06 Jul 2023
చంద్రయాన్-3కి ముహుర్తం ఖరారు.. జులై 14 మధ్యాహ్నం 2.35 నిమిషాలకు రాకెట్ లాంచ్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్- 3ని జూలై 14న మధ్యాహ్నం 2.35 నిమిషాలకి ప్రయోగించనున్నట్లు ట్వీట్టర్ ద్వారా వెల్లడించింది.
ప్రేరణ: ఉచిత సలహాలు ఇచ్చేవారికి దూరంగా ఉండకపోతే మీరు మీద నమ్మకం కోల్పోతారు
ఈ ప్రపంచంలో పక్కనవారి బాధ గురించి ఆలోచన ఎవ్వరికీ ఉండదు. కానీ పక్కన వాడికి సలహాలు ఇవ్వడానికి మాత్రం ప్రతీ ఒక్కరు పరుగెత్తుకుంటూ వచ్చేస్తారు.
మోదీపై లాలూ చురకలు.. ప్రధాని ఎవరైనా సరే భార్య లేకుండా ఉండకూడదని హితవు
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓటమే లక్ష్యంగా జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలు ఐక్య రాగం వినిపిస్తున్నాయి.
ఓటీటీ: ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఏంటంటే?
ప్రతీ వారం ఓటీటీలో సినిమాలు సందడి చేస్తూనే ఉంటాయి. ఈ వారం డిజిటల్ వేదికగా సందడి చేసే చిత్రాలేంటో చూద్దాం.
సీఎం జగన్‌తో తెలంగాణ మాజీ ఎంపీ పొంగులేటీ భేటీ
రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తెలంగాణ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి గురువారం భేటీ అయ్యారు.
తెలంగాణలో భారీగా పెరిగిన ఇంజినీరింగ్ సీట్లు.. 14,565 సీట్లకు గ్రీన్ సిగ్నల్
తెలంగాణలో భారీ సంఖ్యలో ఇంజినీరింగ్ సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. కొత్తగా మరో 14 వేల 565 సీట్లు పెంచుకునేందుకు సర్కార్ పచ్చ జెండా ఊపింది.
దేశ రాజకీయాల్లో సెగలు పుట్టిస్తున్న నేపాల్ ప్రధాని వ్యాఖ్యలు
భారత్‌కు వ్యాపారవేత్తపై నేపాల్ ప్రధాని పుష్పకుమార్ దహల్ చేసిన వ్యాఖ్యలు ఆ దేశ రాజకీయాల్లో సెగలు పుట్టిస్తున్నాయి.
మీ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచే కూలింగ్ ఫేస్ ప్యాక్స్
రోజంతా పనిచేసి అలసిపోయిన తర్వాత చర్మానికి కూలింగ్ ఫేస్ ప్యాక్ వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. దీనివల్ల చర్మం పాడవకుండా ఆరోగ్యంగా ఉంటుంది.
ఎన్నికల వేళ కేబినెట్‌లో మార్పులు.. నడ్డాను వరుసగా కలుస్తున్న కేంద్రమంత్రులు
కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసేందుకు కేంద్రమంత్రులు, రాష్ట్రాల పార్టీల అధ్యక్షులు బారులు తీరుతున్నారు.
మణిపూర్‌లో మళ్లీ పేలిన గన్.. పాఠశాల బయట మహిళ కాల్చివేత
మణిపూర్‌లో మళ్లీ హింస చేలరేగింది. పాఠశాల బయట ఓ మహిళను అతి దారుణంగా కాల్చి చంపేశారు. ఇంపాల్ పశ్చిమ జిల్లాలోని స్థానిక శిశు నిష్తా నికేషన్ స్కూల్ ఎదుట ఈ ఘటన చోటు చేసుకుంది.
ప్రశాంతంగా జీవించడానికి పనికొచ్చే కొన్ని విషయాలు ఇక్కడ తెలుసుకోండి
ఇప్పుడు ప్రశాంతత అనేది దొరకని పదార్థంలా మారిపోయింది. డబ్బులు పెట్టినా ప్రశాంతత దొరకడం లేదు. అనుక్షణం ఒత్తిడిని నెత్తిమీద పెట్టుకుని, కష్టాలతో కాపురం చేసే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు.
విదేశాల్లో తొలి ఐఐటీ ఏర్పాటుకు ఒప్పందం.. జాంజిబార్‌లో ఐఐటీ మద్రాస్ క్యాంపస్
భారతదేశం బయట తొలి ఐఐటీ క్యాంపస్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్, జాంజిబార్ అధ్యక్షుడు హుస్సేన్ అలీ మవినీ సమక్షంలో ఒప్పందాలు జరిగాయి.
టెస్టుల్లో స్టీవ్ స్మిత్ ఎవరెస్టు.. అరుదైన మైలురాయిని చేరుకున్న ఆసీస్ బ్యాటర్!
టెస్టు క్రికెట్‌లో ఘనమైన రికార్డులతో పాటు ఇప్పటికే ఆల్‌టైమ్ గ్రేట్ ఆటగాళ్లలో ఒకడిగా నిలిచిన ఆసీస్ స్టార్ స్టీవన్ స్మిత్ మరో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు.
ఎల్జీపై సీఎం కేజ్రీవాల్ గరంగరం.. దిల్లీ గొంతు నొక్కుతున్నారని ఆగ్రహం
దిల్లీలో లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్య రాజకీయ ప్రకంపణలు మరోసారి బయటపడ్డాయి. ఎల్జీ తాజాగా ఇచ్చిన ఆదేశాలపై సీఎం అసహనం వ్యక్తం చేశారు.
EV కోసం బీమాను కొనుగోలు చేస్తున్నారా..? అయితే వీటి గురించి తెలుసుకోండి!
ప్రమాదవశాత్తు నష్టం, అగ్నిప్రమాదం, ప్రకృతి వైపరీత్యాలు, వాహన దొంగతనం వంటివి బీమా కిందకి వస్తాయి.
అజయ్ చక్రవ్యూహం ఓటీటీలో రిలీజ్: స్ట్రీమింగ్ ఎక్కడంటే?
క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా వైవిధ్యమైన పాత్రల్లో కనిపించిన అజయ్, తాజాగా హీరోగా చక్రవ్యూహం - ద ట్రాప్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చాలారోజుల తర్వాత అజయ్ హీరోగా నటించిన చిత్రం ఇది.
శ్రీవారి ఆలయ ముఖద్వారం వద్ద జారిపడ్డ హుండీ.. బయటకు వచ్చిన కానుకలు
ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. ఈ మేరకు ఆలయ ముఖద్వారం వద్ద సీల్ వేసిన హుండీ పొరపాటున జారికింద పడిపోయింది.
వరల్డ్ కప్‌కు ముందు రిటైర్మెంట్ ప్రకటించిన బంగ్లాదేశ్ కెప్టెన్
బంగ్లాదేశ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డే వరల్డ్ కప్‌కు మరో మూడు నెలల సమయం ఉన్న తరుణంలో అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.
మామన్నాన్ సినిమాను నాయకుడు పేరుతో తెలుగులో రిలీజ్: థియేటర్లలోకి ఎప్పుడు వస్తుందంటే?
కంటెంట్ బాగుంటే సినిమాను ఆదరించే ప్రేక్షకులు ఎక్కడైనా ఉంటారు. ఆ నమ్మకంతోనే తమిళంలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న మామన్నాన్ మూవీ తెలుగులో రిలీజ్ అవుతోంది.
మహేష్ బాబు గుంటూరు కారం నెక్స్ట్ షెడ్యూల్ పై క్లారిటీ: షూటింగ్ ఎక్కడ జరగనుందంటే?
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఆల్రెడీ రిలీజైన గ్లింప్స్ వీడియో అభిమానులను బాగా ఆకట్టుకుంది.
IND Practice Match: విఫలమైన విరాట్ కోహ్లీ.. విజృంభించిన రోహిత్
ప్రస్తుతం టీమిండియా జట్టు కరీబియన్ దీవుల్లో ఉన్న సంగతి తెలిసిందే. జూలై 12 నుంచి వెస్టిండీస్‌తో మొదలు కానన్న టెస్టు సిరీస్ కు భారత జట్టు సిద్ధమైంది.
కర్ణాటకలో టామాటా పంటను దోచుకున్న దొంగలు.. కన్నీరుమున్నీరైనా మహిళా రైతు
కర్ణాటకలో టామాటా దొంగలు పేట్రేగిపోయారు.దీంతో బాధిత మహిళా రైతు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఓ వైపు దేశవ్యాప్తంగా టమాటా ధరలు భగ్గుమంటున్నాయి. మరోవైపు కొందరు దుండగులు ఏకంగా టామాటా పంటనే దొంగిలించారు.
యూపీ: వివాహితను గర్భవతిని చేశాడు.. పెళ్లి చేసుకోమంటే ప్రాణం తీశాడు
ఉత్తర్‌ప్రదేశ్ లో దారుణం జరిగింది. ఓ వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ యువకుడు, ఆమెను గర్భవతిని చేశాడు.
పీసీబీ మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్‌గా జాకా అష్రఫ్ నియామకం
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్‌గా జాకా అష్రాఫ్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని పీసీబీ గురువారం ప్రకటించింది.
ముఖ్యమంత్రి నివాసంలోకి బాధితుడు దశమత్ రావత్.. కాళ్లు కడిగిన సీఎం చౌహాన్
గిరిజన యువకుడిపై మూత్ర విసర్జన ఘటనతో మధ్యప్రదేశ్ దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. ఈ మేరకు బాధితుడు దశమత్ రావత్ ను భోపాల్ లోని తన అధికార నివాసానికి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆహ్వానించారు.
ట్విట్టర్ కు పోటీగా వచ్చిన సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో జాయిన్ అయిన ఎన్టీఆర్, అల్లు అర్జున్
మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్ ఫామ్ ట్విట్టర్ గురించి అందరికీ తెలిసిందే. ఈ ఫ్లాట్ ఫామ్ ను ఎలాన్ మస్క్ కొన్నప్పటి నుండి రోజూ ఏదో ఒక వార్తల్లో ట్విట్టర్ నిలుస్తూనే ఉంది.
లండన్‌లో అజిత్ అగార్కర్‌తో లంచ్.. గొప్ప సందేశాన్ని ఇచ్చిన సచిన్
టీమిండియా లెజెండ్ సచిన్ టెండూల్కర్ లండన్‌లో వెకేషన్‌ని ఆస్వాదిస్తున్నాడు. సోషల్ మీడియాలో ఎప్పుడు చురుగ్గా ఉంటే సచిన్, తన అభిరుచుల్ని, అనుభవాల్ని ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు.
ఇంటర్నేషనల్ కిస్సింగ్ డే: ముద్దు పెట్టుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకోండి
ప్రేమను రకరకాలుగా ప్రకటించవచ్చు. అలా ప్రకటించే విధానాల్లో ముద్దు పెట్టుకోవడం కూడా ఒకటి. ఈరోజు ఇంటర్నేషనల్ కిస్సింగ్ డే.
దిల్లీలో కాల్పుల కలకలం.. 12 కేసుల్లో నిందితుడు, కిరాయి హంతకుడు కమిల్ అరెస్ట్
దేశ రాజధాని దిల్లీలో కాల్పుల కలకలం రేగింది. నగరంలోని రోహిణిలో తెల్లవారుజామున ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ మేరకు కరుడుగట్టిన కిరాయి హంతకుడు కమిల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
దులీప్ ట్రోఫీ 2023: విజృంభించిన శివమ్ మావి
2023 దులీప్ ట్రోఫీలో భాగంగా తొలి సెమీ ఫైనల్లో రైట్ ఆర్మ్ పేసర్ శివమ్ మావి విజృంభించాడు. తొలుత ఈ మ్యాచులో సెంట్రల్ జోన్, వెస్ట్ జోన్ జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన వెస్ట్ జోన్ 220 పరుగులకు ఆలౌటైంది.
ట్విట్టర్ లోకి లాగిన్ అయిన జుకర్ బర్గ్: థ్రెడ్ యాప్ ప్రచారం కోసమేనా?
ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్, తాజాగా ట్విట్టర్ లోకి లాగిన్ అయ్యాడు. దాదాపు 11ఏళ్ల తర్వాత ట్విట్టర్ లో మార్క్ వచ్చాడు.
వరల్డ్ జూనోసిస్ డే: జంతువుల నుండి వచ్చే వ్యాధులపై అవగాహన కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేకరోజు పై ప్రత్యేక కథనం
ప్రతీ ఏడాది జులై 6వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా వరల్డ్ జూనోసిస్ డే జరుపుకుంటారు. జంతువుల ద్వారా మనుషులకు, మనుషుల ద్వారా జంతువులకు వచ్చే వ్యాధులను జూనోసిస్ అంటారు.
దక్షిణాఫ్రికాలో ఘోర ప్రమాదం.. విషవాయువు లీకేజీతో 16 మంది మృత్యువాత
దక్షిణ ఆఫ్రికాలో అర్థరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. సౌత్ ఆఫ్రికన్ ముఖ్యనగరం జోహెన్నస్ బర్గ్ సమీపంలోని ఓ మురికివాడలో విషపూరితమైన గ్యాస్ లీకైంది.
థ్రెడ్స్ యాప్‌కు భారీ రెస్పాన్స్.. నాలుగు గంటల్లోనే ఐదు మిలియన్ల డౌన్‌లోడ్స్
ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా ప్రారంభించిన థ్రెడ్స్ యాప్ అందుబాటులోకి వచ్చింది. ఎలాన్ మస్క్‌కు చెందిన ట్విట్టర్ కు పోటీగా మెటా కొత్త సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌ను తీసుకొచ్చింది.
సంక్షోభంలో ఎన్సీపీ.. ఇవాళ దిల్లీలో అత్యవసర సమావేశానికి శరద్ పవార్ పిలుపు
మహారాష్ట్రకు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పార్టీ గురువారం దిల్లీలో అత్యవసర జాతీయ కార్యవర్గ సమావేశానికి పిలుపునిచ్చింది.
టీ20ల్లో అరుదైన ఘనత సాధించిన అలిస్సా హీలీ
ఆస్ట్రేలియా మహిళా ప్లేయర్ అలిస్సా హీలీ టీ20ల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచులో ఈ ఘనతను సాధించింది.
డిప్రెషన్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఆస్కార్ నామినేటెడ్ సింగర్ కోకో లీ
హాంకాంగ్ లో జన్మించిన ప్రఖ్యాత అమెరికన్ సింగర్ కోకోలీ 48ఏళ్ళ వయసులో కన్నుమూసింది. ఆత్మహత్య చేసుకుని తన ప్రాణాలను తీసేసుకుంది కోకోలీ.
తెలంగాణ, ఏపీలతో పాటు 7 హైకోర్టులకు కొత్త సీజేలు.. సుప్రీం కొలీజియం సిఫారసు
భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు కొత్త చీఫ్ జస్టిస్ లు రానున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది.
2023 వింబుల్డన్: మొదటి రౌండ్‌లో విజయం సాధించిన స్టెఫానోస్ సిట్సిపాస్
పురుషుల సింగిల్స్‌లో స్టెఫానోస్ సిట్సిపాస్ మొదటి రౌండ్ లో కి ప్రవేశించాడు. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచులో అతను 3-6, 7-6(1), 6-2, 6-7(5), 7-6(8)తో థిమ్ పై విజయం సాధించాడు.
ఒక్క పోస్టు కూడా అప్లోడ్ చేయకుండానే అరుదైన రికార్డు అందుకున్న పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇన్స్ టాగ్రామ్ లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. ఇన్స్ టాలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు పవన్ ఒక్క పోస్ట్ కూడా చేయలేదు.
IND vs WI: భారత జట్టులోకి తెలుగోడు.. రోహిత్, కోహ్లీకి విశ్రాంతి
వెస్టిండీస్‌తో జరిగే టీ20 సిరీస్‌కు టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. హార్ధిక్ పాండ్యా జట్టుకు నాయకత్వం వహిస్తుండగా, సూర్యకుమార్ యాదవ్ వైస్ కెప్టెన్ పాత్రలో కనిపించనున్నాడు.
సలార్ టీజర్: జురాసిక్ పార్కులో డైనోసార్ గా ప్రభాస్ ఎలివేషన్; అభిమానులకు పూనకాలే
ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమా టీజర్ విడుదలైంది.
యూఎస్ పౌరసత్వ పరీక్షలో కీలక మార్పులు.. అమెరికాపై అవగాహన, ఆంగ్ల నైపుణ్యాలకు పెద్దపీట
అగ్రరాజ్యం అమెరికా దేశ పౌరసత్వం పొందడం అంత ఈజీ కాదు. ఇకపై నిబంధనలు మరింత కఠినతరం చేయనున్నారు. ఈ మేరకు నేచురలైజేషన్ పరీక్షలో యూఎస్ఏ కీలక మార్పులు చేయనుంది.
జులై 6న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
05 Jul 2023
NCP crisis: పార్టీ గుర్తు ఎక్కడికీ పోలేదు, ప్రజలు, కార్యకర్తలు మనతోనే ఉన్నారు: శరద్ పవార్
మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది. పార్టీ గుర్తును కోసం శరద్ పవార్-అజిత్ పవార్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది.
వైఎస్ జగన్ సంస్థలు జగతి, భారతి, ఎంపీ విజయసాయి రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సంస్థలకు సుప్రీంకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది.
బాప్టిజం ఘాట్ నిర్మాణంపై ఏపీ హైకోర్టు స్టే.. 3 వారాలకు విచారణ వాయిదా
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్మిస్తున్న బాప్తిజం ఘాట్ నిర్మాణ పనులపై వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే వివాదం ఉన్నత న్యాయస్థానానికి చేరుకుంది.
#NKR 21: యాక్షన్ మోడ్ లో కళ్యాణ్ రామ్; కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది
బింబిసార, అమిగోస్ చిత్రాల తర్వాత డెవిల్ అనే సినిమాతో కళ్యాణ్ రామ్ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కళ్యాణ్ రామ్ పుట్టినరోజును పునస్కరించుకుని మరో కొత్త సినిమా ప్రకటన వచ్చింది.
తెలంగాణలో నూతనంగా 8 వైద్య కళాశాలలు.. 10 వేలకు చేరువలో మెడికల్ సీట్లు
తెలంగాణలో నూతనంగా 8 వైద్య కళాశాలలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి.
మధ్యప్రదేశ్: గిరిజన కూలీపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తి ఇల్లు కూల్చివేత
గిరిజన యువకుడిపై మూత్ర విసర్జన చేసిన ప్రవేశ్ శుక్లాపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది.
వెస్టిండీస్ దిగ్గజంతో టీమిండియా ప్లేయర్లు
వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ కోసం భారత ఆటగాళ్లు కరేబియన్ గడ్డపై అడుగుపెట్టారు. ఈ క్రమంలో భారత బృందం ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేశారు.
ప్రేరణ: ఒక పని మీవల్ల కాదని వేరే వాళ్ళు చెబితే మీరు నమ్మారంటే మీ మీద మీకు నమ్మకం లేనట్టే
సాధారణంగా జీవితంలో ఎదుటివాళ్ళు ఎక్కువగా సలహాలిస్తూ ఉంటారు. మీరు కొంచెం మెతకగా కనిపిస్తే ఆ సలహాలు ఇంకా ఎక్కువైపోతాయి. మీరేం చేయగలరో లేదో కూడా వాళ్ళే చెప్పేస్తారు.
ఆర్-5 జోన్‌లో గృహ నిర్మాణాలకు సుప్రీం అనుమతిపై హైకోర్టు విచారణ.. ఈనెల 11కి వాయిదా
ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి రాజధాని పరిధిలోని ఆర్-5 జోన్‌లో పేదల ఇళ్ల నిర్మాణాల అంశంపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ మేరకు అక్కడ గృహాలను నిర్మించేందుకు సుప్రీం కోర్టు అనుమతించిందా లేదా అని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది.
NCP Crisis: మామ మీకు 83ఏళ్లు, రిటైర్ అవ్వండి; శరద్ పవార్‌పై అజిత్ విమర్శలు
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తన మామ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూనే, ఆయనే తమ ఆరాధ్య దైవం అని కొనియాడారు.
ఆర్టీఏ ఏజెంట్ల గుట్టు రట్టు.. నకిలీ సర్టిఫికెట్ల తయారీలో ఆరుగురు అరెస్ట్
నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న ఆరుగురు ప్రైవేట్ ఆర్టీఏ ఏజెంట్లను రాచకొండ పోలీస్ అదుపులోకి తీసుకుంది. రంగారెడ్డి జిల్లా మన్నెంగూడ ఆర్టీఏ ఆఫీస్ దగ్గర సదరు ఏజెంట్లను ఎల్బీనగర్ (ఎస్ఓటీ),ఆదిబట్ల పోలీసులతో కలిసి అరెస్ట్ చేశారు.
మారుతి సుజుకి ఇన్విక్టో వచ్చేసింది.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
ఇండో జపాన్ కంపెనీ మారుతి సుజుకీ నుంచి సరికొత్త ప్రీమియం ఎంపీవీ కార్ ఇవాళ లాంచ్ అయింది. మల్టీ పర్పస్ వెహికల్ ఇన్విక్టో ను దేశీయ మార్కెట్లోకి ఆవిష్కరించింది.
సిద్ధార్థ్ టక్కర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్: స్ట్రీమింగ్ ఎక్కడంటే?
గత కొన్నేళ్ళుగా తెలుగు సినిమాల్లో కనిపించకుండా పోయిన హీరో సిద్ధార్థ్, రీసెంట్ గా టక్కర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా కనిపించిన ఈ చిత్రం, తెలుగు, తమిళంలో విడుదలైంది.
ఎన్సీపీ గుర్తును దక్కించుకునేందుకు ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించిన అజిత్ పవార్
మహారాష్ట్ర ఎన్సీపీ సంక్షోభం రోజురోజుకు ముదురుతుందే కానీ తగ్గడం లేదు. ఎన్సీపీ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తీసుకుంటోంది.
టీమిండియాతో టెస్టు సిరీస్.. స్పెషల్ ఫోకస్ పెట్టిన విండీస్!
జింబాబ్వే వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ క్వాలిఫయర్ మ్యాచుల్లో నిరాశపరిచిన వెస్టిండీస్, వన్డే ప్రపంచ కప్ 2023 టోర్నీకి అర్హత సాధించకలేపోయింది.
వర్షాకాలంలో మీ పెంపుడు కుక్కపిల్లలను జాగ్రత్తగా చూసుకోవడానికి చేయాల్సిన పనులు
వర్షాకాలం వచ్చినపుడు మీరు మాత్రమే కాదు మీరు పెంచుకునే జంతువులను కూడా జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. వర్షాకాలంలో పెంపుడు జంతువులకు పిడుదు పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది.
తీస్తా సెతల్వాద్‌కు ఊరట; మధ్యంతర బెయిల్‌ను పొడిగించిన సుప్రీంకోర్టు
2002 గుజరాత్ అల్లర్ల కల్పిత సాక్ష్యాల కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ప్రముఖ సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌కు బుధవారం సుప్రీంకోర్టులో ఊరట లభించింది.
కుమారుడి కోసం బానెట్‌పైకి దూకిన తల్లి.. ముగ్గురు పోలీసులు సస్పెండ్
మధ్యప్రదేశ్‌లో ఓ మహిళ పట్ల పోలీసులు కర్కశంగా వ్యవహరించారు. వారి తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
Personal Data Protection Bill: వ్యక్తిగత డేటా రక్షణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
వ్యక్తిగత డేటా రక్షణ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది.
యాషెస్ సిరీస్ : ఇంగ్లాండ్‌కు మరో ఎదురుదెబ్బ.. స్టార్ ప్లేయర్ దూరం
యాషెస్ సిరీస్‌లో ఇప్పటికే రెండు టెస్టు మ్యాచులు ఓడిపోయిన ఇంగ్లండ్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మూడో టెస్టుకు ముందు గాయం కారణంగా ఆ జట్టు వైస్ కెప్టెన్ ఒల్లీ పోప్ యాషెస్ సిరీస్‌లోని మిగిలిన మ్యాచులకు దూరమయ్యాడు.
స్పై సినిమా పాన్ ఇండియా రిలీజ్: వేరే రాష్ట్రాల ప్రేక్షకులకు సారీ చెప్పిన నిఖిల్
హీరో నిఖిల్ నుండి స్పై పేరుతో సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. సుభాష్ చంద్రబోస్ మరణ రహస్యంపై వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది.
కేంద్రమంత్రి పదవిపై దిల్లీ పెద్దల మాటకు కట్టుబడి ఉంటా : కిషన్ రెడ్డి
తెలంగాణ భారతీయ జనతా పార్టీలో గత కొద్ది రోజులుగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
'యూనిఫాం సివిల్ కోడ్' అమలుకు మేం వ్యతిరేకం: ఏఐఏడీఎంకే
తమిళనాడులోని బీజేపీకి మిత్రపక్షమైన ఏఐఏడీఎంకే కీలక ప్రకటన చేసింది. యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ)ను వ్యతిరేకిస్తూ, ఈ అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చింది. దీంతో సార్వత్రిక ఎన్నికల ముంగిట బీజేపీకి షాక్ తగిలింది.
ఐసీసీ నెంబర్ 1 టెస్టు బ్యాటర్‌గా కేన్ విలియమ్సన్.. టాప్-10లో భారత్ నుంచి ఒక్కడు
న్యూజిలాండ్ జట్టు స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ టెస్టు క్రికెట్లో నెంబర్ వన్ బ్యాటర్‌గా నిలిచాడు.
ఖుషి సినిమా నుండి వీడియో లీక్: సాంప్రదాయ దుస్తుల్లో విజయ్, సమంత
విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా ఖుషి సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్, శరవేగంగా జరుగుతోంది.
దిల్లీలో భారీగా కుంగిన రోడ్డు.. తెల్లవారుజామునే గుర్తించడంతో తప్పిన ప్రాణనష్టం
దేశ రాజధాని దిల్లీలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఓ రోడ్డు భారీగా కుంగిపోయి రాజధాని వాసులను భయబ్రాంతులకు గురిచేసింది.
Delhi: దిల్లీలోని తీస్ హజారీ కోర్టులో కాల్పుల కలకలం
దిల్లీలోని తీస్ హజారీ కోర్టు ఆవరణలో బుధవారం తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి.
ముగ్గురు భారత ఆటగాళ్లను వదిలేయనున్న లక్నో సూపర్ జెయింట్స్!
ఐపీఎల్ 2023 సీజన్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ నిరాశపరిచింది. గతేడాది టోర్నీలో అడుగుపెట్టిన లక్నో సూపర్ జెయింట్స్ అద్భుత ప్రదర్శనతో ఫ్లే ఆఫ్స్ చేరింది. ఈసారి ఎలిమినేటర్ మ్యాచులో ముంబై ఇండియన్స్ చేతిలో పరాజయం పాలై ఇంటిముఖం పట్టింది.
వర్షాకాలంలో కారులో ప్రయాణం సాఫీగా సాగాలంటే తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు
వర్షాకాలంలో ప్రయాణాలు చేయడం చాలా రిస్కుతో కూడుకున్న పని. ఏ ప్రాంతంలో వర్షాలు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి ప్రయాణాలు చేయడం కష్టంగా ఉంటుంది.
జెనిన్‌లో ఇజ్రాయెల్ ఆపరేషన్; 12మంది మృతి
జెనిన్ శరణార్థి శిబిరంలోని తీవ్రవాద మౌలిక సదుపాయాలు, ఆయుధాలను నాశనం చేయడం లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం చేపట్టిన ఆపరేషన్ ముగిసింది.
దూసుకెళ్తున్న కియా.. ఎలక్ట్రికల్ కార్ల తయారీపై దృష్టి!
దక్షిణ కొరియాకు చెందిన కియా మోటర్స్ భారత విపణిలో తమ మార్కెట్ వాటాను క్రమంగా పెంచుకుంటుంది. ఇప్పటికే చాలా రకాల మోడళ్లను ప్రవేశపెట్టిన సంస్థ, తాజాగా ఎలక్ట్రిక్ కార్లపై దృష్టిసారిస్తున్నట్లు ప్రకటించింది.
గిరిజన హక్కులపై 'యూనిఫాం సివిల్ కోడ్' ప్రభావం ఉండదు: కేంద్రమంత్రి బఘేల్
యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ)పై బుధవారం కేంద్రమంత్రి సత్యపాల్ సింగ్ బఘెల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
మంగపేటలోని 23 గ్రామాలపై హైకోర్టు సంచలన తీర్పు.. 75 ఏళ్లకు గిరిజనులకు అనుకూలమైన తీర్పు
చరిత్రాత్మకమైన కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ములుగు జిల్లా మంగపేట మండలంలోని 23 గ్రామాలు షెడ్యూల్ ప్రాంతాలేనని గుర్తించింది. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
వింబుల్డన్‌లో కార్లోస్ అల్కరాజ్ ముందంజ
టాప్ సీడ్ అల్కరాజ్ వింబుల్డన్‌లో సత్తా చాటాడు. మంగళవారం జరిగిన మొదటి రౌండ్‌లో అతడు 6-0, 6-2, 7-5తో చార్డీ (ఫ్రాన్స్)పై విజయం సాధించాడు. మూడో సెట్లో మాత్రమే అల్కరాజ్ కొంచెం పోరాడాల్సి వచ్చింది.
మున్నంగి సీఫుడ్స్ లో అమ్మోనియం గ్యాస్ లీక్..16 మంది కార్మికులకు అస్వస్థత,ఆస్పత్రికి తరలింపు
ఆంధ్రప్రదేశ్ లోని సీ ఫుడ్స్ పరిశ్రమలో విష వాయువు లీకైంది. ప్రకాశం జిల్లాలోని వావిలేటిపాడులోని మున్నంగి సీ ఫుడ్స్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది.
ఆఫ్ఘనిస్తాన్: మహిళలపై తాలిబన్ల ఆణచివేత; ఉమెన్ బ్యూటీ సెలూన్లపై నిషేధం
ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళలపై అణచివేత ఆగడం లేదు. తాజాగా మహిళా బ్యూటీ, హెయిర్ సెలూన్లపై తాలిబన్లు నిషేధం విధించారు. ఇందుకోసం మహిళలకు ఒక నెల సమయం ఇచ్చారు.
విలన్ గా మంచు మనోజ్: రవితేజ సినిమాలో అవకాశం?
మంచు మనోజ్ హీరోగా సినిమా వచ్చి చాలా రోజులై పోయింది. 2017లో వచ్చిన ఒక్కడు మిగిలాడు తర్వాత మనోజ్ హీరోగా ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు.
విడాకులపై నీహారిక రెస్పాన్స్: ప్రైవసీ కావాలంటున్న మెగా డాటర్
మెగా డాటర్ నీహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డతో వివాహ బంధానికి ముగింపు పలికింది. వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని గత కొన్ని రోజులుగా సోషల్ మీడీయాలో వార్తలు వచ్చాయి.
భారత బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్‌కు గౌరవ డాక్టరేట్
భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ కు మరో అరుదైన గౌరవం లభించింది. కర్ణాటకు చెందిన శ్రీ సత్యసాయి యూనివర్సిటీ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ ఆయనకు గౌరవ డాక్టరేట్ ను అందించింది.
కేరళలో హైఅలెర్ట్.. భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలు బంద్
కేరళ రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. మంగళవారం కురిసిన బీభత్సమైన వర్షానికి చెట్లు నేలరాలాయి. పలు నివాసాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
కిల్లర్ మంచు పర్వతం 'నంగా పర్బత్'పై చిక్కుకుపోయిన పాకిస్థానీ ప్రొఫెసర్
పాకిస్థాన్ పర్వత అధిరోహకుడు ఆసిఫ్ భట్టి ప్రపంచంలోని 9వ అత్యంత ఎత్తైన, ప్రమాదకమైన పర్వతం నంగా పర్బత్‌పై చిక్కుకుపోయారు.
మరింత పడిపోయిన పీవీ సింధు ర్యాంకు
డబుల్ ఒలింపిక్ పతక విజేత, భారత స్టార్ షట్లర్ పివి.సింధు బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో వెనుకబడింది. మంగళవారం బీడబ్ల్యూఎఫ్ ప్రకటించిన జాబితాలో ఏకంగా మూడు స్థానాలు కోల్పోయి సింధు 15వ ర్యాంకులో నిలిచింది.
బలగం సినిమా ఖాతాలో మరో మైలురాయి: ఏకంగా 100కు పైగా అవార్డులు
జబర్దస్త్ కమెడియన్ వేణు, దర్శకుడిగా మారి తెరకెక్కించిన బలగం చిత్రం ఎంత పెద్ద విజయం అందుకుందో అందరికీ తెలిసిందే.
టేకాఫ్ అవుతున్న విమానంలో అరుపులు, కేకలు.. డోర్ తీయబోయిన యువకుడు అరెస్ట్
లండన్ వెళ్తున్న ర్యాన్‌ఎయిర్ విమానంలో వింత ఘటన చోటు చేసుకుంది. టేక్ ఆఫ్ చేసేందుకు సిద్ధంగా ఉన్న విమానంలో ఓ వ్యక్తి అలజడులు సృష్టించాడు. ఫలితంగా తోటి ప్రయాణికులంతా భయబ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటన జాదర్ నగరంలో చోటు చేసుకుంది.
టీమిండియా మాజీ ప్లేయర్‌కు తప్పిన పెను ప్రమాదం
టీమిండియా మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్, అతని కుమారుడు త్రుటిలో ప్రాణాప్రాయం నుంచి తప్పించుకున్నారు. వారు ప్రయాణిస్తున్న కారు అతివేగంగా దూసుకొచ్చి ఓ ట్రక్కును ఢీకొట్టింది.
చరిత్ర సృష్టించిన హైదరాబాద్ మెట్రో.. ఒక్క రోజే 5.10 లక్షల మంది ప్రయాణం
హైదరాబాద్ మెట్రో రైలు చరిత్ర సృష్టించింది. సోమవారం ఒక్క రోజే 5.10 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. ఈ మేరకు ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది.
నేషనల్ వర్క్ హాలిక్స్ డే: పని తప్ప మరో ధ్యాసలేని వారి కోసం ఒకరోజు ఎందుకు ఉంటుందో తెలుసా?
వర్క్ హాలిక్స్.. సాధారణంగా ఆఫీసుల్లో ఈ పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. పని తప్ప మరో ధ్యాస లేని వారి వర్క్ హాలిక్స్ అంటారు.
వైట్‌హౌస్‌లో దొరికిన తెల్ల పొడిపై క్లారిటీ, కొకైన్‌గా గుర్తింపు
అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో అనుమానాస్పదంగా కనిపించిన తెల్లటి పొడి కాసేపు అధికార యంత్రాంగాన్ని హడలెత్తించింది. దాన్ని పరీక్షించిన నిపుణులు కొకైన్‌గా గుర్తించారు.
వన్డే వరల్డ్ కప్ ముందు కీలక నిర్ణయం.. టీమిండియా చీఫ్ సెలక్టర్‌గా అజిత్ అగార్కర్
టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా మాజీ ఆల్ రౌండర్ అజిత్ అగార్కర్ ఎంపికయ్యాడు. భారత పురుషుల క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్‌గా అజిత్ అగార్కర్‌ను నియమిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.
డెవిల్ గ్లింప్స్: భారతదేశ స్వాతంత్ర్యానికి ముందు జరిగే కథలో గూఢచారిగా కళ్యాణ్ రామ్
బింబిసార తర్వాత అమిగోస్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కళ్యాణ్ రామ్, పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం డెవిల్ అనే సినిమాతో వస్తున్నాడు.
వన్డే ప్రపంచ కప్ నుంచి జింబాబ్వే నిష్క్రమణ
ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023కు జింబాబ్వే కూడా అర్హత సాధించలేకపోయింది. మెగా టోర్నీకి అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచులో జింబాబ్వే చేతులెత్తేసింది.
గువాహటిలో ఘోరం.. తల్లీకూతుళ్లపై 8 మంది గ్యాంగ్ రేప్
అసోంలోని గువాహటిలో దారుణం చోటు చేసుకుంది. దివ్యాంగురాలైన ఓ మహిళ సహా ఆమె కుతురుపై 8 మంది దుండగులు అత్యాచారానికి ఒడిగట్టారు.అత్యాచారం అనంతరం నిందితులు తల్లీ కుమార్తెల ప్రైవేట్ భాగాలపై కారం చల్లి పారిపోయారు.
రసకందాయంలో ఎన్సీపీ వ్యవహారం; నేడు పోటాపోటీగా సమావేశం అవుతున్న శరద్ పవార్, అజిత్ వర్గాలు
మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) సంక్షోభం రసకందాయంలో పడింది.
సినిమాల నుండి బ్రేక్ తీసుకోనున్న సమంత: కారణం ఏంటంటే?
స్టార్ హీరోయిన్ సమంత షాకింగ్ డెసిషన్ తీసుకోనుంది. సినిమాల నుంది బ్రేక్ తీసుకోవాలని అనుకుంటుందని సమాచారం. అది కూడా సంవత్సరం వరకూ అని తెలుస్తోంది.
కొండచరియలు విరిగి కార్లపైకి పడ్డ బండరాయి.. ఇద్దరు మృతి, ముగ్గురు సీరియస్
నాగాలాండ్‌లోని చమౌకేడిమా జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మేరకు భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. ఫలితంగా ఓ పెద్ద బండరాయి అమాంతం రెండు కార్లపై పడింది.
కళ్యాణ్ రామ్ బర్త్ డే: ఆయన జీవితంలోని ఆసక్తికరమైన విషయాలు
కీ.శే నందమూరి తారకరామారావు మనవడిగా, నందమూరి హరికృష్ణ కొడుకుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ రామ్, వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
9వ సారి SAFF టైటిల్ గెలిచిన భారత్
శాఫ్ ఫుట్ బాల్ జట్టు ఛాంపియన్ షిప్‌లో భారత జట్టు అదరగొట్టింది. మంగళవారం జరిగిన ఫైనల్లో కువైట్‌పై నెగ్గిన సునీల్ ఛెత్రి సేన తొమ్మిదోసారి సాఫ్ కప్‌ను కైవసం చేసుకుంది.
గిరిజన కూలీపై మూత్ర విసర్జన; నిందితుడు బీజేపీ వ్యక్తి అంటూ ప్రతిపక్షాల ఆరోపణ
మధ్యప్రదేశ్‌లో ఒక గిరిజన కూలీపై మూత్ర విసర్జన చేస్తూ కెమెరాలో చిక్కుకున్న ప్రవేశ్ శుక్లా అనే వ్యక్తిని మంగళవారం అర్థరాత్రి పోలీసలు అరెస్టు చేశారు.
జులై 5న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈ మధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
రాగల 3 రోజులలో తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రాగల 72 గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వానలు కురవనున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది.