకు కుట్ర చేశారు.

రేపు ముంబైలో ప్రతిపక్షాల 'ఇండియా' కూటమి సమావేశం.. 27 పార్టీల హాజరు

2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయేను ఓడించేందుకు లక్ష్యంగా ప్రతిపక్షాల ఇండియా (ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్) కూటమి గురువారం మూడోసారి సమావేశం అవుతోంది.

Asia Cup : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్

ఆసియా కప్ 2023 ప్రారంభమైంది. ముల్తాన్ వేదికగా నేడు నేపాల్ తో జరుగుతున్న ఈ వన్డే మ్యాచులో మొదట టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది.

శరీరంలోని విష పదార్థాలను తొలగించే ప్రత్యేక ఆహారాలు నిజంగా ఉన్నాయా? ఇది తెలుసుకోండి 

డిటాక్స్ టైట్.. శరీరంలోని మలిన పదార్థాలను బయటకు తొలగించే ఆహారాలను డిటాక్స్ డైట్ అనే పేరుతో పిలుస్తారు. ఇవి శరీరంలోని విష పదార్థాలను తొలగించి ఆరోగ్యాన్ని అందిస్తాయి.

మా అమ్మనాన్మ కలను నిజం చేసినందుకు ఆనంద్ మహీంద్రాకు థ్యాంక్స్ : ప్రజ్ఞానంద

మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్స్ చైర్మన్ ఆనంద్ మహీంద్రకు ఫీడే వరల్డ్ కప్ రన్నరప్ ప్రజ్ఞానంద థ్యాంక్స్ చెప్పారు.

ఒక్క పోస్ట్ తో అందరికీ ఆసక్తి కలిగించిన విజయ్ దేవరకొండ, ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? 

విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా రూపొందిన ఖుషి చిత్రం మరో రెండు రోజుల్లో థియేటర్లలో దర్శనమివ్వబోతుంది.

Andy Murray : ఆండ్రీ ముర్రే అరుదైన ఘనత.. 200వ మ్యాచులో విజయం

ప్రపంచ మాజీ నంబర్ వన్ ఆండ్రీ ముర్రే అరుదైన ఘనతను సాధించాడు. గురువారం న్యూయార్క్‌లో జరిగిన యూఎస్ ఓపెన్‌లో ఆ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు.

అంతర్గత వాహన తనిఖీలు పూర్తి చేసుకున్న ఆదిత్య ఎల్-1.. సూర్యుడి వైపు దుసుకెళ్లేందుకు రెఢీ

ఆదిత్య ఎల్-1 మిషన్ రెండో ల్యాంచ్ ప్యాడ్ నుంచి నింగికి దూసుకెళ్లేందుకు సంసిద్ధమవుతోంది. ఈ మేరకు తుదిదశ కసరత్తు పూర్తయిందని ఇస్రో ప్రకటించింది.

చంద్రయాన్-3: విక్రమ్ ల్యాండర్ ఫోటోలు తీసిన రోవర్.. ట్వీట్ చేసిన ఇస్రో

చంద్రయాన్-3 ప్రయోగంలో చంద్రుడిపై దిగిన ప్రజ్ఞాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్ నుంచి కొత్త అప్డేట్ వచ్చింది.

జీ20 సమ్మిట్‌ వేళ.. తెరిచి ఉండేవి ఏవి? మూసి ఉండేవి ఏవో తెలుసుకుందాం 

సెప్టెంబర్ 9,10 తేదీల్లో దిల్లీలో ప్రతిష్ఠాత్మక జీ20 సదస్సు కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వబోతోంది.

ప్రముఖ డెలివరీ సంస్థ జోమాటో షేర్లకు రెక్కలు.. 5 శాతం పెరిగిన ధరలు

దేశీయంగా ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో అద్భుతంగా పుంజుకుంది. ఈ మేరకు కంపెనీ షేర్లు 5 శాతానికి ఎగబాకాయి.

రష్యా సంచలన నిర్ణయం.. చైనాలో పర్యటించేందుకు పుతిన్ గ్రీన్ సిగ్నల్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఈ ఏడాది అక్టోబరులో చైనాలో పర్యటించనున్నారు.

Food: ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఖచ్చితంగా ఎందుకు తినాలి? తినకపోతే ఏమవుతుంది? 

ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయకుండా డైరెక్ట్ గా లంచ్ చేసే అలవాటు మీకుందా? మీరు బ్రేక్ ఫాస్ట్ చేయడం లేదా? అయితే మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి.

Asia Cup 2023: గతంలో భారత్, పాకిస్తాన్ లేకుండా ఆసియా కప్.. ఎందుకో తెలుసా?

క్రికెట్ అభిమానులు ఉత్కంఠం ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2023 సమరం నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అప్గనిస్తాన్, నేపాల్ జట్లు తలపడనున్నాయి.

India G20 presidency: 'జీ20' అంటే ఏమిటి?కూటమికి అధ్యక్షత వహించడం ద్వారా భారత్ ఏమి ఆశిస్తోంది? 

భారత్ అధ్యక్షతన తొలిసారిగా జరగనున్న జీ20 సదస్సుకు కేవలం 9రోజుల సమయం మాత్రమే ఉంది.

కోరుట్లలో తీవ్ర కలకలం.. అనుమానాస్పద స్థితిలో అక్క మృతి, బస్సు ఎక్కి వెళ్లిపోయిన చెల్లెలు

తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్లలో ఘోరం జరిగిపోయింది. ఓ ఇంట్లో అక్క దీప్తి మృతిచెందగా, ఆమె చెల్లెలు అదృశ్యమైన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

రాఖీ పండగ: అన్నాచెల్లెళ్ళు, అక్కాతమ్ముళ్ళు మధ్య అనుబంధాన్ని గుర్తు చేసే తెలుగు పాటలు 

రాఖీ.. అక్కా తమ్ముడు అన్నాచెల్లి మధ్య అమితమైన అనుబంధాన్ని పెంచుతుంది.

తమిళనాడులో వీధి కుక్కల అరాచకం.. బాలికను రక్షించిన స్థానికులు

దేశవ్యాప్తంగా వీధి కుక్కలు హల్ చల్ చేస్తున్నాయి. విచక్షణారహితంగా మనుషులపై దాడులకు పూనుకుంటున్నాయి. దీంతో బయటకెళ్లాలంటే కొన్ని ప్రాంతాల్లో దడ పుడుతోంది.

Asia Cup 2023: వారిద్దరి వల్లే పాక్ పటిష్టంగా తయారైంది: రవిచంద్రన్ అశ్విన్

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2023 టోర్నీ నేటి నుంచి ఆరంభం కానుంది. ముల్తాన్ వేదికగా జరిగే ఆరంభ వేడుకులను ఘనంగా నిర్వహించేందుకు పాక్ క్రికెట్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.

రాఖీ పండగ: ముహూర్తం, తెలుసుకోవాల్సిన విషయాలు, రాఖీ కట్టడానికి సరైన సమయాలు 

ప్రతీ ఏడాది శ్రావణమాసంలో పౌర్ణమి రోజున రాఖీ పండుగ జరుపుకుంటారు. అక్కా చెల్లెల్లు అన్నదమ్ములకు రాఖీ కట్టి తమకు ఎప్పుడు రక్షణగా ఉండాలని కోరుకుంటారు.

హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన భారత్ వరల్డ్ కప్ మ్యాచుల ఫ్రీ సేల్ టికెట్లు.. నిరాశలో అభిమానులు

టీమిండియా వరల్డ్ కప్ 2023 మ్యాచుల టికెట్ల విక్రయాలు మంగళవారం సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభమయ్యాయి.

Delhi: దిల్లీలో తుపాకీ కాల్పులు.. అమెజాన్‌ మేనేజర్‌ మృతి 

దిల్లీలోని భజన్‌పురా ప్రాంతంలో మంగళవారం రాత్రి తుపాకీ కాల్పులు కలకలం రేపాయి.

మణిపూర్‌లో ఆగని హింసకాండ.. ఖోయిరెంటాక్‌లో ప్రతీకార కాల్పుల్లో వ్యక్తి మృతి

మణిపూర్‌లో హింసాత్మకమైన ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా జరిగిన అల్లర్లలో మరో వ్యక్తి ప్రాణం గాల్లో కలిసిపోయింది. కుకీ-జో గ్రామంపై మూక దాడి చేయడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు.

అల్లు అర్జున్ డైలీ రొటీన్ ఎలా ఉంటుందో తెలుసా? ఇన్స్ టాగ్రామ్ పంచుకున్న వీడియో చూడండి 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఇన్ స్టాగ్రామ్ కోలాబరేషన్ అయింది. ఈ కొలాబరేషన్ లో భాగంగా ఇంట్రెస్టింగ్ వీడియోను ఇన్ స్టాగ్రామ్ షేర్ చేసింది.

కోడికత్తిని అందించింది మంత్రి బొత్స మేనల్లుడే: న్యాయవాది సలీం సంచలన వ్యాఖ్యలు 

కోడికత్తి కేసులో నిందితుడు జనపల్లి శ్రీనివాసరావు తరఫున వాదిస్తున్న లాయర్ సలీం సంచలన ఆరోపణలు చేశారు.

తెలంగాణలో కొత్తగా 20 కేజీబీవీలకు కేంద్రం పచ్చజెండా.. కొత్త విద్యాలయాల జాబితా ఇదే 

తెలంగాణలో కొత్తగా కేజీబీవీ విద్యాలయాలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు 20 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రికరింగ్ బడ్జెట్ పేరిట రూ.60 లక్షల నిధులను విడుదల చేసింది.

వందశాతం ఇథనాల్‌తో నడిచే టయోటా కారు వచ్చేసిందోచ్.. పెట్రోల్ అవసరం లేదు

ప్రపంచ మార్కెట్లోకి టయోటా మోటర్ నుంచి ఇన్నోవా హైక్రాస్ ఎంపీవీ కారు వచ్చేసింది.

జాతీయ పోషకాహార వారోత్సవాలు: మిల్లెట్స్ పై ఫోకస్ తో ఫుడ్ ఫెయిర్ నిర్వహిస్తున్న గ్లాన్స్

స్మార్ట్ ఫోన్ లాక్ స్క్రీన్ పై వార్తలను అందించే గ్లాన్స్, జాతీయ పోషకాహార వారోత్సవాల సందర్భంగా ఫుడ్ ఫెయిర్ పేరుతో క్యాంపెయిన్ నిర్వహించడానికి సిద్ధమవుతోంది.

రాఖీ పండగ: ఇంట్లో ఆడే ఆటలతో పండగను మరింత ఉత్సాహంగా మార్చేయండి 

రాఖీ పండగ అంటే కేవలం రాఖీ కట్టడమే కాదు, అన్నాతమ్ముళ్ళు, అక్కాచెల్లెళ్ళ మధ్య బంధాన్ని బలపర్చడం కూడా. ప్రస్తుతం ఆ బంధాలను బలపర్చడానికి కొన్ని ఆటలను మీకు పరిచయం చేస్తున్నాం.

చైనా మ్యాప్‌పై ప్రధాని మోదీ మాట్లాడాల్సిందే: రాహుల్ గాంధీ

అరుణాచల్ ప్రదేశ్‌ను చైనాలో అంతర్భాగంగా పేర్కొంటూ.. ఆ దేశం మ్యాప్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే.

Asia Cup 2023: నేటి నుంచి ఆసియా కప్ పోరు.. తొలి మ్యాచులో పాకిస్థాన్-నేపాల్ ఢీ

క్రికెట్ అభిమానులు ఎంతో అతృతగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2023 నేటి నుంచి ప్రారంభం కానుంది.

రష్యా విమానాశ్రయంపై డ్రోన్ల దాడి.. నుజ్జునుజ్జు అయిన నాలుగు విమానాలు

రష్యాలోని ఎయిర్‌పోర్టుపై భారీ స్థాయిలో డ్రోన్లు విరుచుకుపడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఊహించని రీతిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఘటనలో నాలుగు రవాణా విమానాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

Minority Scholarship Scam: మైనారిటీ స్కాలర్‌షిప్ కుంభకోణం; సీబీఐ కేసు నమోదు 

మైనారిటీ స్కాలర్‌షిప్ కుంభకోణం కేసులో సీబీఐ వివిధ ప్రభుత్వ సంస్థలు, బ్యాంకుల అధికారులపై కేసు నమోదు చేసింది.

జైలర్ ఫుల్ మూవీ ఆన్ లైన్ లో లీక్: ఆందోళలో చిత్రబృందం 

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమా బాక్సాఫీస్ వద్ద 600 కోట్ల కలెక్షన్లను వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 10వ తేదీన రిలీజ్ అయిన ఈ చిత్రం ఇప్పటికి కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వరద పారిస్తోంది.

ఆగస్టు 30న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.

సింగపూర్‌కు బియ్యం ఎగుమతికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

సింగపూర్ దేశానికి బియ్యం ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇండియాకు సింగపూర్ తో ప్రత్యేక సంబంధాలున్నాయి.

తెలంగాణ: అర్చకులకు గుడ్ న్యూస్.. జీతాలు, ఆలయ నిర్వహణ సాయంపెంపు 

తెలంగాణలోని అర్చకుల వేతనాలతో కూడిన 'ధూప దీప నైవేద్యం' సాయాన్ని భారీగా పెంచాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు.

చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో సల్ఫర్‌ను కనుగొన్న ప్రగ్యాన్ రోవర్, హైడ్రోజన్ కోసం అన్వేషణ

చంద్రయాన్-3 ప్రజ్ఞాన్ రోవర్ దక్షిణ ధ్రువం సమీపంలో చంద్రుని ఉపరితలంలో సల్ఫర్ ఉనికిని ధృవీకరించిందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మంగళవారం తెలిపింది.

29 Aug 2023

తోష్ ఖానా కేసులో ఇమ్రాన్ కు ఊరట..విడుదలైన గంటలోపే మళ్లీ అరెస్ట్ 

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఇస్లామాబాద్ హైకోర్టు ఉపశమనం కల్పించింది.

తెలంగాణ: పారా మెడికల్‌ కోర్సుల్లో 10శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ వర్తింపు

మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది.

ఉత్తర్‌ప్రదేశ్: విద్యార్థినులపై ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులు.. సీఎంకు రక్తంతో లేఖ రాసిన బాలికలు 

తమ ప్రిన్సిపాల్ తమను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ ఓ పాఠశాల విద్యార్థులు ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు రక్తంతో లేఖ రాశారు.

Maruthi: భారీ ప్రణాళికతో ముందుకొచ్చిన మారుతీ.. ఏకంగా 45వేల కోట్ల పెట్టుబడులు!

వార్షిక సాధారణ సమావేశంలో మారుతీ సుజుకీ కీలక నిర్ణయాలను తీసుకుంది. వచ్చే ఎనిమిదేళ్లలో తమ వార్షిక తయారీ సామర్థ్యాన్ని 40 లక్షల యూనిట్లకు పెంచుతున్నట్లు ఇండియా ఛైర్మన్ ఆర్.సి.భార్గవ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్: రిజిస్ట్రేషన్ల కోసం 'కార్డ్‌ ప్రైమ్‌' సాఫ్ట్ వేర్ .. 31వ తేదీ నుంచి అమలు 

సాంకేతిక యుగంలో అన్ని అరచేతిలోనే జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Rishabh Pant: చెమటొడ్చి సైక్లింగ్ చేసిన రిషబ్.. సోషల్ మీడియాలో వీడియో!

గతేడాది రోడ్డు ప్రమాదానికి గురైన టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు.

భగవంత్ కేసరి ప్రమోషన్ పనులు మొదలు: మొదటి పాట రిలీజ్ పై అప్డేట్ 

బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న భగవంత్ కేసరి సినిమా నుండి తాజాగా కీలక అప్డేట్ వచ్చింది.

TATA EVs: ఇక కొత్త బ్రాండ్‌తో దర్శనమివ్వనున్న టాటా విద్యుత్ వాహనాలు 

విద్యుత్ వాహనాలకు మార్కెట్లో రోజు రోజుకు డిమాండ్ పెరుగుతోంది. ఈ తరుణంలో వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న ఇంట్రెస్టింగ్ కంటెంట్ 

ఈ వారం థియేటర్లలో మంచి మంచి సినిమాలు రాబోతున్నాయి. అలాగే ఇటు ఓటీటీలో కూడా ఆసక్తికరమైన కంటెంట్ రిలీజ్ అవుతోంది.

'ఫస్ట్‌క్రై.కామ్' సీఈఓపై పన్ను ఎగవేత ఆరోపణలు.. ఐటీ శాఖ దర్యాప్తు 

ఆన్‌లైన్ బేబీ కేర్ ప్రొడక్ట్స్ ప్లాట్‌ఫారమ్ 'ఫస్ట్‌క్రై.కామ్' వ్యవస్థాపకుడు సుపమ్ మహేశ్వరి పన్ను ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

Rumion vs Ertiga: రుమియన్​- ఎర్టిగాలో ఉన్న పోలికలు ఇవే.. ఏదీ కొనచ్చు!

జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ టయోటా, తాజాగా రుమియన్‌ని ఇండియాలో లాంచ్ చేసింది.

ఎలాంటి చర్చ జరగకుండానే ముగిసిన మణిపూర్ అసెంబ్లీ సమావేశాలు 

మణిపూర్ వర్షాకాల సమావేశాలు ఎలాంటి చర్చ లేకుండానే, అర్ధాంతరంగా ముగిశాయి. మణిపూర్‌లో జాతి ఘర్షణలు చెలరేగిన తర్వాత తొలిసారి మంగళవారం సమావేశమైన అసెంబ్లీలో గందరగోళం నెలకొంది.

ధనుష్ పాన్ ఇండియా ప్రాజెక్టులో కింగ్ నాగార్జున: అధికారికంగా ప్రకటించిన మేకర్స్ 

తమిళ నటుడు ధనుష్, 'సార్' సినిమాతో తెలుగులోకి డైరెక్ట్ గా ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు.

జమ్ముకశ్మీర్ కు కేంద్ర పాలిత హోదా శాశ్వతం కాదు: సుప్రీంకోర్టుతో కేంద్రం 

జమ్ముకశ్మీర్ కు కేంద్ర పాలిత హోదా శాశ్వత విషయం కాదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ అంశంపై ఆగస్టు 31న సుప్రీంకోర్టు ముందు వివరణాత్మక సమాచారాన్ని ఉంచుతామని మంగళవారం తెలిపింది.

Neeraj Chopra: నీరజ్ చొప్రా తల్లి మనసు నిజంగానే బంగారం.. ఎందుకంటే?

ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్‌లో నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించి చరిత్రకెక్కాడు. దీంతో నీరజ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

మీరు ఇష్టంగా తినే జిలేబీ, గులాబ్ జామూన్ భారతదేశానివి కావని మీకు తెలుసా?

భారతదేశంలో భిన్న సంస్కృతులు, భిన్న ఆచారాలు, సాంప్రదాయాలు కనిపిస్తుంటాయి. తినే ఆహారం విషయంలోనూ భిన్నమైన వెరైటీలు దర్శనమిస్తుంటాయి.

Hero Karizma XMR 210 : కరిష్మా నుంచి కొత్త బైక్.. స్టైలిష్ లుక్, అట్రాక్టివ్ ఫీచర్లు

ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ హీరో మోటోకార్ప్, ఇండియా మార్కెట్లోకి నూతన బైక్ ను రిలీజ్ చేసింది.

Cooking Gas: గుడ్ న్యూస్.. వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.200 తగ్గించాలని కేంద్రం నిర్ణయం 

రాఖీ పండగ వేళ కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు 14 కిలోల వంటగ్యాస్ సిలిండర్ ధరను తగ్గించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది.

యూఎస్ ఓపెన్‌లో విజయం సాధించిన డొమినిక్ థీమ్

ఆస్ట్రియన్ స్టార్ డొమినిక్ థీమ్ ఎట్టకేలకు యూఎస్ ఓపెన్‌లో సత్తా చాటాడు. 25వ సీడ్ అలెగ్జాండర్ బుబ్లిక్‌ను డొమినిక్ థీమ్ ఓడించి రెండో రౌండ్‌కు అర్హత సాధించాడు.

'అయ్యో తప్పు జరిగింది'.. బిహార్‌లో కులగణన సర్వేపై అఫిడవిట్‌ను ఉపసంహరించుకున్న కేంద్రం 

బిహార్ ప్రభుత్వం నిర్వహించిన కుల గణన సర్వేపై సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌ను కేంద్రం ఉపసంహరించుకుంది.

సూపర్ బ్లూ మూన్: ఆగస్టు 30వ తేదీన ఏ సమయంలో చంద్రుడు అత్యంత పెద్దగా కనిపిస్తాడో తెలుసా? 

బ్లూ మూన్ గురించి మనందరికీ తెలుసు. ఒక నెలలో రెండవసారి పౌర్ణమి రావడాన్ని బ్లూ మూన్ అని పిలుస్తారు.

మార్క్ ఆంటోనీ: విశాల్ పుట్టినరోజు కానుకగా సర్ప్రైజ్ వీడియో విడుదల 

హీరో విశాల్ నుండి వస్తున్న సరికొత్త చిత్రం మార్క్ ఆంటోనీ. యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో రూపొందిన ఈ సినిమా నుండి విశాల్ పుట్టినరోజు సందర్భంగా సర్ప్రైజ్ వీడియోను రిలీజ్ చేసారు.

Asia Cup 2023: ఆసియా కప్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్.. తొలి రెండు మ్యాచులకు స్టార్ ప్లేయర్ దూరం

ఆసియా కప్‌కు ముందు భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గాయం తర్వాత జట్టుకు ఎంపికైన స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ తొలి రెండు మ్యాచులకు అందుబాటులో ఉండడం లేదని కోచ్ రాహుల్ ద్రవిడ్ ధ్రువీకరించాడు.

అమెజాన్ ఉద్యోగులకు సీఈఓ హెచ్చరిక.. ఆఫీసుకు రావాల్సిందే, లేదంటే..

ఈ సంవత్సరం ప్రారంభంలో, దిగ్గజ ఈ- కామర్స్ సంస్థ అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు కార్యాలయానికి రావాలని చెప్పారు.

తెలంగాణ: రైతులకు బ్యాడ్ న్యూస్.. సెప్టెంబర్‌లో కూడా వర్షాలు లేనట్టే 

తెలంగాణలో వర్షాలు మొహం చాటేశాయి. రాష్ట్రంలోకి ఆలస్యంగా ప్రవేశించిన రుతుపవనాలు.. రానురాను బలహీనపడుతూ వచ్చాయి.

కాశ్మీర్ విల్లో క్రికెట్ బ్యాట్‌లకు భలే డిమాండ్.. కొడితే సిక్సులే!

కాశ్మీర్ విల్లో క్రికెట్ బ్యాట్‌లకు రోజు రోజుకు డిమాండ్ పెరుగుతోంది. ఈ బ్యాట్లను వినియోగించే అంతర్జాతీయ క్రికెటర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరిన వైఎస్ జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి 

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్సార్‌సీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టును ఆశ్రయించారు.

అందరి ముందు హీరోయిన్ కు ముద్దు పెట్టిన డైరెక్టర్: విమర్శిస్తున్న నెటిజన్లు 

రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం తిరగబడరా సామీ. అమాయకుడైన హీరో అనుకోని కారణాలవల్ల విలన్లను ఎదుర్కోవాల్సి వస్తే ఎలా ఉంటుందనే పాయింట్ తో తెరకెక్కుతున్న తిరగబడరా సామీ చిత్ర ట్రైలర్ నిన్న రిలీజ్ అయింది.

అదానీ గ్రూప్ షేర్లలో షార్ట్ సెల్లింగ్ వల్ల 12 సంస్థలు లాభపడ్డాయి: రిపోర్ట్ 

విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPIలు),విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIలు) సహా దాదాపు డజను కంపెనీలు, అదానీ గ్రూప్ షేర్లలో షార్ట్ సెల్లింగ్‌లో "అగ్ర లబ్ధిదారులు"గా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) గుర్తించిందని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది.

గెలిస్తేనే కెప్టెన్లను గుర్తు పెట్టుకుంటారు.. రోహిత్ శర్మపై గవాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని నాయకత్వంలో 2013లో చివరిసారిగా ఐసీసీ ట్రోఫీని నెగ్గింది.

తెలుగు భాషా దినోత్సవం రోజున తెలుగు గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైన విషయాలు 

దేశభాషలందు తెలుగు లెస్స అన్నారు శ్రీకృష్ణ దేవరాయలు. ఆయన కర్ణాటక మహారాజు. అయినా కూడా తెలుగు భాష గురించి గొప్పగా పొగిడారంటే తెలుగు భాష గొప్పదనం అర్థం చేసుకోవచ్చు.

మారని చైనా వక్రబుద్ధి.. అరుణాచల్ తమ అంతర్భాగమంటూ మ్యాప్ విడుదల

భారత్ ఎంత శాంతియుతంగా ఉన్నా, చైనా మాత్రం తన వంకర బుద్దిని మార్చుకోవడం లేదు. భారత్‌తో ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వుతున్న విధంగా వ్యవహరిస్తుంది.

Toyoto: మరోసారి టయోటా తయారీ ప్లాంట్ల మూసివేత.. కార్ల ఉత్పత్తికి బ్రేక్

ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా మరోసారి తయారీ కేంద్రాలను మూసివేసింది. జపాన్‌లోని 14 తయారీ కేంద్రాలను మూసివేసినట్లు ఆ సంస్థ స్పష్టం చేసింది.

ప్రభాస్ అభిమానులకు పండగలాంటి వార్త: సలార్ ట్రైలర్ వచ్చేది ఆరోజే? 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా గురించి అభిమానులు అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

దిల్లీ మద్యం స్కామ్‌ను విచారిస్తున్న ఈడీ అధికారిపై సీబీఐ కేసు 

దిల్లీ మద్యం స్కామ్ కేసులో నిందితుడైన వ్యాపారవేత్త అమన్‌దీప్ సింగ్ ధాల్ నుంచి రూ.5 కోట్లు లంచం తీసుకున్న ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారిని సీబీఐ సోమవారం అరెస్టు చేసింది.

BMW X5 SUV : పేలుళ్లకు బెదరని బీఎండబ్ల్యూ X5 ఎస్‌యూవీ

జర్మన్ వాహన తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ప్రయాణికుల భద్రత కోసం సరికొత్త ఎస్‌యూవీతో ముందుకు రానుంది.

నా సామిరంగ అంటున్న నాగార్జున: లుంగీ కట్టి మాస్ లుక్ లో దర్శనమిచ్చిన మన్మధుడు 

ఘోస్ట్ తర్వాత అక్కినేని నాగార్జున తర్వాతి చిత్రంపై చాలా రోజులుగా క్లారిటీ రాలేదు. తాజాగా అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా కొత్త చిత్రాన్ని ప్రకటించారు.

నేటి నుంచి మణిపూర్ అసెంబ్లీ సమావేశాలు; రాష్ట్రంలో హింస చెలరేగిన తర్వాత తొలిసారి భేటీ 

మణిపూర్‌ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ఉదయం 11గంటలకు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో జాతి హింస చెలరేగిన తర్వాత తొలిసారిగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి.

మోదీకి పుతిన్ ఫోన్.. G20 సమ్మిట్‌కు రష్యా తరఫున విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్

న్యూ దిల్లీలో జరగనున్న జీ20 సదస్సులో పాల్గొనేందుకు తాను భారత్‌కు రాలేనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీకి తెలిపారు.

కియా మోటర్స్ నుంచి ఈవీ5 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. లాంచ్ ఎప్పుడంటే?

ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ కియా మోటర్స్ మరో నూతన ఎస్‌యూవీతో ముందుకు రానుంది. తాజాగా కియా ఈవీ5ని చైనాలో జరిగిన ఆటో షోలో ఆవిష్కరించింది.

మీకు తెలియకుండానే మీరు ఎక్కువగా తినేస్తున్నారా? ఈ టిప్స్ తో తక్కువ తినడం అలవాటు చేసుకోండి 

ఆహారం విషయంలో మీరు కంట్రోల్ కోల్పోతున్నారా? ప్రతీసారి తక్కువ తిందామని ఆలోచించి చివరికి ఎక్కువగా తినేస్తున్నారా? బరువు తగ్గాలనుకుని తక్కువగా తినాలనే ఆలోచన మీకుందా?

హౌసింగ్ సొసైటీలో మహిళా గార్డుపై అత్యాచారం.. ఆపై ఆమె మృతి 

ఉత్తర్‌ప్రదేశ్ ఘజియాబాద్‌లోని హౌసింగ్ సొసైటీలో పనిచేస్తున్న 19ఏళ్ల మహిళా సెక్యూరిటీ గార్డుపై సూపర్‌వైజర్ అత్యాచారం చేశాడు.

జైలర్ సినిమాలో ఆ సీన్ తొలగించమని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు 

రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులుపుతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అటు తమిళంలోనూ ఇటు తెలుగులోనూ వసూళ్ల సునామీని సృష్టిస్తోంది.

Asia Cup 2023 : టీమిండియా అసలు బలం ఎందులో ఉంది.. ఆ స్థానంపై క్లారిటీ వచ్చేనా! 

మరికొన్ని గంటల్లో ఆసియా కప్ ప్రారంభం కానుంది. ఆగస్టు 30న నేపాల్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే పోరుతో ఆసియా కప్ కు తెర లేవనుంది.

జీ20 సదస్సు: దిల్లీలో భద్రత కట్టుదిట్టం.. భారీగా బలగాల మోహరింపు.. 1000మంది కమాండోలకు ప్రత్యేక శిక్షణ 

మరో 10రోజుల్లో దిల్లీలో జీ20 శిఖరాగ్ర సమావేశం జరగనుంది. దేశవిదేశాల నుంచి హై ప్రొఫైల్ ఉన్న నాయకులు దిల్లీకి రానున్నారు.

అమెరికా:యూనివర్సిటీ ఆఫ్‌ నార్త్‌ కరోలినాలో కాల్పుల కలకలం.. ప్రొఫెసర్ మృతి 

అమెరికా నార్త్‌ కరోలినా చాపెల్‌ హిల్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ నార్త్‌ కరోలినాలో కాల్పులు కలకలం సృష్టించాయి.

తెలుగు సినిమా: సెప్టెంబర్ లో రిలీజ్ అవుతున్న ఆసక్తికరమైన సినిమాలు 

తెలుగు బాక్స్ ఆఫీస్ వద్ద మెరుపులు మెరిపించడానికి సినిమాలు సిద్ధమైపోతున్నాయి. ఆగస్టులో విడుదలైన సినిమాలు పూర్తి కావడంతో ఇప్పుడు అందరి కళ్ళన్నీ సెప్టెంబర్ మీదే ఉన్నాయి.

ఆగస్టు 29న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది.

ఆర్టికల్ 35A జమ్ముకశ్మీర్ ప్రజల ప్రాథమిక హక్కులను తొలగించింది: ప్రధాన న్యాయమూర్తి

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 35A జమ్ముకశ్మీర్ ప్రజల ప్రాథమిక హక్కులను హరించివేసిందని భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ సోమవారం అన్నారు.