05 Jul 2023

NCP crisis: పార్టీ గుర్తు ఎక్కడికీ పోలేదు, ప్రజలు, కార్యకర్తలు మనతోనే ఉన్నారు: శరద్ పవార్ 

మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది. పార్టీ గుర్తును కోసం శరద్ పవార్-అజిత్ పవార్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది.

వైఎస్ జగన్ సంస్థలు జగతి, భారతి, ఎంపీ విజయసాయి రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు 

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సంస్థలకు సుప్రీంకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది.

బాప్టిజం ఘాట్ నిర్మాణంపై ఏపీ హైకోర్టు స్టే.. 3 వారాలకు విచారణ వాయిదా

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్మిస్తున్న బాప్తిజం ఘాట్‌ నిర్మాణ పనులపై వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే వివాదం ఉన్నత న్యాయస్థానానికి చేరుకుంది.

#NKR 21: యాక్షన్ మోడ్ లో కళ్యాణ్ రామ్; కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది 

బింబిసార, అమిగోస్ చిత్రాల తర్వాత డెవిల్ అనే సినిమాతో కళ్యాణ్ రామ్ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కళ్యాణ్ రామ్ పుట్టినరోజును పునస్కరించుకుని మరో కొత్త సినిమా ప్రకటన వచ్చింది.

తెలంగాణలో నూతనంగా 8 వైద్య కళాశాలలు.. 10 వేలకు చేరువలో మెడికల్ సీట్లు

తెలంగాణలో నూతనంగా 8 వైద్య కళాశాలలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి.

మధ్యప్రదేశ్: గిరిజన కూలీపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తి ఇల్లు కూల్చివేత

గిరిజన యువకుడిపై మూత్ర విసర్జన చేసిన ప్రవేశ్ శుక్లాపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది.

వెస్టిండీస్ దిగ్గజంతో టీమిండియా ప్లేయర్లు  

వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ కోసం భారత ఆటగాళ్లు కరేబియన్ గడ్డపై అడుగుపెట్టారు. ఈ క్రమంలో భారత బృందం ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేశారు.

ప్రేరణ: ఒక పని మీవల్ల కాదని వేరే వాళ్ళు చెబితే మీరు నమ్మారంటే మీ మీద మీకు నమ్మకం లేనట్టే 

సాధారణంగా జీవితంలో ఎదుటివాళ్ళు ఎక్కువగా సలహాలిస్తూ ఉంటారు. మీరు కొంచెం మెతకగా కనిపిస్తే ఆ సలహాలు ఇంకా ఎక్కువైపోతాయి. మీరేం చేయగలరో లేదో కూడా వాళ్ళే చెప్పేస్తారు.

ఆర్‌-5 జోన్‌లో గృహ నిర్మాణాలకు సుప్రీం అనుమతిపై హైకోర్టు విచారణ.. ఈనెల 11కి వాయిదా 

ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి రాజధాని పరిధిలోని ఆర్-5 జోన్‌లో పేదల ఇళ్ల నిర్మాణాల అంశంపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ మేరకు అక్కడ గృహాలను నిర్మించేందుకు సుప్రీం కోర్టు అనుమతించిందా లేదా అని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది.

NCP Crisis: మామ మీకు 83ఏళ్లు, రిటైర్ అవ్వండి; శరద్ పవార్‌పై అజిత్ విమర్శలు 

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తన మామ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూనే, ఆయనే తమ ఆరాధ్య దైవం అని కొనియాడారు.

ఆర్టీఏ ఏజెంట్ల గుట్టు రట్టు.. నకిలీ సర్టిఫికెట్ల తయారీలో ఆరుగురు అరెస్ట్

నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న ఆరుగురు ప్రైవేట్ ఆర్టీఏ ఏజెంట్లను రాచకొండ పోలీస్ అదుపులోకి తీసుకుంది. రంగారెడ్డి జిల్లా మన్నెంగూడ ఆర్టీఏ ఆఫీస్ దగ్గర సదరు ఏజెంట్లను ఎల్బీనగర్ (ఎస్ఓటీ),ఆదిబట్ల పోలీసులతో కలిసి అరెస్ట్ చేశారు.

మారుతి సుజుకి ఇన్విక్టో వచ్చేసింది.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ఇండో జపాన్ కంపెనీ మారుతి సుజుకీ నుంచి సరికొత్త ప్రీమియం ఎంపీవీ కార్ ఇవాళ లాంచ్ అయింది. మల్టీ పర్పస్ వెహికల్ ఇన్విక్టో ను దేశీయ మార్కెట్లోకి ఆవిష్కరించింది.

సిద్ధార్థ్ టక్కర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్: స్ట్రీమింగ్ ఎక్కడంటే? 

గత కొన్నేళ్ళుగా తెలుగు సినిమాల్లో కనిపించకుండా పోయిన హీరో సిద్ధార్థ్, రీసెంట్ గా టక్కర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా కనిపించిన ఈ చిత్రం, తెలుగు, తమిళంలో విడుదలైంది.

ఎన్సీపీ గుర్తును దక్కించుకునేందుకు ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించిన అజిత్ పవార్

మహారాష్ట్ర ఎన్సీపీ సంక్షోభం రోజురోజుకు ముదురుతుందే కానీ తగ్గడం లేదు. ఎన్సీపీ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తీసుకుంటోంది.

టీమిండియాతో టెస్టు సిరీస్.. స్పెషల్ ఫోకస్ పెట్టిన విండీస్!

జింబాబ్వే వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ క్వాలిఫయర్ మ్యాచుల్లో నిరాశపరిచిన వెస్టిండీస్, వన్డే ప్రపంచ కప్ 2023 టోర్నీకి అర్హత సాధించకలేపోయింది.

వర్షాకాలంలో మీ పెంపుడు కుక్కపిల్లలను జాగ్రత్తగా చూసుకోవడానికి చేయాల్సిన పనులు 

వర్షాకాలం వచ్చినపుడు మీరు మాత్రమే కాదు మీరు పెంచుకునే జంతువులను కూడా జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. వర్షాకాలంలో పెంపుడు జంతువులకు పిడుదు పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది.

తీస్తా సెతల్వాద్‌కు ఊరట; మధ్యంతర బెయిల్‌ను పొడిగించిన సుప్రీంకోర్టు 

2002 గుజరాత్ అల్లర్ల కల్పిత సాక్ష్యాల కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ప్రముఖ సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌కు బుధవారం సుప్రీంకోర్టులో ఊరట లభించింది.

కుమారుడి కోసం బానెట్‌పైకి దూకిన తల్లి.. ముగ్గురు పోలీసులు సస్పెండ్ 

మధ్యప్రదేశ్‌లో ఓ మహిళ పట్ల పోలీసులు కర్కశంగా వ్యవహరించారు. వారి తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Personal Data Protection Bill: వ్యక్తిగత డేటా రక్షణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం 

వ్యక్తిగత డేటా రక్షణ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది.

యాషెస్ సిరీస్ : ఇంగ్లాండ్‌కు మరో ఎదురుదెబ్బ.. స్టార్ ప్లేయర్ దూరం

యాషెస్ సిరీస్‌లో ఇప్పటికే రెండు టెస్టు మ్యాచులు ఓడిపోయిన ఇంగ్లండ్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మూడో టెస్టుకు ముందు గాయం కారణంగా ఆ జట్టు వైస్ కెప్టెన్ ఒల్లీ పోప్ యాషెస్ సిరీస్‌లోని మిగిలిన మ్యాచులకు దూరమయ్యాడు.

స్పై సినిమా పాన్ ఇండియా రిలీజ్: వేరే రాష్ట్రాల ప్రేక్షకులకు సారీ చెప్పిన నిఖిల్ 

హీరో నిఖిల్ నుండి స్పై పేరుతో సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. సుభాష్ చంద్రబోస్ మరణ రహస్యంపై వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది.

కేంద్రమంత్రి పదవిపై దిల్లీ పెద్దల మాటకు కట్టుబడి ఉంటా : కిషన్ రెడ్డి

తెలంగాణ భారతీయ జనతా పార్టీలో గత కొద్ది రోజులుగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

'యూనిఫాం సివిల్ కోడ్‌' అమలుకు మేం వ్యతిరేకం: ఏఐఏడీఎంకే

తమిళనాడులోని బీజేపీకి మిత్రపక్షమైన ఏఐఏడీఎంకే కీలక ప్రకటన చేసింది. యూనిఫాం సివిల్ కోడ్‌(యూసీసీ)ను వ్యతిరేకిస్తూ, ఈ అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చింది. దీంతో సార్వత్రిక ఎన్నికల ముంగిట బీజేపీకి షాక్ తగిలింది.

ఐసీసీ నెంబర్ 1 టెస్టు బ్యాటర్‌గా కేన్ విలియమ్సన్.. టాప్-10లో భారత్ నుంచి ఒక్కడు

న్యూజిలాండ్ జట్టు స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ టెస్టు క్రికెట్లో నెంబర్ వన్ బ్యాటర్‌గా నిలిచాడు.

 ఖుషి సినిమా నుండి వీడియో లీక్: సాంప్రదాయ దుస్తుల్లో విజయ్, సమంత 

విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా ఖుషి సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్, శరవేగంగా జరుగుతోంది.

దిల్లీలో భారీగా కుంగిన రోడ్డు.. తెల్లవారుజామునే గుర్తించడంతో తప్పిన ప్రాణనష్టం

దేశ రాజధాని దిల్లీలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఓ రోడ్డు భారీగా కుంగిపోయి రాజధాని వాసులను భయబ్రాంతులకు గురిచేసింది.

Delhi: దిల్లీలోని తీస్ హజారీ కోర్టులో కాల్పుల కలకలం

దిల్లీలోని తీస్ హజారీ కోర్టు ఆవరణలో బుధవారం తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి.

ముగ్గురు భారత ఆటగాళ్లను వదిలేయనున్న లక్నో సూపర్ జెయింట్స్!

ఐపీఎల్ 2023 సీజన్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ నిరాశపరిచింది. గతేడాది టోర్నీలో అడుగుపెట్టిన లక్నో సూపర్ జెయింట్స్ అద్భుత ప్రదర్శన‌తో ఫ్లే ఆఫ్స్ చేరింది. ఈసారి ఎలిమినేటర్ మ్యాచులో ముంబై ఇండియన్స్ చేతిలో పరాజయం పాలై ఇంటిముఖం పట్టింది.

వర్షాకాలంలో కారులో ప్రయాణం సాఫీగా సాగాలంటే తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు 

వర్షాకాలంలో ప్రయాణాలు చేయడం చాలా రిస్కుతో కూడుకున్న పని. ఏ ప్రాంతంలో వర్షాలు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి ప్రయాణాలు చేయడం కష్టంగా ఉంటుంది.

జెనిన్‌లో ఇజ్రాయెల్ ఆపరేషన్; 12మంది మృతి

జెనిన్ శరణార్థి శిబిరంలోని తీవ్రవాద మౌలిక సదుపాయాలు, ఆయుధాలను నాశనం చేయడం లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం చేపట్టిన ఆపరేషన్ ముగిసింది.

దూసుకెళ్తున్న కియా.. ఎలక్ట్రికల్ కార్ల తయారీపై దృష్టి!

దక్షిణ కొరియాకు చెందిన కియా మోటర్స్ భారత విపణిలో తమ మార్కెట్ వాటాను క్రమంగా పెంచుకుంటుంది. ఇప్పటికే చాలా రకాల మోడళ్లను ప్రవేశపెట్టిన సంస్థ, తాజాగా ఎలక్ట్రిక్ కార్లపై దృష్టిసారిస్తున్నట్లు ప్రకటించింది.

గిరిజన హక్కులపై 'యూనిఫాం సివిల్ కోడ్' ప్రభావం ఉండదు: కేంద్రమంత్రి బఘేల్

యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ)పై బుధవారం కేంద్రమంత్రి సత్యపాల్ సింగ్ బఘెల్ కీలక వ్యాఖ్యలు చేశారు.

మంగపేటలోని 23 గ్రామాలపై హైకోర్టు సంచలన తీర్పు.. 75 ఏళ్లకు గిరిజనులకు అనుకూలమైన తీర్పు 

చరిత్రాత్మకమైన కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ములుగు జిల్లా మంగపేట మండలంలోని 23 గ్రామాలు షెడ్యూల్‌ ప్రాంతాలేనని గుర్తించింది. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

వింబుల్డన్‌లో కార్లోస్ అల్కరాజ్ ముందంజ

టాప్ సీడ్ అల్కరాజ్ వింబుల్డన్‌లో సత్తా చాటాడు. మంగళవారం జరిగిన మొదటి రౌండ్‌లో అతడు 6-0, 6-2, 7-5తో చార్డీ (ఫ్రాన్స్‌)పై విజయం సాధించాడు. మూడో సెట్లో మాత్రమే అల్కరాజ్ కొంచెం పోరాడాల్సి వచ్చింది.

మున్నంగి సీఫుడ్స్ లో అమ్మోనియం గ్యాస్ లీక్..16 మంది కార్మికులకు అస్వస్థత,ఆస్పత్రికి తరలింపు

ఆంధ్రప్రదేశ్ లోని సీ ఫుడ్స్ పరిశ్రమలో విష వాయువు లీకైంది. ప్రకాశం జిల్లాలోని వావిలేటిపాడులోని మున్నంగి సీ ఫుడ్స్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది.

ఆఫ్ఘనిస్తాన్: మహిళలపై తాలిబన్ల ఆణచివేత; ఉమెన్ బ్యూటీ సెలూన్లపై నిషేధం 

ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళలపై అణచివేత ఆగడం లేదు. తాజాగా మహిళా బ్యూటీ, హెయిర్ సెలూన్లపై తాలిబన్లు నిషేధం విధించారు. ఇందుకోసం మహిళలకు ఒక నెల సమయం ఇచ్చారు.

విలన్ గా మంచు మనోజ్: రవితేజ సినిమాలో అవకాశం? 

మంచు మనోజ్ హీరోగా సినిమా వచ్చి చాలా రోజులై పోయింది. 2017లో వచ్చిన ఒక్కడు మిగిలాడు తర్వాత మనోజ్ హీరోగా ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు.

విడాకులపై నీహారిక రెస్పాన్స్: ప్రైవసీ కావాలంటున్న మెగా డాటర్ 

మెగా డాటర్ నీహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డతో వివాహ బంధానికి ముగింపు పలికింది. వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని గత కొన్ని రోజులుగా సోషల్ మీడీయాలో వార్తలు వచ్చాయి.

భారత బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్‌కు గౌరవ డాక్టరేట్

భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ కు మరో అరుదైన గౌరవం లభించింది. కర్ణాటకు చెందిన శ్రీ సత్యసాయి యూనివర్సిటీ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ ఆయనకు గౌరవ డాక్టరేట్ ను అందించింది.

కేరళలో హైఅలెర్ట్.. భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలు బంద్ 

కేరళ రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. మంగళవారం కురిసిన బీభత్సమైన వర్షానికి చెట్లు నేలరాలాయి. పలు నివాసాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

కిల్లర్ మంచు పర్వతం 'నంగా పర్బత్'పై చిక్కుకుపోయిన పాకిస్థానీ ప్రొఫెసర్

పాకిస్థాన్ పర్వత అధిరోహకుడు ఆసిఫ్ భట్టి ప్రపంచంలోని 9వ అత్యంత ఎత్తైన, ప్రమాదకమైన పర్వతం నంగా పర్బత్‌పై చిక్కుకుపోయారు.

మరింత పడిపోయిన పీవీ సింధు ర్యాంకు

డబుల్‌ ఒలింపిక్‌ పతక విజేత, భారత స్టార్ షట్లర్ పివి.సింధు బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో వెనుకబడింది. మంగళవారం బీడబ్ల్యూఎఫ్ ప్రకటించిన జాబితాలో ఏకంగా మూడు స్థానాలు కోల్పోయి సింధు 15వ ర్యాంకులో నిలిచింది.

బలగం సినిమా ఖాతాలో మరో మైలురాయి: ఏకంగా 100కు పైగా అవార్డులు 

జబర్దస్త్ కమెడియన్ వేణు, దర్శకుడిగా మారి తెరకెక్కించిన బలగం చిత్రం ఎంత పెద్ద విజయం అందుకుందో అందరికీ తెలిసిందే.

టేకాఫ్‌ అవుతున్న విమానంలో అరుపులు, కేకలు.. డోర్ తీయబోయిన యువకుడు అరెస్ట్ 

లండన్‌ వెళ్తున్న ర్యాన్‌ఎయిర్‌ విమానంలో వింత ఘటన చోటు చేసుకుంది. టేక్ ఆఫ్ చేసేందుకు సిద్ధంగా ఉన్న విమానంలో ఓ వ్యక్తి అలజడులు సృష్టించాడు. ఫలితంగా తోటి ప్రయాణికులంతా భయబ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటన జాదర్‌ నగరంలో చోటు చేసుకుంది.

టీమిండియా మాజీ ప్లేయర్‌కు తప్పిన పెను ప్రమాదం

టీమిండియా మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్, అతని కుమారుడు త్రుటిలో ప్రాణాప్రాయం నుంచి తప్పించుకున్నారు. వారు ప్రయాణిస్తున్న కారు అతివేగంగా దూసుకొచ్చి ఓ ట్రక్కును ఢీకొట్టింది.

చరిత్ర సృష్టించిన హైదరాబాద్ మెట్రో.. ఒక్క రోజే 5.10 లక్షల మంది ప్రయాణం

హైదరాబాద్‌ మెట్రో రైలు చరిత్ర సృష్టించింది. సోమవారం ఒక్క రోజే 5.10 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. ఈ మేరకు ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది.

నేషనల్ వర్క్ హాలిక్స్ డే: పని తప్ప మరో ధ్యాసలేని వారి కోసం ఒకరోజు ఎందుకు ఉంటుందో తెలుసా? 

వర్క్ హాలిక్స్.. సాధారణంగా ఆఫీసుల్లో ఈ పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. పని తప్ప మరో ధ్యాస లేని వారి వర్క్ హాలిక్స్ అంటారు.

వైట్‌హౌస్‌లో దొరికిన తెల్ల పొడిపై క్లారిటీ, కొకైన్‌గా గుర్తింపు

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో అనుమానాస్పదంగా కనిపించిన తెల్లటి పొడి కాసేపు అధికార యంత్రాంగాన్ని హడలెత్తించింది. దాన్ని పరీక్షించిన నిపుణులు కొకైన్‌గా గుర్తించారు.

వన్డే వరల్డ్ కప్ ముందు కీలక నిర్ణయం.. టీమిండియా చీఫ్ సెలక్టర్‌గా అజిత్ అగార్కర్

టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా మాజీ ఆల్ రౌండర్ అజిత్ అగార్కర్ ఎంపికయ్యాడు. భారత పురుషుల క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్‌గా అజిత్ అగార్కర్‌ను నియమిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

డెవిల్ గ్లింప్స్: భారతదేశ స్వాతంత్ర్యానికి  ముందు జరిగే కథలో గూఢచారిగా కళ్యాణ్ రామ్ 

బింబిసార తర్వాత అమిగోస్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కళ్యాణ్ రామ్, పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం డెవిల్ అనే సినిమాతో వస్తున్నాడు.

వన్డే ప్రపంచ కప్ నుంచి జింబాబ్వే నిష్క్రమణ

ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023కు జింబాబ్వే కూడా అర్హత సాధించలేకపోయింది. మెగా టోర్నీకి అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచులో జింబాబ్వే చేతులెత్తేసింది.

గువాహటిలో ఘోరం.. తల్లీకూతుళ్లపై 8 మంది గ్యాంగ్ రేప్

అసోంలోని గువాహటిలో దారుణం చోటు చేసుకుంది. దివ్యాంగురాలైన ఓ మహిళ సహా ఆమె కుతురుపై 8 మంది దుండగులు అత్యాచారానికి ఒడిగట్టారు.అత్యాచారం అనంతరం నిందితులు తల్లీ కుమార్తెల ప్రైవేట్ భాగాలపై కారం చల్లి పారిపోయారు.

సినిమాల నుండి బ్రేక్ తీసుకోనున్న సమంత: కారణం ఏంటంటే? 

స్టార్ హీరోయిన్ సమంత షాకింగ్ డెసిషన్ తీసుకోనుంది. సినిమాల నుంది బ్రేక్ తీసుకోవాలని అనుకుంటుందని సమాచారం. అది కూడా సంవత్సరం వరకూ అని తెలుస్తోంది.

కొండచరియలు విరిగి కార్లపైకి పడ్డ బండరాయి.. ఇద్దరు మృతి, ముగ్గురు సీరియస్ 

నాగాలాండ్‌లోని చమౌకేడిమా జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మేరకు భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. ఫలితంగా ఓ పెద్ద బండరాయి అమాంతం రెండు కార్లపై పడింది.

కళ్యాణ్ రామ్ బర్త్ డే: ఆయన జీవితంలోని ఆసక్తికరమైన విషయాలు 

కీ.శే నందమూరి తారకరామారావు మనవడిగా, నందమూరి హరికృష్ణ కొడుకుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ రామ్, వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

9వ సారి SAFF టైటిల్ గెలిచిన భారత్

శాఫ్ ఫుట్‌ బాల్ జట్టు ఛాంపియన్ షిప్‌లో భారత జట్టు అదరగొట్టింది. మంగళవారం జరిగిన ఫైనల్లో కువైట్‌పై నెగ్గిన సునీల్ ఛెత్రి సేన తొమ్మిదోసారి సాఫ్ కప్‌ను కైవసం చేసుకుంది.

గిరిజన కూలీపై మూత్ర విసర్జన; నిందితుడు బీజేపీ వ్యక్తి అంటూ ప్రతిపక్షాల ఆరోపణ 

మధ్యప్రదేశ్‌లో ఒక గిరిజన కూలీపై మూత్ర విసర్జన చేస్తూ కెమెరాలో చిక్కుకున్న ప్రవేశ్ శుక్లా అనే వ్యక్తిని మంగళవారం అర్థరాత్రి పోలీసలు అరెస్టు చేశారు.

జులై 5న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.

రాగల 3 రోజులలో తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ  

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రాగల 72 గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వానలు కురవనున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

04 Jul 2023

తోషాఖానా కేసులో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు భారీ ఊరట

తోషాఖానా కేసులో పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌కు ఇస్లామాబాద్ హైకోర్టు (ఐహెచ్‌సీ)లో మంగళవారం భారీ ఊరట లభించింది.

మరోసారి మిరపకాయ్ కాంబో.. హరీష్ శంకర్ చెప్పిన స్టోరీ లైన్ కి రవితేజ గ్రీన్ సిగ్నల్ 

టాలీవుడ్ లో మాస్ మహారాజ రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే.అయితే రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో అంటే ఆ క్రేజ్ మామూలుగా ఉండదు.

ఎంబీబీఎస్ స్టూడెంట్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్; భారీగా పెరిగిన సీట్లు

ఎంబీబీఎస్ స్టూడెంట్స్‌కు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

Double Ismart Movie: ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ కి ముహూర్తం ఖరారు 

యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఎంత హిట్టో చెప్పనక్కర్లేదు.

ఎన్నికల వేళ ఐఏఎస్ బదిలీలు.. జీహెచ్ఎంసీ నూతన కమిషనర్‌గా రొనాల్డ్ రోస్ నియామకం

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) నూతన కమిషనర్ గా రొనాల్డ్ రోస్‌ నియామకమయ్యారు. ప్రస్తుతం ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్న రోస్ ను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

బ్యాట్ పట్టుకున్న కేన్ విలియమ్సన్..ఐపీఎల్ గాయం నుంచి కోలుకున్నట్లేనా?

ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ తొలి మ్యాచులో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గాయపడ్డ విషయం తెలిసిందే. దీంతో మిగతా లీగ్‌లకు, కివీస్ తరుపున అంతర్జాతీయ మ్యాచులకు దూరమయ్యాడు.

గెట్ రెఢీ ఫర్ బ్రో మ్యూజిక్ అంటున్న థమన్..ఈనెల 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్

పవన్ కల్యాణ్‌, సాయిధరమ్ తేజ్ ఇద్దరూ కీలక పాత్ర పోషిస్తున్న బ్రో సినిమాకి సంబంధించి తాజా కబురు అందింది. ఈ మేరకు త్వరలోనే బ్రో మ్యూజికల్ బ్లాస్ట్‌ ప్రారంభం కానుందని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ వెల్లడించాడు.

దినదినాభివృద్ధి చెందుతున్న నిమ్స్; దేశంలోనే తొలిసారిగా రోబోటిక్ సర్జరీ సౌకర్యం 

హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో రూ.35 కోట్లతో కొనుగోలు చేసిన హై-ఎండ్ రోబోటిక్ సర్జరీ సిస్టమ్‌ను అందుబాటులోకి వచ్చింది.

భారత మహిళల జట్టు హెడ్ కోచ్‌గా అమోల్ మంజుదార్ ఫిక్స్!

భారత మహిళల జట్టు హెడ్ కోచ్‌గా వెటరన్ క్రికెటర్ అమోల్ మజుందార్ నియామకం అయినట్లు సమాచారం. ఈ మేరకు సీఏసీ ముంబయిలో సోమవారం షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసింది.

స్టైలిష్ లుక్‌తో కియా సెల్టోస్ ఫేస్‌లిస్ట్ వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే కొనాల్సిందే!

కియో సెల్టోస్ ఎస్‌యూవీని ఇండియాలో కియో మోటర్స్ ఆవిష్కరించింది. అద్భుతమైన ఫీచర్లతో కస్టమర్లకు ఈ ఎస్‌యూవీ ఆకర్షిస్తోంది. ఇది చాలా అప్డేట్స్‌తో ముందుకొచ్చింది. 2023 మచ్ అవైటెడ్ కార్స్‌లో కియా సెల్టోస్ ఫేస్‌లిస్ట్ ఒకటి.

తళపతి లియోలో నటిస్తున్న మరో ఫేమస్ డైరెక్టర్‌.. ఇప్పటికే కీలక పాత్రలో ఇద్దరు దర్శకులు 

తళపతి విజయ్ నటిస్తున్న క్రేజీ చిత్రం లియో (Leo, Bloody Sweet). ఈ చిత్రానికి లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

కొన్ని దేశాలు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నాయ్; ఎస్‌సీఓ సదస్సులో పాక్‌కు మోదీ చురక 

ఉగ్రవాదం ప్రపంచ శాంతికి తీవ్రమైన ముప్పును కలిగిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

పాకిస్థాన్‌ను వదిలేస్తున్నా.. ఐపీఎల్ ఆడటానికి సిద్ధం : మహ్మద్ అమీర్

2008లో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రేజీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఎంతోమంది ఆటగాళ్లను అంతర్జాతీయ మ్యాచులను ఆడే అవకాశం ఐపీఎల్ కల్పించింది.

డెవిల్ గ్లింప్స్ వీడియో రిలీజ్ కు రేపే ముహుర్తం.. టైప్ రైటర్ తో స్పై థ్రిల్లర్‌ వీడియో విడుదల

నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ డెవిల్ చిత్రం నుంచి అప్‌డేట్‌ వచ్చింది. గత కొంతకాలంగా ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఎప్పుడెప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు చిత్ర యూనిట్ తాజా కబురు అందించింది.

ఆసియా కప్ నిర్వహణపై క్లారిటీ..ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ఆ రోజునే!

ఆసియా కప్ వివాదంపై త్వరలోనే సస్పెన్స్ వీడనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆసియా కప్ నిర్వహణపై ఓ క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది.

ఘోర రోడ్డు ప్రమాదం; కారును ఢీకొట్టిన ట్రక్కు, 15 మంది మృతి

మహారాష్ట్రలోని ధులే జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబై-ఆగ్రా హైవేపై మంగళవారం కారును కంటైనర్ ట్రక్కు ఢీకొనడంతో 15మంది మృతి చెందారు. మరో 20మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు.

Monsoon fitness: వర్షాకాలంలో వాకింగ్ ఎలా చేయాలో తెలుసుకోండి!

వర్షాకాలంలో ఇంటి నుంచి బయటికెళ్లాలంటే కష్టం. ఎండల నుంచి ఉపశమనంతో పాటు వర్షాకాలంలోనూ మనం ఆనందించడానికి చాలా విషయాలుంటాయి. చల్లటి సాయంత్రం వేళ వేడివేడి పకోడిలు తింటే వచ్చే కిక్కే వేరు.

ఆ ఇద్దరిపై మండిపడ్డ పూనమ్ కౌర్.. ప్రతి ఒక్కరిని గురువు అని పిలవొద్దని హితవు 

తెలుగు సినీ పరిశ్రమలో పూనమ్ కౌర్ ఫైర్ బ్రాండ్ గా మారారు. వివాదాస్పదమైన అంశాలతోనే ప్రాచుర్యం పొందుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఆమె పెట్టే పోస్టులు తరుచుగా వైరల్ అవుతున్నాయి.

తెలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించిన బీజేపీ; తెలంగాణకు కిషన్ రెడ్డి, ఏపీకి పురందేశ్వరీ

భారతీయ జనతా పార్టీ(బీజేపీ) సంస్థాగతంగా సమూల మార్పుల దిశగా అడుగులు వేస్తోంది.

నిరీక్షణకు తెర.. హార్లే-డేవిడ్‌సన్ X440 సూపర్ బైక్ వచ్చేసింది

ఇండియాలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హార్లీ డేవిడ్‌సన్ X440 ను ఎట్టకేలకు ఆ సంస్థ రిలీజ్ చేసింది.

ఓటీటీలోకి నేను స్టూడెంట్ సార్ సినిమా.. జులై 14న ఆహాలో రిలీజ్

టాలీవుడ్ సినిమా నేను స్టూడెంట్ సార్ ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో జులై 14 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము; సీఎం కేసీఆర్, గవర్నర్ ఘన స్వాగతం 

స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం హైదరాబాద్‌‌కు వచ్చారు.

బీజేపీతో పొత్తుపై 2022లోనే ఎన్సీపీలో చర్చ; తిరుగుబాటు నేత ప్రఫుల్ పటేల్ సంచలన వ్యాఖ్యలు 

అజిత్ పవార్ ఉదంతం తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.

మంగళవారం నాడు మంగ‌ళ‌వారం టీజ‌ర్ రిలీజ్.. బోల్డ్‌ లుక్ ఇచ్చిన పాయ‌ల్ రాజ్‌పుత్ 

మంగళవారం సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది.ఈ మేరకు బోల్డ్ లుక్ తో పాయల్ రాజ్‌పుత్ అందాలతో కనువిందు చేస్తోంది.

ఒమన్‌పై నెదర్లాండ్స్ విజయం

వరల్డ్ క్యాలిఫయర్స్ టోర్నమెంట్‌లో భాగంగా ఒమన్‌తో జరిగిన సూపర్ సిక్సెస్ మ్యాచులో నెదర్లాండ్స్ 74 పరుగుల తేడాతో గెలుపొందింది.

ఈ నెల 8న ప్రధాని మోదీ వరంగల్‌ పర్యటన షెడ్యూల్ ఇదే 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 8న తెలంగాణలోని వరంగల్‌కు రానున్నారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు.

రంగంలోకి దిగిన బ్రియాన్ లారా.. వెస్టిండీస్ పరాజయాలకు చెక్ పడేనా?

జింబాబ్వే వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ క్యాలిఫైయర్ మ్యాచుల్లో వెస్టిండీస్ చేతులెత్తేసింది. లీగ్ దశలో ధాటిగా ఆడిన ఆడిన విండీస్, సూపర్ సిక్స్ స్టేజ్ లో దాన్ని కొనసాగించలేకపోయింది.

సలార్ టీజర్ రిలీజ్ కు ముహుర్తం ఖరారు.. తెల్లవారు 5.12 గంటలకు విడుదల చేయడం పై జోరుగా చర్చ

సలార్ టీజర్ రిలీజ్ కు ముహుర్తం ఖరారైంది. ఈనెల 6న ప్రభాస్ సినిమా టీజర్ రిలీజ్ కానుంది. ఈ మేరకు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వెల్లడించారు.

డీఈఆర్‌సీ చైర్‌పర్సన్‌ ప్రమాణ స్వీకారం వాయిదా వేసిన సుప్రీంకోర్టు; కేంద్రం, ఎల్‌జీకి నోటీసులు 

దిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (డీఈఆర్‌సీ) చైర్‌పర్సన్‌గా జస్టిస్ (రిటైర్డ్) ఉమేష్ కుమార్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని జూలై 11 వరకు వాయిదా వేయాలని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది.

టీ10 లీగ్ ఆడనున్న టీమిండియా మాజీ ఆటగాళ్లు

జింబాబ్వే క్రికెట్ తొలిసారిగా 'జిమ్ ఆప్రో టీ10' పేరుతో ఓ ప్రాంఛైజీ లీగ్ ను నిర్వహిస్తోంది. ఈ జిమ్ ఆఫ్రో టీ 10 లీగ్ జులై 20న ప్రారంభం కానుంది.

మహేశ్ బాబు కుమార్తె యాడ్ ఫోటోలు ఇవే..టైమ్స్ స్క్వేర్ పై మెరిసిన సితార

మహేశ్ బాబు కుమార్తె సితార తండ్రికి తగ్గ తనయురాలు అనిపించుకుంటోంది. ఈ మేరకు సితార కలెక్షన్స్ లో భాగంగా పీఎంజే జువెల్లరీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది.

ఆస్ట్రేలియా ఆటగాళ్ల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ముగ్గురిపై వేటు

యాషెస్ రెండో టెస్టు చివరి రోజు ఇంగ్లాండ్ బ్యాటర్ బెయిర్ స్టో స్టంపౌట్ వివాదానికి సంబంధించి ఆస్ట్రేలియా ఆటగాళ్ల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ముగ్గురిని మెరీల్‌బోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఎంసీసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన ఎస్ఈఓ శిఖరాగ్ర సమావేశం; పుతిన్, జిన్‌పింగ్‌, షెహబాజ్ హాజరు 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) జరగనుంది. భారత్ ఈ కార్యక్రమాన్ని వర్చువల్‌గా నిర్వహిస్తోంది.

టీమిండియాకు అదే పెద్ద మైనస్.. ఈసారీ వరల్డ్ కప్‌లో పాక్ గెలుస్తుంది: పాక్ మాజీ క్రికెటర్

ఈ ఏడాది భారత్, పాకిస్థాన్ జట్లు కనీసం రెండుసార్లు తలపడనున్నాయి. మొదట వన్డే ఫార్మాట్‌లో జరిగే ఆసియా కప్ టోర్నీలో టీమిండియా, పాక్ తలపడనుండగా, భారత్ వేదికగా జరగనున్న ప్రపంచ కప్ టోర్నీలో మరోసారి ఈ రెండు జట్లు మధ్య పోరు జరగనుంది.

మన టార్గెట్ 2047: కేంద్ర మంత్రి మండలి సమావేశంలో ప్రధాని మోదీ

దిల్లీలోని ప్రగతి మైదాన్ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మోదీ మంత్రులకు దిశానిర్దేశం చేశారు.

నేడు దిల్లీకి సీఎం వైఎస్ జగన్..వర్షాకాల సమావేశాల వేళ మోదీతో కీలక భేటీ 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. నేటి సాయంత్రం ఆయన హస్తినాకు పయనం కానున్నారు. ఈ మేరకు బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవనున్నారు.

ట్విట్టర్‌కు పోటీగా 'థ్రెడ్స్' యాప్.. జూన్ 6న లాంచ్

ట్విట్టర్ పోటీగా ఫేస్‌బుక్ మాతృసంస్థ మేటా కొత్త యాప్‌ను తీసుకురానుంది. దానికి థ్రెడ్స్(Threads) అని పేరు పెట్టారు. ఈ కొత్త యాప్‌ను జూన్ 6న లాంచ్ చేయనున్నారు.

Sravana Masam 2023: నేటి నుంచి శ్రావణమాసం ప్రారంభం; ఈ నెల విశిష్టతను తెలుసుకుందాం

హిందూ క్యాలెండర్‌లో శ్రావణ మాసాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. ఆధ్యాత్మికత, సాంస్కృతిక ఐక్యతను పెంపొందించడంలో ఈ నెల దోహదపడుతుంది.

అన్ని బ్యాంకుల ఖాతాదారులకు ఎస్‌బీఐ గుడ్ న్యూస్..కార్డు లేకున్నా నగదు డ్రా చేసుకోవచ్చు

ఇకపై ఏటీఎం కార్డు వెంట తీసుకురాకపోయినా క్యాష్ విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ మేరకు ఇండియన్ బ్యాంకింగ్‌ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్ తమ ఖాతాదారులకు మరో కొత్త సర్వీసుని ప్రవేశపెట్టింది.

Wimbledon 2023: జకోవిచ్, స్వియాటెక్‌ శుభారంభం.. విలియమ్స్ ఔట్!

ప్రతిష్ఘాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో టాప్ సీడ్ ప్లేయర్లు శుభారంభం అందించారు. పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ నోవక్ జకోవిచ్, మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ స్వియాటెక్ తొలి అడ్డంకిని అలవోకగా అధిగమించారు.

హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. నగరంలో భారీ భద్రతా, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ నగరంలో పర్యటించనున్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవం ముగింపు కార్యక్రమంలో పాల్గొననున్నారు. మంగళవారం గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో ఉత్సవం నిర్వహిస్తున్నారు.

శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌కు నిప్పంటించిన దుండగులు

కాలిఫోర్నియా శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌కు ఆదివారం తెల్లవారుజామున 1:30గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. ఈ విషయాన్ని మంగళవారం స్థానిక ఛానెల్ దియా టీవీ ధృవీకరించింది.

జులై 4న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.

తెలంగాణకు గుడ్ న్యూస్.. నేటి నుంచి 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు

తెలంగాణలో రాగల మూడు రోజులూ భారీ వర్షాలు కురవనున్నాయి. మంగళవారం నుంచి గురువారం వరకు రోజులపాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

Happy Birthday Keeravani: ఆస్కార్ విజేత ఎం.ఎం.కీరవాణి స్వర సంచలనాలు ఇవే 

'నాటు నాటు పాట'తో ఆస్కార్ సాధించి, తెలుగు సినిమా సంగీతాన్ని ప్రపంచ నలువీధుల్లో మారుమోగించిన మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి.