LOADING...

18 Jul 2023


Rafale Deal: ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనలో రాఫెల్ డీల్ ఎందుకు జరగలేదంటే!

భారత నావికా దళానికి 26రాఫెల్ విమానాలు, మూడు స్కార్పీన్ క్లాస్ సబ్‌మెరైన్‌ల ఒప్పందాలపై భారత్- ఫ్రాన్స్ మధ్య తర్వలో చర్చలు ప్రారంభమవుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

కొరియా ఓపెన్‌లో గిన్నిస్ వరల్డ్ రికార్డును బ్రేక్ చేసిన సాత్విక్‌సాయిరాజ్

కొరియా ఓపెన్‌లో ఇండియన్ స్టార్ షట్లర్ సాత్విక్ సాయిరాజ్ గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డును తన పేరిట రాసుకున్నాడు. అత్యంత వేగవంతమైన స్మాష్ కొట్టిన మేల్ ప్లేయర్ గా నిలిచాడు. అతడు ఏకంగా గంటకు 565 కిలోమీటర్ల వేగంతో స్మాష్ హిట్ కొట్టాడు.

IPO: ఐపీఓ లిస్టింగ్‌లో భారత్ టాప్; ఈ ఏడాది 80లాంచ్‌లతో అదరగొట్టిన బీఎస్ఈ, ఎన్‌ఎస్ఈ 

ఐపీఓల లిస్టింగ్‌లలో భారత్‌కు చెందిన బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్ఈ) సత్తా చాటాయి.

జకోవిచ్‌కు మరో షాక్.. నిబంధనలు ఉల్లంఘించినందుకు భారీ జరిమానా

వింబుల్డన్‌లో పరాజయం పాలైన నొవాక్ జొకోవిచ్‌కు ఊహించని షాక్ తగిలింది. ఈ గ్రాండ్‌స్లామ్‌లో స్పెయిన్ కుర్రాడు కార్లోస్ అల్కరాజ్ చేతిలో ఓడిన జకోవిచ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు భారీ జరిమానా పడింది.

సినిమాల నుండి 6నెలలు బ్రేక్ తీసుకోనున్న సాయి ధరమ్ తేజ్: కారణమిదే 

విరూపాక్ష సినిమాతో 100కోట్లు కొల్లగొట్టి కెరీర్ లోనే అత్యధిక వసూళ్ల మార్కును సాయి ధరమ్ తేజ్ సొంతం చేసుకున్నాడు. విరూపాక్ష తర్వాత సాయి ధరమ్ తేజ్ నుండి వస్తున్న చిత్రం బ్రో.

Delhi: యువకుడిపై కత్తులతో దాడి చేసి హత్య చేసిన ప్రియురాలి కుటుంబ సభ్యులు

దిల్లీలోని జాఫ్రాబాద్‌లో దారుణం జరిగింది. 25ఏళ్ల యువకుడిని కత్తులతో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఆసియా క్రీడలకు హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్!

వచ్చే నాలుగు నెలల్లో వరుస టోర్నీలతో టీమిండియా బిజీబిజీగా గడపనుంది. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో భారత జట్టు ఉంది. వెస్టిండీస్ సిరీస్ ముగిసిన వెంటనే ఐర్లాండ్ టూర్‌కు టీమిండియాకు వెళ్లనుంది.

వర్షాకాలంలో దోమల వల్ల కలిగే వ్యాధులు, వాటి లక్షణాలు తెలుసుకోండి 

వర్షాలు ఎక్కువగా పడటం వల్ల దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. భూమి మీద నీరు నిల్వగా ఉండటం, పాడైపోయిన టైర్లలో నీళ్ళు చేరడం మొదలగు వాటివల్ల దోమలు ఎక్కువగా పుట్టుకొస్తాయి.

Opposition Meeting: 26 ప్రతిపక్షాల కూటమి పేరు 'I-N-D-I-A' గా ఖరారు

బెంగళూరులో సమావేశమైన 26 ప్రతిపక్ష పార్టీలు తమ కూటమికి పేరును ఖరారు చేశాయి.

మెర్సిడెస్-బెంజ్ నుంచి మరో రెండు కార్లు.. ఫీచర్లు చూస్తే కొనాల్సిందే!

లగ్జరీ కార్లను తయారు చేసే జర్మన్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ నూతనంగా మరో రెండు కార్లను మార్కెట్లోకి విడుదల చేయనుంది. మెర్సిడెస్-బెంజ్ 2024 AMG GLC43, 2025 AMG GLC63 S E కార్లను వచ్చే ఏడాది యూఎస్ లో విక్రయించనున్నారు.

ఐకియా స్టోర్‌లో కస్టమర్‌కు చేదు అనుభవం; ఫుడ్ కోర్ట్‌లో తింటుండగా పైనుంచి పడిన చచ్చిన ఎలుక 

బెంగళూరులోని ఐకియా స్టోర్‌లోని ఒక మహిళా కస్టమర్‌కు చేదు అనుభవం ఎదురైంది.

నాయకుడు ఓటీటీ రిలీజ్: రిలీజై రెండు వారాలు పూర్తి కాకముందే స్ట్రీమింగ్ కు సిద్ధం 

తమిళంలో మామన్నాన్ పేరుతో రిలీజైన పొలిటికల్ థ్రిల్లర్ సినిమా, ఎంత మంచి సక్సెస్ అందుకుందో అందరికీ తెలుసు.

ఒక్క అక్షర దోషంతో అగ్రరాజ్యం లక్షలాది మిలిటరీ ఈమెయిల్స్, రహస్యాలు లీక్ 

ఒకే ఒక్క అక్షర దోషం అమెరికా మిలిటరీకి తీవ్ర తలనొప్పిగా మారింది.

ప్రధాని పదవిపై కాంగ్రెస్‌కు ఆసక్తి లేదు.. విపక్షాల భేటీలో ఖర్గే కీలక వ్యాఖ్యలు

ప్రధాని పదవిపై కాంగ్రెస్‌కు ఆసక్తి లేదని బెంగళూరులో జరుగుతున్న ప్రతిపక్షాల సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు.

చర్మ సంరక్షణ: దద్దుర్ల నుండి విముక్తి పొందడానికి ఈ టిప్స్ పాటించండి 

చర్మంపై అనేక కారణాల వలన దద్దుర్లు ఏర్పడతాయి. దద్దుర్ల వల్ల కలిగే దురద, ఇబ్బంది మిమ్మల్ని అసౌకర్యానికి గురి చేస్తుంది. ప్రస్తుతం దద్దుర్లను పోగొట్టుకునేందుకు పనికొచ్చే ఇంటి చిట్కాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

సీఎం వద్దకు రామచంద్రపురం పంచాయతీ.. జగన్‌తో పిల్లి సుభాష్ భేటీ

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం వైసీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై వైసీసీ అధిష్టానం దృష్టి సారించింది.

హాలీవుడ్ నుండి టాలీవుడ్ దాకా: ఈవారం థియేటర్లలో రిలీజయ్యే సినిమాల లిస్టు 

ప్రతీ వారం థియేటర్లలో కొత్త కొత్త సినిమాలు పడుతుంటాయి. ఈ వారం మాంచి క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అవేంటో చూద్దాం.

CRCS-Sahara Refund Portal: సహారా డిపాజిటర్ల రీఫండ్ కోసం పోర్టల్‌ను ప్రారంభించిన కేంద్రం 

సహారా గ్రూప్‌లోని 10 కోట్ల మంది డిపాజిటర్లు తమ డబ్బును 45 రోజుల్లో తిరిగి క్లెయిమ్ చేసుకునేందుకు 'సీఆర్‌సీఎస్- సహారా రీఫండ్ పోర్టల్'ను కేంద్ర సహకార మంత్రి అమిత్ షా మంగళవారం ప్రారంభించారు.

రూ.6వేల కోట్ల జీతాలను వాపస్ చేయనున్న టెస్లా డైరెక్టర్లు

ఎలక్ట్రిక్ కార్ల తయారీ రంగంలో టెస్లా కంపెనీ ఎన్నో సంచనాలను సృష్టించింది. ప్రస్తుతం టెస్లా కంపెనీలో డైరక్టర్లు పొందుతున్న జీతాలు, అలవెన్సులపై వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే.

బ్రిజ్‌ భూషణ్‌‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన దిల్లీ కోర్టు

మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ చీఫ్‌, ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌, ఫెడరేషన్ అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్‌కు దిల్లీలోని రూస్‌ అవెన్యూ కోర్టు మంగళవారం మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.

థ్రెడ్స్ యాప్ ని ఎదుర్కోవడానికి ట్విట్టర్ తీసుకొస్తున్న కొత్త ఫీఛర్స్ ఏంటి? 

మైక్రో బ్లాగింగ్ దిగ్గజం ట్విట్టర్ కు థ్రెడ్స్ యాప్ గట్టి పోటీ ఇస్తోంది. మెటా కంపెనీ నుండి లాంచ్ అయిన థ్రెడ్స్ యాప్, ట్విట్టర్ కు సవాలుగా మారింది.

MS Dhoni : ధోనీ బైక్స్, కార్ల కలెక్షన్స్ ఇవే.. ఇన్ని ఎందుకని ప్రశ్నించిన సాక్షి!

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి బైకులు, కార్లు అంటే ఎంతో ఇష్టం. ధోనీ వద్ద పాతకాలం బైకుల నుంచి కొత్తగా మార్కెట్లోకి వచ్చే హైఎండ్ మోడల్ బైక్స్ వరకూ అన్నీ ఉన్నాయి.

ప్రాజెక్ట్ కె: అమెరికాలో ప్రభాస్ అభిమానుల కార్ ర్యాలీ; కార్లతో ప్రాజెక్ట్ కె లోగో 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె సినిమా నుండి జులై 21వ తేదీన గ్లింప్స్ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.

PM Modi: 'అదొక అవినీతిపరుల సమ్మేళనం'; ప్రతిపక్షాల సమావేశంపై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపక్ష పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హార్డ్ కోర్ అవినీతిపరులంటూ వారిపై ధ్వజమెత్తారు.

2024లో హాజీపూర్ స్థానం నుంచే పోటీ చేస్తా; చిరాగ్ పాశ్వాన్ సంచలన ప్రకటన

లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్ మంగళవారం కీలక ప్రకటన చేశారు.

Hyderabad: నేటి నుంచి మాన్‌సూన్‌ రెగట్టా.. ముస్తాబైన హుస్సేన్ సాగర్

నేటి నుంచి ప్రారంభమయ్యే మాన్‌సూన్ రెగట్టా సెయిలింగ్ పోటీలకు ఆతిథ్యమిచ్చేందుకు హుస్సేన్ సాగర్ ముస్తాబైంది.

Evergrande: రెండేళ్లలో ఏకంగా రూ.6లక్షల కోట్ల నష్టం; తీవ్ర సంక్షోభంలో చైనా కంపెనీ 'ఎవర్‌గ్రాండే' 

చైనాకు చెందిన ప్రముఖ ప్రాపర్టీ డెవలపర్ సంస్థ 'ఎవర్‌గ్రాండే' పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయింది.

వార్ 2 సినిమాలో నటించడంపై నోరు విప్పిన కియారా అద్వానీ 

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాతో చాలా బిజీగా ఉన్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

జకోవిచ్ ను మట్టికరిపించిన అల్కరాజ్

మెన్స్ సింగిల్స్ టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ జోరుకు బ్రేకు పడింది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ గెలిచి, వింబుల్డన్ ను గెలవాలనుకున్న జకోవిచ్ ఆశలు నెరవేరలేదు. స్పెయిన్ యువ కెరటం కార్లోస్ అల్కరాజ్ చేతిలో అతనికి ఓటమి ఎదురైంది.

కలర్స్ స్వాతి విడాకులు తీసుకోనుందా? ఫోటోలు డిలీట్ చేయడానికి కారణమేంటి?

టెలివిజన్ ప్రోగ్రాం కలర్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన స్వాతి, ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఐఎండీ హెచ్చరికలు; ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు; హిమాచల్‍‌లో 122కు చేరిన మృతులు 

నైరుతి రుతుపవనాలు ఈ వారంలో కీయాశీల దశకు చేరుకున్న అవకాశం ఉన్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కీలక ప్రకటన చేసింది.

హిండెన్‌బర్గ్‌ నివేదిక పూర్తిగా అవాస్తవం : గౌతమ్ అదానీ

మోసపూరిత లావాదేవీలు, స్టార్ ధరల తారుమారు వంటి అవకతవలకు ఆదానీ గ్రూప్ పాల్పడిందంటూ గతంలో అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ నివేదిక ఇచ్చింది.

మార్నింగ్ సిక్నెస్: గర్భిణీ మహిళల్లో కనపడే ఈ ఇబ్బంది లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

మార్నింగ్ సిక్నెస్ అనే ఇబ్బంది గర్భిణీ మహిళల్లో కలుగుతుంది. అది కూడా మొదటి మూడు నెలల్లో ఎక్కువగా ఉంటుంది.

అమెరికాలో విషాదం.. ఆడుకుంటూ చెల్లిని తుపాకీతో కాల్చిన అక్క

అమెరికాలో గన్ కల్చర్ ఎంత ప్రమాదకరంగా మారిందో చెప్పేందుకు ఈ ఘటన నిదర్శనం.

మారుతీ సుజుకి గ్రాండ్ విటారా ధర పెంపు.. ఎందుకంటే..?

గ్రాండ్ విటారా ఎస్‌యూవీ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వేరియంట్ల ధరను పెంచుతున్నట్లు మారుతి సుజుకీ ఇండియా స్పష్టం చేసింది. ఈ ధర తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించింది.

నేనేమి ప్రెగ్నెంట్ కాదు పెళ్ళి చేసుకోవడానికి: పెళ్ళిపై తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు 

గత కొన్ని రోజులుగా తెలుగు సినిమాలకు దూరమైన తాప్సీ పన్ను, బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ వస్తోంది. అటు సినిమాలతో బిజీగా ఉంటున్న తాప్సీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

J-K Encounter: జమ్ముకశ్మీర్ పూంచ్‌లో ఎన్‌కౌంటర్; నలుగురు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్‌లో పూంచ్‌లో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.

బడ్జెట్ ఎక్కువ అవుతోంది.. కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించలేం

నాలుగేళ్లకోసారి నిర్వహించే కామన్వెల్త్ గేమ్స్‌ను 2026లో ఆస్ట్రేలియాలోని విక్టోరియా స్టేట్ వేదిక కానుంది. అయితే తాము కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించలేమని విక్టోరియా స్టేట్ తెలిపింది.

Opposition 26 vs NDA 38: పోటాపోటీగా అధికార, ప్రతిపక్షాల సమావేశాలు

కేంద్రంలోని అధికార బీజేపీకి వ్యతిరకేంగా ప్రతిపక్షాలు బెంగళూరులో నిర్వహిస్తున్న సమావేశాలు మంగళవారం కూడా కొనసాగనున్నాయి. రెండోరోజు సమావేశానికి 26రాజకీయ పార్టీలు హాజరవుతాయని కాంగ్రెస్ పేర్కొంది.

ప్రాజెక్ట్ కె నుండి దీపికా పదుకొణె లుక్ రిలీజ్: అభిమానులు నిరాశ చెందారా? 

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి వస్తున్న భారీ చిత్రాల్లో ప్రాజెక్ట్ కె ఒకటి. ఈ సినిమాపై ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు.

పవన్ అభిమానులకు పండగ లాంటి వార్త: బ్రో సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది 

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న బ్రో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు నెమ్మదిగా మొదలయ్యాయి. మొన్నటికి మొన్న బ్రో నుండి జాణవులే అనే సెకండ్ సాంగ్ రిలీజ్ చేసారు.

జులై 18న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.

కేరళ మాజీ సీఎం ఊమెన్‌ చాందీ కన్నుమూత

కాంగ్రెస్ సీనియర్ నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు.

17 Jul 2023


Dearness Allowance: డియర్‌నెస్ అలవెన్స్‌ను 4% పెంచే యోచనలో కేంద్రం 

త్వరలోనే కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ను పెంచనున్నట్లు సమాచారం.

iPhone 15 vs iPhone 14: ఈ రెండు ఫోన్ల మధ్య తేడాలను తెలుసుకుందాం

ప్రముఖ ఫోన్ల తయారీ కంపెనీ యాపిల్ తన కొత్త మొబైల్ 'ఐఫోన్ 15'ను సెప్టెంబర్‌లో ఆవిష్కరించనుంది.

Delhi Ordinance: రాజ్యసభలో సంఖ్యా బలం లేకున్నా ఆర్డినెన్స్‌ను బీజేపీ ఎలా ఆమోదిస్తుందంటే!

దిల్లీలోని అధికారులు, బ్యూరోక్రాట్లను కేంద్రం పరిధిలోకి తెస్తూ బీజేపీ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

ప్రేరణ: కావాలనుకున్నప్పుడు నీ దగ్గరకు రాని సమయం గురించి నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు 

మీకు సమయం విలువ తెలిస్తే మీ భవిష్యత్తు బాగుంటుంది. తెలియకపోతే మీకు భవిష్యత్తులో ఇబ్బందులు రావొచ్చు.

అసెంబ్లీ సభా హక్కుల కమిటీ చైర్మన్‌గా తిరుపతి ఎమ్మెల్యే 

తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక పదవిని కట్టబెట్టారు. ఆసెంబ్లీ సభా హక్కుల కమిటీ చైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

జవాన్ నుండి నయనతార లుక్ రిలీజ్: గన్ పట్టుకుని నిలబడ్డ లేడీ సూపర్ స్టార్ 

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటిస్తున్న జవాన్ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుందని అందరికీ తెలిసిందే. తాజాగా జవాన్ ప్రివ్యూ వీడియోలో నయనతార కనిపించింది.

రాజాసింగ్‌కు మరో షాక్.. గోషామహల్ సీటు వదులుకుంటేనే సస్పెన్షన్‌ ఎత్తివేత..?

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బీజేపీ అదిష్టానం మరోసారి ఝలక్ ఇచ్చినట్లు సమాచారం. రాజాసింగ్ పై విధించిన సస్పెన్షన్ ఇంకా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఎన్‌సీపీని ఐక్యంగా ఉంచాలని శరద్ పవార్‌ను కోరాం: అజిత్ పవార్ బృందం 

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) రెండుగా చీలిన తర్వాత అజిత్ పవార్, సునీల్ తట్కరే, ప్రఫుల్ పటేల్ సోమవారం ముంబైలో శరద్ పవార్‌తో సమావేశమయ్యారు.

స్పెషల్ రికార్డుకు చేరువలో జేమ్స్ అండర్సన్

మాంచెస్టర్ వేదికగా జులై 19 నుంచి ప్రారంభం కానున్న యాషెస్ సిరీస్ నాలుగో టెస్టు కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తుది జట్టును నేడు ప్రకటించింది.

హిండింబ సినిమా నుండి రివర్స్ యాక్షన్ ట్రైలర్ విడుదల 

సినిమా వాళ్ళు ఎప్పటికప్పుడు కొత్త కొత్త పేర్లతో తమ సినిమాను ప్రమోట్ చేస్తుంటారు. టీజర్, ట్రైలర్, గ్లింప్స్, స్నీక్ పీక్.. ఇలా రకరకాల పేర్లు పెట్టి సినిమా కంటెంట్ ని జనాల్లోకి వదులుతారు.

ఆసియా క్రీడల్లో భారత జట్టు పాల్గొనేందుకు అనమతి ఇవ్వండి.. ప్రధానికి ఫుట్‌బాల్‌ కోచ్‌ లేఖ

ఆసియా క్రీడల్లో భారత జట్టు పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు భారత ఫుట్ బాల్ జట్టు హెడ్ కోచ్ ఇగోర్ స్టిమాక్ లేఖ రాశారు.

Stalin on ED: ఈడీ ఎన్నికల ప్రచారంలో చేరిందంటూ సీఎం స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

తమిళనాడు మంత్రి కె.పొన్ముడికి చెందిన ప్రదేశాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం దాడులు సోదాలు నిర్వహించింది. ఈడీ దాడులపై ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తీవ్రంగా స్పందించారు.

సైంధవ్ సినిమా హార్ట్ ని పరిచయం చేసిన విక్టరీ వెంకటేష్ 

వెంకటేష్ కెరీర్లో 75వ సినిమాగా తెరకెక్కుతోన్న సైంధవ్ సినిమాను హిట్ ఫ్రాంఛైజీ చిత్రాల దర్శకుడు డాక్టర్ శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

అమిత్ షా సమక్షంలో రూ.2,378 కోట్ల డ్రగ్స్ ధ్వంసం

దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్వాధీనం చేసుకున్న 1.44 లక్షల కిలోల మాదకద్రవ్యాలను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ధ్వంసం చేశారు. దిల్లీలో ఈ ప్రక్రియను కేంద్ర హోం శాఖ మంతి అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారు.

జోధ్‌పూర్‌లో దారుణం; ప్రియుడి ఎదుటే దళిత బాలికపై సామూహిక అత్యాచారం 

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో దారుణం జరిగింది. ముగ్గురు కళాశాల విద్యార్థులు ఆమె ప్రియుడి ఎదుటే ఓ మైనర్ దళిత బాలిక(17)పై సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘోరం ఆదివారం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

Lok Janshakti Party: చిరాగ్, పశుపతిని కలిపేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు

దివంగత రామ్‌విలాస్‌ పాశ్వాన్‌కు చెందిన లోక్‌ జనశక్తి పార్టీ(ఎల్‌జేపీ)లో చీలికను నిరోధించేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది.

శరీరంలో హార్మోన్ల స్థాయిల్లో మార్పులు రావడానికి కారణమయ్యే అలవాట్లు ఏంటో చూద్దాం 

హార్మోన్లు అనేవి రసాయనిక సమాచారాలను శరీర భాగాలకు అందజేస్తాయి. హార్మోన్లు అధికంగా ఉత్పత్తి అయినా, లేకపోతే కావాల్సిన దానికంటే తక్కువ ఉత్పత్తి అయినా శరీరంలో ఇబ్బందులు తలెత్తుతాయి.

టెస్టు క్రికెట్‌లో పాకిస్థాన్ తొలి కీపర్‌గా సర్పరాజ్ అహ్మద్ రికార్డు

టెస్టు క్రికెట్లో పాకిస్తాన్ కీపర్ సర్పరాజ్ అహ్మద్ అద్భుత రికార్డును సృష్టించాడు. గాలే అంతర్జాతీయ స్టేడియం వేదికగా మొదటి టెస్టులో శ్రీలంక, పాకిస్థాన్ తలపడ్డాయి. ఈ మ్యాచులో 15 బంతుల్లో 17 పరుగులు చేసి అరుదైన మైలురాయిని చేరుకున్నాడు.

ప్రియదర్శిని అలా పోల్చవద్దని ఫైర్ అయిన రాహుల్ రామకృష్ణ 

ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ.. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి దూకుడు మీద ఉన్న నటులు. అటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూనే ఇటు హీరోగానూ సినిమాలను తెరకెక్కిస్తున్నారు.

అంతర్జాతీయ క్రికెట్లో మరో మైలురాయిని అధిగమించిన ఎల్లీస్ పెర్రీ

ఆస్ట్రేలియా మహిళా ప్లేయర్లలో ఆల్ రౌండర్ ఎల్లీస్ పెర్రీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఎన్నో అరుదైన రికార్డులను సాధించి, ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది.

Typhoon Talim: చైనాను వణిస్తున్న'తాలిమ్ టైఫూన్' తుపాను; విమానాశ్రయాలు, పాఠశాలలు మూసివేత 

చైనాను 'తాలిమ్ టైఫూన్' తుపాను వణికిస్తోంది. తుపాను సోమవారం రాత్రికి తీరాన్నితాకనుంది. హైనాన్ నుంచి గ్వాంగ్‌డాంగ్ వరకు దక్షిణ తీరం వెంబడి తీరం దాటే క్రమంలో తుపాను మరింత బలపడుతుందని చైనా వాతావరణ చెప్పింది.

అమెరికాలో భారీ వర్షాలు.. 2600 విమానాలు రద్దు

అమెరికాలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా దేశవ్యాప్తంగా 2600 పైగా విమానాల రాకపోకలను రద్దు చేశారు. మరో 8వేల విమనాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.

ఓటీటీలోకి వచ్చేస్తున్న హారర్ మూవీ అశ్విన్స్: స్ట్రీమింగ్ ఎక్కడంటే? 

వసంత్ రవి, విమలారామన్ ప్రధాన పాత్రలో నటించిన హారర్ మూవీ అశ్విన్స్, జూన్ 23న రిలీజైంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి సరైన స్పందన రాలేదు కానీ విమర్శకుల నుండి పాజిటివ్ స్పందన వచ్చింది.

విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ నటించిన మెర్రీ క్రిస్మస్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ 

దక్షిణ భారతదేశ చిత్ర పరిశ్రమలో విజయ్ సేతుపతి ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

RBI Pension: 4ఏళ్ల తర్వాత రిటైర్డ్ ఆర్‌బీఐ ఉద్యోగులకు పెరిగిన పెన్షన్ 

రిటైర్డ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఉద్యోగుల పెన్షన్‌ను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

తిరుపతికి చేరుకున్న పవన్ కళ్యాణ్.. అంజూ యాదవ్‌పై ఎస్పీకి ఫిర్యాదు

జనసేన నాయకుడు సాయిపై సీఐ అంజు యాదవ్ చేయి చేసుకోవడంపై తిరుపతి జిల్లా ఎస్పీకి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిర్యాదు చేశారు.

పుతిన్ కలల వంతెన అయినా క్రిమియా వంతెనపై మరోసారి పేలుళ్లు.. ఇద్దరు మృతి

రష్యా అధక్ష్యుడు పుతిన్ కలల వంతెనగా పేరున్న కెర్చ్ బ్రిడ్జిపై మరోసారి పేలుళ్లు సంభవించాయి. ఈ ప్రమాదంలో వంతెన కొంతభాగం దెబ్బతింది. దీంతో కెర్చ్ బ్రిడ్జిపై రాకపోకలకు రష్యా మూసివేసింది.

డేట్ నైట్ ఫోటోలను పంచుకున్న ఇలియానా: బాయ్ ఫ్రెండ్ అతనేనా? 

గతకొన్ని రోజుల క్రితం తాను ప్రెగ్నెంట్ అని, పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నానని సోషల్ మీడియా అకౌంట్ లో ఇలియానా రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇలియానా ప్రెగ్నెంట్ సమయాన్ని ఆహ్లాదంగా గడుపుతోంది.

Heavy Rains: ఉత్తరాఖండ్‌లో ప్రమాదకర స్థాయిని దాటిన గంగానది; దిల్లీలో మళ్లీ ఉప్పొంగిన యమునా

ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వాగులు, వంకలు, నదులు ప్రమాదకర స్థాయిలను దాటి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.

హరిహర వీరమల్లు సినిమాపై నిధి అగర్వాల్ ఎమోషనల్: వైరల్ అవుతున్న పోస్ట్ 

పవన్ కళ్యాణ్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు సినిమాను క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నారు.

PAK vs SL: సెంచరీతో కదం తొక్కిన ధనంజయ డిసిల్వా

పాకిస్థాన్, శ్రీలంక మధ్య జరుగుతున్న 2 మ్యాచుల టెస్టు సిరీస్‌లో మొదటి టెస్టు ప్రారంభమైంది. గాలే అంతర్జాతీయ స్టేడియంలో మొదట శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

IMD: ఈ వారం తెలంగాణ,ఏపీతో పాటు ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు; ఐఎండీ హెచ్చరిక 

దేశంలోని వర్షాలపై భారత వాతావరణ శాఖ(ఐఎండీ) కీలక ప్రకటన చేసింది. నైరుతి రుతుపవనాలు ఈ వారం తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయని హెచ్చరించింది.

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాను ఎన్నికలే ఆపుతున్నాయా? నిర్మాత ఏఎమ్ రత్నం క్లారిటీ 

పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం బ్రో, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు చిత్రాలు ఉన్నాయి. వీటిల్లో బ్రో సినిమా జులై 28వ తేదీన రిలీజ్ అవుతుంది. ఓజీ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

నాట్ స్కివర్-బ్రంట్ సెంచరీ వృథా.. రెండో వన్డేలో ఓటమి పాలైన ఇంగ్లండ్

సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్‌ మైదానంలో ఆస్ట్రేలియా మహిళలతో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. నాట్ స్కివర్-బ్రంట్ సెంచరీతో ఆకట్టుకున్నా మిగిలిన బ్యాటర్లు రాణించకపోవడంతో ఇంగ్లండ్ మూడు పరుగుల తేడాతో ఓడిపోయింది.

మణిపూర్‌లో మహిళ దారుణ హత్య; 9మంది అరెస్టు 

మణిపూర్‌లోని ఇంఫాల్ తూర్పు జిల్లాలోని సావోంబంగ్ ప్రాంతంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో ఐదుగురు మహిళలతో సహా మొత్తం తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

గుంటూరు కారం సినిమాలో హిట్ హీరోయిన్: నో లీక్స్ అంటూ లీక్ చేసిన మీనాక్షి చౌదరి 

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం సినిమా నుంచి పూజా హెగ్డే తప్పుకుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

త్వరలో మార్కెట్లోకి ఎఐఎం ఈవీ స్పోర్ట్ 01 కారు.. ఒక్కసారి ఛార్జీ చేస్తే 320 కిలోమీటర్లు

ప్రముఖ జపనీస్ సంస్థ నుంచి ఎఐఎం ఈవీ స్పోర్ట్ 01  కారు త్వరలో మార్కెట్లోకి రానుంది. గుడ్‌వుడ్ ఫెస్టివల్ లో ఈ కారును ఆ సంస్థ ప్రదర్శించింది.

CI Anju Yadav: మరో వివాదంలో శ్రీకాళహస్తి సీఐ; తొడకొడుతూ హల్‌చల్ చేసిన అంజు యాదవ్‌

శ్రీకాళహస్తి సీఐ అంజు యాదవ్‌ తీరు రోజురోజుకు వివాదాస్పదంగా మారుతోంది. తాజాగా బయటకు వచ్చిన అంజు యాదవ్‌ వీడియో ఒకటి ఆమెను మరింత ఇరకాటంలోకి నెట్టింది.

మీ పిల్లలు మీరు చెప్పింది వినకుండా వాదిస్తున్నారా? ఇలా డీల్ చేయండి 

పిల్లల పెంపకం అంత ఈజీ కాదు. ఏడెనిమిదేళ్ళ వయసు రాగానే పిల్లలు చెప్పింది వినరు. అడ్డంగా వాదించడం మొదలెడతారు. కొన్నిసార్లు వారి వాదనలు మీకు విచిత్రంగా అనిపిస్తాయి.

మాంచెస్టర్ యునైటెడ్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న హ్యారీ మాగ్వైర్‌

మాంచెస్టర్ యునైటెడ్ కెప్టెన్సీ నుంచి హ్యారి మాగ్వైర్‌ తప్పుకున్నాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా అతను వెల్లడించారు.

Opposition Meeting: నేడు బెంగళూరలో ప్రతిపక్షాల నేతల సమావేశం; 2024 ఎన్నికల రోడ్‌మ్యాప్‌పై ఫోకస్

బెంగళూరు వేదికగా ప్రతిపక్షాలు మరోసారి సమావేశం కాబోతున్నాయి. అయితే ఈసారి సోమవారం, మంగళవారం ఈ సమావేశాలు జరగనున్నాయి.

వరల్డ్ ఎమోజీ డే 2023: అసలు ఎమోజీలు ఎక్కడ పుట్టాయి? ఎక్కువగా వాడుతున్న ఎమోజీ ఏది? 

ఇప్పటి తరానికి మాట్లాడలేని కొత్త భాష పుట్టుకొచ్చింది. అదే ఎమోజీ భాష. నోరు విప్పి మాట్లాడుకోవడం తగ్గించిన మనుషుల భావాలను మాటల్లో కాకుండా బొమ్మల్లో అర్థం చేసుకోవడమే ఎమోజీ లాంగ్వేజ్.

జులై 17న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.

భోపాల్-దిల్లీ వందే భారత్ రైలు కోచ్‌లో మంటలు

భోపాల్ నుంచి దిల్లీ వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలులోని ఓ కోచ్‌లో సోమవారం ఉదయం మంటలు చెలరేగాయి.