LOADING...

20 Sep 2023


లోక్‌సభలో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లు 

లోక్‌సభ,రాష్ట్ర శాసనసభలలో మహిళలకు 33% సీట్లు మంజూరు చేస్తూ మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభ ఆమోదించింది.

చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై తీర్పు రేపటికి వాయిదా 

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కస్టడీ పిటిషన్‌పై తీర్పును సీబీఐ కోర్టు గురువారానికి వాయిదా వేసింది.

ఆర్థిక సంక్షోభంలో భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నాగల్.. ఖాతాలో కేవలం 900 యూరోలే ఉన్నాయని ఆవేదన 

భారత్ పురుషుల సింగిల్స్ టెన్నిస్ స్టార్ ఆటగాడు సుమిత్ నాగల్ మరోసారి ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు.

రష్యా మధ్యవర్తిత్వంతో.. అజర్​బైజాన్​, అర్మేనియా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం 

అజర్‌బైజాన్‌, అర్మేనియా దేశాల మధ్య రెండు రోజులుగా యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. వివాదానికి కేంద్రమైన నాగర్నో-కారబఖ్‌లో రెండు దేశాలు భీకర దాడులకు దిగాయి.

అభిమాన గాయకుడ్ని అన్‌ఫాలో చేసిన కోహ్లీ, రైనా.. నెట్టింట తీవ్ర విమర్శలపాలైన పంజాబీ గాయకుడు శుభ్‌

భారత్‌, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల సెగ ఇతర రంగాల ప్రముఖులను తాకింది.

వాట్సాప్ పేమెంట్స్ లో కొత్త ఫీఛర్: ఇతర యూపీఐ యాప్స్ కు చెల్లింపులు చేసే సదుపాయం 

వాట్సాప్ లో ఇతర యూపీఐ యాప్స్ కు, క్రెడిట్, డెబిట్ కార్డులతో చెల్లింపులు జరిపే సదుపాయాన్ని ఇండియాలో కల్పించబోతున్నట్లు కంపెనీ వెలడి చేసింది.

మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎంఐఎం వ్యతిరేకం: ఒవైసీ ప్రకటన 

మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ కీలక ప్రకటన చేశారు. మహిళా బిల్లుకు తమ పార్టీ వ్యతిరేకమని స్పష్టం చేశారు.

కృష్ణా ట్రిబ్యునల్‌లో ఏపీ సర్కారుకు షాక్.. నీరు వాడకుండా తెలంగాణను అడ్డుకోలేమని స్పష్టం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి కృష్ణా ట్రిబ్యునల్‌లో ఎదురుదెబ్బ తగిలింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఏపీ సర్కార్ దాఖలు చేసిన ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్‌ను KWDT(KRISHNA WATER DISPUTES TRIBUNAL) ట్రెబ్యునల్‌ తిరస్కరించింది.

విజయ్ లియో నుండి అదిరిపోయే అప్డేట్: అందరూ రెడీగా ఉండాల్సిందే 

తమిళ హీరో విజయ్, లియో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా కనిపిస్తుంది.

టీ20 ప్రపంచకప్‌ 2024లో ఐసీసీ కీలక నిర్ణయం.. అమెరికాలో మూడు వేదికలు ఖరారు

టీ20 ప్రపంచకప్‌- 2024 మెగా టోర్నీకి సంబంధించి అగ్రరాజ్యం అమెరికాలో వేదికలు సిద్ధమయ్యాయి. ఈ మేరకు మూడు మైదానాల్లో మ్యాచ్‌లను నిర్వహించాలని ఐసీసీ ఖరారు చేసింది.

ఆకాశ ఎయిర్ లైన్స్‌ మూసివేతపై.. సీఈఓ క్లారిటీ 

ఆకస్మికంగా పైలెట్ల రాజీనామాలు చేయడంతో ఆకాశ ఎయిర్ లైన్స్ కంపెనీ తీవ్ర ఆందోళనలను ఎందుర్కొంటోంది. ఈ క్రమంలో ఆకాశ ఎయిర్ లైన్స్ మూసివేస్తున్నారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి.

అధికారిక ప్రకటన: నాగ చైతన్య, సాయి పల్లవి జోడీ మరోసారి ఫిక్స్ 

నాగ చైతన్య కెరీర్లో 23వ సినిమాగా రూపొందుతున్న చిత్రాన్ని దర్శకుడు చందు మొండేటి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

'అప్రమత్తంగా ఉండండి'.. కెనడాలోని భారతీయులకు విదేశాంగ శాఖ కీలక సూచనలు

ఖలిస్థానీ నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఉదంతం భారత్- కెనడా మధ్య ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య ఆరోపణల పర్వం నడుస్తోంది.

ప్రపంచకప్ 2023 ముంగిట గుడ్ న్యూస్.. ఐసీసీ వన్డే ర్యాంకుల్లో మళ్లీ నెం.1గా సిరాజ్

టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ మరోసారి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి దూసుకెళ్లాడు.

AP cabinet decisions: దసరా నుంచే విశాఖ రాజధానిగా పాలన.. ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు ఇవే 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

జీ తెలుగు ఆధ్వర్యంలో పర్యావరణ హితంగా గణేష్ నవరాత్రులు, సెట్ ప్రాపర్టీస్ తో గణపతి విగ్రహం తయారీ   

'గణపతిబప్పా.. మోరియా' అంటూ దేశమంతటా ఘనంగా జరుపుకొనే పండుగ 'గణేష్​ చతుర్థి'. వీధివీధినా మండపాలు ఏర్పాటు చేసి గణపతి నవరాత్రులను కోలాహలంగా నిర్వహిస్తారు.

ఆసియా క్రీడల్లో అథ్లెట్ లెజెండ్ పీటీ ఉష రికార్డులు తెలుసా

ఇండియన్ క్వీన్ ఆఫ్ ట్రాక్ అండ్ ఫీల్డ్"గా పీటీ ఉష పేరుగాంచారు. ఆమె క్రీడల్లో కొనసాగిన కాలంలో సంచలన క్రీడాకారిణిగా గుర్తింపు పొందారు.

నీరసాన్ని దూరం చేయడం నుండి క్యాన్సర్ల నివారణ వరకు వెలగపండు ప్రయోజనాలు 

వెలగపండు.. ఇది సంవత్సరంలో కొన్ని నెలలు మాత్రమే దొరుకుతుంది. వినాయక చవితి నుండి మొదలుకొని వేసవి వరకు ఈ పండు లభ్యమవుతుంది.

క్రికెట్ ప్రేమికులకు డబుల్ దమాకా.. వన్డే ప్రపంచకప్‌ అధికారిక పాటను చూసేయండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులకు, ప్రత్యేకించి భారత ఉపఖండ వాసులకు గుడ్ న్యూస్ వచ్చేసింది.

చైనాకు చెక్ పెట్టేందుకు.. అరుణాచల్‌లో 300 కిలోమీటర్ల సరిహద్దు రోడ్ల నిర్మాణంపై కేంద్రం ఫోకస్ 

2020 నుంచి వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్‌ఎసీ) వద్ద భారత్ -చైనా మధ్య ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే.

ఏయన్నార్ శతజయంతి ఉత్సవాల్లో బాలీవుడ్ నటుడు, ముంబై నుండి హైదరాబాద్ విచ్చేసిన స్టార్ యాక్టర్ 

అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ఉత్సవాలు అన్నపూర్ణ స్టూడియోస్ లో విగ్రహావిష్కరణతో ప్రారంభమయ్యాయి.

కుమారి శ్రీమతి టీజర్: వయసు పెరిగినా పెళ్ళి చేసుకోని అమ్మాయి పాత్రలో నిత్యా మీనన్ 

ఊహలు గుసగుసలాడే సినిమాతో దర్శకుడుగా మారిన నటుడు అవసరాల శ్రీనివాసరావు, ప్రస్తుతం మరొక కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈసారి దర్శకుడిగా కాదు కథా రచయితగా మాత్రమే ప్రేక్షకులను పలకరించనున్నాడు.

చంద్రబాబు అరెస్ట్‌తో టీడీపీకి భారీ మద్దతు.. సీ ఓటర్ సర్వేలో వెల్లడి

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఉస్తాద్ భగత్ సింగ్ క్వాలిటీపై నెటిజన్ కామెంట్.. గట్టిగా కౌంటర్ ఇచ్చిన హరీష్ శంకర్ 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రూపొందుతున్న సంగతి అందరికీ తెలిసిందే.

కెనడా నిప్పుతో చెలగాటమాడటం ఆడుతోందని అమెరికా చురకలు.. వాషింగ్టన్‌ జోక్యం వద్దని నిపుణుల సూచన  

భారత్‌పై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర ఆరోపణలపై అమెరికా ఖండించింది. అగ్రరాజ్యంతో పాటు యూకే, ఆస్ట్రేలియా దేశాలు తీవ్ర వ్యాఖ్యలపై ఆందోళన వ్యక్తం చేశాయి.

పార్లమెంటులో నరేంద్ర మోదీతో విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ.. భారత్- కెనడా సంబంధాలపై కీలక చర్చ

భారత్, కెనడా మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సిక్కు తీవ్రవాద గ్రూపుతో ట్రూడో పొత్తు కారణంగా భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలు క్షీణించాయి.

TS DSC (TRT) Notification 2023: నేటి నుంచే టీచర్ పోస్టుల భర్తీకి రిజిస్ట్రేషన్ ప్రారంభం

సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ), స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, పీఈటీ మొదటైన 5089 టీచర్ పోస్టులను డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్(టీఎస్ డీఎస్సీ 2023) ద్వారా భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఇండో హిందూలకు సిఖ్ ఫర్ జస్టిస్ అల్టిమేటం.. దేశం విడిచి భారత్ వెళ్లిపోవాలని  హెచ్చరికలు

కెనడాలో ఖలిస్థాన్ అనుకూలవాద సంస్థ సిఖ్ ఫర్ జస్టిస్ (SFJ) అల్టిమేటం ఆ దేశంలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది.

దుబాయ్ వెళ్తున్నారా? ఈ అనుభవాలను ఖచ్చితంగా మిస్ అవకండి 

దుబాయ్ ఇప్పుడు ప్రపంచ దేశంగా మారిపోయింది. ప్రపంచ దేశాలు రకరకాల ఈవెంట్స్ నిర్వహించడానికి దుబాయ్ ని వేదికగా చేసుకుంటున్నాయి.

తమిళనాడు: చెన్నైలో విద్యుత్ అధికారులు, కాంట్రాక్టర్లు లక్ష్యంగా ఐటీ దాడులు 

తమిళనాడులోని చెన్నైలో బుధవారం ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి.

ప్రపంచకప్ పిచ్‌ల‌పై ఐసీసీ స్పెషల్ ఫోకస్.. పచ్చిక పెంచాలంటూ క్యూరెట‌ర్లకు మార్గదర్శకాలు జారీE

ప్రపంచకప్-2023, అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో భారతదేశంలోని పిచ్‌లపై ఐసీసీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది.

జీవితంలో చాలా కష్టాలు, సమస్యలు వస్తాయి: ఇప్పటి యువతకు సమంత సందేశం 

స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన సమంత, ప్రస్తుతం సినిమాలు తక్కువగా చేస్తున్నారు. మయోసైటిస్ చికిత్స కోసం సమంత అమెరికాలో ఉన్నారు.

మహిళా రిజర్వేషన్ బిల్లు: ఎస్సీ,ఎస్టీ,ఓబీసీలకు కోటా కల్పించాలని కోరిన సోనియా  

మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ గురువారం మద్దతు తెలిపారు.

Asian Games 2023 : ఆసియా క్రీడల్లో భారత్‌ ఘోర ఓటమి.. చైనా చేతిలో ఎదురుదెబ్బ

ఆసియా క్రీడలు 2023ని భారతదేశం ఓటమితో ప్రారంభించింది. ఈ క్రమంలోనే పురుషుల ఫుట్‌బాల్‌ జట్టు చైనా చేతిలో ఘోర పరాజయంతో ఆరంభించింది.

ఇండిగో విమానంలో అనూహ్య ఘటన.. గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ డోర్ తెరిచే ప్రయత్నం 

దిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో అనూహ్య ఘటన జరిగింది.

అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏయన్నార్ విగ్రహావిష్కరణ: తరలి వచ్చిన తెలుగు సినిమా తారలు 

తెలుగు సినిమా దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ఉత్సవాలు అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏయన్నార్ విగ్రహావిష్కరణతో ప్రారంభమయ్యాయి. ఇప్పటి నుండి 2024 సెప్టెంబర్ 20వ తేదీ వరకు శతజయంతి ఉత్సవాలు జరుగుతాయి.

సెప్టెంబర్ 28న జో బైడెన్‌ అభిశంసన కమిటీ విచారణ 

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై ప్రతినిధుల సభ స్పీకర్ కెవిన్ మెక్‌కార్తీ చేపట్టిన అభిశంసన విచారణపై కీలక అప్డేట్ వచ్చేసింది. సెప్టెంబర్ 28వ తేదీన కమిటీ విచారణను నిర్వహించనుంది.

స్పోర్ట్స్ లుక్ ఇస్తున్న TATA Curvv Suv ఈవీ.. లాంచ్,ధరల వివరాలు తెలుసా 

ప్రతిష్టాత్మకమైన టాటా వాహనాల కంపెనీ మరో కొత్త మోడల్ కి తెరలేపింది. ఇప్పటివరకు అనేక హ్యాచ్ బ్యాక్ కార్లను తయారు చేసిన టాటా, తాజాగా Curvv SUV పేరిట ఈవీ, ఐస్ సెగ్మెంట్ లోకి అడుగుపెట్టింది.

వాల్తేరు వీరయ్య విలన్ బాబీ సింహాపై పోలీసు కేసు నమోదు 

తెలుగు, తమిళం సినిమాల్లో విలన్ గా నటించే నటుడు బాబీ సింహాపై తాజాగా కేసు నమోదైంది. బాబీ సింహ లేటెస్ట్ గా తెలుగులో వాల్తేరు వీరయ్య సినిమాలో ప్రకాష్ రాజ్ తమ్ముడిగా కనిపించారు.

టర్కీ పర్యటనకు వెళ్తున్నారా? ఈ ఆహారాలు ఖచ్చితంగా ట్రై చేయండి 

ఒక్కో దేశంలో ఒక్కో రకమైన ఆహార సంప్రదాయం ఉంటుంది. కొన్ని దేశాల్లో బియ్యంతో చేసిన ఆహారాలను ఎక్కువగా తింటారు. మరికొన్ని దేశాల్లో గోధుమతో చేసిన ఆహారాలను తింటారు.

భారత్‌పై కెనడాఆరోపణలు.. స్పందించిన బ్రిటిష్ సిక్కు ఎంపీ 

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సోమవారం భారత ప్రభుత్వానికి, ఈ ఏడాది ప్రారంభంలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు మధ్య సంభావ్య సంబంధం ఉందని ఆరోపించడంతో భారత్-కెనడా సంబంధాలు అట్టడుగు స్థాయికి చేరుకున్నాయి.

హర్భజన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు.. చాహల్‌కు అందుకే మొండిచేయి చూపించారేమోనని అసంతృప్తి 

టీమిండియా సెలెక్టర్లపై మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అనూహ్య వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు మరో స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను ఆస్ట్రేలియా సిరీస్‌కు ఎంపిక చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

Green Metro buses: హైదరాబాద్‌లో ఆర్టీసీ ప్రయాణికుల కోసం 'గ్రీన్‌ మెట్రో లగ్జరీ' ఏసీ బస్సులు 

ప్రజా రవాణాను మరింత పర్యావరణహితంగా మార్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్‌టీసీ) మరో అడుగు ముందుకు వేసింది.

Happy Birthday ANR: అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ఉత్సవాలు 

తెలుగు సినిమాను ఏలిన హీరోల్లో అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు అగ్రగణ్యులు. వీరిద్దరూ తెలుగు సినిమాకు రెండు కళ్ళలాంటి వారు.

ASIAN GAMES 2023 : ఆసియా ఖండంలోనే అతిపెద్ద క్రీడా సమరం గురించి మీకు ఈ విషయాలు తెలుసా 

ఆసియాలోనే అతిపెద్ద క్రీడా సంబురం వచ్చేసింది. చైనాలోని హాంగ్‌జౌ వేదికగా ఈ క్రీడలు శనివారం సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆసియా క్రీడల గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం

నేడు లోక్‌సభలో మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై చర్చ.. మాట్లాడనున్న సోనియా గాంధీ 

మహిళా రిజర్వేషన్ బిల్లుపై బుధవారం చర్చ జరగనుంది. అయితే ఈ బిల్లుపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ మాట్లాడనున్నారు. కాంగ్రెస్ తరఫున ఆమె కీలక ప్రసంగం చేయనున్నారు.

రాజ్యాంగ పీఠిక నుండి లౌకిక, సామ్యవాద పదాలు తొలగించబడ్డాయి: అధిర్ రంజన్ చౌదరి 

కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం రోజున చట్టసభ సభ్యులకు ఇచ్చిన రాజ్యాంగం,కొత్త కాపీలలో "సెక్యులర్", "సోషలిస్ట్" అనే పదాలు లేవని కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి మంగళవారం ఆరోపించారు.

సెప్టెంబర్ 20న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

సెప్టెంబర్ 20వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

ఖలిస్తానీ హత్య వివాదం.. భారతదేశంలోని కెనడా పౌరులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ 

ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభనను దృష్టిలో ఉంచుకుని కెనడా ప్రభుత్వం మంగళవారం భారతదేశంలో నివసిస్తున్న తమ పౌరులను హెచ్చరించింది.

19 Sep 2023


తలైవా ర‌జినీకాంత్‌కు బీసీసీఐ గోల్డెన్ టిక్కెట్.. దీంతో ఏమేం చేయొచ్చో తెలుసా

తలైవా ర‌జినీకాంత్‌కు బీసీసీఐ గోల్డెన్ టిక్కెట్ అందించింది. ఈ మేరకు సెక్రటరీ జైషా స్వయంగా సూపర్ స్టార్ ను కలిసి అందజేశారు.

ఫియట్ తొలి ఈవీ కారు 600e గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా.. ధర తెలుసుకోండి

ఫియట్ కంపెనీ నుంచి వస్తున్న తొలి పూర్థిస్థాయి ఎలక్ట్రిక్ కారు త్వరలోనే ప్రపంచ ఆటోమొబైల్ మార్కెట్లో విడుదల కానుంది.

ఆర్‌బీఐ ప్రాధాన్య రంగ రుణాల జాబితాలో దేశీయ సోలార్ ప్యానల్ తయారీ పరిశ్రమ 

ప్రాధాన్యత రంగ రుణ గ్రహీతల జాబితాలో సోలార్ ప్యానెల్ తయారీ రంగాన్ని చేర్చాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ఆలోచిస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాల్లో నారీమణుల జయభేరి.. మహిళలకు భారీగా దక్కనున్న సీట్లు 

మహిళా రిజర్వేషన్ బిల్లు 2023కి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఈ డిమాండ్ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు-2023లో నేరవేరనుంది.

వాట్సాప్ ఛానెల్స్ లో జాయిన్ అయిన ప్రధాని నరేంద్ర మోదీ, మొదటి పోస్ట్ ఇదే 

వాట్సాప్ కొత్తగా ఛానెల్స్ అనే ఫీఛర్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో అడ్మిన్ ఒక్కరే, మెసేజ్ పంపించవచ్చు. వాళ్ళను ఫాలో అయ్యేవాళ్ళు ఎలాంటి మెసేజ్ పంపడానికి లేదు.

మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఇప్పుడు ఆమోదించినా.. అమల్లోకి వచ్చేది 2029లోనే.. ఎందుకో తెలుసా? 

దాదాపు మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టంగా మారడానికి ఒక అడుగు దురంలోనే ఉంది. ఈ బిల్లు చట్టంగా మారితే చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు కానుంది.

ప్రపంచకప్ ముంగిట టీమిండియాకు గంభీర్ సలహాలు, సూచనలు

టీమిండియాపై భారత మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ప్రపంచ కప్ లోగా లోయర్ ఆర్డర్ మరింత సరిదిద్దుకోవాలని సూచించారు.

రామ్ గ్లింప్స్: దేశభక్తి నేపథ్యంలో సాగే సినిమా గ్లింప్స్ విడుదల 

దేశభక్తి నేపథ్యంలో ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం ఆ జాబితాలోకి రామ్(Rapid Action Mission) సినిమా కూడా చేరనుంది.

మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఇండియా కూటమిలో భిన్న వాదనలు.. ఎవరెమన్నారో తెలుసా

మహిళా రిజర్వేషన్ బిల్లు 2023పై విపక్షాల కూటమి 'ఇండియా'లో భిన్నవాదనలు వ్యక్తమవుతున్నాయి.

Women's Reservation Bill: ఎన్డీఏ, యూపీఏ మహిళా రిజర్వేషన్ బిల్లుల మధ్య తేడా ఏంటి? 

చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం సోమవారం ఆమోదం తెలిపింది. పార్లమెంట్ కొత్త భవనంలో జరిగిన తొలి సెషన్‍‌లో మంగళవారం లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సమావేశాల్లోనే మహిళా బిల్లును ఆమోదించనున్నారు.

నాగచైతన్య కొత్త సినిమాలో హీరోయిన్ ఫిక్స్, వీడియో రిలీజ్ చేసిన మేకర్స్ 

హీరో నాగ చైతన్య, దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్లో ఇప్పటివరకు ప్రేమమ్, సవ్యసాచి అనే రెండు చిత్రాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు కూడా థియేటర్ల వద్ద పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయాయి.

సప్త సాగరాలు దాటి ట్రైలర్:తెలుగులో వస్తున్న  కన్నడ బ్లాక్ బస్టర్ 

కన్నడ హీరో రక్షిత్ శెట్టి నటించిన సప్త సాగరాలు దాటి సైడ్-ఏ చిత్ర తెలుగు ట్రైలర్ ఈరోజు విడుదలైంది. నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ జరిగింది.

ప్రపంచకప్ ముందు ఆటగాళ్లకు గాయాలు.. వేగంగా కోలుకుంటారనే ధీమాలో క్రికెట్ దేశాలు

ప్రపంచకప్‌ మెగాటోర్నీ అక్టోబర్‌ 5న భారత్‌ వేదికగా ప్రారంభం కానుంది. ఆటకు ముందే పలు జట్లకు ఆటగాళ్ల గాయాలు, ఆందోళన కలిగిస్తున్నాయి.

జనసేనకు గుడ్‌న్యూస్.. తిరిగి 'గాజు గ్లాసు' గుర్తును కేటాయించిన ఎన్నికల సంఘం 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. మరోసారి జనసేనకు ఎన్నికల గుర్తుగా గాజు గ్లాసును కేటాయించింది.

జమ్ముకశ్మీర్ అనంత్‌నాగ్‌లో ఎన్‌కౌంటర్‌.. లష్కరే తోయిబా కమాండర్ హతం

జమ్ముకశ్మీర్ అనంత్‌నాగ్‌లో మంగళవారం ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబా కమాండర్ ఉజైర్ ఖాన్ హతమయ్యాడు.

గుజరాత్ వెళ్తున్నారా? జీఐ ట్యాగ్ పొందిన వస్తువులు కొనండి 

పర్యటనలో భాగంగా గుజరాత్ వెళ్తుంటే, అక్కడ ఖచ్చితంగా జీఐ(జియోగ్రాఫికల్ ఇండికేషన్-భౌగోళిక గుర్తింపు) పొందిన వస్తువులు కొనండి. ప్రస్తుతం ఆ వస్తువులు ఏంటో తెలుసుకోండి.

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు.. 'చారిత్రక దినం'గా అభివర్ణించిన ప్రధాని మోదీ 

పార్లమెంట్ కొత్త భవనంలో మంగళవారం లోక్‌సభ కార్యకలాపాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి.

టీమిండియాపై గవాస్కర్ ప్రశంసలు.. కొత్తబంతితో పాక్ కంటే భారత బౌలింగ్‌ అటాక్ భేష్

టీమిండియాపై మాజీ స్టార్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసల జల్లు కురిపించారు. కొత్తబంతితో భారత బౌలింగ్ అటాక్ అద్భుతమని కొనియాడారు.

అల్లు అర్జున్ ఖాతాలో మరో గౌరవం: లండన్ కు పయనమవుతున్న ఐకాన్ స్టార్? 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికై అందరి దృష్టిని ఆకర్షించారు. పుష్ప సినిమాలో నటనకి గాను అల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు వరించింది.

మార్టిన్ లూథర్ కింగ్: ఇంట్రెస్టింగ్ టైటిల్ తో సంపూర్ణేష్ బాబు కొత్త చిత్రం 

హృదయ కాలేయం సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన సంపూర్ణేష్ బాబు, తాజాగా ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్‌‌కు 'సంవిధాన్‌ సదన్‌' పేరు.. ప్రధాని మోదీ ప్రతిపాదన 

పార్లమెంట్ పాత భవనంలోని సెంట్రల్ హాల్‌లో మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు.

జియో ఏయిర్ ఫైబర్: రిలయన్స్ జియో నుండి సరికొత్త ఇంటర్నెట్ సేవలు 

మొబైల్ నెట్ వర్క్ మార్కెట్ ను ఏకఛత్రాధిపత్యంలా ఏలుతున్న రిలయన్స్ జియో, ఏయిర్ ఫైబర్ ని లాంచ్ చేసింది. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 19న ఏయిర్ ఫైబర్ ని లాంచ్ చేశారు.

షూటింగ్ ప్రపంచక‌ప్‌లో సిల్వ‌ర్ మెడ‌ల్ గెలిచిన భారత షూటర్ నిశ్చ‌ల్

బ్రెజిల్ దేశంలోని అత్యంత ప్రసిద్ధ నగరం రియో ​​డి జనీరోలో జ‌రిగిన ప్ర‌పంచ‌క‌ప్‌లో భారత షూటర్ రికార్డు సృష్టించింది.

ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌‌పై 21వ తేదీకి వాయిదా 

అమరావతి ఇన్నర్ రింగ్‌ రోడ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హై కోర్టు విచారణకు స్వీకరించింది.

భారత రోడ్లపై ALCAZAR ఫేస్‌లిఫ్ట్ టెస్ట్ రన్.. 3వరుసల SUVకి కంపెనీ రెడి

Hyundai Alcazar 2024 Model : భారత ఆటోమొబైల్​ మార్కెట్​లో హ్యుందాయ్​ అల్కజార్ కి మంచి​ డిమాండ్​ ఉంది.

రూల్స్ రంజన్: దేఖో ముంబై పాటను లాంచ్ చేసిన మాస్ మహారాజా రవితేజ 

కిరణ్ అబ్బవరం, నేహాశెట్టి హీరో హీరోయిన్లుగా కనిపిస్తున్న రూల్స్ రంజన్ సినిమా నుండి ఈరోజు నాలుగవ పాట రిలీజైంది.

కేరళ: అదుపులో నిపా వైరస్.. కంటైన్మెంట్ జోన్లలో ఆంక్షల సడలింపు 

కొన్నిరోజులుగా కేరళను కలవరపెడుతున్న నిఫా వైరస్ ప్రస్తుతం అదుపులో ఉన్నట్లు విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది.

బ్రేక్ ఫాస్ట్ లో ఫైబర్ తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ ఫుడ్స్ ట్రై చేయండి 

ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత కొద్దిసేపటికి ఆకలిగా ఉన్నట్టు కొందరికి అనిపిస్తుంటుంది. దానికి కారణం కావలసినంత ఫైబర్ తీసుకోకపోవడమే.

INDIA VS AUS : బీసీసీఐ అనూహ్య నిర్ణయం.. టీమిండియా కెప్టెన్‌గా కేఎల్ రాహుల్

భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ ఈనెల 22న ప్రారంభం కానుంది.

దెబ్బకు దెబ్బ.. కెనడా రాయబారిని బహిష్కరించిన భారత్ 

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారత్‌కు చాలా దగ్గరి సంబంధం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలను కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలో ప్రతీకార చర్యలకు భారత్ దిగింది.

ప్రపంచ కప్ జట్టులోకి స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. చెప్పకనే చెప్పేసిన కెప్టెన్ రోహిత్

టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ జట్టులోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నారు.

చారిత్రక సందర్భం.. అధికారికంగా భారత పార్లమెంట్‌గా మారిన కొత్త భవనం 

సెప్టెంబర్ 19వ భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత కీలకమైన రోజు.

ఇండియన్ సినిమాపై బయోపిక్: రాజమౌళి సమర్పణలో వస్తున్న కొత్త ప్రాజెక్ట్ 

తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన రాజమౌళి, ఆర్ఆర్ఆర్ తర్వాత మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడని అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందనేది ఇంకా వెల్లడి కాలేదు.

X వినియోగదారులపై బాంబ్ పేల్చిన ఎలాన్ మస్క్.. ప్రతి ఒక్కరూ డబ్బులు చెల్లించాల్సిందేనట

ట్విట్టర్ వాడాలంటే ప్రతి ఒక్కరూ డబ్బులు చెల్లించాల్సిందేనని ఎలాన్ మస్క్ మరోసారి ప్రకటించేశారు. కొంతకాలంగా 'X'​లో మస్క్, భారీ మార్పులు తెచ్చేందుకు యత్నిస్తున్నారు.

Talk Like A Pirate Day: చిత్ర విచిత్రమైన పనులు చేయడానికి ఒక రోజుందని మీకు తెలుసా? 

ప్రపంచంలో ప్రతీ విషయం మీద దినోత్సవం జరుపుకోవడం చాలా సర్వసాధారణం. విమెన్స్ డే నుంచి మొదలుకొని మెన్స్ డే, మదర్స్ డే ఇలా రకరకాల దినోత్సవాలు జరుపుకుంటారు.

WORLD NO.1 INDIA : ప్రపంచకప్‌కు ముందు వన్డేల్లో నెం.1గా భారత్ .. కీలకంగా మారనున్న ఆస్ట్రేలియా సిరీస్  

ఆసియా కప్-2023 అద్భుత విజయంతో టీమిండియా నూతనోత్సాహంగా నిండి ఉంది. ఈ నేపథ్యంలోనే వన్డేల్లో నెంబర్ వన్ ర్యాంక్‌కు మరింత చేరువ కాగలిగింది.

భారత్, కెనడా మధ్య వివాదాన్ని రగిల్చిన ఖలిస్థానీ టెర్రరిస్ట్ నిజ్జర్ ఎవరు?

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ హత్య ఉదంతం భారత్, కెనడా దేశాల మధ్య వివాదాన్ని రగిల్చింది.

ఆదిత్య-ఎల్1: భూమిని పూర్తిగా దాటేసి.. లగ్రేంజియన్ పాయింట్ వైపు ప్రయాణం 

సూర్యుడిని అధ్యయనం చేయడానికి ఆదిత్య-ఎల్1 మిషన్ ని ఇస్రో ప్రయోగించింది.

ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్యపై కెనడా ఆరోపణలను ఖండించిన భారత్ 

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యను హత్య చేయడంలో భారత్ పాత్ర ఉందంటూ కెనడా ప్రభుత్వం ఆరోపణలు చేసింది. అయితే ఈ ఆరోపణలను భారత ప్రభుత్వం ఖండించింది.

వచ్చే నెల భారత రోడ్లపైకి BMW iX1 లగ్జరీ ఈవీ కారు.. దీని ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే

లగ్జరీ కార్లలో బీఎండబ్ల్యూ కారుకు ఉన్న ప్రత్యేకత వేరే ఏ కారుకు లేదు. లగ్జరీ విభాగంలో అత్యంత ప్రజాదరణ కలిగిన కారుగా బీఎండబ్ల్యూ పేరుగాంచింది.

విజయ్ ఆంటోనీ ఇంట్లో విషాదం: ప్రాణాలు తీసుకున్న కూతురు 

తమిళ హీరో విజయ్ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కూతురు ఆత్మహత్య చేసుకుంది.

సెప్టెంబర్ 19న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

సెప్టెంబర్ 19వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

ఖలిస్తానీ ఉగ్రవాది హత్య ఆరోపణలపై భారత దౌత్యవేత్తను తొలగించిన కెనడా

జూన్‌లో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యకు భారత ప్రభుత్వానికి మధ్య సంభావ్య సంబంధం ఉందని ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ఆరోపించిన వెంటనే కెనడా సోమవారం ఒక భారతీయ దౌత్యవేత్తను తొలగించింది.