15 Jul 2023

అబుదాబిలో ఐఐటీ-దిల్లీ క్యాంపస్ ఏర్పాటు; భారత్- యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు 

ప్రధాని నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) పర్యటన ముగిసింది. ఈ సందర్భంగా యూఏఈ అధ్యక్షుడు అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌- ప్రధాని మోదీ మధ్య కీలక ద్వైపాక్షిక చర్చలు జరిగాయి.

ఖుషి షూటింగ్ పూర్తి; చిత్ర యూనిట్ సెలబ్రేషన్స్

విజ‌య్ దేవ‌ర‌కొండ, సమంత జంటగా న‌టిస్తున్న తాజా చిత్రం 'ఖుషి' షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ మేరకు నిర్మాణ సంస్థ తాజా అప్‌డేట్ ఇచ్చింది. షూట్ పూర్తైన సంద‌ర్భాన్ని పురస్కరించుకుని చిత్ర బృందంతో కలిసి విజ‌య్ కేక్ క‌ట్ చేశాడు.

వరదల్లో చిక్కుకున్న రూ.కోటి విలువ చేసే ఎద్దు; రక్షించిన ఎన్టీఆర్ఎఫ్ బృందాలు

దిల్లీలో యమునా నది మహోగ్రరూపం దాల్చడంతో వరద నోయిడాను సైతం చుట్టుముట్టింది. వరదల ధాటికి మూగ జీవాలు అల్లాడిపోతున్నాయి. ఈ క్రమంలో రూ.కోటి విలువైన ఏడేళ్ల ఎద్దు ఒకటి నీటిలో చిక్కుకుపోయింది. దాన్ని కాపాడేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ రంగంలోకి దిగింది.

కటిక చీకట్ల కాంగ్రెస్ కావాలా? కరెంట్ వెలుగుల బీఆర్ఎస్ కావాలా?: కేటీఆర్

తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాష్ట్రంలో 24 గంటల ఉచిత కరెంట్‌పై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

US Open: సెమీస్‌కు చేరిన లక్ష్య సేన్, సింధు ఓటమి

భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు లక్ష్య సేన్ యూఎస్ ఓపెన్-2023 పురుషుల సింగిల్స్‌లో సత్తా చాటాడు. సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లాడు.

ఏపీలో కబ్జాలపాలైన అటవీభూములను రక్షించాలని కేంద్రానికి చంద్రబాబు లేఖ

ఆంధ్రప్రదేశ్ లో అటవీ భూములు అన్యాక్రాంతంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాశారు. ఈ మేరకు విలువైన భూమిని కాపాడాలని కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌ను కోరారు.

తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని నెలకోల్పుతాం: భట్టి విక్రమార్క

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని జనం కోరుకుంటున్నట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. ఈ మేరకు ప్రజల సంపదను ప్రజలకే పంచేందుకు ఇందిరమ్మ రాజ్యం రావాలని ఆశిస్తున్నారన్నారు.

పరువు నష్టం కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ

పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మోదీ ఇంటి పేరుపై వ్యాఖ్యల కేసులో సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై స్టే విధించాలని కోరుతూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన సాయి పల్లవి; తల్లిదండ్రులపై ఇన్‌స్టాలో భావోద్వేగ పోస్ట్

తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి దక్షిణాదిన తనకంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సాయి పల్లవి. ఇటీవలే తన తల్లిదండ్రులతో కలిసి అమర్‌నాథ్ యాత్రను పూర్తి చేశారు.

BRO: 'బ్రో' మూవీ రెండో సాంగ్ రిలీజ్, అదిరిపోయిన 'జానవులే నెరజానవులే' మెలోడీ 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన 'బ్రో(BRO)' మరో అప్డేట్ వచ్చింది. 'జానవులే నెరజానవులే' అంటూ సాగే మెలోడీ సాంగ్‌ను చిత్ర యూనిట్ శనివారం రెండో సాంగ్‌ను విడుదల చేసింది.

తెలంగాణలో వచ్చే 5రోజులు వానలే వానలు.. ఎల్లో అలెర్ట్ జారీ

తెలంగాణలో నైరుతి రుతుపవనాలు జోరు అందుకోనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తూ భారీ వర్షాలను కురిపించనున్నాయి.

కూరగాయల ధరల పెరుగుదలపై అసోం సీఎంకు ఓవైసీ స్ట్రాంగ్ రిప్లే

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ముస్లిం వ్యాపారులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ముస్లిం వ్యాపారుల వల్లే గువాహటిలో కూరగాయల రేట్లు పెరుగుతున్నాయని సీఎం ఆరోపించారు.

భారత మార్కెట్‌లో BMW X5 విడుదల; ధర రూ.93.90లక్షలు

ప్రముఖ వాహనాల తయారీ దిగ్గజం బీఎండబ్ల్యూ ఇండియా '2023 BMW X5' మోడల్ కారును భారత మార్కెట్‌లో విడుదల చేసింది.

యమునా వరదలపై ఆప్ సంచలన ఆరోపణలు.. బీజేపీ కుట్రే అంటున్న కేజ్రీవాల్ సర్కార్

దిల్లీని వరదలు ముంచేస్తున్న తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. యమునా వరదలు బీజేపీ సృష్టి అంటూ ఆప్ ప్రభుత్వం బాంబ్ పేల్చింది.

ఆంధ్రప్రదేశ్‌లో గంజాయిని అరికట్టాలంటూ గవర్నర్‌కు లోకేశ్ ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్ లో గంజాయి ఏరులై పారుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన లోకేశ్ డ్రగ్స్‌ను అరికట్టాలని ఫిర్యాదు చేశారు.

కోనసీమ: బోరుబావి నుంచి భారీగా ఎగసిపడుతున్న గ్యాస్, మంటలు   

ఆంధ్రప్రదేశ్ లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఓ ఆక్వా చెరువు వద్ద గల బోరు నుంచి గ్యాస్‌ ఎగిసిపడుతోంది. అలాగే గ్యాస్‌కు అగ్ని కిలలు కూడా తోడవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

హాలీవుడ్ సమ్మెకు ప్రియాంక చోప్రా సంఘీభావం; నెటిజన్ల ప్రశంసలు

హాలీవుడ్ రచయిత సంఘం గత మూడు నెలలుగా చేస్తున్న సమ్మెకు తాజాగా స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ సంఘీభావం తెలిపింది.

యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్‌తో ప్రధాని మోదీ చర్చలు 

రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) చేరుకున్నారు.

టామాట బాటలోనే ఉల్లి.. త్వరలోనే భారీగా పెరగనున్న ఉల్లిగడ్డ ధరలు

ఉల్లి వినియోగదారులకు మరో షాక్ తగలనుంది. ఉల్లిగడ్డ ధరలు భారీగా పెరగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

బరువు తగ్గించే గ్రీన్ టీని ఎలా తయారు చేసుకోవాలి, ఏ సమయాల్లో తాగితే ఉత్తమం! 

గ్రీన్ టీ.. ఇది ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. ముఖ్యంగా బరువును తగ్గించుకునేందుకు గ్రీన్ టీ చక్కటి ఔషధంలా పని చేస్తుంది. ఇందులో ఉండే ఈజీసీజీ పదార్థం జీవక్రియ రేటు పెంచుతుంది.

Modi France Tour: మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్‌లో ఫ్రాన్స్ కీలక భాగస్వామి: ప్రధాని మోదీ

ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ- ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌ మధ్య కీలక ద్వైపాక్షిక చర్చలు జరిగాయి.

కరేబియన్ గడ్డపై టీమిండియా భారీ విజయం.. అశ్విన్ మాయజాలానికి చేతులెత్తేసిన వెస్టిండీస్‌

వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా అదరగొట్టింది. ఈ మేరకు ఇన్నింగ్స్‌, 141 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.

జులై 15న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

జులై 15వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

14 Jul 2023

ప్రేరణ: సారీ చెప్పేంత ధైర్యం మీలో ఉంటే దేన్నయినా సాధించే గుణం మీలో ఉన్నట్టే 

నన్ను క్షమించు అని అవతలి వారిని అడగాలంటే మనసులో చాలా ధైర్యం ఉండాలి. అది అందరిలో ఉండదు. సారీ చెప్పడం అంటే చిన్నతమని ఫీలైపోతారు. అహం అడ్డొస్తుంది.

వరుసగా రెండోసారి బంగారు పతకాన్ని ముద్దాడిన తేజింద‌ర్‌పాల్ సింగ్

ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్‌లో భారత స్టార్ షాట్ పుట్ తేజిందర్‌పాల్‌సింగ్ తూర్ సంచలనం సృష్టించాడు. వరుసగా రెండోసారి బంగారు పతకాన్ని సాధించి రికార్డు సృష్టించాడు.

గుండెపోటుతో లపతగంజ్ యాక్టర్ అరవింద్ కుమార్ కన్నుమూత 

లపతగంజ్ సిరీస్ నటుడు అరవింద్ కుమార్ హఠాత్తుగా మరణించారు. సిరీస్ షూటింగుకు వెళ్తుండగా గుండెపోటు రావడంతో తోటి నటులు ఆయన్ని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు.

అగ్నిపర్వతంపై పిజ్జా వండుకు తిన్న మహిళా పర్యటకురాలు.. వీడియో వైరల్

అలెగ్జాండ్రా బ్లాడ్జెట్, ఈమె ప్రపంచ పర్యటకురాలు. విహార యాత్రలు చేయడం అంటే ఈమెకు ఎంతో ఇష్టం. ఇష్టం అనేకంటే ష్యాషన్ అంటే సరిగ్గా సరిపోతుందేమో.

వాలంటీర్లపై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు 

ప్రస్తుతం ఏపీ రాజకీయాలు వాలంటీర్ల చుట్టూ తిరుగుతున్నాయి. కొద్దిరోజుల క్రితం వాలంటీర్లపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

మోనో ఫోబియా: పీరియడ్స్ కి సంబంధించిన భయాలను పోగొట్టుకోవాలంటే చేయాల్సిన పనులు 

రుతుక్రమం అనేది అందరికీ ఒకేలా ఉండదు. ఈ సమయంలో అసౌకర్యం కచ్చితంగా ఉంటుంది. కానీ అది కొందరిలో తక్కువగా ఉంటే మరికొందరిలో మాత్రం ఎక్కువగా పెరిగి యాంగ్జాయిటీ, ఒత్తిడి కలుగుతాయి.

వైద్యరంగంలో అద్భుతం.. తెగిపోయిన తలను తిరిగి అతికించిన ఇజ్రాయిల్ డాక్టర్లు

ఇజ్రాయెల్‌ వైద్యులు ప్రపంచమే ఆశ్చర్యపోయే రీతిలో అసాధారణ వైద్య చికిత్సలు అందించారు. దాదాపుగా తెగిపోయిన తలను తిరిగి అతికించి ఓ బాలుడికి పునర్జన్మను అందించారు.

బీసీసీఐ ఖజానాకు కాసుల పంట.. ఐసీసీ నుంచి ఏడాదికి రూ.2వేల కోట్లు

ప్రపంచంలోనే బీసీసీఐ రిచెస్ట్ క్రికెట్ బోర్డుగా అవతరించిన విషయం తెలిసిందే. ఒక్క ఏడాదికే ఎన్నోవేల కోట్లు ఆర్జిస్తూ వరల్డ్ క్రికెట్‌లో అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా పేరు సంపాదించుకుంది. మరోసారి బీసీసీఐ ఖజానాకు కాసుల పంట పండింది.

కునో నేషనల్ పార్కులో నేలరాలిన సూరజ్.. 4 నెలల్లో ఎనిమిది చీతాల మరణాలు 

గత కొద్ది నెలలుగా భారతదేశంలో చిరుత పులులు ఒక దాని వెంట మరోటి మరణిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో తాజాగా మరో చీతా ప్రాణాలు కోల్పోయింది.

టెస్టుల్లో హిట్ మ్యాన్ ప్రభంజనం..  రోహిత్ ఖాతాలో పలు రికార్డులు 

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టుల్లో పరుగుల వరద పాటిస్తున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టెస్టులో 221 బంతుల్లో 103 పరుగులు చేశాడు.

బ్రో సినిమా నుండి సెకండ్ సాంగ్ వచ్చేస్తుంది: లాంచ్ ఎప్పుడంటే? 

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న బ్రో నుండి ఇదివరకు మై డియర్ మార్కండేయ అనే పాట రిలీజ్ అయింది. ఈ పాటకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది.

మెగా ప్రిన్సెస్ కు ప్రత్యేక గది: ఫారెస్ట్ థీమ్ తో ఇంటీరియర్ డిజైన్; వీడియో విడుదల 

రామ్ చరణ్, ఉపాసన దంపతులు పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల పాపకు క్లింకార అని పేరు పెట్టారు.

అట్టహాసంగా బాస్టిల్ డే పరేడ్.. అద్భుత విన్యాసాలు వీక్షించిన మోదీ, మాక్రాన్ 

ఫ్రాన్స్‌ జాతీయ దినోత్సవం (బాస్టీల్‌ డే) వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఫ్రెంచ్ దేశంలో 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ వేడుకలకు గౌరవఅతిథిగా హాజరయ్యారు.

హరీశ్ రావును కలవడంపై రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ నుంచి సస్పెండ్ అయిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు జోరుగా ప్రచారాలు వినిపిస్తున్నాయి.

జనసేనలోకి పంచకర్ల రమేష్ బాబు.. పెందుర్తి బరిలో దిగనున్న వైసీపీ మాజీ జిల్లా ప్రెసిడెంట్

ఆంధ్రప్రదేశ్ లో విశాఖ వైసీపీ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు రాజీనామా ఇటీవలే రాజకీయ సంచలనానికి తెరలేపింది. ఈ మేరకు తాను జనసేన పార్టీలో చేరేందుకు కార్యచర్యణ సిద్ధం చేసుకుంటున్నారు.

శివ కార్తికేయన్ మహావీరుడు సినిమాపై బయటకు వచ్చేసిన టాక్: సినిమా ఎలా ఉందంటే? 

శివ కార్తికేయన్ హీరోగా, దర్శకుడు శంకర్ కూతురు అదితి శంకర్ హీరోయిన్ గా రూపొందిన మహావీరుడు చిత్రం, ఈరోజు థియేటర్లలో రిలీజైంది.

హైదరాబాద్‌లో బీజేపీ స్టేట్ లీడర్ ముక్కెర తిరుపతి రెడ్డి కిడ్నాప్.. ఎమ్మెల్యే సహా అనుచరులపై అనుమనాలు

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు ముక్కెర తిరుపతి రెడ్డి కిడ్నాప్‌కు గురైన సంఘటన తెలంగాణ రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది.

మరో అరుదైన రికార్డుకు చేరువలో బెన్‌స్టోక్స్

ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టెస్టుల్లో మరో అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జూలై 19న నుంచి 4వ టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.

ఇస్రో: చంద్రయాన్-3 ప్రయోగం వెనకాల ఉన్న కీలక శాస్త్రవేత్తలు 

చంద్రుడిని అన్వేషించడానికి చంద్రయాన్-3 ప్రయోగాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ విజయవంతంగా లాంచ్ చేసింది.

టెస్టు సిరీస్‌లో శ్రీలంకతో తలపడనున్న పాకిస్థాన్.. ఈ ఆటగాళ్లపై భారీ అంచనాలు 

శ్రీలంక-పాకిస్థాన్ మధ్య రెండు మ్యాచుల టెస్ట్ సిరీస్ జులై 16 నుంచి ప్రారంభ కానుంది. ఈ సిరీస్‌కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుంది. మొదటి టెస్టు జులై 16న గాలే ఇంటర్నేషన్ క్రికెట్ స్టేడియంలో ప్రారంభం కానుంది.

చంద్రుడిపై భారతదేశపు సంతకం: నింగిలోకి ఎగసిన చంద్రయాన్-3 మిషన్ 

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అరుదైన ఘనతను అందుకుంది. చంద్రుడి పైకి పంపిస్తున్న చంద్రయాన్-3 మిషన్ ని ఈరోజు మధ్యాహ్నం 2:35గంటలకు LVM3 M4రాకెట్ సాయంతో నింగిలోకి విజయంవంతంగా పంపింది.

అఖిల్ వర్ధన్‌ హత్య కేసులో సంచలనం.. చంపింది అదే పాఠశాలలోని సీనియర్ విద్యార్థులేనట

ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు వసతి గృహంలో అఖిల్ వర్ధన్‌ హత్యలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ మేరకు మిస్టరీ వీడింది.దీనికి కారణం ఎవరో కాదు ఆ స్కూల్ విద్యార్థులేనని పోలీసులు వెల్లడించారు.

ఇక ట్విట్టర్‌లో డబ్బులు సంపాదించే అవకాశం.. ఎలాగంటే!

గూగుల్, యూట్యూబ్, ఫేస్‌ బుక్ మాత్రమే కాదు, ఇక నుంచి ట్విట్టర్‌లో కూడా డబ్బులు సంపాదించవచ్చు. ట్విట్టర్ యాడ్ రెవెన్యూలో కొంత భాగాన్ని క్రియేటర్లకు ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.

భారత అంతరిక్షానికే చంద్రయాన్‌-3 మైలురాయి.. ఇస్రో సైంటిస్టులకు గుడ్‌లక్‌ చెప్పిన మోదీ  

చందమామ గురించి శోధించే క్రమంలో అగ్రరాజ్యాలు ఇప్పటికే చంద్రుడి మీద జెండాలు పాతాయి. అయినప్పటికీ చంద్రుడికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోలేకపోయాయి.

వినేశ్‌ ఫొగాట్‌కు NADA నోటీసులు!

భారత అగ్రశేణీ రెజ్లర్ వినేశ్ ఫోగాట్‌కు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA) నోటీసులు జారీ చేసింది. డోపింగ్ నిరోధక నిబంధనలను పాటించడంలో ఆమె విఫలమైనందుకు ఆమెకు నోటీసులు జారీ చేసినట్లు పేర్కొంది. దీనిపై రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని పేర్కొంది.

తెలుగు, తమిళంలో మహావీరుడు షోస్ క్యాన్సిల్: అసలేం జరిగిందంటే? 

శివ కార్తికేయన్ గత కొన్ని రోజులుగా తెలుగు మార్కెట్ మీద బాగా దృష్టి పెట్టాడు. ఆయన సినిమాలకు ఇక్కడ మంచి వసూళ్ళు వస్తున్నాయి కూడా.

భారత విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఐదేళ్ల వర్క్ వీసాకు ఫ్రాన్స్ గ్రీన్ సిగ్నల్

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫ్రెంచ్ పర్యటనలో భాగంగా ఫ్రాన్స్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ మేరకు భారత విద్యార్థులకు శుభవార్తను ప్రకటించింది.

కన్నడ మీడియాలోకి ఏఐ యాంకర్ సౌందర్య ఎంట్రీ!

రోజు రోజుకూ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుకుంది. టెలివిజన్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ఎన్నో సంచనాలను సష్టిస్తోంది. ఇటీవల ఒడిశాకు చెందిన ఓ మీడియాలో ఛానల్ ఏఐ యాంకర్‌తో వార్తలు చదివించింది.

సీమాహైదర్ లవ్ స్టోరీలో ఇండియన్ పోలీసులకు బెదిరింపులు.. రంగంలోకి ముంబై పోలీస్

పాకిస్థానీ మహిళ సీమా హైదర్, సచిన్ మీనాల ప్రేమ కథలో ఇండియన్ పోలీసులకు బెదిరింపులు వస్తున్నాయి. ప్రియుడితో కలిసి ఉండాలని పాక్ దేశాన్ని విడిచిపెట్టింది సీమా హైదర్. ఈ మేరకు ప్రేమికుడు ఉండే భారతదేశానికి తరలివచ్చింది.

చంద్రయాన్ 3 ప్రయోగాన్ని ముందుండి నడిపిస్తున్న రీతూ శ్రీవాస్తవ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు 

చంద్రుడి పైకి భారతదేశం పంపిస్తున్న మూడవ మిషన్ లాంచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2:35గంటలకు చంద్రయాన్-3 మిషన్ లాంచ్ కానుంది.

అరంగేట్రం మ్యాచులోనే రికార్డులను బద్దలుకొట్టిన యశస్వి జైస్వాల్

టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ అరంగేట్రం మ్యాచులోనే అదరగొట్టాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో సెంచరీ బాది చరిత్ర సృష్టించాడు.

గృహం: మీ బాల్కనీ అందంగా కనిపించాలంటే ఈ మొక్కలను పెంచండి 

తీగ మొక్కలు బాల్కనీలో పర్చుకుని పువ్వులు పూస్తుంటే మీ బాల్కనీకి కొత్త అందం వస్తుంది.

వరదలో మునిగిన సుప్రీంకోర్టు, రాజ్‌ఘాట్.. ప్రధాన రహదారుల్లో భారీ టాఫ్రిక్ జామ్

దేశ రాజధాని దిల్లీ పరిసర ప్రాంతాల్లో కుంభవృష్టి కారణంగా మహానగరంలోని వీధులన్నీ యమునా నది ఉగ్రరూపాన్ని చవిచూసినట్టైంది.

Virat Kohli: టెస్టుల్లో విరాట్ కోహ్లీ సూపర్ రికార్డు

డొమినికాలో వెస్టిండీస్ జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డును సాధించాడు. ఆ మార్కును అధిగమించేందుకు 21 పరుగులు దూరంలో ఉన్న కోహ్లీ, తన మొదటి ఇన్నింగ్స్ లోనే ఆ మైలురాయిని చేరుకున్నాడు.

ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ ఎఫెక్ట్: సమ్మె బాట పట్టిన హాలీవుడ్ రచయితలు, నటీనటులు 

హాలీవుడ్ ఇండస్ట్రీ నటీనటులు సమ్మె బాట పట్టారు. రెమ్యునరేషన్ పెంచాలని, భవిష్యత్తుకు భరోసా కల్పించాలని, కృత్రిమ మేధస్సు వల్ల భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులను తప్పించాలని నిర్మాతలను, స్టూడియోలను డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్నారు.

క్రమంగా తగ్గుతున్న యమునా ప్రవాహం.. దిల్లీ వీధుల్లో ఇంకా తగ్గని వరద ప్రభావం

గత కొన్ని రోజులుగా దిల్లీ రాజధానిని వణికిస్తోన్న యమునా నది ప్రస్తుతం శాంతిస్తోంది. క్రమంగా వర్షాలు తగ్గుముఖం పడుతుండటంతో నీటి ప్రవాహం తగ్గిపోతోంది.

కళ్లు చెదిరే ఫీచర్లతో లంబోర్ఘిని రేసు కారు ఆవిష్కరణ

ఇంగ్లాండ్ లోని వెస్ట్ సెన్సెక్స్ లో జరుగుతున్న గుడ్‌వుడ్ ఫెస్టివల్ ఆఫ్ స్పీడ్‌లో లంబోర్ఘిని సంస్థ SC63 LMDh రేస్ కారును ప్రదర్శించింది.

ఫ్రాన్స్ ఎన్ఆర్ఐలకు మోదీ గుడ్ న్యూస్.. త్వరలోనే ఈఫిల్‌ టవర్ నుంచి యూపీఐ సేవలు 

ఫ్రాన్స్ వాసులకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మేరకు భారత్‌లో అత్యంత విజయవంతమైన డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థ యూపీఐ (UPI)ని ఇకపై ఫ్రాన్స్‌లో వాడుకోవచ్చని మోదీ ప్రకటన చేశారు.

బేబీ రివ్యూ: వెండితెర మీద ట్రయాంగిల్ లవ్ స్టోరీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందంటే? 

నటీనటులు: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్, నాగబాబు తదితరులు

Ind vs Wi: సెంచరీలు బాదేసిన టీమిండియా ఓపెనర్లు.. భారీ స్కోరు దిశగా భారత్

విండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బ్యాటర్ల జోరు కొనసాగుతోంది. ముఖ్యంగా తొలి టెస్టులో అరంగేట్రం బ్యాటర్ యశస్వీ అద్భుతంగా రాణిస్తున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి జట్టుకు అదిరిపోయే ఆరంభం అందించాడు.

చంద్రయాన్ 3: ఈరోజు మద్యాహ్నం నింగిలోకి దూసుకెళ్ళనున్న రాకెట్ 

చంద్రయాన్-3 మిషన్ ను ఈరోజు మద్యాహ్నం 2:35గంటలకు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట నుండి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) లాంచ్ చేయనుంది.

ఫ్రాన్స్ నుంచి ప్రధాని మోదీ ఫోన్.. దిల్లీ వరదలపై అమిత్ షాతో సమీక్ష

ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం దిల్లీలో వరదల పరిస్థితిపై ఆరా తీశారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారు.

జులై 14న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.

ప్రధాని మోదీకి ఫ్రాన్స్ అరుదైన గౌరవం.. గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లిజియన్ ఆఫ్​ హానర్ తో సత్కారం

ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఫ్రెంచ్ దేశ అత్యుతన్నత గౌరవ పురస్కారం లభించింది.