08 Jun 2023
భోళాశంకర్ నుండి సంగీత్ సాంగ్ లీక్ చేసిన చిరంజీవి
భోళాశంకర్ సినిమా నుండి రిలీజైన మొదటి పాట భోళా మ్యానియాకు అభిమానులు స్టెప్పులు వేస్తూనే ఉన్నారు. లూప్ లో పెట్టుకుని భోళా మ్యానియా పాటకు చిందులేస్తున్నారు.
అగ్ని ప్రైమ్ గ్రాండ్ సక్సెస్.. ఒడిశా తీరం నుంచి పరీక్షించిన భారత్
బాలిస్టిక్ అగ్నిక్షిపణుల తరంలో కొత్తతరం మిస్సైల్ వచ్చి చేరింది. అగ్నిప్రైమ్ గా పిలుచుకునే ఈ బాలిస్టిక్ క్షిపణి రాత్రిళ్లు కూడా ప్రయాణం చేయగలదు.
WTC Final: కెప్టెన్ రోహిత్ శర్మపై సౌరబ్ గంగూలీ గుస్సా
ఇంగ్లండ్ లోని ఓవల్ లో టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ జరుగుతోంది.
శభాష్.. చెన్నై సూపర్ కింగ్స్ కు సీఎం వైఎస్ జగన్ అభినందనలు
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రముఖ భారత క్రికెటర్ అంబటి రాయుడు గురువారం కలిశారు.
ప్రేరణ: నీ దగ్గర ఎన్ని డబ్బులున్నా నీ పెదాల మీద కొంత నవ్వు లేకపోతే అవన్నీ వృధానే, అందుకే నవ్వండి
ఉరుకులు పరుగుల ప్రయాణంలో, కార్పోరేట్ ఉద్యోగాలతో జీవితాలను వెల్లదీస్తున్న వారందరూ తమ ముఖం మీద ఎప్పుడూ చిరాకును అంటించుకుని తిరుగుతారు. ఎందుకని అడిగితే ఇంకా చిరాకు పడతారు.
ప్రభుత్వంతో పట్టుబట్టి 37 డిమాండ్లు ఒడిసిపట్టాం.. ఉద్యమం విరమిస్తున్నాం
ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగుల సంఘం కీలక ప్రకటన చేసింది. తాము ప్రభుత్వంతో పట్టుబట్టి దాదాపు 37 డిమాండ్లు సాధించామని, అందుకే ఉద్యమాన్ని విరమిస్తున్నామని ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.
ఉలిక్కిపడ్డ ఆఫ్ఘనిస్తాన్.. మరోసారి బాంబు పేలుడు
ఎప్పుడూ బాంబుల మోతతో నిత్యం సంఘర్షణకు గురయ్యే దేశంలో అఫ్ఘనిస్తాన్ ది ముందు వరుస. కారణం ఆ దేశంలో నిత్యం ఎక్కడో ఓ చోట గొడవలు, అల్లర్లు, మానవ బాంబులు, బాంబు పేలుడ్లు జరగడమే.
ముంబై హత్య: రెండు కట్టర్లతో శరీరాన్ని 20ముక్కలు చేశాడు; బాధితురాలు అనాథ
ముంబై సమీపంలోని మీరా రోడ్ ప్రాంతంలో 32ఏళ్ల తన జీవిత భాగస్వామిని చంపి, శరీరాన్ని ముక్కలుగా చేసి, ఆ భాగాలను కుక్కర్‌లో ఉడికించిన నిందితుడిని పోలీసులు తమదైశైలిలో విచారిస్తున్నారు.
రంగబలి టీజర్: కామెడీ, యాక్షన్ కలయికతో సరికొత్తగా కనిపిస్తున్న నాగశౌర్య
కొన్నిరోజుల క్రితం తెలుగు సినిమా హీరో అంటే అల్లరి చిల్లరగా ఉండేవాడు. ఆ క్యారెక్టరైజేషన్ ని ప్రేక్షకులు ఇష్టపడేవారు.
VIDEO: పాకిస్థాన్ ఆటగాడు స్టంపౌట్.. నవ్వుకున్న నెటిజన్లు
విటాలిటీ టీ20 బ్లాస్ట్ టోర్నీలో పాకిస్థాన్ ఆటగాడు విచిత్రంగా స్టంపౌట్ అయ్యాడు. డెర్బిషైర్ తరుపున ఆడుతున్న పాకిస్థాన్ స్టార్ ప్లేయర్ హైదర్ అలీ స్టంపౌట్ అయిన వీడియోను చూసిన నెటిజన్లు పడి పడి నవ్వుకుంటున్నారు.
తిరుపతి హథీరాంజీ మఠంలో అర్జున్ దాస్ తొలగింపు, ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం
ఏపీలోని తిరుపతి హథీరాం జీ మఠానికి ప్రస్తుతం మహంతుగా ఉన్న అర్జున్ దాస్ పై వేటు పడింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.
పాట్నాలో జరిగే ప్రతిపక్ష నేతల సమావేశానికి కేసీఆర్‌ను ఆహ్వానించలేదు: తేజస్వీ యాదవ్
ఈ నెల 23న పాట్నాలో జరిగే బిహార్ సీఎం నితీష్ కుమార్ ఆధ్వర్యంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష నేతల సమావేశం జరగనుంది.
400 మీటర్ల లోతులో హోటల్ గదులు: ప్రపంచంలోనే అత్యంత లోతులో ఉన్న హోటల్ గురించి తెలుసుకోండి
ఆతిథ్య రంగంలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు, కాన్సెప్టులు వస్తున్నాయి. అతిథులకు ఆసక్తిని కలిగించడానికి రకరకాల ఆలోచనలతో హోటళ్లను నిర్మిస్తున్నారు.
రియల్ మీ 11 ప్రో సిరీస్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తునన రియల్ మీ 11 ప్రో సిరీస్ భారత మార్కెట్లోకి వచ్చేసింది.
వివేకా కేసులో అవినాష్ రెడ్డే A-8 నిందితుడు : కోర్టులో సీబీఐ కౌంటర్
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వివేకా దారుణ హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ ఎక్కడా నిందితుడిగా పేర్కొనలేదు.
లక్నో: 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, సుత్తితో కొట్టి చంపిన యువకుడు
ఉత్తర్‌ప్రదేశ్ లక్నోలోని ఇందిరానగర్‌లో గురువారం ఘోరం జరిగింది. 14 ఏళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేసి, సుత్తితో తలపై కొట్టి హత్య చేశాడు.
సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ఆదిపురుష్: రన్ టైం ఎంతంటే?
భారత ఇతిహాసమైన రామాయణాన్ని వెండితెర మీద కనీవినీ ఎరుగని రీతిలో ఆవిష్కరించడానికి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఆదిపురుష్ చిత్రాన్ని తెరకెక్కించాడు.
సరికొత్త స్కోడా కొడియాక్ వచ్చేసింది.. 2024లో భారత్ లాంచ్ అయ్యే అవకాశం!
స్కోడా కంపెనీ మార్కెట్లోకి సరికొత్త మోడల్ ను ప్రవేశపెట్టింది. స్కోడా కొడియాక్ పేరుతో ఈ సెవన్ సీటర్ మార్కెట్లోకి లాంచ్ అయింది.
'గొట్టంగాళ్లు' అంటూ టీడీపీ ఇన్‌చార్జులపై కేశినేని నాని ధ్వజం
టీడీపీలో విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహారం క్లైమాక్స్‌కు చేరుకున్నట్లు కనిపిస్తుంది.
జనసేన తీర్థం పుచ్చుకోనున్న వైకాపా నేత ఆమంచి సోదరుడు
చీరాలలో ఆమంచి బ్రదర్స్ అంటే పొలిటికల్ బ్రదర్స్ అనే పేరు ఉంది. గుంటూరు జిల్లాలోని చీరాల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు ఆమంచి కృష్ణమోహన్, ఆమంచి స్వాములు సోదరులు.
సుడిగాలి సుధీర్ హీరోగా కాలింగ్ సహస్ర సినిమా: చిత్ర గొంతులోంచి జాలువారిన మొదటి పాట రిలీజ్
జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు రాష్ట్రాల్లో పేరు తెచ్చుకున్న వారు సినిమా హీరోలుగా మారుతున్న సంగతి తెలిసిందే. అందులో సుడిగాలి సుధీర్ ఒక్కడే వరుసగా సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నాడు.
కెనడాలో ఇందిరా గాంధీ హత్యోదంత శకటం ప్రదర్శన; ఖండించిన జైశంకర్
కెనడాలోని బ్రాంప్టన్‌లో భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి ఘోర అవమానం జరిగింది.
8 మందిపై కత్తితో విరుచుకుపడ్డ సైకో.. ముగ్గురు చిన్నారుల పరిస్థితి ఆందోళనకరం
కళ్ల ముందు ఆడుకుంటున్న పిల్లలకు పొరపాటున తమకు తామే జారిపడితేనే తల్లిదండ్రులు ఎంతో విలవిలలాడుతారు. తమ పిల్లలకు ముళ్లు గుచ్చుకున్న తమకే గుచ్చినట్టుగా అల్లాడిపోతారు.
టీమిండియా పాజిటివ్ గేమ్‌ను ఆడలేదు: రవిశాస్త్రి
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ ను టీమిండియా పేలవంగా ఆరంభించింది. టీమిండియా బౌలర్లు వికెట్లు తీయకపోవడంతో రోహిత్ సేనపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. చాలామంది మాజీలు ఇప్పటికే అశ్విన్ ను ఎంపిక చేయకపోవడాన్ని తప్పుబట్టారు.
డీజే టిల్లు సీక్వెల్ తర్వాత తెలుగులో మరో సినిమాను ఒప్పుకున్న అనుపమ పరమేశ్వరన్
ప్రేమమ్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన మలయాళీ భామ అనుపమ పరమేశ్వరన్, వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది.
కారుణ్య మరణానికి సిద్దపడ్డ జ్ఞాన్‌వాపి మసీదు కేసు మాజీ పిటిషనర్; రాష్ట్రపతికి లేఖ
ఉత్తర్‌ప్రదేశ్ వారణాసిలోన జ్ఞాన్‌వాపి మసీదు ప్రాంగణంలో శృంగార్ గౌరీని పూజించే హక్కును కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పిటిషనర్లలో ఒకరైన రాఖీసింగ్ కారుణ్య మరణానికి సిద్ధమయ్యారు.
మే9 హింసకాండ నిందితులను వదలబోం: ఆర్మీ చీఫ్
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి, పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ పై పరోక్షంగా ఆ దేశ సైన్యాధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
జత కట్టకుండానే పిల్లల్ని కనే జంతువుల గురించి తెలుసుకోండి
సంతానం కలగడానికి ప్రత్యుత్పత్తి ఖచ్చితంగా అవసరమని అందరికీ తెలుసు. కానీ ప్రత్యుత్పత్తి జరపకుండానే కొన్ని జీవులు పిల్లల్ని కంటాయని ఎంతమందికి తెలుసు?
టీమిండియా పెద్ద తప్పు చేసింది..ఆ నిర్ణయం తీసుకోవడం సరైంది కాదు: రికి పాంటింగ్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ లో టీమిండియా బౌలర్లు చేతులెత్తేశారు.
గుడ్‌న్యూస్; త్వరలో తగ్గనున్న పెట్రోల్-డీజిల్ ధరలు
పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలనే ఆలోచనలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు(ఓఎంసీ) ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఫలిస్తున్న ఆర్‌బీఐ ఫ్యూహం.. 50 శాతం రూ.2000 నోట్లు వాపస్
2023 మే 19న పెద్ద నోట్ల ఉపసంహరణపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ సంచలన ప్రకటన చేసింది. దేశంలోని ఈ అత్యున్నత బ్యాంక్ తీసుకున్న నిర్ణయాలు ఫలితాలనిస్తున్నాయి.
ఇంటర్ మియామి క్లబ్‌లో లియోనెల్ మెస్సీ
అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ ఈ మధ్యనే పీఎస్‌జీ క్లబ్ ను వీడిన సంగతి తెలిసిందే.
నక్సల్స్ సానుభూతిపరులే లక్ష్యంగా జార్ఖండ్, బిహార్‌లోని ఏడు చోట్ల ఎన్ఐఏ దాడులు
2018లో మావోయిస్టులు నరేష్ సింగ్ భోక్తాను దారుణంగా హత్య చేసిన ఘటనకు సంబంధించి బిహార్, జార్ఖండ్‌లోని ఏడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గురువారం తెలిపింది.
కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు; ధృవీకరించిన ఐఎండీ
నైరుతి రుతుపవనాలు గురువారం కేరళను తాకాయి. ఈ మేరకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రుతుపవనాల రాకను ధృవీకరించింది.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్: మెగా ఇంట మోగనున్న పెళ్ళి బాజాలు
మెగా హీరో వరుణ్ తేజ్, అతి త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అందాల రాక్షసితో హీరోయిన్ గా పరిచయమైన లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ పెళ్ళి జరగనుంది. ఆల్రెడీ నిశ్చితార్థానికి ముహూర్తం ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది.
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వీడియో విడుదల.. జాతీయ మహిళా కమిషన్ లో శేజల్ ఫిర్యాదు
తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మరో పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా బాధితురాలను చిన్నయ్యకు సంబంధించిన ఓ వీడియోను విడుదల చేయడం రాజకీయాల్లో కలకలం రేపుతోంది.
పసిడితో మెరిసిన భారత బృందం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ ను భారత్ ఘనంగా ముగించింది. భారత బృందం సభ్యులు ఏకంగా పసిడి తో మెరిశారు.
'వన్ ఆన్ వన్' వ్యూహం: 450లోక్‌సభ స్థానాల్లో ప్రతిపక్షాల నుంచి బీజేపీపై ఒక్కరే పోటీ
2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీపై ఉమ్మడిగా పోరాడేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఇందుకోసం ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్లాలని భావిస్తున్నాయి.
వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే: ఈ వ్యాధి రావడానికి కారణాలు, లక్షణాలు, చికిత్స
బ్రెయిన్ ట్యూమర్ పై అవగాహన కలిగించడానికి, బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న వారికి సపోర్ట్ ఇచ్చేందుకు, వాళ్ల కుటుంబాలకు అండగా ఉండడానికి, అలాగే బ్రెయిన్ ట్యూమర్ పై పరిశోధనలు చేస్తున్న వైద్య బృందాన్ని గుర్తించడానికి ప్రతీ ఏడాది జూన్ 8వ తేదీన వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే ని జరుపుతారు.
అప్ఘనిస్తాన్ ను చిత్తుగా ఓడించిన శ్రీలంక.. వన్డే సిరీస్ లంకదే
అప్ఘనిస్తాన్ తో మూడు వన్డేల సిరీస్ ను ఆతిథ్య శ్రీలంక 2-1తో కైవసం చేసుకుంది. బుధవారం జరిగిన చివరి వన్డేలో అప్ఘనిస్తాన్ ను లంక చిత్తుగా ఓడించింది. వన్డే వరల్డ్ కప్ క్వాలిఫై రేసులో ఉన్న శ్రీలంక సొంతగడ్డపై సిరీస్ ను సాధించింది.
తిరుపతి దేవాలయంలో క్రితి సనన్ కు ఓం రౌత్ ముద్దు పెట్టడంపై చెలరేగుతున్న వివాదం
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ మైదానంలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. ఈ ఈవెంట్ కు విచ్చేసిన దర్శకుడు ఓం రౌత్ చేసిన పని, వివాదానికి దారితీసింది.
కెనడాలో భారత విద్యార్థుల నిరసన.. 700 మందికి ఫేక్ లెటర్లిచ్చిన ఏజెంట్
విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనే ఆకాంక్షతో లక్షల ఖర్చులకు వెనుకాడకుండా బ్యాంకులో రుణమో, అప్పో సొప్పో చేసి దాదాపుగా 700 మంది భారత విద్యార్థులు కెనడాకు తరలివెళ్లారు.
మరోసారి కన్ఫూజన్‌కు గురైన హర్షా బోగ్లే.. అసలు విషయం తెలిసాక!
హైదరాబాదీ కామెంటేటర్ హర్షాబోగ్లే గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రికెటర్లతో సమానంగా పాపులారిటీ సంపాదించుకున్నాడు.
36 గంటల తర్వాత రష్యా నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం
దిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం, ఇంజిన్ లోపం తలెత్తడంతో రష్యాలోని మారుమూల పట్టణమైన మగదాన్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ అయిన విషయం తెలిసిందే.
ఉక్రెయిన్ లో నీటి యుద్ధం.. నీట మునిగిన ఖేర్సన్ నగరం
ఒకప్పుడు బుల్లెట్లు, కత్తులు, కటార్లు, యుద్ధ విమానాలు తదితర వాటిని మాత్రమే శత్రు దేశాలపై ప్రయోగించేవారు. కానీ మారుతున్న కాలంలో వరదనీరు, జలాశయాలు లాంటి పేలుడ్లు ఈ జాబితాలోకి వచ్చి చేరాయి.
డబ్ల్యూటీసీ ఫైనల్‌లో చరిత్ర సృష్టించిన ట్రావిస్ హెడ్.. సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డు
డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆసీస్ బ్యాటర్ రికార్డును సృష్టించాడు. టీమిండియాతో జరిగిన వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌లో సెంచరీ చేసిన తొలి బ్యాటర్ గా ట్రావిస్ హెడ్ రికార్డుకెక్కాడు.
IATA: ఎయిర్‌లైన్ పరిశ్రమలో జోష్; ఈ ఏడాది లాభం రూ.80వేల కోట్లు దాటొచ్చని అంచనా
విమానాల్లో ప్రయాణీకుల రద్దీ పెరుగుతోంది. స్థానిక ఆర్థిక వ్యవస్థలు పుంజుకుంటున్నందున ఈ ఏడాది ఎయిర్‌లైన్ పరిశ్రమ 9.8బిలియన్ డాలర్ల(రూ.80,000కోట్లు) నికర లాభాన్ని నమోదు చేస్తుందని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) పేర్కొంది.
Wrestlers Fight: రెజ్లర్ల ఉద్యమానికి తాత్కాలిక బ్రేక్!
భారత రెజ్లర్ల ఉద్యమానికి తాత్కాలిక బ్రేక్ పడింది. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ సింగ్ శరణ్ సింగ్ ను అరెస్టు చేయాలంటూ తలపెట్టిన ఉద్యమానికి రెజ్లర్లు విరామం ప్రకటించారు.
హైదరాబాద్ వరల్డ్ ర్యాంక్ 202... అత్యంత ఖరీదైన నగరాల్లో భాగ్యనగరం
భారత్ లోని విదేశీయులకు ఖరీదైన నగరాల జాబితాలో హైదరాబాద్‌కు చోటు లభించింది. మెర్సర్స్ 2023 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే ప్రకారం దేశ ఆర్థిక రాజధాని ముంబయి అగ్రస్థానంలో నిలచింది.
రెపో రేటు యథాతథం; 6.5 శాతమే కొనసాగించాలని ఆర్‌బీఐ నిర్ణయం
రెపో రేటును యథాతథంగా 6.5 శాతం కొనసాగించాలని నిర్ణయించినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం తెలిపారు. ఈ మేరకు మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ)లో నిర్ణయం తీసుకున్నారు.
ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం ఎందుకు జరుపుతారు? తెలుసుకోవాల్సిన విషయాలేంటి?
ప్రతీ ఏడాది జూన్ 8వ తేదీన ప్రపంచ మహాసముద్రాలు దినోత్సవాన్ని జరుపుతారు. సముద్రాల ప్రాముఖ్యతను జనాలకు తెలియజేయడానికి, సముద్ర వనరులను సంరక్షించడానికి ఈ దినోత్సవాన్ని జరుపుతారు.
అదరిపోయే వోల్వో ఈఎక్స్ 30 వచ్చేసింది.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 480 కిలోమీటర్ల ప్రయాణం
స్వీడన్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ వోల్వో ఈఎక్స్ 30ఈవీ కారును ఈనెల 7న భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని ధర దాదాపు 36,000 యూరోలు (సుమారు రూ.32 లక్షలు) ఉండనుంది. టెస్లా ప్రపంచవ్యాప్తంగా మరింత సరసమైన ఎలక్ట్రిక్ వాహనాలను అందించనుంది.
బ్రిజ్ భూషణ్ సింగ్ కేసు కీలక మలుపు; ఆ రెజ్లర్ మైనర్ కాదట
రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై నమోదైన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
దేశానికే హైదరాబాద్ హెల్త్ హబ్.. అతిపెద్ద ప్రభుత్వ ఆస్పత్రికి భాగ్యనగరమే నిలయం
హైదరాబాద్ దేశానికే హెల్త్ సిటీగా మారనుందా. ఈ విషయానికి అవుననే సమాధానాన్ని ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ఏకంగా దేశంలోనే అతిపెద్ద సర్కార్ ఆస్పత్రి భవన నిర్మాణానికి ముహుర్తం వచ్చేస్తోంది. ఈ మేరకు ప్రఖ్యాత నగరం, హైదరాబాద్ చరిత్రలోకి ఎక్కనుంది.
పెళ్ళితో కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్న మేఘా ఆకాష్: వరుడు ఎవరంటే?
తెలుగు సినిమా పరిశ్రమలో వరుసగా పెళ్ళిళ్ళ సందడి వినిపిస్తోంది. మొన్నటికి మొన్న హీరో శర్వానంద్, రక్షిత రెడ్డిని వివాహం చేసుకున్నాడు. మెగా హీరో వరుణ్ తేజ్ కూడా పెళ్ళి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
WTC Final: తొలిరోజు ఆసీసీదే.. విఫలమైన టీమిండియా బౌలర్లు
టీమిండియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో తొలి రోజు ఆస్ట్రేలియా చెలరేగింది. తొలి సెషన్ నుంచి నిలకడగా ఆడిన ఆస్ట్రేలియా తొలి రోజే 300 మార్క్ దాటి భారీ స్కోరు దిశగా సాగింది. ట్రావిస్ హెడ్ శతకంతో విజృంభించగా.. స్మిత్ సెంచరీకి చేరువయ్యాడు.
భగవంత్ కేసరిగా బాలయ్య: ఊచకోత కోయడానికి అన్న దిగిండు
బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు భగవంత్ కేసరి అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.
ముంబై: జీవిత భాగస్వామిని ముక్కలుగా నరికి, శరీర భాగాలను కుక్కర్‌లో ఉడకబెట్టాడు
ముంబైలో దారణం జరిగింది. ఒక వ్యక్తి తన జీవిత భాగస్వామిని హత్య చేసి, ఆమె మృతదేహాన్ని చెట్లను కట్ చేసే యంత్రంతో ముక్కలుగా చేశాడు. ఆ తర్వాత శరీర భాగాలను కుక్కర్‌లో ఉడకబెట్టాడని పోలీసు వర్గాలు తెలిపాయి.
జూన్ 8న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
07 Jun 2023
మీ జుట్టు వేగంగా, మందంగా పెరగాలనుకుంటున్నారా? ఈ చిట్కాలు మీకోసమే
మన శరీరంలో మిగతా భాగాలకు ఇచ్చే ప్రాముఖ్య్త జుట్టుకు ఇవ్వము. జుట్టు సంరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టరు. జుట్టు ఊడిపోతున్నప్పుడే దాన్ని కాపాడుకోవాలన్న ఆలోచన వస్తుంది.
బీజేపీ వైపు జేడీఎస్ చూపు; 2024 ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమికి కర్ణాటకలో ఎదురుదెబ్బ!
ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ఆశించినన్ని సీట్లు రాకపోవడంతో దిగ్భ్రాంతికి గురైన జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) బీజేపీకి స్నేహ హస్తాన్ని అందిస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే 2024లో సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాల కూటమికి ఇదే ఎదురుదెబ్బే అవుతుంది.
16 వేలకు పైగా గుండెలను కాపాడిన డాక్టర్.. గుండెపోటుతో మృతి
ఆ డాక్టర్ వైద్యం చేస్తే ఎలాంటి ఆపదలో ఉన్న గుండె అయినా కొట్టుకుంటుంది. అలా దాదాపు 16 వేలకుపైగా గుండెల్ని కాపాడిన ఓ కార్డియాలజిస్ట్ అదే గుండెపోటుతో మరణించడం పట్ల విచారం వ్యక్తమవుతోంది.
నల్లటి ఆర్మ్‌బ్యాండ్స్ ధరించిన టీమిండియా-ఆస్ట్రేలియా ప్లేయర్లు.. ఎందుకంటే?
ఓవల్ వేదికగా టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ నేడు జరుగుతోంది. ఈ మ్యాచులో మొదట టాస్ గెలిచిన రోహిత్ సేన ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఔరంగజేబును కీర్తిస్తూ సోషల్ మీడియా పోస్ట్; కొల్హాపూర్‌లో నిరసనలు; పోలీసుల లాఠీఛార్జ్
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబును కీర్తిస్తూ, మరాఠా జాతీయ చిహ్నాన్ని అగౌరవపరిచేలా సోషల్ మీడియా చేసిన పోస్ట్ మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో నిరసనలకు దారితీసింది.
తవ్వకాల్లో బయటపడ్డ ఎలుగుబంటి ఎముకతో తయారు చేసిన సంగీత సాధనం
ఎలుగు బంటి ఎముకతో తయారు చేసిన పురాతన సంగీత సాధనాన్ని(ఫ్లూట్) పురావస్తు శాస్త్రవేతలు కనుక్కున్నారు. ఈ సంగీత సాధనం, ఇప్పటికీ పనిచేయడం విశేషం.
ఒడిషా ఘటనలో 51 గంటల ఆపరేషన్.. స్వయంగా నడిపించిన రైల్వే మంత్రి
ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బహానగ రైల్వే స్టేషన్ సమీపంలో 3 రైళ్లు ఢీకొన్న ఘటనలో ఇప్పటికే 288 ప్రాణాలు కోల్పోవడం దిగ్భ్రాంతికరం.
2023 ఫ్రెంచ్ ఓపెన్: సెమీఫైనల్‌కి దూసుకెళ్లిన బిట్రిజ్ హద్దాద్ మైయా
2023 ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనల్ మ్యాచులో ఓన్స్ జబీర్ పై బిట్రిజ్ హద్దాయ్ మైయా గెలుపొందింది. ఎంతో ఉత్కంఠంగా సాగిన ఈ పోరులో 3-6, 7-6, 6-1తో ఓన్స్ జబీర్‌ను బ్రిటెజ్ హద్దాయ్ మైయా చిత్తు చేసింది.
లక్నో కోర్టులో తూపాకీ కాల్పులు; గ్యాంగ్‌స్టర్ హత్య
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో కోర్టులో ఒక గ్యాంగ్‌స్టర్‌ను ప్రత్యర్థి కాల్చి చంపాడు.
భారత మార్కెట్‌లో పట్టు సాధించేందుకు స్టార్‌బక్స్ కొత్త వ్యూహం
భారతీయ మార్కెట్లోకి ప్రవేశించిన విదేశీ కాఫీ బ్రాండ్లలో స్టార్‌బక్స్ ఒకటి. భారత మార్కెట్‌లో స్టార్‌బక్స్ దేశీయ కంపెనీల నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కొంటోంది.
వైఎస్ వివేకా హత్య కేసు: కలర్ జిరాక్స్ కాపీతో నిన్‌హైడ్రిన్ పరీక్షకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి రాసిన లేఖపై కలర్ జిరాక్స్ కాపితో నిన్‌హైడ్రిన్ పరీక్ష జరిపేందుకు సీబీఐ కోర్టు అనుమతిచ్చింది.
వాట్సప్‌లో సరికొత్తగా 'ఇమేజ్ క్రాప్' ఫీచర్..!
వినియోగారులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వాట్సప్ కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తేస్తోంది. వినియోగదారుల అవసరాలు, భద్రతను దృష్టిలో ఉంచుకొని మరో అత్యాధునిక ఫీచర్‌తో వాట్సప్ ముందుకొస్తోంది.
తెలుగులో రవితేజ తమిళంలో కార్తీ: గజదొంగల పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న స్టార్ హీరోలు
రావణాసుర పరాజయం తర్వాత టైగర్ నాగేశ్వర్ రావు సినిమాతో రవితేజ పాన్ ఇండియా రేంజ్ లో వస్తున్నాడు . కొత్త దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుండి గ్లింప్స్ వీడియో రిలీజైన సంగతి తెలిసిందే.
కనీస మద్ధతు ధరలకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. క్వింటాల్ వరికి రూ.143 పెంపు
2023 -24 మార్కెటింగ్ సీజన్ ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ల పెంపుదలకు బుధవారం కేంద్ర మంత్రివర్గం అంగీకరించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశమైంది.
హోండా ఎలివేట్ Vs కియా సెల్టోస్.. రెండింట్లో బెస్ట్ ఆప్షన్ ఇదే!
జపాన్ కార్ల తయారీ సంస్థ హోండా మంగళవారం మిడ్ సైజ్ ఎస్‌యూవీ హోండా ఎలివెట్ ని భారత్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. త్వరలో ప్రారంభమయ్యే పండుగల సీజన్‌లో ఎలివేట్ మోడల్ కారు ఆవిష్కరణకు హోండా కార్స్ రంగం సిద్ధం చేస్తోంది.
7:11 PM టీజర్ విడుదల: భూమికీ మరో గ్రహానికీ మధ్య జరిగే సైన్స్ ఫిక్షన్ కథ
ఈ మధ్య కాలంలో తెలుగులో విభిన్నమైన సినిమాలు వస్తున్నాయి. బాహుబలి తర్వాత తెలుగు సినిమా మార్కెట్ విపరీతంగా పెరగడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రయోగాలు మొదలయ్యాయి.
మనీష్ సిసోడియాను తలుచుకొని అరవింద్ కేజ్రీవాల్ కంటతడి
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం నగరంలో కొత్త పాఠశాలను ప్రారంభించారు.
డబ్ల్యూటీసీ ఫైనల్ విజేత 'గద' వెనుక కథ తెలిస్తే అశ్చర్యపోవాల్సిందే!
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌లో గెలుపొందిన జట్టుకు ఐసీసీ 'గద'తో పాటు భారీ ప్రైజ్ మనీని అందిస్తుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ 2021లో టీమిండియాపై న్యూజిలాండ్ విజేతగా నిలిచింది.
ఉద్యోగులపై ఏపీ సర్కార్ వరాల జల్లు.. సీపీఎస్ స్థానంలో జీపీఎస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ ఉద్యోగుల సంక్షేమం కోసం కొత్త పెన్షన్ విధానాన్ని తేనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన నూతన ప్రభుత్వ పెన్షన్ విధానంపై బిల్లు రూపకల్పనను కేబినెట్ ఆమోదించింది.
క్రీడామంత్రి అనురాగ్ ఠాకూర్ ఎదుట రెజ్లర్లు 5 డిమాండ్లు
భారత రెజ్లింగ్ సమాఖ్యకు ఒక మహిళ నేతృత్వం వహించాలని రెజ్లర్లు డిమాండ్ చేశారు.
అర్థమయ్యిందా అరుణ్ కుమార్ పేరుతో ఆహాలో కొత్త సిరీస్ మొదలు; ఫస్ట్ లుక్ రిలీజ్
తెలుగువారికి దగ్గరైన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహాలో సరికొత్త కంటెంట్ వస్తోంది. ఇటీవల పుష్ప ఫేమ్ జగదీష్ ప్రతాప్ బండారి నటించిన సత్తిగాని రెండెకరాలు అనే వెబ్ ఫిలిమ్ రిలీజైంది.
నైరుతి రుతుపవనాల జాడేదీ..ఇంకా కేరళను తాకని నైరుతి, మరో 3 రోజుల ఆలస్యం
రానున్న 24 గంటల్లో అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుపాన్ రూపం దాల్చనుంది.
డబ్య్లూటీసీ ఫైనల్‌కు ముందు రహానే బర్త్ డే.. టీమిండియాలో వైబ్రేషన్స్!
డబ్య్లూటీసీ ఫైనల్లో ఆసీస్ ను ఓడించి ఐసీసీ ట్రోఫీని సాధించాలని టీమిండియా తహతహలాడుతోంది. నేడు ఇంగ్లాండ్ లోని ఓవల్ వేదికగా టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య నేడు డబ్య్లూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగుతోంది.
బాలకృష్ణ 108వ సినిమా: టైటిల్ రివీల్ కోసం 108లొకేషన్లు
బాలకృష్ణ, అనిల్ రావిపుడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మొట్టమొదటి చిత్రంపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.
5 శాతం మంది ఉద్యోగులకు తొలగించిన రెడ్డిట్
అమెరికా ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ అయిన రెడ్డిట్ తన కంపెనీలో 5 శాతం మంది లేదా 90మంది ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టినట్లు ప్రకటించింది.
అమెరికాలో డేంజర్ బెల్స్.. న్యూయార్క్ నగరాన్ని కప్పేసిన పొగ
అగ్రరాజ్యం అమెరికాలో కాలుష్యం కారణంగా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి.
ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మెయిన్ అలీ సంచలన నిర్ణయం.. రిటైర్మెంట్ తర్వాత మళ్లీ జట్టులోకి
ఇంగ్లండ్ వెటరన్ ఆల్ రౌండర్ మెయిన్ అలీ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాడు. 2021 సెప్టెంబర్‌లో టెస్టులకు గుడ్ బై చెప్పిన అలీ.. మళ్లీ జట్టులోకి అడుగుపెట్టనున్నాడు.
నాగ చైతన్య రీసెంట్ రిలీజ్ కస్టడీ ఓటీటీలోకి వచ్చేస్తోంది: స్ట్రీమింగ్ ఎక్కడంటే?
నాగ చైతన్య, క్రితి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన కస్టడీ చిత్రం మే 12వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయ్యింది. తెలుగు, తమిళం భాషల్లో రూపొందిన ఈ చిత్రం, రెండు భాషల్లోనూ ఒకేరోజున విడుదలైంది.
మెరుగైన బోధనకోసం మూడు AI ట్రాన్స్‌ఫార్మర్ మోడల్స్‌ను ఆవిష్కరించిన బైజూస్
దేశీయ దిగ్గజ ఎడ్‌టెక్ సంస్థ బైజూస్ తమ సేవల్లో నాణ్యతను మెరుగుపర్చుకోవడానికి, విద్యార్థులకు అభ్యాసం మరింత సులువు కావడానికి మూడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ట్రాన్స్‌ఫార్మర్ మోడల్‌లను విడుదల చేసింది.
తెలంగాణ: బీసీలకు రూ.లక్ష ఆర్థిక సాయం రూల్స్ ఇవే..ఈనెల 20న దరఖాస్తుకు లాస్ట్ డేట్
బీసీ ఫెడరేషన్ పరిధిలోని కులాలకు, చేతి వృత్తిదారులకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ అందించింది. ఒక్కో చేతి వృత్తిదారుడికి రూ. లక్ష ఆర్థిక సాయం ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ మంగళవారం నుంచే ప్రారంభమైంది.
పిచ్చెక్కించే ఫీచర్స్‌తో మారుతీ సుజుకీ జిమ్మీ వచ్చేసింది.. ధర ఎంతంటే?
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మారుతీ సుజుకీ జిమ్మీ ఎట్టకేలకు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది.
సికింద్రాబాద్ నుంచి పలు రైళ్ల రద్దు.. రద్దైన రైళ్ల పూర్తి వివరాలు ఇవే
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరే పలు రైళ్లు రద్దైనట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. గతవారం ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది.
పాక్ ఆర్థిక తిప్పలు; న్యూయార్క్‌లోని రూజ్‌వెల్ట్ హోటల్ ను లీజుకిచ్చిన దాయాది దేశం
ఆర్థిక కష్టాలను అధిగమించేందుకు పాకిస్థాన్ అష్టకష్టాలు పడుతోంది. చివరికి విదేశాల్లో తమ దేశ ఆస్థులను కుదువ పెట్టే దయనీయ స్థితికి పాక్ చేరుకుంది.
ఇక వాట్సప్‌లో సులభంగా హెచ్‌డి ఫోటోస్ షేర్ చేసే అవకాశం
వాట్సప్ మెసేజింగ్ యాప్‌ను ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఉపయోగిస్తున్నారు. స్నేహితులు, బంధువులకు ఏదైనా చెప్పాలనుకుంటే త్వరగా వాట్సప్ లో సందేశం పంపొచ్చు. ముఖ్యంగా ఫోటో, లేదా వీడియో పంపించాలనుకుంటే వాట్సప్ చాలా అనుకూలమైన మార్గం.
రష్యాలో ఏయిర్ఇండియా ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..సహాయం కోసం ముంబయి నుంచి మరో ఫ్లైట్
అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకి భారత రాజధాని న్యూదిల్లీ నుంచి ఓ విమానం బయల్దేరింది. అది కాస్తా సాంకేతిక లోపంతో మంగళవారం అర్థాంతరంగా రష్యాలోని మగడాన్ ఏయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది.
గుంటూరు కారం నెక్స్ట్ షెడ్యూల్ లొకేషన్ ఎక్కడో తెలుసా?
మహేష్ బాబు అభిమానులకు గుంటూరు కారం గ్లింప్స్ విడుదల కాగానే కడుపు నిండిపోయింది. తమ హీరోను ఊరమాస్ గా చూడాలని, పోకిరి తాలూకు వైబ్రేషన్స్ రావాలని ఎన్నో రోజులుగా కోరుకున్నారు.
మణిపూర్‌లో హింసను అరికట్టాలని అమిత్ షా ఇంటి ఎదుట 'కుకీ' తెగ మహిళల నిరసన
మణిపూర్‌లో జాతి హింసను అరికట్టాలని ప్లకార్డులతో కుకీ తెగకు చెందిన మహిళలు బుధవారం దిల్లీలోని కేంద్ర హోం మంత్రి అమిత్ షా నివాసం వెలుపల నిరసన తెలిపారు.
ChatGPTని ఉపయోగిస్తున్న యాపిల్ సీఈఓ టిమ్ కుక్
తాను వ్యక్తిగతంగా చాట్ జిపిటిని ఉపయోగిస్తున్నానని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ స్పష్టం చేశారు. గుడ్ మార్నింగ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చాట్ జిపిటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఆరోగ్యం: ఏయే ఆహారాలను ఎలా నిల్వ చేయాలో ఇక్కడ తెలుసుకోండి
ఈ రోజు ఆహార భద్రతా దినోత్సవం. మనం తీసుకునే ఆహారం చెడిపోకుండా ఉండేందుకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే విషయంపై అవగాహన పెంచేందుకు, అలాగే కలుషితమైన ఆహారాన్ని తినడం వల్ల కలిగే ఇబ్బందులను తెలియజేయడానికి ఈరోజును జరుపుతారు.
తెలంగాణ: 2023-24 అకాడమిక్ క్యాలెండర్ రిలీజ్.. జూన్ 12 నుంచి కొత్త అకాడమిక్ ఇయర్
తెలంగాణ పాఠశాల విద్యాశాఖ 2023-24 అకాడమిక్ క్యాలెండర్‌ను రిలీజ్ చేసింది. ఈ విద్యాసంవత్సరంలో మొత్తంగా 229 పని దినాలు ఉంటాయని వెల్లడించింది. జూన్ 12 నుంచి కొత్త అకాడమిక్ ఇయర్ మొదలుకానుంది.
రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం; రైల్వే గేటును ఢీకొట్టిన ట్రాక్టర్
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దాదాపు ఆ పెను ప్రమాదం 288మందిని బలితీసుకుంది. ఒడిశా రైలు ప్రమాదం తర్వాత, ట్రైన్ యాక్సిడెంట్ అంటేనే ప్రజలు భయపడిపోతున్నారు.
అరంగేట్రం టెస్టులో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా పేయర్లు వీరే!
ఇప్పటివరకూ టెస్టు క్రికెట్ లో ఎన్నో గుర్తిండిపోయే ఇన్నింగ్స్‌లు ఆడిన బ్యాట్‌మెన్స్ చాలామందే ఉంటారు. వారంతా మైదానంలో పరుగుల వర్షం కురిపించి, ఎన్నో రికార్డులను సాధించారు. ముఖ్యంగా టెస్టు క్రికెట్లో పరుగుల సాధించాలంటే బ్యాటర్ కు చాలా ఓపిక ఉండాలి.
గ్లోబల్ రన్నింగ్ డే: శరీరాన్ని, మనసును ఆరోగ్యంగా ఉంచే పరుగు వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు
పొద్దున్న లేవగానే పరుగెత్తే అలవాటు మీకుందా? కనీసం జాగింగ్ అయినా చేస్తారా? ఈ అలవాట్లు మీకు లేకపోతే ఇప్పుడే అలవర్చుకోండి. ఎందుకంటే పరుగు వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి.
ముంబై: హాస్టల్ గదిలో శవమై కనిపించిన విద్యార్థిని; రైలు పట్టాల వద్ద నిందితుడి మృతదేహం
ముంబైలోని హాస్టల్ గదిలో ఓ విద్యార్థిని మృతదేహం లభ్యమైంది. ఆమెపై అత్యాచారం జరిగినట్లు అనుమానిస్తున్నామని, శవపరీక్ష నివేదిక వచ్చిన అది నిర్ధారణ అవుతుందని పోలీసులు తెలిపారు.
తెదేపా నేత వైవీబీ రాజేంద్రప్రసాద్‌కు హార్ట్ ఎటాక్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ బుధవారం ఉదయం గుండెపోటుకు గురయ్యారు. వైవీబీ అస్వస్థతను గమనించిన కుటంబసభ్యులు, హుటాహుటిన ఆయన్ను విజయవాడలోని రమేశ్ ఆస్పత్రిలో చేర్పించారు.
డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం రెండు పిచ్‌లు సిద్ధం.. కారణం ఇదేనా!
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ప్రారంభం కావడానికి మరికొన్ని గంటలు మాత్రమే సమయం మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ పిచ్ పై కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
వైరల్ వీడియో: శర్వానంద్ పెళ్ళిలో సిద్ధార్థ్ పాట; వావ్ అంటున్న అభిమానులు
ఈ మధ్య హీరో సిద్ధార్థ్ ఎక్కడికి వెళ్లినా తన పాటలతో అందరినీ అలరిస్తున్నాడు. ఒకానొక టెలివిజన్ ప్రోగ్రాంలో అతిథిగా విచ్చేసిన సిద్ధార్థ్, బొమ్మరిల్లు సినిమాలోని పాటలు పాడి అందరికీ వినోదం పంచాడు.
ఇండియన్ రైల్వేస్ కి ఏమైందీ..మళ్లీ పట్టాలు తప్పిన రైలు.. ఈసారి ఆయిల్ ట్యాంకర్
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్‌పూర్ జిల్లాలో మంగళవారం రాత్రి ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. షాపురా భిటోని స్టేషన్‌లోని భారత్ పెట్రోలియం డిపో సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
అమెరికా కాంగ్రెస్‌లో మోదీ రెండోసారి ప్రసంగం; ఆ ఘనత సాధించిన తొలి భారత ప్రధాని
జూన్ 22న జరిగే అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగించేందుకు ఎదురుచూస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
నేటి నుంచి ఫ్రెంచ్ ఓపెన్.. స్వియాటెక్‌తో తలపడనున్న కోకో గౌఫ్
ఫ్రెంచ్ ఓపెన్ 2023 సెమీఫైనల్ స్థానం కోసం ప్లేయర్లు పోటీపడుతున్నారు. టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ ప్రతి రౌండ్ లోనూ ప్రత్యర్థులపై సునాయాసంగా గెలుపొందింది.ప్రస్తుతం ఆమె కోకో గౌఫ్‌తో తలపడనుంది.
ఆదిపురుష్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మొత్తం ఖర్చు తెలుసా? క్రాకర్స్ కోసమే 50లక్షలు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న ఆదిపురుష్ చిత్రం కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎదురుచూపులు ఏ రేంజ్ లో ఉన్నాయో నిన్న జరిగిన ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తెలియజేసింది.
రాజస్థాన్ కాంగ్రెస్ లో లుకలుకలు .. సొంత పార్టీ దిశగా సచిన్ పైలట్
కర్ణాటక గెలుపును ఆస్వాదిస్తున్న కాంగ్రెస్ అధిష్టానానికి ఆ ఆనందం ఎక్కువ సేపు నిలువలేకపోతోంది. దీనికి కారణం రాజస్థాన్ కాంగ్రెస్ లో ఏర్పడిన లుకలుకలే.
వర్జీనియా: గ్రాడ్యుయేషన్ వేడుకలో కాల్పులు; ఇద్దరు మృతి
వర్జీనియాలోని రిచ్‌మండ్‌లో హైస్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుకలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి.
రోహిత్ సేనను అడ్డుకునేందుకు ఆసీస్ కీలక నిర్ణయం.. రంగంలోకి లక్నో టీమ్ హెడ్ కోచ్
లండన్ లోని ఓవల్ మైదానంలో నేటి నుంచి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచుకు ముందు ఆసీస్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో మూవీ: హీరోయిన్ గా ప్రియాంకా చోప్రా?
కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సినిమా ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తాను చేస్తున్న దేవర షూటింగ్ పూర్తి కాగానే ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ జాయిన్ అవుతాడు.
రెజ్లర్లను మరోసారి చర్చలకు ఆహ్వానించిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతున్న రెజ్లర్లతో చర్చలు జరిపేందుకు కేంద్రం సుముఖంగా ఉందని కేంద్ర క్రీడామంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు.
జూన్ 7న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు.
నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక భేటీ.. ఉద్యోగుల్లో టెన్షన్ టెన్షన్
ఏపీలో కీలక మంత్రివర్గం సమావేశం జరగనుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలో జరగనున్న ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పలు ముఖ్య నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది.